Posts

Showing posts from November, 2018

వంశీ వ్యూ పాయింట్ - 'టాక్సీవాలా'

వంశీ వ్యూ పాయింట్ - 'టాక్సీవాలా'  ************************************             విజయ్ దేవరకొండ తాజా చిత్రం 'టాక్సీవాలా' - అర్జున్ రెడ్డి, గీత గోవిందం లాంటి సంచలనాలు; నోటా వంటి పరాజయం తక్కువకాలంలోనే చవిచూసిన విజయ్ తాజా చిత్రమైన 'టాక్సీవాలా' పై ఆసక్తి నెలకొంది. ఈ చిత్రానికి ఏకైక ఆకర్షక అంశం 'విజయ్ దేవరకొండ' ఇమేజ్. కొత్త దర్శకుడు, కొత్త హీరోయిన్. లో బడ్జెట్ ... ఈ చిత్రం మీద అనుమానాలు కలిగించాయి. అంచనాలను అందుకుందా లేక అనుమానాలను నిజం చేసిందా - చూద్దాం.              కథ పరంగా చెప్పాలంటే హారర్ కామెడీ కి కాస్త సైన్స్ టచ్ ఇచ్చారు 'ఆస్ట్రల్ ప్రొజెక్షన్' పేరున. కాకపొతే, ఎక్కువగా దాని మీద దృష్టి పెట్టకుండా దానికి కాసింత కామెడీ, రివెంజ్ డ్రామా కలిపారు. ఆస్ట్రల్ ప్రొజెక్షన్ పాయింట్ కొత్తగా ఉన్నప్పటికీ, దాన్ని సరిగా ప్రాజెక్ట్ చేయలేదు, దానిమీద పెద్దగా దృష్టి పెట్టలేదు కూడా. అలాగని అదేమీ ఇబ్బంది పెట్టే అంశం కాలేదు కూడా. కుటుంబానికి భారం కాకూడదని, ఎదో పని చేసుకోవాలని నగరం వచ్చే సగటు మధ్యతరగతి అబ్బాయిగా విజయ్, మెడికోగా కొత్తమ్మాయి ప్రియాంక, ఆస్ట్రల్ ప

... కాసింత గట్టిపడాల్సిందే

వంశీ కలుగోట్ల // ... కాసింత గట్టిపడాల్సిందే // ********************************************** మహాసభ జరుగుతోందని తెలిసి, మావాడు వెళ్ళాడు  నాయకుడు ఆవేశంతో ఊగిపోతూ ప్రసంగిస్తున్నారు  నేను రెండువేలమందిని ఒక కర్రతో వెంటాడి తరిమాను అన్నాడు నాయకుడు, అభిమానులు వెర్రెత్తి కేరింతలు కొట్టారు  రాష్ట్ర విభజన జరిగినపుడు నేను పదకొండు రోజులు అన్నం మానేసాను అన్నాడు నాయకుడు, ఆడపడుచుల కన్నీటితో వరద వచ్చేలా ఉందని, సహాయక చర్యలు చేపట్టారు అవసరమైతే రోడ్డుమీదకీడ్చి కొట్టగలను గుర్తుంచుకో అంటూ నాయకుడు హెచ్చరించాడు, కార్యకర్తలు ఆవేశంతో ఊగిపోయారు  ...  ...  ...  అర్ధరాత్రి చాయ్ తాగుతున్న మావాడిని పలకరించి, 'ఈ టైం లో చాయ్ తాగుతున్నావు, ఏమైందిరా' అని  అడిగా  'ఏం లేదురా, సినిమా బాలేదు. సినిమా దెబ్బకు బాగా తలనెప్పిగా ఉంది' అన్నాడు  అదేందిరా, నువ్వేళ్లింది మహాసభకు కదా అని అడిగాను  ఏ ఊకో మామా, వాళ్ళు మస్తు సెప్తారు వినేటోళ్ళకు దిమాక్ ఉండొద్దా! కావాలంటే నువ్వూ వెళ్ళి చూడు. సాంగ్స్ హీరోయిన్స్ లేకపోయినా హీరో ఆ ఆ అదే నాయకుడి మాటలు సినిమాలో డవిలాగుల లాగానే ఉన్నాయి అంటూ ఇంకో చాయ