Posts

Showing posts from 2020

... జీహెచ్ఎంసీ ఎన్నికలు

వంశీ వ్యూ పాయింట్ // ... జీహెచ్ఎంసీ ఎన్నికలు // ********************************************             జీహెచ్ఎంసీ ఎన్నికలు చాలా ప్రతిష్టగా మారాయి తెరాసతో పాటుగా, భాజపాకు కూడా. ముఖ్యంగా దుబ్బాక ఉప ఎన్నిక ఫలితం జీహెచ్ఎంసీ ఎన్నికల్లో వేడిని పెంచింది. కాంగ్రెస్, తెదేపాలకు కలిసి గానీ లేక విడివిడిగా గానీ పోటీ చేసినా ఎటువంటి ఉపయోగం లేదని తెలిసిపోయింది సమయంలో భాజపా ఆ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని ప్రయత్నాలు చేస్తోంది. అయితే ఇంతకాలం ముందుగా ప్రధాన ప్రతిపక్ష స్థానాన్ని భర్తీ చేయాలని సాగిన ప్రయత్నాలు, దుబ్బాక ఉప ఎన్నిక ఫలితం తరువాత మారిపోయాయి - 'మధ్యంతర ఎన్నికలు' అన్న బండి సంజయ్ వ్యాఖ్యలు అందుకు నిదర్శనం. అయితే నగరంలో నిజంగా భాజపా అంత పట్టు సంపాదించిందా లేక తెరాస గ్రాఫ్ అంత దారుణంగా పడిపోయిందా అన్నది ముఖ్య విషయం.             ముందుగా తెరాసకు ప్రతికూలాంశాలు పరిశీలిస్తే అత్యంత ముఖ్యమైనవి రెండు - ఇటీవలి భారీ వర్షాలకు ప్రజలు ఎదుర్కొన్న ఇబ్బందులు, అధికార వ్యవస్థ స్పందించిన తీరు; రెండవది కరోనా పరిస్థితుల్లో అధికార వ్యవస్థ మరియు ప్రభుత్వం తీరు. ...

... ఆకాశం నీ హద్దురా

వంశీ వ్యూ పాయింట్ // ... ఆకాశం నీ హద్దురా // ****************************************             "నుదుటినుండి స్వేదం చిందకుండా చేసేపనికి విలువ లేదు. భారతీయ మేధ ఏ ఒక్కరికీ తీసిపోదు. కానీ, మనకు ధైర్యం పాళ్ళు తక్కువ. దేశంలో యువతకు కావలసింది అపజయాన్ని చవిచూస్తామన్న భయాన్ని శాశ్వతంగా నిర్మూలించటం. విజయాభిలాషను పెంపొందించుకోవటం" అని సి.వి. రామన్ గారు చెప్పారు. మనలో అందరూ కలలు కంటారు, ఆ కలలను నిజం చేసుకోవడానికి అవసరమైన పోరాటం చేసే ధైర్యం మాత్రం అతి కొద్దిమందిలో మాత్రమే ఉంటుంది. కలలు కనే మిగతా అందరూ, ఆ ధైర్యవంతుల గురించి కథలుకథలుగా చెప్పుకుంటారు, తరతరాలుగా. అటువంటి ఒక ధైర్యవంతుడి కథ, కెప్టెన్ గోపినాథ్ గారి జీవితం ఆధారంగా సుధా కొంగర గారి దర్శకత్వంలో రూపొందిన 'ఆకాశం నీ హద్దురా' సినిమా. మొదటి సన్నివేశం నుండి ఒక విధమైన ట్రాన్స్ లో నడుస్తుంది సినిమా. ఆ మూడ్ సినిమా అంతటా కొనసాగించడంలో సుధా కొంగర గారు విజయం సాధించారు అని చెప్పవచ్చు.             ఆకాశయానాన్ని సామాన్యులకూ అందుబాటులోకి తీసుకురావాలని తపించి, పోరాడిన చంద్ర మహేష్ మరియు అతడి మిత్రుల...

... కరోనా కంటే ఎక్కువగా భయపెడుతున్న అంశం?

వంశీ కలుగోట్ల // ... కరోనా కంటే ఎక్కువగా భయపెడుతున్న  అంశం ? // ************************************************************             చిరంజీవి గారికి కరోనా నెగటివ్ అని, మొదటి సారి పాజిటివ్ వచ్చింది కూడా ఫాల్టి టెస్ట్ కిట్ వల్ల అని తెలిసిందని ఆయనే స్వయంగా ప్రకటించారు. మంచిది, ఆయనకు కరోనా నెగటివ్ అని తెలియడం ఆయను విపరీతంగా అభిమానించే నాలాంటి కోట్లాది మందికి సంతోషాన్నిచ్చే విషయం. కానీ, అంతటి మెగాస్టార్ గారి విషయంలోనే మొదటి రిజల్ట్ ఫాల్టి కిట్ ద్వారా అని, అది కూడా మూడు వేర్వేరు ఇతర పరీక్షల అనంతరం నిర్ధారించబడిందని అంటే ఇక ఇపుడు బయట పడుతున్న అసీంప్టమాటిక్ కేసులలో ఎన్ని నిజానికి కరోనా పాజిటివ్ మరియు ఎన్ని ఫాల్టి కిట్స్ ద్వారా తప్పుడు ఫలితాలు? పాజిటివ్ కాదు అని నిర్ధారించబడేంతవరకూ చిరంజీవి గారు ఖచ్చితంగా కొంత భయం, మనోవేదన అనుభవించి ఉంటారు. అలాంటిది ఇక సామాన్యుల బాధల గురించి ప్రత్యేకంగా చెప్పాలా?             నిజానికి ఈ కరోనా టెస్ట్ మరియు ట్రీట్మెంట్ అన్నవి ఇపుడు మాఫియాలా తయారైంది. ప్రైవేట్ సంస్థలకు టెస్ట్ బాధ్యతలు అప్పగించడం ద్...

... మనం మేలుకోమా?

