Posts

Showing posts from September, 2018

... తెలంగాణ ముందస్తు ఎన్నికల ప్రకటనపై సమీక్ష

వంశీ కలుగోట్ల // ... తెలంగాణ ముందస్తు ఎన్నికల ప్రకటనపై సమీక్ష // ***********************************************************           ముందస్తు ఎన్నికలకు వెళ్ళడం కెసిఆర్ కు లాభిస్తుందా లేక దెబ్బ తింటాడా? పైపైన చూస్తే కెసిఆర్ కు గెలుపు అతి సులువు అన్నట్టే కనబడుతోంది. కానీ, చిన్న సంశయం కూడా. ఒకసారి కెసిఆర్/తెరాస బలాబలాలు సమీక్షించుకుంటే అనుకూలతలు -> తెరాస ప్రభుత్వంపై ప్రజలలో తీవ్ర అసంతృప్తి లేదు. ఎన్నో త్యాగాల ఫలితంగా సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం గాడిన పడటానికి ఇంకా సమయం అవసరమని అధికులు భావిస్తున్నారు.  -> అద్భుతంగా ఉందని అనకపోయినప్పటికీ విభజన తరువాత పోల్చి చూస్తే ఆంధ్రప్రదేశ్ కంటే తెలంగాణ ఎన్నోరెట్లు మెరుగ్గా ఉంది. దీన్ని ఆర్థిక వనరుల దృష్ట్యా చెప్పడం లేదు. పాలన తీరు గురించి. కెసిఆర్ ఎంతటి సమర్థనాయకుడో, తెరాసలో ఉన్న ద్వితీయస్థాయి నాయకత్వం బలమేంటో తెలిసివస్తోంది. -> ప్రతిపక్షాలకు సరియైన, ప్రజాకర్షక నాయకుడు లేకపోవడం అన్నది ఖచ్చితంగా తెరాసకు అనుకూలించే మరొక విషయం. అంతేకాదు, విపక్షాల మధ్య ఐక్యత కూడా లేదు. ముందస్తు వల్ల అభ్యర్థులను హడావుడిగా