Posts

Showing posts from October, 2015

Spectre - My view

Spectre - My view *********************** Spectre, latest offering from James Bond series. I managed to watch it. Before stepping into the review or my view, first thing about Bond 007 is - as Ian Fleming described 'James Bond as being debonair, suave, a charming lady killer, coupled with a dedicated saboteur who do anything for his country and of course a great seducer'. James Bond 007 is not just about action, performance, killing and chasing the target; he is more than that. James Bond is signature for style, killer looks. That's what missing with this Bond. Bond has got 'licence to kill' the goons with guns and girls with his stylish/seducing looks. Daniel Craig as Bond and that too after Brosnan - hmmm, I am not much satisfied (of course this is his 4th Bond movie, but this is the first one I watched it after Daniel Craig stepped into the Bond character). I have seen almost all the Bond movies except for the last three movies - Casino Royale, Quantum of Solace

ప్రత్యేక రాయలసీమ పోరాటానికి, కలకు అమరావతి శంఖుస్థాపన కార్యక్రమం ఊతమిచ్చిందా? - 1

ప్రత్యేక రాయలసీమ పోరాటానికి, కలకు అమరావతి శంఖుస్థాపన కార్యక్రమం ఊతమిచ్చిందా? - 1 ****************************** ****************************** ****************************** *** అమరావతి శంకుస్థాపన అనే ఒక బృహత్తర ఖర్చుతో కూడిన కార్యక్రమం పూర్తయ్యింది. భవిష్యత్తులో ఆ నగరం ఎలా వుండబోతోందో తెలియదు. కానీ, ఇది ఒక చరిత్రనే - ఎందుకంటే ఆహారధాన్యాల ఉత్పాదకత తగ్గిపోతోందని అగ్రరాజ్యాలు కూడా ఆందోళన పడుతూ చేతనైనంతవరకూ పంటపొలాల రక్షణ చేపడుతూ, ఆహారధాన్యాల ఉత్పాదకతకు ఇతరత్రా మార్గాలు అన్వేషిస్తూన్న తరుణంలో ఇక్కడి దార్శనికుడు అధికారికంగానే ముప్ఫై మూడువేల ఎకరాలను రాజధాని పేరుతో తన గొప్ప కోసం, ఫాల్స్ ప్రిస్టేజ్ కోసం, ప్రచారం కోసం సంతర్పణ చెయ్యటం అన్నది ఆయన దార్సనికతకు దర్పణంగా చరిత్రలో ఖచ్చితంగా నిలబడిపోతుంది. ఇతర వైఫల్యాల నుంచి దృష్టి మళ్ళించటానికి వందల కోట్లు ఖర్చు పెట్టి శంఖుస్థాపన కార్యక్రమం చేపట్టటం అందునా రాష్త్రం ఇటువంటి దీనస్థితిలో ఉన్నప్పుడు అవసరమా అనే ప్రశ్న వేసేవారేవరైనా ఉన్నారు అంటే వారు అభివృద్ధిని వ్యతిరెకించెవారే ఎందుకంటే ఆ రెండు పత్రికలూ అలానే చెపుతాయి కాబట్టి. భవిష్యత్తులో

మోడీ దేవుడు కాదు ...

మోడీ దేవుడు కాదు ... ******************* మోడీ గారిని అభిమానించండి, ఆరాధించండి, ఆదర్శంగా తీసుకోండి; కాని మోడిని దేవుడిగా మార్చకండి, చూడకండి. అలా జరిగితే దేవుడి పేరు చెప్పుకునే పూజారుల గోల ఎక్కువవుతుంది. అలనాటి రాముడి కాలం నుండి మనలో పేరుకుపోయిన వ్యక్తి పూజా విధానం మనల్ని ఎప్పుడు   ఎవరో ఒకరికోసం ఎదురు చూసేలా చేస్తోంది, ఎవరో ఒకరు మార్పు కోసం పోరాడితేనో, కూసింత మంచి   చేస్తోనో అతగాడిని అవతారపురుషుడిగా కీర్తించడం, ఆ పేరు చెప్పుకునే పూజారుల ఆగడాలతో అవస్థలు పడటం. ఆ వ్యక్తులు పాటించిన ఆదర్శాలు, వాళ్ళు నేర్పిన విలువలు, నెలకొల్పిన ప్రమాణాలు మాత్రం పుస్తకాలలో, శిలా ఫలకాలలో భద్రంగా మనకు దూరంగా ఉంచటం అంతే. మోడీ మీద విశ్వాసం ఉంచండి, మూఢ నమ్మకంతో మూర్ఖపు అభిమానం మాత్రం పెంచుకుని ఆయనను దేవుడిగా కీర్తించకండి. ప్రధానిగా సమర్థంగా మేసలుకునే స్థాయి నుండి తనే సర్వస్వం అనుకునే స్థాయి  పోకడలదాకా మోడీని తీసుకెళ్తే భరించాల్సింది, అనుభవించాల్సింది మనమే. ఒక్క మోడీ మాత్రమె కాదు మనం కూడా మన భాధ్యతలను సమర్థంగా నిర్వాహించగాలిగిన నాడు మనకు ఇలా మోడీ లాంటి వాళ్ళ కోసం ఎదురు చూడాల్సిన అవసరం రాదు. మోడీ దేవుడు కాదు ... ఒ