వంశీ కలుగోట్ల // ... మనం మేలుకోమా? // ************************************             "కల్పవృక్షం - మనిషి" కథ అని మా తాత ఒక కథ చెప్పేవారు చిన్నపుడు. ఒక బాటసారి అడవి గుండా పయనిస్తూ, మధ్యాహ్నం విశ్రాంతి కోసం ఒక చెట్టు కింద కూచుంటాడు. అతడికి తెలీని విషయం ఏంటంటే అది కోరిన కోరికలు తీర్చే కల్పవృక్షం. అలసటగా ఉన్న అతడు 'ఇపుడు దాహం తీరేలా చల్లటి మంచినీరు దొరికితే ఎంత బావుండు?' అనుకున్నాడు. వెంటనే మంచినీరు ప్రత్యక్షమైంది. దాహం తీరగానే ఆకలి గురొచ్చింది, 'ఇపుడు పంచభక్ష్యపరమాన్నాలు లభిస్తే ఎంత బావుండు' అనుకున్నాడు. వెంటనే అవీ ప్రత్యక్షం. తిన్న తరువాత 'ఆహా ఇపుడు శయనించటానికి ఒక హంసతూలికాతల్పము, వింజామరలు వీస్తూ సేవికలు, అప్సరసలాంటి భార్య, ఒక పెద్ద భవనం ఉంటే ఎంత బావుండు' అనుకున్నాడు. వెంటనే అవన్నీ ప్రత్యక్షమయ్యాయి. అపుడు అతడు 'అయ్యో ఇదంతా నిజమేనా లేక నా కలా. ఒకవేళ ఇది నిజమే అయితే, ఉన్నట్టుండి ఇవన్నీ మాయమైతే' అనుకున్నాడు. అనుకున్న తక్షణమే అవన్నీ మాయమయ్యాయి. అపుడు అతడు మరింత భయంతో 'ఇపుడు ఈ అడవిలో ఏ పులో, సింహమో వచ్చి నన్ను చంపి తినేస్తే ఎలా' అనుకున్నాడ...

... గురువిందగింజలు 

వంశీ కాలుగొట్ల // ... గురువిందగింజలు // ************************************             వరదలొచ్చాయి, భూకంపం వచ్చింది ... అవీ కాకపొతే ఇంకోటి. ప్రతిసారీ ఒక బ్యాచ్ ఉంటుంది సినిమావాళ్ళ మీదవిమర్శలు చేయటానికి. "సినిమా వాళ్ళెంత ఇచ్చారు? ఎందుకు ఇవ్వలేదు? ఇవ్వలేదు కదా - ఇక వారి సినిమాలు చూడటం మానెయ్యండి" ... ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సాధారణం అయిపోయింది. సినిమా వాళ్ళు మన మెడ మీద కత్తి పెట్టిదోపిడీలు చెయ్యట్లేదు; ప్రజల బాగు కోసం, సమాజ అభివృద్ధి కోసం కేటాయించిన పథకాల డబ్బును దోచుకోవట్లేదు; ప్రభుత్వం ఇచ్చే జీతం తీసుకుంటూ కూడా, చేయాల్సిన పని కోసం లంచం అడిగి సంపాదించట్లేదు ... వాళ్ళ నటన, ఆట, పాట నచ్చి మనం చూసి హిట్ చేసిన సినిమాల ద్వారా వచ్చిన క్రేజ్ తో సంపాదించుకున్నారు. ఛండాలంగా ఉన్నాయని, బాలేవని మనం తిప్పికొట్టిన సినిమాల ద్వారా నష్టాలు కూడా పొందారు.             మీకు దమ్ముంటే మీ ఏరియా ఎమ్మెల్యేని, అప్పోజిషన్ ఎమ్మెల్యే కాండిడేట్ ని, వ్యాపారులని, ఉద్యోగుల్ని ... లాంటి వాళ్ళందరిని ఎంత ఇచ్చారో అడగండి, ఎందుకు ఇవ్వలేదో (ఇవ్వకపోయుంటే) నిలదీయండి....

... జస్ట్ సరదాకి, అంతే

వంశీ కలుగోట్ల // ... జస్ట్ సరదాకి, అంతే  // ************************************ నవ్వొస్తే, నవ్వుకోండి. రాకపోతే వదిలేయండి. అంతకుమించి సీరియస్ గా తీసుకోకండి (ఆ ఇప్పటిదాకా ఏదో పెద్ద సీరియస్ గా తీసుకున్నట్టు) డిస్క్లైమర్: ఇది కేవలం సరదాకి రాసినది మాత్రమే. సారూప్యతలు కేవలం యాదృచ్చికమే తప్పించి, ఎటువంటి సంబంధమూ లేదని ముందుగానే మనవి చేసుకుంటున్నాను. ఒకానొక రచయిత/కవి సృజన: అమ్మా ... బాగున్నారా?! బాగానే ఉంటారమ్మా ఎందుకంటే మీరు అమ్మ కదా! దిగ్గజ విశ్లేషకుల విశ్లేషక ఉవాచ:             ఆహా ఏమి రచనా సౌందర్యము? ఏమి భాషా పటిమ? ఎంతటి ఆర్ద్రత నిండిన మాట? ఎంతటి నిష్కల్మష భావము? నిజంగా ఆ 'అమ్మా' అనడంలో మొత్తం స్త్రీజాతి పట్ల ఆ రచయిత/కవి యొక్క గౌరవభావం ఉట్టిపడుతోంది. నిజానికి అక్కడ అమ్మ అని ఆపెయ్యవచ్చు, కానీ అమ్మా దీర్ఘం తీస్తూ అనడంలో ఆ గౌరవభావం మరియు ఆర్ద్రత మరియు అదీఇదీ అనేక భావానలను అలా ఎక్స్టెండ్ చేసినట్టయి మరింత సౌందర్యం చేకూరింది. అలానే బాగున్నావా అనకుండా బాగున్నారా అనడం ద్వారా అతడు మొత్తం స్త్రీజాతిని, అందరు అమ్మలనూ కలిపి అడిగినట్టయింది. ఎంతటి గొప్ప కవి హృదయం? ...

... ప్రశ్నించండి

వంశీ కలుగోట్ల // ... ప్రశ్నించండి // *****************************           సంక్షేమపథకాలు అమలు చేయడంలో, సరికొత్త సంక్షేమ పథకాలు తీసుకురావడంలో బహుశా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ప్రస్తుతం ఎవరూ బీట్ చేయలేరేమో. గతంలోనూ సంక్షేమ పథకాల ప్రకటన ఇబ్బడిముబ్బడిగా జరిగేది కాకపొతే అధికశాతం ప్రకటనలతోనే సరిపోయేది, వాటి అమలు అనేది ఎన్నికలకు రెండు మూడు నెలల ముందు మాత్రమే గుర్తుకు వచ్చేది. ఇపుడు అలా కాదు అమలు కూడా, అది కూడా యుద్ధప్రాతిపదికన అన్నట్టుగా జరుగుతున్నాయి. జనాలు మెచ్చుకుంటున్నారు, పల్లకీల్లో ముఖ్యమంత్రి ఫోటో పెట్టు మోస్తున్నారు. నచ్చనివాళ్ళు శాపనార్థాలు పెడుతున్నారు.           నాకు తెలిసి, ఎవరూ చేయనిపని ఏంటంటే 'ప్రశ్నించడం'. ఇన్ని సంక్షేమ పథకాల అమలుకు నిధులు ఎక్కడినుండి వస్తున్నాయి? ఇపుడు సంక్షేమపథకాలు పేరిట అందినకాడికి తీసుకుంటున్నాం కదా సంబరపడితే, రేపటిరోజున మనమో, మన పిల్లలో ప్రత్యక్ష లేదా పరోక్ష పన్నుల రూపంలో కట్టుకోవలసినదే ఈ బాకీ అంతా. పథకాల అమలుకు మెచ్చుకుని, మోస్తున్నవారు కానీ శాపనార్థాలు పెడుతూ తిడుతున్నవారు కానీ రాష్ట్రం ఉత్పాదక...

