... జస్ట్ సరదాకి, అంతే

వంశీ కలుగోట్ల // ... జస్ట్ సరదాకి, అంతే  //
************************************
నవ్వొస్తే, నవ్వుకోండి. రాకపోతే వదిలేయండి. అంతకుమించి సీరియస్ గా తీసుకోకండి (ఆ ఇప్పటిదాకా ఏదో పెద్ద సీరియస్ గా తీసుకున్నట్టు)

డిస్క్లైమర్:
ఇది కేవలం సరదాకి రాసినది మాత్రమే. సారూప్యతలు కేవలం యాదృచ్చికమే తప్పించి, ఎటువంటి సంబంధమూ లేదని ముందుగానే మనవి చేసుకుంటున్నాను.

ఒకానొక రచయిత/కవి సృజన:


అమ్మా
... బాగున్నారా?!
బాగానే ఉంటారమ్మా
ఎందుకంటే
మీరు అమ్మ కదా!

దిగ్గజ విశ్లేషకుల విశ్లేషక ఉవాచ:
            ఆహా ఏమి రచనా సౌందర్యము? ఏమి భాషా పటిమ? ఎంతటి ఆర్ద్రత నిండిన మాట? ఎంతటి నిష్కల్మష భావము? నిజంగా ఆ 'అమ్మా' అనడంలో మొత్తం స్త్రీజాతి పట్ల ఆ రచయిత/కవి యొక్క గౌరవభావం ఉట్టిపడుతోంది. నిజానికి అక్కడ అమ్మ అని ఆపెయ్యవచ్చు, కానీ అమ్మా దీర్ఘం తీస్తూ అనడంలో ఆ గౌరవభావం మరియు ఆర్ద్రత మరియు అదీఇదీ అనేక భావానలను అలా ఎక్స్టెండ్ చేసినట్టయి మరింత సౌందర్యం చేకూరింది. అలానే బాగున్నావా అనకుండా బాగున్నారా అనడం ద్వారా అతడు మొత్తం స్త్రీజాతిని, అందరు అమ్మలనూ కలిపి అడిగినట్టయింది. ఎంతటి గొప్ప కవి హృదయం?
            అలానే బాగున్నారా తరువాత ప్రశ్నార్థకంతో పాటు, ఆశ్చర్యార్థక చిహ్నం పెట్టడం ద్వారా కవి స్త్రీలపట్ల జరుగుతున్న నేరాలను ప్రశ్నిస్తున్న ధోరణిలో మొత్తం సమాజాన్ని ఒక్క మాటతో, రెండు చిహ్నాలతో కడిగిపారేశారు. అలాగే అమ్మ కాబట్టి బాగుంటారు అనడంలో ఎంతో నిగూడార్థం ఉంది. అమ్మలను, మహిళలను సమాజం కాపాడుకోవాలని అంతర్లీనంగా చెప్పాలన్న కవి తాపత్రయం కనబడుతోంది. నాలుగే నాలుగు వాక్యాల కవితతో స్త్రీల పట్ల తన గౌరవాన్ని చాటుకుంటూ, సమాజాన్ని కడిగిపారేసిన ఈ కవిత మరియు కవి పలురీతుల సంస్కరించబడటానికి (అంటే దిగ్గజ విశ్లేషకుల ఉద్దేశం సత్కరించబడటానికి అని) అర్హులు.

పాఠకులు మరియు మరికొందరు రచయితలు/కవుల భావన:
            ఈ దిగ్గజ విశ్లేషకులు సెలెక్టివ్ గానే చదువుతారా లేక కొన్ని 'ప్రత్యేక' అంశాల ప్రాతిపదికన చదువుతారా అన్నది అర్థం కావడం లేదు. అదే అంశంపై అంతకంటే చక్కగా, అద్భుతంగా అనిపించేట్టు రాయబడిన కవితలు/రచనలు వారి ఫ్రెండ్స్ లిస్ట్ లో ఉన్నవారే రాసి ఉంటారు కానీ వీరు వాటిని టచ్ చేయరు. హా అయినా మనకెందుకులే?


శకుంతలాకియా మాట:
            మనమంతా పెద్దాయన ఆ అదే కృష్ణపరమాత్మ గీతలో చెప్పిన మాట 'ప్రతిఫలాపేక్ష లేకుండా పనిచేయండి' అనే మాట స్ఫూర్తిగా, ఆ విధంగా ముందుకు సాగుదాం ... అని మా శకుంతలాకియా అందరికీ తనమాటగా చెప్పమని చెప్పింది. బానే చెప్పింది కదా

Comments

Popular posts from this blog

... కరోనా కంటే ఎక్కువగా భయపెడుతున్న అంశం?

... మూడో కూటమి

... 2019 ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు - జనసేన