... జాన్ విక్ 3 - పారాబులమ్

వంశీ వ్యూ పాయింట్ // ... జాన్ విక్ 3 - పారాబులమ్ //
***********************************************
            జాన్ విక్ సిరీస్ మూవీస్ తెలుసనుకుంటా ... కీను రీవ్స్ కి మళ్ళీ స్టార్డం వచ్చేలా చేసిన చిత్రం జాన్ విక్ మొదటి భాగం. ఒక ఎమోషనల్ ఆక్షన్ థ్రిల్లర్. నాకు బాగా నచ్చింది. సెకండ్ పార్ట్ అంతగా అనిపించలేదు. రెండ్రోజుల క్రితం మూడో భాగం John wick 3: Parabulum చూశాను. నేను జనరల్ గా ఆక్షన్ థ్రిల్లర్ మూవీస్ ని ఎక్కువగా ఇష్టపడతాను. నా ఆల్ టైం ఫెవరెట్ ఆక్షన్ థ్రిల్లర్ మూవీ అంటే కిల్ బిల్ 1 & 2. వాటి గురించి ఒక్క వాక్యంలో చెప్పాలంటే హింసాత్మక కావ్యంలా ఉంటాయని చెప్పవచ్చు. వయోలెన్స్ ని అంత బ్యూటిఫుల్ గా చూపించవచ్చు అని నాకు కిల్ బిల్ సినిమా చూశాకే తెలిసింది. నేను ప్లాన్ చేసుకుంటున్న ఒక ఫ్యాక్షన్ మూవీ లో ఆక్షన్ సీన్స్ కిల్ బిల్ స్ఫూర్తితో ఉంటాయని ఇపుడే చెప్తున్నా. ఓకే ... ఇపుడు జాన్ విక్ 3 సినిమాకు వద్దాం.
            రూల్స్ ని బ్రేక్ చేసిన జాన్ విక్ పై హై టేబుల్ (అంటే హై కమాండ్ - బాస్ అఫ్ ది అండర్ వరల్డ్ అనుకోండి) ఎక్స్ కమ్యూనికాడో డిక్లేర్ చేస్తుంది అంటే అదే డెత్ వారంట్ లాగా  అన్నమాట. అక్కడినుండి సగభాగం వరకూ ఒక రకంగా చెప్పాలంటే జాన్ విక్ సర్వైవల్ కోసం ఫైట్ చేయడమే. ప్రతి సన్నివేశం ఉత్కంఠభరితంగా ఉంటుంది. జాన్ విక్ హై టేబుల్ కు లోబడి ఉంటాననడం, హై టేబుల్ ఇచ్చిన ఒక ఆర్డర్ ని కంప్లీట్ చేస్తే, అతడిని మళ్ళీ మెంబెర్ గా తీసుకుంటామని హై టేబుల్ చెప్పడంతో సెకండ్ పార్ట్ మొదలవుతుంది. ఆ తరువాత ఏం జరిగిందన్నది సినిమాలో చూస్తే బావుంటుంది. మధ్యలో జాన్ విక్ కి హెల్ప్ చేసే సోఫియా (హాలీ బెర్రీ), వాళ్ళిద్దరి కాంబినేషన్ లో వచ్చే ఆక్షన్ సీక్వెన్సెస్ సూపర్ గా ఉంటాయి.
            జాన్ విక్ సిరీస్ లోని మిగతా మూవీస్ లాగానే ఇది కూడా ఒక రకంగా చెప్పాలంటే కీను రీవ్స్ వన్ మాన్ షో లాంటిదే - హాలీ బెర్రీ (సోఫియా గా), ఇయాన్ మక్ షేన్ (విన్స్టన్ గా), లారెన్స్ ఫిష్బర్న్ (బోవెరీ కింగ్) లాంటివాళ్లు ఉన్నా కీను లాగేస్తాడు. మరీ కిల్ బిల్ స్థాయి కాకపోయినా (కిల్ బిల్ - టరంటినో మూవీ) ఆక్షన్ సీక్వెన్సెస్ సూపర్బ్ గా ఉంటాయి. ఆ బాక్గ్రౌండ్ స్కోర్ సూపర్బ్ - టేలర్ బేట్స్, జోయెల్ జె. రిచర్డ్స్ మ్యూజిక్ సినిమా మూడ్ ని ఎలేవేట్ చేసేలా ఉంది. సినిమా అంతా ఒక రకమైన డార్క్ మోడ్ లో రన్ అవుతుంది. (ప్రీవియస్ ఫిలిమ్స్ లాగానే). ఇంతకంటే ఎక్కువ చెప్పాలనుకోవట్లేదు - ఇందులో కథ కంటే ఎక్కువగా కథనం, టేకింగ్, మ్యూజిక్ వంటివి ఇంపార్టెంట్. కిల్ బిల్ సిరీస్ తరువాత (మళ్ళీ చెపుతున్నా ఇది కిల్ బిల్ సిరీస్ తో కంపారిసిన్ కాదు, నచ్చిన ఆక్షన్ థ్రిల్లర్ మూవీస్ లిస్ట్ లో అని) నాకు బాగా నచ్చిన ఆక్షన్ థ్రిల్లర్ మూవీస్ లో జాన్ విక్ 3 ఖచ్చితంగా ఉంటుందని చెప్పగలను. ఆ జోనర్ ఇష్టపడేవాళ్ళు చూడవచ్చు. సినిమా వోడాఫోన్ ప్లే (ఇపుడు వి ఐ మూవీస్ గా మార్చారు)లో ఉంది.

నోట్: ముందుగానే చెప్పినట్టు ఇది ఆక్షన్ థ్రిల్లర్ జోనర్ ఇష్టపడేవాళ్ళకు మాత్రమే. ఇందులో వయోలెన్స్ ఎక్కువగా ఉంటుంది. అలానే ఈ మూవీ చూసేముందు జాన్ విక్ ఫస్ట్ పార్ట్ చూస్తే బెటర్ (సెకండ్ పార్ట్ స్కిప్ చేసినా పర్లేదు)

Comments

Popular posts from this blog

... కరోనా కంటే ఎక్కువగా భయపెడుతున్న అంశం?

... మూడో కూటమి

... 2019 ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు - జనసేన