... రెండు ప్రశ్నలు

వంశీ కలుగోట్ల // ... రెండు ప్రశ్నలు // ********************************             ఇవాళ రెండు ప్రశ్నలు ఎదురయ్యాయి - రెండు విభిన్న పోస్ట్ లలో. మొదటిది నిజానికి ప్రశ్న కాదు, దాదాపు 98% మంది మీడియా పట్ల కలిగి ఉండే స్థిరాభిప్రాయం. రెండవది అమాయకత్వం అనిపించింది. నాకు తెలిసిన/అనిపించిన వివరణ ఇస్తున్నాను.  * ఒక పత్రికలో లేదా మీడియా గ్రూప్ లో వచ్చేవన్నీ అబద్ధాలే అవుతాయా?             మన దగ్గర ఒక్కో మీడియా గ్రూప్ కు సంబంధించిన యాజమాన్యానికి ఒక పార్టీ లేదా సిద్ధాంతం పట్ల అభిమానం ఉంటుంది. ఆ మీడియా గ్రూప్ లో పనిచేసే సిబ్బందికి, వారి వ్యక్తిగత ఇష్టాయిష్టాలు, పత్రికా విలువలు కంటే యాజమాన్యం అభీష్టానికి అనుగుణంగా పనిచేయడమే రావాలి. అలాంటివారే ఉంటారు. అయితే ఇదంతా మాక్సిమం స్థానిక రాజకీయాల వరకే పరిమితమై ఉంటుంది, కొన్నిసార్లు స్థానికంగా ప్రభావితం చేయగల జాతీయ రాజకీయ అంశాలు/పార్టీల పట్ల కూడా అది కనబడుతుంది. అవి కాక మిగతా అంశాలు అవి తాము అభిమానించే పార్టీలను ప్రభావితం చేస్తాయని అనుమానపడనంతవరకూవాటిపట్ల ఒక ప్రత్యేకధోరణి కనబడదు - వార్తల్లాగానే అంది...

13 అవర్స్: ది సీక్రెట్ సోల్జర్స్ అఫ్ బెంఘాజి

వంశీ వ్యూ పాయింట్ // 13 అవర్స్: ది సీక్రెట్ సోల్జర్స్ అఫ్ బెంఘాజి // *********************************************************             2016 లో వచ్చిన హాలీవుడ్ ఆక్షన్ థ్రిల్లర్ '13 అవర్స్: ది సీక్రెట్ సోల్జర్స్ అఫ్ బెంఘాజి' - వాస్తవ ఘటనల ఆధారంగా మైఖేల్ బే నిర్మాణం మరియి దర్శకత్వంలో వచ్చిన చిత్రం. లిబియాలోని  బెంఘాజిలో ఉన్న అమెరికన్ డిప్లొమాటిక్ ప్రాంతాన్ని, దుండగుల/ఉగ్రవాదుల దాడి నుండి కాపాడటానికి 'గ్లోబల్ రెస్పాన్స్ స్టాఫ్' (జిఆర్ఎస్) అనే ఆరుగురు ప్రైవేట్ సెక్యూరిటీ టీం మెంబెర్స్ చేసే ప్రయత్నమే '13 అవర్స్'.             కథ పరంగా చెప్పుకోవాలంటే ముందే చెప్పినట్టు వాస్తవంగా జరిగిన అంశాలను దాదాపుగా అలానే తెరకెక్కించారు అని చెప్పవచ్చు. మొదటి సగభాగం నెమ్మదిగా సాగినట్టనిపిస్తుంది. తరువాత అంతా ఉత్కంఠభరితంగా సాగుతుంది. నిజానికి ఇది ఆక్షన్ థ్రిల్లర్ అనేకన్నా ఒక ఎమోషనల్ ఫిలిం అనవచ్చు. జిఆర్ఎస్ మెంబర్స్ మధ్య సాగే సన్నివేశాలు, సంభాషణలు బావుంటాయి. ప్లెయిన్ స్క్రీన్ ప్లే వల్ల ఉండాల్సిన ఉత్కంఠత కాస్త లోపించింది అనిపిస్తుంది. ద్వితీయార్...

... లా అబైడింగ్ సిటిజెన్

వంశీ వ్యూ పాయింట్ //... లా అబైడింగ్ సిటిజెన్ // ******************************************             2009 లో విడుదలైన గెరార్డ్ బట్లర్, జెమీ ఫాక్స్ ల ఆక్షన్ థ్రిల్లర్ చిత్రం 'లా అబైడింగ్ సిటిజెన్'. కమర్షియల్ సక్సెస్ తో పాటు, ప్రశంసలు, అవార్డులు కూడా అందుకుంది. ఇంజనీర్ క్లయిడ్ షెల్టన్ (గెరార్డ్ బట్లర్) జీవితంలో జరిగిన ఒక ప్రమాదం, ఆ తరువాత అతడు అందుకు కారకులైన వ్యక్తులు మరియు వ్యసస్థలపై ప్రతీకారం తీర్చుకోవడం ఈ చిత్ర కథ. ఇంజనీర్ క్లయిడ్ షెల్టన్ ది చిన్న కుటుంబం, సొంతోషకరమైన జీవితం గడుపుతున్న ఆ కుటుంబంపై హఠాత్తుగా ఒకరోజు కొందరు దుండగులు దాడి చేసి - అతడి భార్య, కూతురును (చిన్న పాప) లను రేప్ చేసి, చంపేస్తారు - ఆ సన్నివేశాలను అతడు చూసేలా ఫోర్స్ చేస్తూ. అయితే సరైన సాక్ష్యాధారాలు లేకపోవడం, దాంతోపాటు ప్రాసిక్యూటింగ్ అటార్నీ అయిన నిక్ రైస్ ఆ కేసును నిర్లక్ష్యం చేస్తాడు. ప్రత్యక్ష సాక్షిగా షెల్టన్ ఉన్నా, అతడు బాధితుడు కాబట్టి అతడి సాక్ష్యాన్ని కన్సిడర్ చేయరు. దోపిడీ మాత్రమే చేద్దామని అన్న ఆమెస్ నిందితుడిగా నిరూపించబడి, కఠిన శిక్ష విధింపబడుతుంది. తప్పు ఒప్పుకుని, క్షమి...

