... పోరాడమని చెప్పండి
వంశీ కలుగోట్ల // ... పోరాడమని చెప్పండి //
****************************** *******
'ఆ గొంతు, ఆకారం - వీడేంటి, హీరో ఏంటి?' అని చీత్కారాలెదుర్కొన్న వ్యక్తి ఇవాళ ఒక స్ఫూర్తివంతమైన నటుడు, తిరుగులేని మెగాస్టార్ అయ్యాడు. ఒక దిగ్గజంగా వెలుగుతున్న అమితాబ్ బచ్చన్ అయ్యాడు. అతడిప్పుడు భారతీయ సినీ రంగానికి భీష్ముడు లాంటి వ్యక్తి.
'ఈ ... మొఖపోడికి హీరో అవకాశం ఇవ్వాలంట, అది కూడా నా సినిమాలో' అని ఛీత్కారం చేసిన దర్శకాగ్రేసరుడే, తన కాల్షీట్స్ కోసం వారం రోజులు తిరిగే స్థాయికి ఎదిగాడు చిరంజీవి. తెలుగు సినిమా గతిని మార్చిన మెగాస్టార్ గా ఇంకా వెలుగొందుతున్నాడు.
అనిల్ కపూర్, షారుఖ్, , ఆమీర్, సల్మాన్, హృతిక్ లాంటివారందరూ అవమానాలు, తిరస్కారాలు ఎదుర్కోలేదా?
రజనీకాంత్, అర్జున్, అజిత్, విక్రమ్, రవితేజ, నాని, వీడి కొండా లాంటివారు అవమానాలు, తిరస్కారాలు ఎదుర్కోలేదా?
(ఇక్కడ పేర్లు ప్రస్తావించబడని అనేకమంది కూడా)
బంధుప్రీతి (నెపోటిజం) ఖచ్చితంగా ఉంది, ఉంటుంది కూడా అది బాలీవుడ్ అయినా, టాలీవుడ్ అయినా? మరింకో వుడ్అయినా. మనకు పెద్దగా పరిచయం లేదు కానీ హాలీవుడ్ లో కూడా ఎంతోకొంత స్థాయిలో ఖచ్చితంగా ఉంటుంది. విల్ స్మిత్ కొడుకు కాకపోయుంటే 'ది పర్స్యూట్ అఫ్ హ్యాపీనెస్' సినిమాలో జేడెన్ స్మిత్ ఉండగలిగేవాడా? 'కరాటే కిడ్' లో జాకీ చాన్ తో చేయగలిగేవాడా? తండ్రి/తల్లి పేర్లు తెలిసేలా పేరు పెట్టుకుని, వాటి వెనుక జూనియర్ అని తగిలించుకుని వెలిగిన నటులు చాలామందే ఉన్నారు హాలీవుడ్ లో కూడా. ఈ జాడ్యం ఇవాళ కొత్తగా వచ్చినది కాదు, ఇప్పటికిప్పుడు హఠాత్తుగా పోదు.
అవన్నీ కాదబ్బా ... ఒకటే మాట
అవమానాలు, ఛీత్కారాలు, తిరస్కరణలు ఎదురైనపుడు పోరాడినవాడు అమితాబ్ అవుతాడు, చిరంజీవి అవుతాడు, రజనీకాంత్ అవుతాడు - పోరాడలేనివాడు గోడమీద బొమ్మవుతాడు, ఇంట్లో వాళ్ళకు ఒక కన్నీటి జ్ఞాపకంగా మిగులుతాడు.
కెరీర్ లో అత్యంత ఉన్నత స్థితిని అనుభవించాక; జీవితంలో అత్యంత క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొన్న అమితాబ్ జీవితం ఒక పాఠం. కేబీసీ కి ముందు అమితాబ్ అవకాశాలు కోసం అడుగుతాడని తప్పించుకు తిరిగిన వాళ్ళెందరో. ఒకప్పుడు డేట్స్ కోసం నెలల తరబడి తిరిగిన వారే, మొహం చాటేసి తిరిగినా అమితాబ్ కృంగిపోలేదు, నిష్క్రమించలేదు. నిలబడ్డాడు. సినిమాలు మానుకుని, రాజకీయాల్లో విలువ పోగొట్టుకొని రెంటికి చెడ్డ రేవడు అయ్యాడు అనిపించుకున్న నోళ్ళతోనే, దాసరి తరువాత ఇండస్ట్రీకి నువ్వే పెద్దదిక్కవ్వాలి అనిపించుకున్నాడు చిరంజీవి.
చెప్పండి
... పరీక్షలు ఫెయిలయినా
... ఇంటర్వ్యూలో ఉద్యోగం రాకపోయినా
... కోరుకున్నది దక్కకపోయినా
... ఇష్టమైనది సాధించలేకపోయినా
... ఎవరూ పట్టించుకోకపోయినా
... పరిస్థితులన్నీ ఎదురుతిరిగినా
... బతకొచ్చు అని చెప్పండి. బతికుంటే ఇపుడు కోల్పోయినదాన్ని మించినది సాధించే అవకాశం ఉంటుందని చెప్పండి. ప్రయంత్నం లేకుండానే ఎపుడో ఒకపుడు పోయే ప్రాణాన్ని తీసుకోకుండా, పోరాటానికి అంకితం చేయమనండి.
******************************

ఖాన్ త్రయాన్ని వీరితో కలప కూడదు. మత పిచ్చి ఉంది వాల్లకి. పైగా దావూద్ ఇబ్రహీం నెట్ వర్క్ తో బాలీవుడ్ నాశనం అయిపోయింది.
ReplyDeleteఏ రంగం లో అయినా బయటివారు నిలదొక్కుకోవడం కష్టం. కుక్కలు కూడా ఇతర కుక్కలను రానివ్వవు.
It is a common trait for animals including humans.
Influence of Dawood or mafia was/is not just on Khans, on others as well. If you remember how T Series Gulshan Kumar died and what happened with Sanjay Dutt etc are few examples. Situations makes it inevitable sometimes and ones who don't gel with those highly influential people, have to look for alternative options before it becomes too dangerous. Second line is totally agreeable ... even dogs bark at the new dog :
Deleteఅంబానీలకు నెపోటిజం ఉంది ఎవరినీ ఎదగనివ్వడం లేదని ఒక్కరూ అనడం లేదు.
ReplyDeleteNepotism is not just restricted to one or few fields ... it starts at everyone's home with no end visible. Heredity is one form of nepotism or may be the initial form of nepotism
DeleteLike we keep on adoring Ntr, Balakrishna, Jr Ntr etc., Anr, Nagarjuna, Naga chaitanya, Akhil etc, Krishna, Mahesh babu etc, Chiranjeevi, Pawan Kalyan, Ram charan, Allu arjun etc., Cbn, Lokesh, etc, Ysr,Jagan etc., It's just not confined to one field or one family, anywhere in the world. If we like one person, we keep on loving the family tree to follow., whether they are good or evil. Sic. The human race just likes to lick the boots of somebody, shamelessly, for generations, unwinding their self respect or whatever. Sicer, Sicest. Phew.
Delete