Posts

Showing posts from March, 2016

ప్రపంచస్థాయి అదీ ప్రపంచస్థాయి ఇదీ ...

ప్రపంచస్థాయి అదీ ప్రపంచస్థాయి ఇదీ ...  ****************************** **********        ఒకనాటి సమైక్య తెలుగు రాష్ట్రం పాలనాపరంగా, సాంకేతికంగా, సామాజికంగా, భౌగొళికంగా విడిపోయిమూడు సంవత్సరాలు కావస్తోంది. ఒకటిగా ఉన్న 'తెలుగు' ప్రజలు రాజకీయ కారణాల వల్లనో మరే ఇతర కారణాల వల్లనో రెండు రాష్ట్రాలుగా విడిపోయారు. ఇప్పుడు విభజనకు కారణాలు గట్రా వెతకటం అనవసరం. కానీ, ఎవరి దారి వారు చూసుకోవాల్సిన అవసరం ఏర్పడింది కాబట్టి, కష్టమో నష్టమో తప్పదు. కొన్ని మరిచిపోవాలి. నేటి తెలంగాణా రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలు ఆంధ్ర/రాయలసీమ ప్రాంతం వారి వల్ల అభివృద్ది చెంది వుండవచ్చు అలాగే మరి కొన్ని ప్రాంతాలు నిర్లక్ష్యానికి గురై తీవ్రంగా నష్టపోయివుండవచ్చు. కానీ, ఆ గతమంతా మరిచిపోయి వర్తమానంలో జీవిస్తూ భవిష్యత్తు వైపు ప్రయాణించాల్సిన తరుణం ఇది. తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్ కానీ, ఇతర తెలంగాణా నాయకులు కానీ చేస్తున్నది అదే. తెలంగాణా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలనే బహిరంగ [ప్రయత్నాల వెనుక తమ పార్టీని తిరుగులేని శక్తిగా మలచుకోవాలనే అంతర్గత ప్రయత్నాలు, తన/తమ వారసులకు ఎదురు లేకుండా చేసుకోవాలనే ప్

పోరాటం దారెటు?

పోరాటం దారెటు? ********************        ఆదిమ కాలం నుండీ ఏదో ఒక దానికోసం 'పోరాటం' అనేది జరుగుతూనే ఉంది. ఆహారం కోసం, ఆవాసం కోసం, అవసరాల కోసం, అస్థిత్వం కోసం ... అలా మనిషి ఎదుగుదలతో పాటు పోరాటం కూడా రూపాంతరం చెందుతూ వచ్చింది. కాకపోతే మనిషి ఏ విధంగా అయితే ఈ ఎదుగుదలతో ఇబ్బందులను ఎదుర్కుంటున్నాడో, పోరాటం కూడా అదే విధంగా అర్థం కోల్పోయి అవగాహన లేని నాయకుల చేతిలో అపసవ్యదిశగా పయనిస్తోంది. మేధావులుగా గుర్తింపబడినవారు, మేధావి వర్గంగా చెప్పుకునేవారు, వివిధ పోరాటాలకు నాయకత్వం వహిస్తున్నవారు, నాయకత్వం వహించాలని ఉవ్విళ్ళూరుతున్నవారు - వీరందరిలో కూడా తమ పోరాటం వాదానికి వ్యతిరేకంగానా లేక వ్యక్తికి/వ్యక్తులకు వ్యతిరేకంగానా అన్న విషయంలో అవగాహన లోపించింది.         ఈ పోరాటశక్తుల నాయకులలో ఎవరైనా లోపాలు ఎంచితే, వెంటనే 'ఆ నాయకులు కూడా మనుషులే, అయినా పోరాటం అతడు/ఆమె మీద మాత్రమే ఆధారపడి లేదు. ఇంతకు మునుపు ఉంది, ఇక మీదటా కొనసాగుతుంది' అనే సమాధానం వస్తుంది. వారు అతితెలివితో గమనించలేకపొతున్న విషయం ఏమిటంటే వారు ఏ వాదానికైతే వ్యతిరేకంగా పోరాడుతున్నారో, ఆ వాదం కూడా కేవలం వ్యక్తులవల్లనే తప్పుదా

విభజన తరువాత తిరోగమిస్తోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే ...