... ట్రైటర్ (2008)

వంశీ వ్యూ పాయింట్ // ... ట్రైటర్ (2008) // *************************************             ఇటీవలి కాలంలో అంటే గత రెండు మూడు దశాబ్దాల కాలం నుండి టెర్రరిజం మీద వచ్చినన్ని సినిమాలు బహుశా ప్రేమ మీద కూడా వచ్చి ఉండవేమో అనిపిస్తుంది. అలా తామరతంపరగా వచ్చిన సినిమాల్లో ఒక హాలీవుడ్ ఫిలిం ట్రైటర్ (Traitor), 2008 లో వచ్చిన ఈ సినిమా యూఎస్ బాక్స్ ఆఫీస్ వద్ద మంచి ఫలితాన్నే రాబట్టినట్టుంది.  ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేని మరొక అంశం ఏంటంటే ఈ టెర్రరిజం బేస్డ్ మూవీస్ లో 99% సినిమాల్లో ఇస్లామిక్ టెర్రరిజం అన్నది ప్రధాన అంశం. ట్రైటర్ సినిమా అందుకు భిన్నం కాదు. అయితే ఇందులో ఇస్లాంను రెండు విధాలుగా అర్థం చేసుకున్న రెండు గ్రూప్స్ (లేదా వ్యక్తులు) మధ్య సంఘర్షణగా చెప్పవచ్చు. Steve Martin అందించిన కథలోని ఆ సంఘర్షణను చాలా చక్కగా, జాగ్రత్తగా, ఆకట్టుకునేలా తెరకెక్కించటంలో దర్శకుడు Jeffrey Nachmanoff విజయం సాధించాడు అని చెప్పవచ్చు.             సమీర్ సుడానీస్ - అమెరికన్ మరియు ఇస్లాం సిద్ధాంతాలను పవిత్రంగా ఆచరించే నిఖార్సైన ముస్లిం వ్యక్తి. అయితే కొన...

... జాసన్ బౌర్న్ సిరీస్ మూవీస్

వంశీ వ్యూ పాయింట్ // ... జాసన్ బౌర్న్ సిరీస్ మూవీస్ // ************************************************             సీక్రెట్ ఏజెంట్ మూవీస్ లో ఆక్షన్ కు, థ్రిల్లింగ్ ఎలిమెంట్ కు, డ్రామాకు, సెంటిమెంట్ (దేశభక్తి)కు మంచి స్కోప్ ఉంటుంది. నిజానికి ఏ సీక్రెట్ ఏజెంట్ మూవీలో అయినా సెంట్రల్ థీమ్ ఒకటే ఉంటుంది. దేశానికి, ప్రపంచానికి ముప్పు తలపెట్టే ప్రయత్నం చేస్తున్న విలన్ గ్యాంగ్ ను ఏజెంట్ ఎదుర్కొని, వారి ప్రయత్నాలను వమ్ము చేయడం. ఈ స్పై మూవీస్ మొదలైంది 1914 లో The German Spy Peril అనే సినిమాతో. కానీ జనాల్లో ఆసక్తి, కమర్షియల్ స్కోప్ బాగా పెరిగింది మాత్రం ఇయాన్ ఫ్లెమింగ్ సృష్టించిన 'జేమ్స్ బాండ్' పాత్ర/సినిమాల ద్వారా అని చెప్పవచ్చు. జేమ్స్ బాండ్ అంటే ఒక స్టైల్, ఒక ట్రెండ్. జేమ్స్ బాండ్ సినిమా తరువాత స్పై థ్రిల్లర్స్ అన్నీ వాటిని అనుకరించడం మొదలైంది అని చెప్పవచ్చు. జేమ్స్ బాండ్ తరువాత, స్పై థ్రిల్లర్స్ మూవీస్లో ఒక డిఫరెంట్ పాటర్న్ లో వచ్చిన సిరీస్ జాసన్ బౌర్న్ సిరీస్ (ఇప్పటికి అయిదు సినిమాలు వచ్చాయి. మొదట మూడు సూపర్ సక్సెస్ కాగా, నాలుగోది పర్వాలేదనిపించిండి, అయిదోది పోయి...

... జాన్ విక్ 3 - పారాబులమ్

వంశీ వ్యూ పాయింట్ // ... జాన్ విక్ 3 - పారాబులమ్ // ***********************************************             జాన్ విక్ సిరీస్ మూవీస్ తెలుసనుకుంటా ... కీను రీవ్స్ కి మళ్ళీ స్టార్డం వచ్చేలా చేసిన చిత్రం జాన్ విక్ మొదటి భాగం. ఒక ఎమోషనల్ ఆక్షన్ థ్రిల్లర్. నాకు బాగా నచ్చింది. సెకండ్ పార్ట్ అంతగా అనిపించలేదు. రెండ్రోజుల క్రితం మూడో భాగం John wick 3: Parabulum చూశాను. నేను జనరల్ గా ఆక్షన్ థ్రిల్లర్ మూవీస్ ని ఎక్కువగా ఇష్టపడతాను. నా ఆల్ టైం ఫెవరెట్ ఆక్షన్ థ్రిల్లర్ మూవీ అంటే కిల్ బిల్ 1 & 2. వాటి గురించి ఒక్క వాక్యంలో చెప్పాలంటే హింసాత్మక కావ్యంలా ఉంటాయని చెప్పవచ్చు. వయోలెన్స్ ని అంత బ్యూటిఫుల్ గా చూపించవచ్చు అని నాకు కిల్ బిల్ సినిమా చూశాకే తెలిసింది. నేను ప్లాన్ చేసుకుంటున్న ఒక ఫ్యాక్షన్ మూవీ లో ఆక్షన్ సీన్స్ కిల్ బిల్ స్ఫూర్తితో ఉంటాయని ఇపుడే చెప్తున్నా. ఓకే ... ఇపుడు జాన్ విక్ 3 సినిమాకు వద్దాం.             రూల్స్ ని బ్రేక్ చేసిన జాన్ విక్ పై హై టేబుల్ (అంటే హై కమాండ్ - బాస్ అఫ్ ది అండర్ వరల్డ్ అనుకోండి) ఎక్స్ కమ్యూనికాడో డి...

... వైద్యో నారాయణో హరిః

వంశీ కలుగోట్ల // ... వైద్యో నారాయణో హరిః // *************************************** ఇపుడు జరుగుతున్న విషయం చెప్తాను.             పరిస్థితి ఎలా ఉందంటే కాస్త దగ్గో, జలుబో, ఒళ్ళు వెచ్చబడటమో జరిగితే లోలోపల దడ పుడుతోంది. అలాగని వెంటనే హాస్పిటల్, దగ్గరలో ఉన్న డాక్టర్ దగ్గరకో వెళ్ళటానికి కూడా భయం. మరేం చేయాలి ... ??? అపుడు గుర్తొస్తారు మన ఫ్రెండ్స్ లో డాక్టర్స్ లేదా తెలిసిన డాక్టర్, మన ఫ్రెండ్స్ డాక్టర్ - ఇలా వాళ్ళకు ఫోన్ చేసి వివరాలు చెప్పి, వాళ్ళ సలహా తీసుకుంటాం. ఇపుడు ఉన్న పరిస్థితుల్లో బయటకు, అదీ రద్దీ ఎక్కువగా ఉండే హాస్పిటల్స్ లాంటి ప్రదేశాలకు వెళ్లాలంటే భయం ఉంటుంది కాబట్టి అర్థం చేసుకోవచ్చు. ఇదే సమయంలో అనేక ప్రైవేట్ (వెల్, ప్రైవేట్ అనేకంటే కార్పొరేట్ హాస్పిటల్స్ అనాలేమో) హాస్పిటల్స్ సాధ్యమైనంత దండుకుంటున్నాయి. నిజానికి సీరియస్ కండిషన్ లేకపోతే హోమ్ క్వారంటైన్ లో ఉండి, డాక్టర్స్ సలహాలతో మందులు తీసుకుంటూ ఉండవచ్చు అని ప్రభుత్వాలు స్పష్టం చేసినప్పటికీ జనాలు పట్టించుకోవడం లేదు.             ఇక్కడ నష్టపోతున్నది ఎవరంటే ఆ డాక్టర్ ఫ్రెండ్స...

