Posts

Showing posts from November, 2017

జబర్దస్త్ గురించి

వంశీ కలుగోట్ల // ... జబర్దస్త్ //  ****************************** పురాణాలలో కొన్ని కథలు విని ఉంటాం. అందులో ఎలా ఉంటుందంటే దేవుడిని విపరీతంగా పూజించే భక్తుడికంటే, దేవుడిని దూషించే వాడికే దేవుడు ప్రత్యక్షమవుతాడు లేదా దర్శనమిస్తాడు. దాన్ని ప్రశ్నించిన భక్తుడికి దేవుడు చెబుతాడు - 'నువ్వు అవసరం ఉన్నప్పుడో లేకపోతే నిర్దిష్ట సమయాల్లోనో నన్ను తలచుకుంటున్నావు కానీ వాడు అలా కాదు నిరంతరం నన్నే తలచుకుంటున్నాడు అందుకే వాడు మరణానంతరం నా లోకంలో నా సమక్షంలో సకల సుఖాలనుభవిస్తాడు' అని వివరిస్తాడు. ఈ జబర్దస్త్ గోలలో నాకొకటి అనిపిస్తోంది... ఈ జబర్దస్త్ ను ఎవరైతే అధికంగా విమర్శిస్తున్నారో వారే మళ్ళీ మళ్ళీచూస్తూ, షేర్ చేస్తూ ఆ టి.ఆర్.పి రేటింగ్ లు ఏవైతే ఉన్నాయో వాటికి కారణమవుతున్నారు. ఈ జబర్దస్త్ బాగా ప్రాచుర్యం పొందాక హేవిటో అది అనుకుని కొన్ని ఎపిసోడ్స్ చూశాను (అది కూడా చాలాకాలం క్రితం). అందులోని వెకిలితనం, బూతు, అశ్లీలత, వెటకారం తదితరాలు నాకు నచ్చలేదు. అప్పటినుండి ఇప్పటివరకూ మళ్ళీ చూడలేదు కూడా. అంతే కాదు, సాధ్యమైనంతవరకూ నా చుట్టూ ఉన్నవారికి దాన్ని చూడొద్దని చెప్పటానికే ప్రయత్నించాను. నాకు బూతు/అశ…

... ఆర్జీవీ

వంశీ కలుగోట్ల // ... ఆర్జీవీ // ************************* Don't walk like you rule the world, walk like you don't care who rule the world.
రాం గోపాల్ వర్మ - పరిచయం అక్కర్లేని పేరు. ఒకప్పట్లో అయితే కేవలం సినీ ప్రేక్షకులకు మాత్రమే పరిచయం. కానీ ఎప్పుడైతే ఆర్జీవీ సామాజిక మాధ్యమపు గోడలెక్కడం మొదలెట్టాడో, అప్పటినుండి అందరికీ తెలిసిపోయాడు. తెలిసిపోవడమే కాదు ఒక ఇజమై కూచున్నాడు. నిజాయితీగా మాట్లాడతాడు అని కొందరు, నోటికొచ్చింది మాట్లాడతాడు అని కొందరు - ఇలా ఆర్జీవీని ఇష్టపడేవారు, ఇష్టపడనివారుగా ఏర్పడ్డారు. నిన్న 'ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే విత్ ఆర్జీవీ' ప్రోగ్రాం కాసింత చూశాను. గతంలోనూ కొన్ని ఆర్జీవీ ఇంటర్వ్యూలు చూశాను. వాటికీ, వీటికీ తేడా ఉందనిపించింది. విషయం గురించి కాదు, వర్మ గురించి. 'నేను అందరిలా కాదు' అనుకోవడం వేరు, 'నేను అందరికంటే వేరు' అనుకోవడం వేరు. నేను అందరిలా కాదు అనుకునేవాడు తనపని తానూ చేసుకుపోతాడు, నేను అందరికంటే వేరు అనుకునేవాడు అందరినీ కెలుకుతుంటాడు. నేను అందరిలా కాదు అనుకునే దశనుండి నేను అందరికంటే వేరు అనుకునే దశకు ఆర్జీవీ వచ్చాడనిపించింది.…

