... లా అబైడింగ్ సిటిజెన్
వంశీ వ్యూ పాయింట్ //... లా అబైడింగ్ సిటిజెన్ //
******************************************
2009 లో విడుదలైన గెరార్డ్ బట్లర్, జెమీ ఫాక్స్ ల ఆక్షన్ థ్రిల్లర్ చిత్రం 'లా అబైడింగ్ సిటిజెన్'. కమర్షియల్ సక్సెస్ తో పాటు, ప్రశంసలు, అవార్డులు కూడా అందుకుంది. ఇంజనీర్ క్లయిడ్ షెల్టన్ (గెరార్డ్ బట్లర్) జీవితంలో జరిగిన ఒక ప్రమాదం, ఆ తరువాత అతడు అందుకు కారకులైన వ్యక్తులు మరియు వ్యసస్థలపై ప్రతీకారం తీర్చుకోవడం ఈ చిత్ర కథ. ఇంజనీర్ క్లయిడ్ షెల్టన్ ది చిన్న కుటుంబం, సొంతోషకరమైన జీవితం గడుపుతున్న ఆ కుటుంబంపై హఠాత్తుగా ఒకరోజు కొందరు దుండగులు దాడి చేసి - అతడి భార్య, కూతురును (చిన్న పాప) లను రేప్ చేసి, చంపేస్తారు - ఆ సన్నివేశాలను అతడు చూసేలా ఫోర్స్ చేస్తూ. అయితే సరైన సాక్ష్యాధారాలు లేకపోవడం, దాంతోపాటు ప్రాసిక్యూటింగ్ అటార్నీ అయిన నిక్ రైస్ ఆ కేసును నిర్లక్ష్యం చేస్తాడు. ప్రత్యక్ష సాక్షిగా షెల్టన్ ఉన్నా, అతడు బాధితుడు కాబట్టి అతడి సాక్ష్యాన్ని కన్సిడర్ చేయరు. దోపిడీ మాత్రమే చేద్దామని అన్న ఆమెస్ నిందితుడిగా నిరూపించబడి, కఠిన శిక్ష విధింపబడుతుంది. తప్పు ఒప్పుకుని, క్షమించమని వేడుకున్న డర్బీకి స్వల్ప శిక్ష విధింపబడుతుంది. నిజానికి డర్బీనే షెల్టన్ భార్య మరియు కూతురు (చిన్న పాప)లపై అఘాయిత్యం చేసి, హత్య చేసిన వ్యక్తి. ఆ విషయమే షెల్టన్ చెప్పినా, ఎవరూ పట్టించుకోరు. కుటుంబాన్ని కోల్పోయి, నిందితులకు శిక్ష పడలేదన్న ఆవేదనతో మిగులుతాడు క్లయిడ్ షెల్టన్. అందుకు కారకులైన నేరస్తులతో పాటు అటార్నీ నిక్ రైస్ మరియు జ్యూడిషరీ సిస్టంపై కోపం పెంచుకుంటాడు.
పదేళ్ళ తరువాత లెథల్ ఇంజక్షన్ ద్వారా మరణశిక్ష అమలు జరుపబడే సమయంలో ఆమెస్, ఎవరూ ఊహించని విధంగా తీవ్ర వేదన అనుభవిస్తాడు. తరువాత డర్బీ అత్యంత దారుణంగా చంపబడతాడు. ఈ నేరాల్లోషెల్టన్ ను అనుమానితుడిగా అరెస్ట్ చేస్తారు. కానీ, అతడిని నేరస్తుడిగా నిరూపించే ఆధారాలేవీ ఉండవు. ఇక అక్కడనుండి షెల్టన్ మరియు అటార్నీ నిక్ రైస్ మధ్య ఆట మొదలవుతుంది. నిక్ రైస్ మరియు జ్యూడిషరీ సిస్టంతో షెల్టన్ గేమ్ చాలా ఇంట్రస్టింగ్ గా సాగుతుంది. జైల్లో ఉన్నా కూడా, ప్రతిసారీ షెల్టన్ పై చేయి సాధించడమే కాకుండా చెప్పినవి చెప్పినట్టు చేస్తుంటాడు. ఈ మిస్టరీని ఛేదించటానికి నిక్ చేసే ప్రయత్నాలు ఉత్కంఠభరితంగా ఉంటాయి. జ్యూడిషరీ సిస్టంతో పాటు మొత్తం ఫిలడెల్పియాను భయాందోళనలో ముంచెత్తుతాడు షెల్టన్, జైల్లో ఉండి. షెల్టన్ మరియు నిక్ రైస్ ల మధ్య జరిగిన ఆధిపత్య పోరులో చివరకు ఏం జరిగిందనేది సినిమాలో చూస్తే బావుంటుంది.
ఈ సినిమాకు ప్రధాన బలం స్క్రీన్ ప్లే. ఎక్కడా డల్ మూమెంట్స్ ఉండవు. అలాగే బ్రియాన్ టేలర్ నేపథ్య సంగీతం; జోనాథన్ సెలా సినిమాటోగ్రఫీ సినిమా మూడ్ మరియు థీమ్ ను ఎలివేట్ చేసేలా ఉంటాయి. తారిఖ్ అన్వర్ ఎడిటింగ్ సినిమాను క్రిస్పీగా ఉండేలా చేసింది. కోర్టు విమ్మెర్ అందించిన కథను ఎఫ్ గ్యారీ గ్యారీ తెరకెక్కించిన విధానం చాలా బావుంటుంది. తెరవెనుక వీళ్ళంతా సినిమాను నిలబెడితే తెరమీద గెరార్డ్ బట్లర్ మరియు జెమీ ఫాక్స్ తమ భుజాల మీద మోశారు. బాధ, నిస్సహాయత, కోపం, పగ లాంటి అన్ని ఎమోషన్స్ ను బేలన్సుడ్ గా పోర్ట్రె చేస్తూ గెరార్డ్ బట్లర్ సూపర్బ్ అనిపించాడు. ఇక జెమీ ఫాక్స్ నటన గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. ఇందులో కొన్ని సన్నివేశాలు అధిక రక్తపాతం, జుగుప్సాకర దృశ్యాలతో ఉంటాయి, అలాంటివి ఇష్టపడనివారు దూరం ఉండవచ్చు. చూడాలనుకునేవారికి, ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఉంది.
Comments
Post a Comment