... ఎవరి తప్పులు/ఆశలకు ఎవరు బాధ్యులు?

వంశీ కలుగోట్ల // ...  ఎవరి తప్పులు/ఆశలకు ఎవరు బాధ్యులు? // ****************************** **************************             ఇవాళ ఈనాడులో 'మధ్యతరగతి ఆశలపైపిడుగు ' అంటూ ఒక ఆర్టికల్ రాశారు. రాజధాని తరలిపోవడంతో అక్కడ ప్లాట్లు కొన్న అనేకమంది మధ్యతరగతివారు నష్టపోబోతున్నారు అన్నది ఆ ఆర్టికల్ సారాంశం. ఈనాడు వారు (లేదా ఆంధ్రజ్యోతి, సాక్షి లేదా మరే ఇతర మీడియా వారైనా) తెలుసుకోవాల్సింది లేదా తెలియజెప్పాల్సింది ఏంటంటే రాజధాని తరలిపోవడం లేదు. మూడు రాజధానుల ఏర్పాటు నిర్ణయం అమలుకు ఉన్న అడ్డంకులు తొలగిపోయిన తరువాత కూడా అమరావతి శాసనరాజధానిగా కొనసాగబోతోంది. ఆయితే పూర్తిస్థాయి రాజధానిగా ఉండకపోవడం అన్నది ఖచ్చితంగా కొంత ప్రతికూలాంశమే. అయితే అది ఎవరికి నష్టం అన్నది గమనించాలి. రైతులకు నష్టం కలిగించే విధంగా ప్రభుత్వం వ్యవహరించకపోవచ్చు. మరీ వారు ఆశపడుతున్నట్టు ఎకరా నాలుగైదు కోట్ల స్థాయికి కాకపోయినా, నష్టపరిహారం లేదా పొలం వెనక్కి ఇవ్వడం వంటివి జరగవచ్చు. ప్రధానంగా నష్టపోయేది ఎవరంటే అక్కడ భూములు, ప్లాట్స్ కొన్నవారు అన్నది ఇవాళ్టి ఈనాడు కథనం (మధ్యతరగతి ఆశలపై పిడుగు) ద్వారా అర్...

... పవర్ స్టార్ - పార్ట్ 1 (నో పాలిటిక్స్)

వంశీ కలుగోట్ల // ... పవర్ స్టార్ -  పార్ట్ 1 (నో పాలిటిక్స్) // ****************************** ********************             1996 లో నేను కర్నూలులో ఇంటర్మీడియేట్ చదువుతున్నాను, నేను హాస్టల్ లో ఉండేవాడిని. మా కాలేజీ సిటీకి దూరంగా, నందికొట్కూరు రోడ్ లో ఉండేది. ప్రతి ఆదివారం హాస్టల్ లో ఉండే అందరినీ కాలేజీ బస్సులు సిటీ సెంటర్ లో డ్రాప్ చేసి, మళ్ళీ సాయంకాలం హాస్టల్ కి తీసుకెళ్ళేవి. నాకు బాగా గుర్తు ... అప్పట్లో కొన్ని పోస్టర్స్ వచ్చాయి 'ఎవరీ అబ్బాయి' అంటూ. ఈవీవీ సత్యనారాయణ సినిమా అని తెలుసు, కానీ హీరో ఎవరో అర్థం కాలేదు. కొన్నాళ్ళకు తెలిసింది ఆ సినిమాలో హీరో మెగాస్టార్ చిరంజీవి చిన్న తమ్ముడు కళ్యాణ్ బాబు అని. అప్పటికి దాదాపు రెండు మూడేళ్ళ నుండి చిరంజీవికి సరైన హిట్ పడక, 1996 లో అప్పటివరకూ చిరంజీవి సినిమా లేక చిరంజీవి అభిమానులు డీలాగా ఉన్న సమయం అది. ఆ సమయంలో చిరంజీవి తమ్ముడి సినిమా ఖచ్చితంగా హిట్ అవ్వాల్సిందే కదా. సినిమా రిలీజ్ అయింది, ఫుల్ హంగామా. సినిమా చూశాక మొదట అనుకున్నది డాన్సుల్లో చిరంజీవి పేరు సెడగొట్టేట్టు ఉన్నాడు కదరా అని, ఇక నటన గురించి అంట...

... కరోనా గురించి కొన్నిమాటలు

వంశీ కలుగోట్ల // ... కరోనా గురించి కొన్నిమాటలు // *******************************************             ఇపుడు కరోనా గురించే వార్తలన్నీ, కరోనా లేని వార్తలు లేవు. కాబట్టి కాస్త కరోనా గురించి కొన్ని మాటలు మాట్లాడుకుందాం. అసలే శ్రీశ్రీ గారు చెప్పిన 'అగ్గిపుల్లా, సబ్బుబిళ్ళా ... కాదేదీ కవితకనర్హం' అన్న మాటలను ఆదర్శంగా తీసుకుంటాం మనమంతా. అలాంటిది నాలుగు మాటలు చెప్పుకోవడానికి కరోనా లాంటి టాపిక్ ను వదలడమెందుకు? కమాన్ గుస గుస ...             కరోనాకు మందు లేదు అని చెబుతున్నది అబద్ద్ధం అని నా అభిప్రాయం. ఎందుకంటే కరోనా వచ్చిన వారందరూ మరణించటం లేదు. కాకపొతే కరోనా వైరస్ సోకినా తరువాత ప్రారంభ దశలో కాకుండా తీవ్రమైన దశలో కనుగొంటే కోలుకోవడం అన్నది ప్రధానంగా ఆ వ్యక్తి యొక్క అంతర్గత రోగనిరోధక శక్తి మీద ఆధారపడి ఉంటుంది. అదే ప్రారంభ దశలో కనుగొనగలిగితే కొన్ని మందులతో, బలవర్ధక ఆహారం, మరికొన్ని వైద్యులు సూచించిన విషయాలు పాటించడం వంటి వాటిద్వారా కోలుకునేలా చేయవచ్చు అన్నది ఇప్పటిదాకా జరుగుతోంది అని నా అభిప్రాయం. ముదిరిపోయాక ఏ మందులూ ఏమీ చేయలేవు. క...

