Posts

Showing posts from September, 2020

... రెండు ప్రశ్నలు

వంశీ కలుగోట్ల // ... రెండు ప్రశ్నలు // ********************************             ఇవాళ రెండు ప్రశ్నలు ఎదురయ్యాయి - రెండు విభిన్న పోస్ట్ లలో. మొదటిది నిజానికి ప్రశ్న కాదు, దాదాపు 98% మంది మీడియా పట్ల కలిగి ఉండే స్థిరాభిప్రాయం. రెండవది అమాయకత్వం అనిపించింది. నాకు తెలిసిన/అనిపించిన వివరణ ఇస్తున్నాను.  * ఒక పత్రికలో లేదా మీడియా గ్రూప్ లో వచ్చేవన్నీ అబద్ధాలే అవుతాయా?             మన దగ్గర ఒక్కో మీడియా గ్రూప్ కు సంబంధించిన యాజమాన్యానికి ఒక పార్టీ లేదా సిద్ధాంతం పట్ల అభిమానం ఉంటుంది. ఆ మీడియా గ్రూప్ లో పనిచేసే సిబ్బందికి, వారి వ్యక్తిగత ఇష్టాయిష్టాలు, పత్రికా విలువలు కంటే యాజమాన్యం అభీష్టానికి అనుగుణంగా పనిచేయడమే రావాలి. అలాంటివారే ఉంటారు. అయితే ఇదంతా మాక్సిమం స్థానిక రాజకీయాల వరకే పరిమితమై ఉంటుంది, కొన్నిసార్లు స్థానికంగా ప్రభావితం చేయగల జాతీయ రాజకీయ అంశాలు/పార్టీల పట్ల కూడా అది కనబడుతుంది. అవి కాక మిగతా అంశాలు అవి తాము అభిమానించే పార్టీలను ప్రభావితం చేస్తాయని అనుమానపడనంతవరకూవాటిపట్ల ఒక ప్రత్యేకధోరణి కనబడదు - వార్తల్లాగానే అందిస్తారు - అంతర్జాతీయ అంశాలు, క్రీడలు, సాహిత్యం, ఆరోగ్యం, ఆర్థికం

13 అవర్స్: ది సీక్రెట్ సోల్జర్స్ అఫ్ బెంఘాజి

వంశీ వ్యూ పాయింట్ // 13 అవర్స్: ది సీక్రెట్ సోల్జర్స్ అఫ్ బెంఘాజి // *********************************************************             2016 లో వచ్చిన హాలీవుడ్ ఆక్షన్ థ్రిల్లర్ '13 అవర్స్: ది సీక్రెట్ సోల్జర్స్ అఫ్ బెంఘాజి' - వాస్తవ ఘటనల ఆధారంగా మైఖేల్ బే నిర్మాణం మరియి దర్శకత్వంలో వచ్చిన చిత్రం. లిబియాలోని  బెంఘాజిలో ఉన్న అమెరికన్ డిప్లొమాటిక్ ప్రాంతాన్ని, దుండగుల/ఉగ్రవాదుల దాడి నుండి కాపాడటానికి 'గ్లోబల్ రెస్పాన్స్ స్టాఫ్' (జిఆర్ఎస్) అనే ఆరుగురు ప్రైవేట్ సెక్యూరిటీ టీం మెంబెర్స్ చేసే ప్రయత్నమే '13 అవర్స్'.             కథ పరంగా చెప్పుకోవాలంటే ముందే చెప్పినట్టు వాస్తవంగా జరిగిన అంశాలను దాదాపుగా అలానే తెరకెక్కించారు అని చెప్పవచ్చు. మొదటి సగభాగం నెమ్మదిగా సాగినట్టనిపిస్తుంది. తరువాత అంతా ఉత్కంఠభరితంగా సాగుతుంది. నిజానికి ఇది ఆక్షన్ థ్రిల్లర్ అనేకన్నా ఒక ఎమోషనల్ ఫిలిం అనవచ్చు. జిఆర్ఎస్ మెంబర్స్ మధ్య సాగే సన్నివేశాలు, సంభాషణలు బావుంటాయి. ప్లెయిన్ స్క్రీన్ ప్లే వల్ల ఉండాల్సిన ఉత్కంఠత కాస్త లోపించింది అనిపిస్తుంది. ద్వితీయార్థం మొత్తం దాడి, ప్రతిదాడులతోనే సాగే సిని