... గురువింద గింజలు

వంశీ కలుగోట్ల // ... గురువింద గింజలు // ****************************************** -> మన ఆర్కే గారున్నారే అదేనండీ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు మొన్నామధ్య కోర్టుకు తన లాయర్ల ద్వారా వినతి పంపించారు ఏమిటంటే 'వ్యక్తిగత హాజరు నుండి మినహాయింపు ఇవ్వండి' అంటూ, అదీ ఎప్పుడు అంటే సదరు న్యాయస్థానం వారు వ్యక్తిగతంగా ఆర్కే గారు హాజరు కావట్లేదని ఆగ్రహం వ్యక్తం చేసినందువల్ల. కారణాలేంటయ్యా అంటే, శాసనసభ సమావేశాలను కవర్ చేస్తూ తీరిక లేకుండా ఉన్నారట. పాపం ఆయన ఫీల్డ్ జర్నలిస్ట్ కదా, ఉదయాన్నే నిద్ర లేవగానే తినీ తినకుండా లగెత్తుకుని శాసనసభ దగ్గరకెళ్ళి రాత్రి వరకూ అక్కడ కెమెరాలు మోసుకుంటూనో లేక కాయితాలు పట్టుకుని రాసుకుంటూనో తెగ బిజీగా ఉంటున్నారు కాబోలును. ఇదే ఆర్కే గారు ప్రతిపక్షనేత జగన్ గారు పాదయాత్ర సందర్భంగా వ్యక్తిగత హాజరు నుండి మినహాయింపు ఇవ్వమని కోర్టును అభ్యర్థించినపుడు రాసిన విశ్లేషణలు ఆయనకు చూపితే ఎలా ఉంటుంది? ఆ అవన్నీ పట్టించుకుంటే ఆయన ఆ స్థాయిలో కూచుని అంత కమ్మగా అనగా హాయిగా ఎలా ఉంటారులెండి. 
-> మన కత్తి మహేష్ గారున్నారు కదా ... పవన్ కళ్యాణ్ గారిపై విమర్శల జడివాన కురిపించి ప్రాముఖ్యత సంప…

'గొప్పోడు' - అవార్డు గారంటీ (*నిబంధనలు వర్తిస్తాయి)

వంశీ కలుగోట్ల // 'గొప్పోడు' - అవార్డు గారంటీ (*నిబంధనలు వర్తిస్తాయి) //
*************************************************************
మన (అంటే స్వీయ గౌరవం అన్నమాట) దగ్గర ఒక మాంచి ఊర మాస్ మసాలా సినిమా కథ ఒకటుందబ్బా. ప్రతి సీన్ కేకో కేకస్య, కేకభ్యహ అన్నట్టు ఉంటాది. కావాలనుకుంటే సదువుకోండి ...
ఓపెనింగ్ సీన్ లో మన హీరోవోడు ఒక సేతిలో గొడ్డలి, మరో సేతిలో మా సినిమా యూనిట్ ప్రత్యేకంగా తయారు చేసిన ఒక విచిత్ర ఆయుధం పట్టుకుని ఒక రెండు మూడొందల మందిని నరికి పారేస్తాడు. అయినా కూడా మన హీరోవోడికి సిన్న గాయం కూడా కాదు. సీన్ ముగియగానే మన హీరోవోడు ఒళ్ళంతా రక్తంతో (నరికేసినోళ్లదిలే టెన్షన్ పడమాకండి) 'హింస మంచిది కాదు, అది మన ధర్మమూ కాదు, సంప్రదాయమూ కాదు. అహింసను మించిన ధర్మమూ లేదు' అని అరమూసిన కళ్ళతో చెబుతుంటే, మనోడు నరికెయ్యగా మిగిలినోళ్ళు అమాంతం కాళ్ళమీద పడిపోయి 'నీ అంతటోడు లేడు, నువ్వే మాకు గొప్పోడు' అంటూ పాటేసుకుంటారు. ఆ తరువాత అసలు సీన్ ఉంటాది, ఒక మాంచి అందమైన అమ్మాయి అసలు బట్టలేసుకుందా అని అనుమానమొచ్చేలా ఉండీ లేని దుస్తులతో వస్తాది. మన హోరో 'ఏమున్నావే నువ్వు, …