విభజన తరువాత తిరోగమిస్తోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే ...  ****************************** ************************        ఆంధ్రప్రదేశ్ శాసన సభ సమావేశాలు జరుగుతున్న తీరు రాష్ట్రం ఎటువైపు పయనిస్తోందో సూచిస్తున్నాయి. కొన్ని సంవత్సరాల క్రితం బీహార్ రాష్ట్రంలో ఎలాంటి అరాచక పరిస్థితులు ఉండేవో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు అదే విధంగా తమిళనాడులో రాజకీయాలు ఎలా ఉంటాయో కూడా విశదీకరించనక్కరలేదు. దీని అర్థం గతంలో ఏదో అత్యద్భుత పరిస్థితులు ఉండేవి అని కాదు, కానీ విభజన జరిగిన నాటినుండి ప్రతి విషయంలోనూ అధికార పక్ష నేతలతో పాటు స్వయంగా అత్యంత అనుభవశాలి, స్వయంప్రకటిత నిప్పు అయినటువంటి చంద్రబాబు గారు వ్యవహరిస్తున్న తీరు రాష్ట్రం అతివేగంగా తిరోగమన దిశగా పయనిస్తున్న తీరు తెలుపుతోంది. ప్రతిపక్షాల మాటలు పక్కనబెడదాం, మిత్ర పక్షం భా.జ.పా కు చెందిన శాసన సభ్యుడు విష్ణుకుమార్ రాజు 'పచ్చ చొక్కా వేసుకోచ్చాను, మాట్లాడటానికి అవకాశం వస్తుందని' అని అనవలసి వచ్చిందంటే పరిస్థితి ఎలా ఉందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అడుగడుగనా విలువలకు తూట్లే. సభేతర విషయాలను పక్కన బెడితే తీరు, లేవనెత్తే అంశాలు,

పుస్తకాలను కొనండి ...

పుస్తకాలను కొనండి ... ************************ "చిరిగిన చొక్కా అయినా తొడుక్కో కానీ ఒక మంచి పుస్తకం కొనుక్కో"        కవిత్వం, విలువలు ఉన్న సాహిత్యానికి పాఠకులు తగ్గుతున్నారు అనేది ప్రబలమవుతున్న భావన. కానీ, అదే సమయంలో కవిత్వం లేదా ఇతర సాహిత్యం రాసే వారి సంఖ్య; రాయటం పట్ల ఆసక్తి చూపుతున్న వారి సంఖ్యా పెరుగుతోంది. మరి సమస్య ఎక్కడుంది అంటే ... 'సాహిత్యాన్ని కొనటం' దగ్గర. ప్రధానంగా కవిత్వ ప్రధాన పుస్తకాలను ఉచితంగా ఇచ్చినా చదవటమే ఎక్కువ అనే భావన చాలా మందిలో ఉంది. కవిత్వానికి పాఠకులులేరా అంటే ఉన్నారు కానీ వారికి కవిత్వం ఉచితంగా కావాలి. ఈ పాఠకులు ఏమైనా పేదవారా అంటే కాదు, వీరిలో చాలామంది ఆర్థికంగా చాలా ఉన్నత స్థితిలో ఉన్నవారే. అయినా కూడా వీరికి కవిత్వ పుస్తకాలు ఉచితంగా కావాలి.        ఈ పుస్తకాల ధర ఏమైనా ఎక్కువగా ఉంటుందా అంటే కాదు. ఇక్కడ నేను ఆ పుస్తకాల ధరను సినిమా టికెట్ ధరతోనో, బీర్ ధరతోనో గట్రా వాటితో పోల్చాలనుకోవటం లేదు. కానీ చాలావరకు అందుబాటులో ఉండే ధరలలోనే ఉంటున్నాయి. కవిత్వ పుస్తకాలను ప్రచురించటానికి ముందుకు వచ్చేవారిలో చాలామంది కవిత్వాన్ని నిలబెట్టా