Posts

Showing posts from August, 2019

... 'సాహో' గురించి

వంశీ వ్యూ పాయింట్ // ... 'సాహో' గురించి // *****************************************             సాహో సినిమా గురించి మాట్లాడుకుందాం. శౌర్యం సినిమాలో అనుకుంటా అలీ కాలేజీలో ఫీజికల్ ఇన్స్ట్రక్టర్ కం స్పోర్ట్స్ ట్రైనర్ గా పని చేస్తూ ఉంటాడు. ఎప్పుడు చూసినా సిక్స్ ప్యాక్ బాడీ, టోన్డ్ మసిల్స్ తో కనబడుతుంటాడు. నిజమేంటంటే అతనికి అటువంటి బాడీ ఏమీ ఉండదు. బెలూన్స్ ని బాడీ కి చుట్టుకుని అలా కనబడుతుంటాడు. ఆ రహస్యం తెలుసుకున్న హీరో గోపీచంద్ అతడితో ఓ ఆటాడుకుంటాడు. ఆ ఇంతకీ మనం ఏం మాట్లాడుకుంటున్నాం సాహో సినిమా గురించి కదూ. సాహో సినిమా గురించి చెపుదామనుకుంటే, ఆ ఆలీ క్యారెక్టర్ మ్యాటర్ గుర్తొచ్చింది అంతే. అంటే ఏం లేదు ఒక మామూలు కథను పట్టుకుని, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ అంటూ కథలో ఏమీ లేకపోయినా, జస్ట్ టెక్నికల్ స్టాండర్డ్స్ పెట్టి - అదే హాలీవుడ్ స్టాండర్డ్స్ అనుకోమన్నారు. అదన్నమాట విషయం.               సాహో చిత్రాన్ని ఒక ఆక్షన్ ఎంటర్టైనర్ గా ప్రచారం చేశారు, అఫ్ కోర్స్ అదే నిజమనుకోండి. బహుశా దర్శకుడు మరియు కథకుడు అయిన సుజీత్ ఈ కథ రాసుకున్నపుడు అతడు తెలుగు ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని రాసుకుని ఉంటాడు…

... తిరుమల టికెట్స్ వ్యవహారం

వంశీ వ్యూ పాయింట్ // ... తిరుమల టికెట్స్ వ్యవహారం // *****************************************************             తిరుమల వెళ్ళే బస్సులో టిక్కెట్ల వెనుక జెరూసలెం యాత్ర గురించిన ప్రకటన ముద్రించడం అన్నది ఖచ్చితంగా సున్నితమైన భావాలను రెచ్చగొట్టగల అంశం, తప్పు. అయితే, దీన్ని వెంటనే జగన్ కు  ఆపాదించి, క్రైస్తవ మత ప్రచారం మొదలు పెట్టాడు అంటూ మతాల మధ్య చిచ్చు పెట్టాలని చూడటం అంతకంటే బాధ్యతారాహిత్యం. 
నాకు అర్థం కానీ విషయాలు ఏంటంటే -> ఈ టిక్కెట్ల వెనుక ప్రభుత్వ పథకాల ప్రచారం అన్నది చంద్రబాబు ప్రభుత్వం చేసినది. ఆ ప్రకటనలలో ఏమున్నదో ఒకసారి చూడండి - 'గత నాలుగున్నరేళ్ళలో' అని సుస్పష్టంగా ఉన్నది. అంటే, దిగిపోకముందే చంద్రబాబు ప్రభుత్వం ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని చేసిన పని అది అన్నది స్పష్టం. అపుడు ఎవరూ ప్రశ్నించలేదు. అసలు అవి కనీసం ప్రింట్ అయ్యాయో లేదో కూడా ఎవడికి తెలియదు. కానీ, ఇపుడు దానిని జగన్ కు ఆపాదించి గొడవ చేస్తున్నారు.  ->  శ్రీశైలం ఈవో విషయంలోనూ ఇలానే జరిగింది. కానీ, అతడు జగన్ వచ్చాక నియమించబడ్డ వ్యక్తి కాదు. కానీ, గొడవ మాత్రం జగన్ సీఎం అయ్యాక జరిగింది. 
            అంటే ఇక్క…