... వైఎస్సార్

వంశీ కలుగోట్ల // ... వైఎస్సార్ // ***************************             కాంగ్రెస్ చరిత్రలో వైఎస్సార్ ది ఒక ప్రత్యేక అధ్యాయం అని చెప్పవచ్చు. మొదటినుండి కాంగ్రెస్ లో రెండే మార్గాలు - అధిష్టానంతో సర్దుకుపోవడం లేదా అధిష్టానానికి ఎదురు తిరిగి బయటకు పోవడం. ఒకానొక ఉత్తమ ఉదాహరణ సుభాష్ చంద్రబోస్; మరొక ఉదాహరణ ప్రకాశం పంతులు, రాజాజీ వంటివారు. బోస్ ఎదురు తిరిగి బయటకు వెళ్ళగా; ప్రకాశం పంతులు, రాజాజీ వంటివారు సర్దుకుపోయారు. గాంధీ మరియు నెహ్రు ఆధిపత్యం అంగీకరించకపోతే బయటకు పోవలసిందే. అదే సమయంలో దేశవ్యాప్తంగా ఆ పార్టీలో మరొక నాయకుడు స్థానికంగా కానీ, జాతీయంగా కానీ వ్యక్తిగత ఇమేజ్ తో బలపడకూడదు అనేది ఒక బేసిక్ ప్రిన్సిపల్ - అంటే అది వారి నియోజకవర్గస్ధాయి వరకూ అయితే పర్వాలేదు. అంతకుమించితే 'కట్' చేయబడతారు. గాంధీ, నెహ్రు కాలం నుండి నేటి సోనియా,  రాహుల్ వరకూ ఇదే తీరు. పార్టీలో ఉండి, పార్టీ తీరుకు భిన్నంగా ఎదగడం, కాంగ్రెస్ చరిత్రలో గాంధీ - నెహ్రు కుటుంబాలవారు మినహాయించి మరొకరు పార్టీకి మించి వ్యక్తిగత ఇమేజ్ ను పెంచుకోవడం అన్నది జరగలేదు - నాకు తెలిసినంతవరకూ దానికి ఏకైక...

... జింక మీద జాలి కాదు

వంశీ కలుగోట్ల // ... జింక మీద జాలి కాదు // ****************************** ********             పంజాగుట్ట స్మశానవాటికలో కరోనా మృతుల శవాలను కుక్కలు పీక్కుతింటున్నాయి అన్న వార్త చూసినపుడు చాలా బాధగా అనిపించింది. అందులో నిజానికి మీడియా అతి కూడా ఉందేమో. అక్కడ గుట్టలుగా శవాలు పడేసి, ఎవరూ పట్టించుకోకుండా వదిలేసి, కుక్కలపాలు కావడం జరగలేదు. బహుశా అది కేవలం ఒక ఘటన మాత్రమే కావచ్చు. ఆ పోస్ట్ చూడగానే మొదట చాలా బాధ కలిగింది, ఇంతటి నిర్వహణా లోపమా అని కోపమూ వచ్చింది. అదే సమయంలో నిద్రాణంగా ఉండిన బాధపడిన ఘటన గుర్తొచ్చింది - అదే తెలంగాణ ఆరోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్ గారు 'హైదరాబాద్ ను కర్నూలు, గుంటూరుల లాగా కానివ్వం' అని వెటకారంగా మాట్లాడిన మాటలు. ఆయన ఆ మాట అన్న సమయంలో, అక్కడున్న ఎవరూ ఆంధ్రప్రదేశ్ ప్రస్తావన తీసుకురాలేదు - ఆయన అన్న ఆ మాటలు అసందర్భమే కాక, బాధించాయి. అందుకే '...తలకాయ యాడ బెట్టుకోవాల్నో అర్థమవుతోందా రాజేంద్రా' అన్న వైఎస్ గారి వ్యాఖ్యలను ఉటంకించాను. ఈ పోస్ట్ ద్వారా కామెంట్స్ లోనూ, ఆఫ్ లైన్ లోనూ నాకు కొన్ని ప్రశ్నలు ఎదురయ్యాయి. ముందుగా ఆ పోస్ట్ లో పెట్టిన పిక...

... పోరాడమని చెప్పండి

వంశీ కలుగోట్ల // ... పోరాడమని చెప్పండి // ****************************** ******* 'ఆ గొంతు, ఆకారం - వీడేంటి, హీరో ఏంటి?' అని చీత్కారాలెదుర్కొన్న వ్యక్తి ఇవాళ ఒక స్ఫూర్తివంతమైన నటుడు, తిరుగులేని మెగాస్టార్ అయ్యాడు. ఒక దిగ్గజంగా వెలుగుతున్న అమితాబ్ బచ్చన్ అయ్యాడు. అతడిప్పుడు భారతీయ సినీ రంగానికి భీష్ముడు లాంటి వ్యక్తి.  'ఈ ... మొఖపోడికి హీరో అవకాశం ఇవ్వాలంట, అది కూడా నా సినిమాలో' అని ఛీత్కారం చేసిన దర్శకాగ్రేసరుడే, తన కాల్షీట్స్ కోసం వారం రోజులు తిరిగే స్థాయికి ఎదిగాడు చిరంజీవి. తెలుగు సినిమా గతిని మార్చిన మెగాస్టార్ గా ఇంకా వెలుగొందుతున్నాడు.  అనిల్ కపూర్, షారుఖ్, , ఆమీర్, సల్మాన్, హృతిక్ లాంటివారందరూ అవమానాలు, తిరస్కారాలు ఎదుర్కోలేదా? రజనీకాంత్, అర్జున్, అజిత్, విక్రమ్, రవితేజ, నాని, వీడి కొండా లాంటివారు అవమానాలు, తిరస్కారాలు ఎదుర్కోలేదా? (ఇక్కడ పేర్లు ప్రస్తావించబడని అనేకమంది కూడా) బంధుప్రీతి (నెపోటిజం) ఖచ్చితంగా ఉంది, ఉంటుంది కూడా అది బాలీవుడ్ అయినా, టాలీవుడ్ అయినా? మరింకో వుడ్అయినా. మనకు పెద్దగా పరిచయం లేదు కానీ హాలీవుడ్ లో కూడా ఎంతోకొంత స్థాయిలో ఖచ్చితంగా ఉంటుంది....