విక్రమార్కుడు - రాజకీయాలు - 2: లెక్కలేనంత తిక్క ఉన్నోడు

వంశీ కలుగోట్ల // విక్రమార్కుడు - రాజకీయాలు - 2 //  లెక్కలేనంత తిక్క ఉన్నోడు ముందు మాట: ఈ రచనలోని పాత్రలు, అంశాలు కేవలం కల్పితాలు మాత్రమే ఎవరిని ఉద్దేశించినవి కావు. *********************************************************************************** పట్టినపట్టు వదలని మహాపరాక్రముడు, అవిశ్రాంత శ్రామికుడు అయిన విక్రమార్కుడు అలుపు సొలుపు లేనివాడై చెట్టుమీది భేతాళుడిని భుజం మీదకెత్తుకుని, మరో చేతిలో కత్తి పట్టుకుని అమావాస్య రాతిరిలో భయములేనివాడై నగరం వైపుగా తన ప్రయాణం మొదలెట్టాడు. విక్రమార్కుడికి పట్టుదల ఎలాగో భేతాళుడికి నోటి దూల అలాగే కాబట్టి భేతాళుడు ఊరికే ఉండకుండా తన అలవాటు ప్రకారం మాట్లాడటం మొదలెట్టాడు. "విక్రమార్కా, భయము వలదు. నేను నీకు ఇంతకుమునుపు చెప్పిన 'మచ్చలేని మనిషి' కథలో చివరలో అడిగిన ప్రశ్నకు నువ్వు సమాధానం చెప్పలేదని నాకేమీ కోపము లేదు ఎందువల్లననగా అది ఎంతటి క్లిష్టమైన ప్రశ్న అన్న విషయం నాకు తెలుసు ఇక నీలాంటి వాడికి అంటే అదే భవిష్యద్దర్సనం సరిగ్గా లేని వానికి ఇంకెంత కష్టమో ఊహించుకోగలను" "భేతాళా నా సహనమునతో పరాచికములు ఆడకుము." "రాజా

విక్రమార్కుడు - రాజకీయాలు: మచ్చలేని జీవితం

విక్రమార్కుడు - రాజకీయాలు ముందు మాట: ఈ రచనలోని పాత్రలు, అంశాలు కేవలం కల్పితాలు మాత్రమే ఎవరిని ఉద్దేశించినవి కావు. ****************************************************************************** యధాప్రకారం - పట్టిన పట్టు వదలని మహా పరాక్రముడు, అవిశ్రాంత శ్రామికుడు అయిన విక్రమార్కుడు అలుపు సొలుపు లేనివాడై చెట్టుమీది భేతాళుడిని భుజం మీదకెత్తుకుని, మరో చేతిలో కత్తి పట్టుకుని అమావాస్య రాతిరిలో భయములేనివాడై నగరం వైపుగా తన ప్రయాణం మొదలెట్టాడు. విక్రమార్కుడికి పట్టుదల ఎలాగో భేతాళుడికి నోటి దూల అలాగే కాబట్టి భేతాళుడు ఊరికే ఉండకుండా తన అలవాటు ప్రకారం మాట్లాడటం మొదలెట్టాడు. "విక్రమార్కా నిన్ను, నీ పట్టుదలను చూస్తుంటే బహు ముచ్చట వేస్తోందయ్యా. అసలు ఎందుకు నీకు ఇంత పట్టుదల, ఏమి సాధిద్దామని? ఎందుకయ్యా నీకు ఈ అనవసర ఆరాటం?" "భేతాళా తెలిసీ అడుగుతున్నావా లేక దీన్ని తెలివి అనుకుంటారనుకున్నావా లేక గతమేమైనా మతిమరుపునకు వచ్చినదా? మన ఈ సమాగామమేమీ కొత్తది కాదు మరల ఏల ఈ విధముగా ప్రశ్నించెదవు?" "అయ్యో విక్రమార్కా! నీకు విషయం తెలిసినట్టు లేదు. భవిష్యత్తులో రాజకీయాలలో ఇలాగే మాట