... లా అబైడింగ్ సిటిజెన్

వంశీ వ్యూ పాయింట్ //... లా అబైడింగ్ సిటిజెన్ // ******************************************             2009 లో విడుదలైన గెరార్డ్ బట్లర్, జెమీ ఫాక్స్ ల ఆక్షన్ థ్రిల్లర్ చిత్రం 'లా అబైడింగ్ సిటిజెన్'. కమర్షియల్ సక్సెస్ తో పాటు, ప్రశంసలు, అవార్డులు కూడా అందుకుంది. ఇంజనీర్ క్లయిడ్ షెల్టన్ (గెరార్డ్ బట్లర్) జీవితంలో జరిగిన ఒక ప్రమాదం, ఆ తరువాత అతడు అందుకు కారకులైన వ్యక్తులు మరియు వ్యసస్థలపై ప్రతీకారం తీర్చుకోవడం ఈ చిత్ర కథ. ఇంజనీర్ క్లయిడ్ షెల్టన్ ది చిన్న కుటుంబం, సొంతోషకరమైన జీవితం గడుపుతున్న ఆ కుటుంబంపై హఠాత్తుగా ఒకరోజు కొందరు దుండగులు దాడి చేసి - అతడి భార్య, కూతురును (చిన్న పాప) లను రేప్ చేసి, చంపేస్తారు - ఆ సన్నివేశాలను అతడు చూసేలా ఫోర్స్ చేస్తూ. అయితే సరైన సాక్ష్యాధారాలు లేకపోవడం, దాంతోపాటు ప్రాసిక్యూటింగ్ అటార్నీ అయిన నిక్ రైస్ ఆ కేసును నిర్లక్ష్యం చేస్తాడు. ప్రత్యక్ష సాక్షిగా షెల్టన్ ఉన్నా, అతడు బాధితుడు కాబట్టి అతడి సాక్ష్యాన్ని కన్సిడర్ చేయరు. దోపిడీ మాత్రమే చేద్దామని అన్న ఆమెస్ నిందితుడిగా నిరూపించబడి, కఠిన శిక్ష విధింపబడుతుంది. తప్పు ఒప్పుకుని, క్షమించమని వేడుకున్న డర్బీ

... ట్రైటర్ (2008)

వంశీ వ్యూ పాయింట్ // ... ట్రైటర్ (2008) // *************************************             ఇటీవలి కాలంలో అంటే గత రెండు మూడు దశాబ్దాల కాలం నుండి టెర్రరిజం మీద వచ్చినన్ని సినిమాలు బహుశా ప్రేమ మీద కూడా వచ్చి ఉండవేమో అనిపిస్తుంది. అలా తామరతంపరగా వచ్చిన సినిమాల్లో ఒక హాలీవుడ్ ఫిలిం ట్రైటర్ (Traitor), 2008 లో వచ్చిన ఈ సినిమా యూఎస్ బాక్స్ ఆఫీస్ వద్ద మంచి ఫలితాన్నే రాబట్టినట్టుంది.  ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేని మరొక అంశం ఏంటంటే ఈ టెర్రరిజం బేస్డ్ మూవీస్ లో 99% సినిమాల్లో ఇస్లామిక్ టెర్రరిజం అన్నది ప్రధాన అంశం. ట్రైటర్ సినిమా అందుకు భిన్నం కాదు. అయితే ఇందులో ఇస్లాంను రెండు విధాలుగా అర్థం చేసుకున్న రెండు గ్రూప్స్ (లేదా వ్యక్తులు) మధ్య సంఘర్షణగా చెప్పవచ్చు. Steve Martin అందించిన కథలోని ఆ సంఘర్షణను చాలా చక్కగా, జాగ్రత్తగా, ఆకట్టుకునేలా తెరకెక్కించటంలో దర్శకుడు Jeffrey Nachmanoff విజయం సాధించాడు అని చెప్పవచ్చు.             సమీర్ సుడానీస్ - అమెరికన్ మరియు ఇస్లాం సిద్ధాంతాలను పవిత్రంగా ఆచరించే నిఖార్సైన ముస్లిం వ్యక్తి. అయితే కొన్ని అనుకోని పరిస్థితుల్లో అతడు ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజషన్లో భాగమవ