... చచ్చేవాడిది, బ్రతకలేని భయం

వంశీ కలుగోట్ల // ...  చచ్చేవాడిది, బ్రతకలేని భయం // ********************************************** అందరికీ భయాలుంటాయి కానీ ఒక్క క్షణపు ఆలోచన ... కాసింత ధైర్యం కొందరిని బ్రతుకువైపు నడిపిస్తుంది మరికొందరిని చావువైపుకు తోస్తుంది బ్రతికేవాడిది ... చావలేని భయం  చచ్చేవాడిది ... బ్రతకలేని భయం                డిప్రెషన్ - ఇదేమీ కొత్తపదం కాదు. ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం అనేక జీవితాలను బలితీసుకునే జబ్బు. డిప్రెషన్ కు అనేక రకాల కారణాలు ఉండవచ్చు. కొంతమంది డాక్టర్స్ చెప్పేదానికి ప్రకారం చాలాసార్లు డిప్రెషన్ అనేది బయటి సంఘటనలతో సంబంధం లేకుండా మెదడులో న్యూరో ట్రాన్స్మిషన్ లో జరిగే మార్పుల వల్ల రావచ్చు. అలాగే జీవితంలో జరిగే పలు ఘటనలు కూడా డిప్రెషన్ కు కారణం కావచ్చు. ఏ దశలో లేదా ఎలాంటి వ్యక్తులు డిప్రెషన్ కు లోనవుతారు అన్నదానికి స్పష్టమైన సమాధానం ఇవ్వడం కష్టమేనేమో. డబ్బు, హోదా, ఆనందాలు అన్నీ ఉన్నాయి అని మనం అనుకునే ప్రముఖుల జీవితాలు ఈ డిప్రెషన్ కారణంగా ఒక చిన్న రాయి తగిలి పగిలిపోయిన అద్దాలమేడలా కూలిపోవడం పలు ఘటనల్లో చూశాం. సైకియాట్రిస్ట్ ను కలవగలిగేంత...

... మరి మీరేం చేశారు

వంశీ కలుగోట్ల // ... మరి మీరేం చేశారు // ************************************* ఒక టీచర్ సోనూ సూద్ ను ఉదాహరణగా చూపుతూ, మిగతా నటీనటులందరినీ తిట్టాడు ... 'మీ టీచర్స్ గ్రూప్ లో, నీ పై లేదా క్రింది స్థాయి ఉద్యోగులలో ఎంతమంది సాయం చేశారు' అని అడిగామనుకోండి 'అది వేరు ఇది వేరు. మేమేం కోట్లు సంపాదించట్లేదుగా' అని సమాధానం వస్తుంది  మరి పిల్లలకు చెప్పే పాఠంలో 'Every little helps' అని చెప్తావ్ కదా అంటే మౌనం * ఒక టీచర్ అనే కాదు - ఒక బ్యాంకు ఎంప్లాయ్, ఒక రెవిన్యూ ఉద్యోగి, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఒక వ్యాపారి ఇలా పలు రంగాల వారు ఇలానే అంటున్నారు. సోనూ సూద్ ను చూపడం, మిగతా అందరినీ, మరీ ప్రత్యేకించి తెలుగు నటులను తిట్టటం. మరి మీరేం చేశారు అంటే అధికుల వద్ద సమాధానం ఉండదు, సరే వారిలో ఎవరో ఒకరు చేతనైనంత చేశారనుకుందాం - మరి వాళ్ళ రంగంలో మిగతావాళ్ళెందుకు చెయ్యలేదు అంటే "అది వాళ్ళ ఇష్టం అండి. సాయం చెయ్యమని వాళ్ళను బలవంతం చెయ్యలేం కదా" అంటారు. ఇక్కడ నటులను మాత్రం వారు చేసిందానికన్నా, ఇంకా ఎక్కువ చేయలేదెందుకని తిడతారు. సోనూ సూద్ స్వయంగా చెప్పినట్టు, వలస కార్మికుల కష్టాలతో తన అనుభవా...

... చైనా వస్తుబహిష్కరణ సాధ్యమయ్యేదేనా?

వంశీ కలుగోట్ల // ... చైనా వస్తుబహిష్కరణ సాధ్యమయ్యేదేనా? // ******************************************************             కరోనా వైరస్ ను ల్యాబ్ లో పుట్టించారో లేక అది జంతువుల నుండి వ్యాపించిందో అన్నదాని మీద పలురకాల కథనాలు ఉన్నాయి, కానీ ఆ వైరస్ చైనా నుండి ప్రపంచానికి వ్యాపించింది అనడంలో మాత్రం ఎటువంటి సందేహమూ లేదు. దానితో పాటు, ఈ సమయంలో సరిహద్దుల్లో చైనా కవ్వింపు చర్యలకు పాలపడటం జరుగుతోంది. ప్రత్యేకించి ఈ రెండు ఘటనలూ 'చైనా వస్తు బహిష్కరణ' అన్న అంశాన్ని మరొకసారి దేశభక్తుల మదిలోనుండి మాటల్లోకి వెలిగక్కాయి. చైనా తయారీ వస్తువులను బహిష్కరించడం ద్వారా చైనా ఆర్థికమూలాల మీద దెబ్బకొట్టడం, తద్వారా చైనాను భయపెట్టటం అన్నది ఈ చర్యల పరమోద్దేశం. అయితే అది సాధ్యమా? చైనా వస్తువులు కొనడం మానితేనే దేశభక్తి ఉన్నట్టు అనే భావాన్ని వ్యాప్తి చెయ్యటం ఒక అంటువ్యాధిలా వ్యాపిస్తోంది. ఈ తీరు ఎలా ఉందంటే, రోగం ఉన్నది తలలో అయితే మందు మోకాలికి వేస్తున్న చందాన ఉంది.             కొన్ని వాస్తవాలు పరిశీలిస్తే ... ఒక అంచనా ప్రకారం మన దేశపు కంపెనీల పేర్లతో అమ్ముడ...

"... సంస్కారి సరసం" అనబడు గొప్ప రొమాంటిక్ చిత్రం/కథ

వంశీ కలుగోట్ల // "... సంస్కారి సరసం"  అనబడు గొప్ప రొమాంటిక్ చిత్రం/కథ // ****************************** ****************************** ****** అతడు అతడే  ఆమె ఆమే  అవును వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు  కానీ ఆమె తండ్రి, అతడి తల్లి వారి ప్రేమను ఒప్పుకోలేదు.  అయినప్పటికీ ప్రేమకు ధైర్యం ఎక్కువ కాబట్టి, వారు రహస్యంగా, కరోనా నిబంధనలకు అనుగుణంగా భౌతిక దూరం పాటిస్తూ కలుసుకునేవారు.  ఒకరోజు ఆమె ఒక చిన్న కోరిక కోరింది   ఆమె: ఏమోయ్ నన్ను అంతగా ప్రేమిస్తున్నానంటావు కదా, నా మీద ఏదైనా కవితలాంటిది రాయొచ్చుగా అతడు: నీ పరోక్షంలో విరహంతో నిశ్శబ్దమవుతాను, నీ సమక్షంలో స్వాంతన పొందుతూ ప్రేమను అనుభవిస్తాను. ఇక రాయడానికి ఏం మిగిలుంటాను? ఆమె: ఈ మాటలకేం తక్కువలేదులే, ప్లీజ్ రా ఏదైనా కనీసం ఒక డైలాగు లాంటిది అతడు: తప్పదంటావా ఆమె: ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ ... (ఇక్కడ సెన్సార్ నిబంధనలకు అనుగుణంగా వారి ముద్దును కవర్ చేస్తూ పూవులు ఊపబడతాయి) అతడు: సరే ... అయితే ఇదిగో ఇది నీ కోసమే - "మదీయ మది తమరి తలపులతో తన్మయమందుచున్నది సుకుమారలావణ్యలతాతన్వి సమానిత సుందరీ మా హృదయేశ్వరీ. ఏమీ ఏమేమీ ఆ సౌంద...