గిరీశం - త్రివిక్రమ్

వంశీ కలుగోట్ల // ... గిరీశం - త్రివిక్రమ్ // **************************** శుక్రవారం వచ్చిందంటే మాకు పార్టీయే, రూమ్మేట్స్ అందరం కలిసి మందు తాగడం, ఏదో ఒక టాపిక్ మీద తెల్లారేవరకు చర్చ పెట్టుకోవడం. నిజం చెప్పాలంటే దాన్ని చర్చ అనడం కంటే మా గిరిగాడి బోధనా కార్యక్రమం అనటం మేలేమో. రెండు పెగ్గులు లోపలికి వెళ్ళే దాకా సైలెంట్ గా ఉంటాడు మా గిరి. రెండో పెగ్గు పడిన ఒక ఐదు నిమిషాల తరువాత మొదలవుతుంది గిరీశోపాఖ్యానం. టాపిక్ ఇదీ అంటూ ఏమీ ఉండదు, ఒక్కోసారి ఒకే టాపిక్ మీద లేదంటే ఒక నాలుగైదు టాపిక్స్ మీద అది ఆ రోజు గిరిగాడి మూడ్ ని బట్టి ఉంటుంది. మేమందరం వాడిని సరదాగా గిరీశం అంటుంటాం. కన్యాశుల్కం లోని గిరీశానికి మా గిరికి దగ్గరి పోలికలు ఉంటాయి కూడా. కాకపోతే మావోడికి రెండు పెగ్గులు పడాలి. గ్లెన్ ఫిడిచ్ విష్కి, సోడా, ఐస్ క్యూబ్స్, చిప్స్ గట్రా సరంజామా అంతా రెడీగా పెట్టుకుని మొదలెట్టాం. ఒకటో రౌండ్ పూర్తయ్యింది - టాపిక్ రాజకీయాలు, క్రికెట్ అయిపోయాయి. గిరి గాడు మేమంతా మాట్లాడేది వినడం తప్ప ఇంకా నోరు తెరవలేదు, తర్వాత మాకెలాగూ ఛాన్స్ ఉండదు కాబట్టి ముందే మా మాటలన్నీ మాట్ల

రామ్ చరణ్ 'బ్రూస్ లీ' సినిమా గురించి నా రాత

రామ్ చరణ్ 'బ్రూస్ లీ' సినిమా గురించి నా రాత ****************************** **************** మరికొంత సమయం వృధా చెయ్యాలా, వద్దా అన్న చిన్న మీమాంస. దీని గురించి కూడా రాయాలా అనే భావన. అయినా గొప్పగా అనిపించిన వాటి గురించేనా, ఇలాంటి వాటి గురించి కూడా రాయాలి కదా. పొరపాటున వారి కంటబడితే , అర్థం చేసుకోగలిగే సహృదయత ఉంటె తరువాతి కళా ఖండాల విషయంలో జాగ్రత్తపడతారేమో అని ఒక చిన్న ఆశ. ఇదంతా నేను నిన్న చూసొచ్చిన 'బ్రూస్ లీ' చలన చిత్రం గురించే ... అర్థం కాని విషయం (బాధించిన విషయం కూడా) ఈ చిత్రానికి, బ్రూస్ లీ కి ఎటువంటి సంబంధం ఉందని ఆ పేరు పెట్టారో మరి, కథానాయక పాత్రధారుడైన చరణ్ చేతిపై బ్రూస్ లీ పచ్చ బొట్టు తప్ప. బ్రూస్ లీ అంటే కేవలం ఒక పోరాట పధ్ధతి మాత్రమే కాదు. బ్రూస్ లీ సినిమాలు చూసిన ప్రభావంతో ఒక కాలు, చెయ్యి పైకెత్తి బ్రూస్ లీ పోరాట భంగిమను కాపీ కొట్టి అలా నిలబడి 'హియ్యా' అనడమే బ్రూస్ లీ (అంటే అదేలెండి పెద్ద పోరాట యోధుడిలా పోస్ కొట్టడం అన్నమాట) అనుకుంటే ఒకానొకప్పుడు నన్ను కూడా కొంత మంది మిత్రులు 'బ్రూస్ లీ' అనేవారు. ఆ పేరు పెట్టడం వల్ల ఏదో బ్రూస్

One among us … Peter Gibb (మనలో ఒకడు - 3)

One among us … Peter Gibb **************************     Friends, I hope that most of you might know Newton’s third law of motion - 'for every action, there is an equal and opposite reaction'. Here in this article I am going to share the journey of a person whose experience stands as one of the best examples of Newton's third law. You might want to know who he is, but at this point, all I say is ‘He is ONE AMONG US’. *                *                 * Peter started to become conscious, his senses filled with light and noise in an unfamiliar place. The first question was 'where am I?’ Very next moment, the strong smell of medicines and seeing the people (doctors and nurses) around made him to realize that he is in the hospital. But, why? More questions again. Slowly Peter started gaining control of his emotions slowly, and started gathering the last memory. The first bit he could recollect '...was being at a Placebo gig at Brixton Academy the night before and