... జాసన్ బౌర్న్ సిరీస్ మూవీస్

వంశీ వ్యూ పాయింట్ // ... జాసన్ బౌర్న్ సిరీస్ మూవీస్ // ************************************************             సీక్రెట్ ఏజెంట్ మూవీస్ లో ఆక్షన్ కు, థ్రిల్లింగ్ ఎలిమెంట్ కు, డ్రామాకు, సెంటిమెంట్ (దేశభక్తి)కు మంచి స్కోప్ ఉంటుంది. నిజానికి ఏ సీక్రెట్ ఏజెంట్ మూవీలో అయినా సెంట్రల్ థీమ్ ఒకటే ఉంటుంది. దేశానికి, ప్రపంచానికి ముప్పు తలపెట్టే ప్రయత్నం చేస్తున్న విలన్ గ్యాంగ్ ను ఏజెంట్ ఎదుర్కొని, వారి ప్రయత్నాలను వమ్ము చేయడం. ఈ స్పై మూవీస్ మొదలైంది 1914 లో The German Spy Peril అనే సినిమాతో. కానీ జనాల్లో ఆసక్తి, కమర్షియల్ స్కోప్ బాగా పెరిగింది మాత్రం ఇయాన్ ఫ్లెమింగ్ సృష్టించిన 'జేమ్స్ బాండ్' పాత్ర/సినిమాల ద్వారా అని చెప్పవచ్చు. జేమ్స్ బాండ్ అంటే ఒక స్టైల్, ఒక ట్రెండ్. జేమ్స్ బాండ్ సినిమా తరువాత స్పై థ్రిల్లర్స్ అన్నీ వాటిని అనుకరించడం మొదలైంది అని చెప్పవచ్చు. జేమ్స్ బాండ్ తరువాత, స్పై థ్రిల్లర్స్ మూవీస్లో ఒక డిఫరెంట్ పాటర్న్ లో వచ్చిన సిరీస్ జాసన్ బౌర్న్ సిరీస్ (ఇప్పటికి అయిదు సినిమాలు వచ్చాయి. మొదట మూడు సూపర్ సక్సెస్ కాగా, నాలుగోది పర్వాలేదనిపించిండి, అయిదోది పోయింది). బౌర్న్ పాత్ర ఆక

... జాన్ విక్ 3 - పారాబులమ్

వంశీ వ్యూ పాయింట్ // ... జాన్ విక్ 3 - పారాబులమ్ // ***********************************************             జాన్ విక్ సిరీస్ మూవీస్ తెలుసనుకుంటా ... కీను రీవ్స్ కి మళ్ళీ స్టార్డం వచ్చేలా చేసిన చిత్రం జాన్ విక్ మొదటి భాగం. ఒక ఎమోషనల్ ఆక్షన్ థ్రిల్లర్. నాకు బాగా నచ్చింది. సెకండ్ పార్ట్ అంతగా అనిపించలేదు. రెండ్రోజుల క్రితం మూడో భాగం John wick 3: Parabulum చూశాను. నేను జనరల్ గా ఆక్షన్ థ్రిల్లర్ మూవీస్ ని ఎక్కువగా ఇష్టపడతాను. నా ఆల్ టైం ఫెవరెట్ ఆక్షన్ థ్రిల్లర్ మూవీ అంటే కిల్ బిల్ 1 & 2. వాటి గురించి ఒక్క వాక్యంలో చెప్పాలంటే హింసాత్మక కావ్యంలా ఉంటాయని చెప్పవచ్చు. వయోలెన్స్ ని అంత బ్యూటిఫుల్ గా చూపించవచ్చు అని నాకు కిల్ బిల్ సినిమా చూశాకే తెలిసింది. నేను ప్లాన్ చేసుకుంటున్న ఒక ఫ్యాక్షన్ మూవీ లో ఆక్షన్ సీన్స్ కిల్ బిల్ స్ఫూర్తితో ఉంటాయని ఇపుడే చెప్తున్నా. ఓకే ... ఇపుడు జాన్ విక్ 3 సినిమాకు వద్దాం.             రూల్స్ ని బ్రేక్ చేసిన జాన్ విక్ పై హై టేబుల్ (అంటే హై కమాండ్ - బాస్ అఫ్ ది అండర్ వరల్డ్ అనుకోండి) ఎక్స్ కమ్యూనికాడో డిక్లేర్ చేస్తుంది అంటే అదే డెత్ వారంట్ లాగా  అన్నమాట. అక్కడి