... నన్ను చూసి ఏడవకురా

వంశీ కలుగోట్ల // ... నన్ను చూసి ఏడవకురా //  ***************************************           ఈ మద్దెన శకుంతలాకియా కోర్ట్ తీర్పుల గురించి, కొందరి మాటల గురించి తెగ వర్రీ అయిపోతాంది. 'ఏందే ఇది? ఇయన్నీ ఆటలో అరటిపండులెక్కటివి' అని అక్కడికీ సెప్తిని. అయినా "ఒక పార్టీ ఎమ్మెల్యేల చర్యల పట్ల తీవ్రంగా వ్యాఖ్యానిస్తూ 'ఎంక్వయిరీ ఎందుకు వేయకూడదు?' అని ప్రశ్నించినవారు, ఇపుడు అదే తరహాను వందలమందితో ఆహ్వానమందుకున్న మరొకరి పట్ల చేయగలదా? ఏమిటీ ఈ దారుణం. కనీసం ఆయనకన్నా తెలియదా? అట్టా వందలమంది వస్తే, సెప్పొద్దూ. అనుభవం యాడికి బోయింది. ఇట్టా అయితే ఎట్టా." అని శకుంతలాకియా తన ఆవేదనను వెలిబుచ్చింది.           ఫాఫమ్ శకుంతలాకియా ఆవేదన చూస్తే జాలేసింది. తనకు కాస్త స్వాంతన చేకూర్చటానికి నేను ఇలా చెప్పాను - "ఇద్దో శకుంతలాకియా మనం ఎన్నైనా అనుకోవచ్చు. కొందరు సైన్యాన్ని నమ్ముకుంటారు, కొందరు శతృశిబిరంలోని ద్వారపాలకులను (ప్రత్యేకించి రాత్రిపూట ఉండే) వారిని నమ్ముకుంటారు. కొన్ని వందలేళ్ళ క్రితం ఒక బలమైన రాజ్యంపై అంతకంటే బలమైన మరొక రాజ్యపు రాజు దండయాత్ర చేశాడు. కొన్ని ...

... జగన్ సంవత్సరం పాలన - మరింత మెరుగ్గా పని చేయాలి

వంశీ కలుగోట్ల // ... జగన్ సంవత్సరం పాలన - మరింత మెరుగ్గా పని చేయాలి // ****************************** ***********************************             అష్టకష్టాలూ పడి, అనుకున్నది సాధించిన జగన్మోహన్ రెడ్డి గారు నవీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రెండవ ముఖ్యమంత్రిగా అత్యధికశాతం ప్రజలచే ఎన్నుకోబడి సంవత్సరం ముగిసింది. ఎన్నో ఆశలు, నమ్మకాలతో ప్రజలు అధికారం అప్పగించారు. సరిగ్గా సంవత్సరం క్రితం ఇదే రోజున ఉదయాన్నే టీవీల ముందు కూచున్నాం - బహుశా ఇంత ఉత్కంఠత గతంలో ఎపుడూ లేదేమో. చంద్రబాబు ప్రభుత్వం పట్ల తీవ్ర వ్యతిరేకత ఉందని తెలుసు, అయినా సరే వైఎస్సార్సీపీ అభిమానులలో గెలుపు పట్ల ఏదో అనుమానం - ఎందుకంటే అవతల అపర కౌటిల్యుడుగా పేరొందిన చంద్రబాబు. ఏదో ఒకటి చేసి, మళ్ళీ అధికారంలోకి వస్తాడేమో అని భయం. ఇపుడూ రాకపోతే ఇక జగన్ పని ముగిసినట్టే అని నర్మగర్భవ్యాఖ్యలు. అవతల చంద్రబాబు శిబిరంలో ఓటమి తప్పదని అనిపించేలా ఉన్నా కూడా మేకపోతు గాంభీర్యం. నేర చరిత ఉందని ప్రచారం పొందిన జగన్ పట్ల జనాలు సానుకూలత చూపారని ఆశ. అనుభవం, దార్శనికత పేరుతో, అమరావతి ఆశతో మళ్ళీ అధికారం అప్పగిస్తారులే అని క...

... మూడు బలిపశువుల కథలు

వంశీ కలుగోట్ల // ... మూడు బలిపశువుల కథలు // ****************************** ************** 1             అనగనగా కథల్లో, పురాణాల్లో చదువుకుని ఉంటాం - ఎవరో ఒకరు ఏదో ఒక దాన్ని ఆశించి ఘోరతపస్సు చేస్తారు. అలా ఎవరు తపస్సు మొదలుపెట్టినా మొదట ఉలిక్కిపడేది ఇంద్రుడు. బహుశా పదునాలుగు లోకాలలో (నిజమా, అబద్ధమా అనేది వేరే విషయం) అత్యంత అభద్రతాభావంతో ఉండేది ఇంద్రుడు మాత్రమేనేమో (ఇపుడూ ఎవరో ఒకరు ఉండే ఉంటారు). ఎందుకంటే ఆ తపస్సు చేసేవారి కోరిక స్వర్గాధిపత్యమేమో లేకపోతే వారు కోరే వేరే కోరికల వల్ల తన పదవికి ముప్పు వస్తుందేమో అనే అనుమానాలు. ఇంద్రుడి తక్షణ కర్తవ్యం ఆ తపస్సును భగ్నం చేయడం - తనకు తెలిసిన అన్ని మార్గాలూ ప్రయత్నిస్తాడు. అవతలి వాడు గట్టి వాడైతే (ఎందుకంటే అప్పట్లో తపస్సులు చేసినోళ్ళందరూ మగోళ్ళే పురాణాల లెక్కల ప్రకారం) అన్నీ తట్టుకుని నిలబడతాడు. అపుడు ఇంద్రుడు చివరి అస్త్రం తీస్తాడు - అదే అప్సరసలను పంపడం. ఆ అప్సరసల మాయలో పడకుండా ఉన్నోళ్ళు బహు అరుదు. ఇక వాళ్ళ తపస్సు భగ్నం, ఇంద్రుడు హ్యాపీ. అప్సరసలతోనూ పని జరక్కపోతే - శివుడు ఏదొక వరం ఇవ్వడం, తరువాత విష్ణువు ఆ సమస్యను పరిష్...