13 అవర్స్: ది సీక్రెట్ సోల్జర్స్ అఫ్ బెంఘాజి

వంశీ వ్యూ పాయింట్ // 13 అవర్స్: ది సీక్రెట్ సోల్జర్స్ అఫ్ బెంఘాజి //
*********************************************************
            2016 లో వచ్చిన హాలీవుడ్ ఆక్షన్ థ్రిల్లర్ '13 అవర్స్: ది సీక్రెట్ సోల్జర్స్ అఫ్ బెంఘాజి' - వాస్తవ ఘటనల ఆధారంగా మైఖేల్ బే నిర్మాణం మరియి దర్శకత్వంలో వచ్చిన చిత్రం. లిబియాలోని  బెంఘాజిలో ఉన్న అమెరికన్ డిప్లొమాటిక్ ప్రాంతాన్ని, దుండగుల/ఉగ్రవాదుల దాడి నుండి కాపాడటానికి 'గ్లోబల్ రెస్పాన్స్ స్టాఫ్' (జిఆర్ఎస్) అనే ఆరుగురు ప్రైవేట్ సెక్యూరిటీ టీం మెంబెర్స్ చేసే ప్రయత్నమే '13 అవర్స్'.
            కథ పరంగా చెప్పుకోవాలంటే ముందే చెప్పినట్టు వాస్తవంగా జరిగిన అంశాలను దాదాపుగా అలానే తెరకెక్కించారు అని చెప్పవచ్చు. మొదటి సగభాగం నెమ్మదిగా సాగినట్టనిపిస్తుంది. తరువాత అంతా ఉత్కంఠభరితంగా సాగుతుంది. నిజానికి ఇది ఆక్షన్ థ్రిల్లర్ అనేకన్నా ఒక ఎమోషనల్ ఫిలిం అనవచ్చు. జిఆర్ఎస్ మెంబర్స్ మధ్య సాగే సన్నివేశాలు, సంభాషణలు బావుంటాయి. ప్లెయిన్ స్క్రీన్ ప్లే వల్ల ఉండాల్సిన ఉత్కంఠత కాస్త లోపించింది అనిపిస్తుంది. ద్వితీయార్థం మొత్తం దాడి, ప్రతిదాడులతోనే సాగే సినిమాలో జిఆర్ఎస్ టీం మెంబర్స్ మధ్య వచ్చే సన్నివేశాలు, ఎమోషనల్ డైలాగ్స్ ఆకట్టుకుంటాయి. ఒక సన్నివేశంలో ఒక పాత్ర 'The chief gets a medal, military gets award. But, what do we get?' అని అడుగుతాడు. దానికి సమాధానంగా మరొక పాత్ర 'What do we get? ... (small pause) We get to home' అని సమాధానం చెప్తాడు. సినిమా చూస్తే ఆ డైలాగ్ ప్రభావం ఏంటన్నది అర్థమవుతుంది అని మాత్రం చెప్పగలను. మన మూవీస్ లో చూస్తుంటాం - సైనికులు, సీక్రెట్ ఏజెంట్స్, సెక్యూరిటీ ఆఫీసియల్స్ మామూలుగా మాట్లాడుకోరు. దేశం, దేశభక్తి, త్యాగాలు చేయడమే గొప్ప ఇలా వాస్తవానికి దూరంగా ఉంటాయి (అధికశాతం). ఈ సినిమాలో వారు జిఆర్ఎస్ టీం మెంబర్స్ మధ్య జరిగే సంభాషణలు వాస్తవికంగా ఉంటూ, హృదయానికి హత్తుకునేలా ఉంటాయి. అలాగని ఎక్కువ మెలోడ్రామా ఉండదు.
             జిఆర్ఎస్ టీం మెంబర్స్ గా నటించిన James Badge Dale (as Rone Woods), John Krasinki (as John Silva), Max Martini (as Mark Geist), Dominic Fumusa (as Tiegen), Pablo Schreiber (as Paronto), David Denmen (as Benton) పాత్రలకు తగ్గట్టుగా నటించారు. కుటుంబాలకు దూరంగా, ఏ క్షణంలో ఏమి జరుగుతుందో తెలియని ఉద్విగ్న సమయాల్లో వారి మధ్య వచ్చే సన్నివేశాలు, సంభాషణలు ఆకట్టుకుంటాయి. మైఖేల్ బే మార్క్ పెద్దగా కనబడకపోయినప్పటికీ, పర్వాలేదనిపించే సినిమా, చూడొచ్చు. బాక్గ్రౌండ్ స్కోర్ బావుంది. ప్రథమార్థంలో ఎడిటింగ్ డిపార్ట్మెంట్ తమ కత్తెరకు కాస్త పని చెప్పి ఉంటే బావుందనిపిస్తుంది. సినిమాటోగ్రఫీ సినిమా మూడ్ కు తగ్గట్టు ఉంది. మైఖేల్ బే నిర్మాణం మరియు దర్శకత్వం బావున్నాయి. వార్, ఆక్షన్ థ్రిల్లర్స్ ఇష్టపడేవారిని ఆకట్టుకుంటుంది. చూడాలనుకుంటే జియో సినిమా యాప్ లో ఉంది.

Comments

Popular posts from this blog

... మూడో కూటమి

... కరోనా కంటే ఎక్కువగా భయపెడుతున్న అంశం?

... 2019 ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు - జనసేన