... కొన్ని జ్ఞాపకాలు: 1

వంశీ కలుగోట్ల // ... కొన్ని జ్ఞాపకాలు: 1 // ****************************************             ఒక్కోసారి అనిపిస్తుంది మనిషి అంటే ఒక కదిలే జ్ఞాపకాల దొంతర అని. కొన్ని జ్ఞాపకాలు మనల్ని నిలబెడతాయి, నడిపిస్తాయి; మరికొన్ని జ్ఞాపకాలు మనల్ని తలదించుకునేలా చేస్తాయి, సిగ్గుపడేలా చేస్తాయి. కొన్నిసార్లు జ్ఞాపకాలలో మనముండకపోవచ్చు - లేదా వేరే వారు ఆ జ్ఞాపకాలను ప్రభావితం చేసినవారు అయి ఉండవచ్చు. అలా నాకు చాలాసార్లు గుర్తొచ్చే జ్ఞాపకాలలో ఒకదాన్ని ఇక్కడ పంచుకోవాలనిపించింది. ఇది ఎటువంటి జ్ఞాపకం అనేది నేను మొదటే చెప్పాలనుకోవట్లేదు. చదవండి. నా అభిప్రాయం ప్రకారం మనుషుల్లో మంచివారు, చెడ్డవారు అంటూ ఉండరు - పరిస్థితులు, అనుభవాలు వారిని కొన్ని సమయాలలో అలా ప్రవర్తించేలా డ్రైవ్ చేస్తాయి. ఆ పరిస్థితులను తట్టుకుని నిలబడగలిగితే, మనీషి లేదా మామూలు మనిషి. ఈ అనుభవంతో ఎవరెలాంటివారో నేను జడ్జ్ చెయ్యట్లేదు. చదవండి ...  *            *            *             అది 2010 వ సంవత్సరం, డిసెంబర్ 18. యునైటెడ్ కింగ్డమ్ లోని మిల్టన్ కీన్స్ సిటీ. అప్పటికే నేను అక్కడికెళ్లి దాదాపు మూడు సంవత్సరాలయ్యింది. ఇంగ్లాండ్ లో శీతాకాలం ఎలా ఉంటుంద…

... తెలుగోడి శతృవు

వంశీ కలుగోట్ల // ... తెలుగోడి శతృవు //
**********************************
వాడు: అరేయ్ మన తెలుగోళ్ళు కులగజ్జిగాళ్ళు, వెధవలు, మూర్ఖులు, ఎంతకైనా దిగజారే నీచులు అట కదరా. వీడు: ఎవరు చెప్పార్రా? వాడు: ఎవరో చెప్తే నేనెందుకు పట్టించుకుంటానురా, మన తెలుగోడే చెప్పాడు. వీడు: అదేరా ఇసయం. తెలుగోళ్ళకు శతృవులు ఉత్తరాదివాళ్ళు, తమిలోళ్ళు అంటూ వేరే ఎవరూ ఉండర్రా. మన తెలుగోళ్ళ రూపంలోనే, మన మధ్యనే తిరుగుతూ, మననే సం ... వద్దులే అసలే ఈ మధ్యన సెన్సారోళ్ళు మరీ ఎక్కువగా గొంతులు నొక్కేస్తున్నారు. నీకర్థమైందిగా ఆ ... వాడు: మరిప్పుడేం చెయ్యాలిరా? వీడు: అరేయ్ జులాయి సినిమాలో బిట్టూ ఏం చెప్పాడురా 'మనమేం చెయ్యాలని ఎప్పుడూ ఎవరినీ అడక్కూడదు' అని సెప్పాడా లేదా. అయినా, నువ్వడిగావు కాబట్టి సెప్తన్నా - చేసేదేం లేదురా, మన డాక్టర్ సాబ్ చెప్పాడుగా బాల్ బాగా పిసుక్కుందాం అంతే. బాల్ ఎంత బాగా పిసుక్కుంటే అంత ప్రశాంతత. పోయి బాగా పిసుక్కో