మనలో ఒకడు - 1: విరించి

మనలో ఒకడు ************ ఉపోద్ఘాతం గొప్పవాళ్ళు అంటే కేవలం స్వామి వివేకానంద, గాంధీ, బోస్, ఆజాద్, భగత్ సింగ్ ఇలా ప్రపంచానికంతా తెలిసిన వాళ్ళు మాత్రమె కాదు. గొప్పతనం అన్నది ఒక స్థాయి కూడా కాదు. మనం రోజూ పలకరించే, కలిసే వారిలో కూడా చాలా మంది గొప్పవాళ్ళు ఉంటారు. నోబెల్ బహుమతి వచ్చే వరకు సత్యార్థి అంటే ఎవరో మనలో చాలా మందికి తెలీదు కదా. తన బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తూ తోచినంతలో సమాజ ఉన్నతికి తన వంతు కృషి తను చేస్తున్న ప్రతి ఒక్కరు గొప్పవారే. అలాంటి వారు మనలోనే, మన స్నేహితులలోనే చాలా మంది ఉన్నారు. 'సమాజంలోని సమస్యల పరిష్కారానికి ఎవరికోసమో వేచి చూడటం కాకుండా తమవంతు కృషి/ప్రయత్నం తాము చెయ్యాలన్న ఆలోచన' వారిని గొప్పవారిగా భావించేలా చేస్తోంది. పోరాడటం తెలిసిన వాడు ఏనాటికైనా గెలిచి తీరతాడు అంటారు. అలాంటి పోరాట యోధులు కూడా మనలో చాలా మంది ఉన్నారు. నేను రాసేది కాబట్టి నా ఇష్టానికి తగ్గట్టు రాయటమే కాబట్టి, పైన ఉదహరించిన రెండు లక్షణాలు నాకు విపరీతంగా నచ్చుతాయి కాబట్టి అలాంటి లక్షణాలు ఉన్న వారి గురించి నేను 'మనలో ఒకడు' శీర్షిక పేర ధారావాహికంగా రాస్తున్నాను. వీరు వార్తలకెక్కినవారు కా

పిచ్చి కుక్క

వంశీ కలుగోట్ల // కథ: పిచ్చి కుక్క ... // *********************************   --- ఈ కథాంశం, ఇందులోని పాత్రలు కేవలం కల్పితం మాత్రమే, ఎవరిని ఉద్దేశించినవీ కావు. "చూడవయ్యా విహారీ ఈ వార్త చదివావా - ఇది దారుణం, అమానుషం, రాక్షసత్వం. ఈ దేశంలో పుట్టానని చెప్పుకోవటానికి సిగ్గుపడుతున్నాను, భయమేస్తోంది ఇక్కడ బతకాలంటే. ఈ ఆధునిక కాలంలో కూడా మనుషులను ఉరి తీసే అనాగరిక చర్యలకు పాల్పడే ఆచారం ఇంకానా?" "ఏమిటి మాస్టారూ పొద్దున్నే దేశం మీద పడ్డారు? ఏమైందని?" "ఏమైంది అని అలా తాపీగా అడుగుతావేమిటి నాయనా? నీలాంటివాళ్ళు ఉండబట్టే ఇలాంటి ప్రభుత్వాల ఆగడాలు సాగుతున్నాయి." "అయ్యబాబోయ్ శంకరం గారూ నా మీద పడ్డారెంటండి బాబూ అసలు మాటరెంతో చెప్పి తరువాత తిట్టండి" "ఇవాల్టి పేపర్ చూడలేదా నువ్వు? ముప్పై ఏళ్ల క్రితం మన ఊర్లో వంద మంది మృతికి కారణమైన వ్యక్తిని నిన్న ఉరి తీసారు. ఇది ప్రభుత్వ ప్రతీకార హత్య తప్ప మరేమీ కాదు. అసలు అతడే నిందితుడని ఎలా నిర్ధారించారు? ఒకవేళ అవునే అనుకో తప్పు ఒప్పుకున్నాడు కదా, క్షమాభిక్ష కోరాడు కదా - మరి ఉరి తీయటం ఎందుకు? సంస్కరించాలి తప్ప చ

గడ్డం జిందాబాద్

గడ్డం జిందాబాద్ ************* "ఏందిరా సాంబడు సాములోరి మాదిరి అట్టా ఇంత పొడువున గడ్డం పెంచినావు" "ఓయ్ సాములోరి లెక్క ఏందిరా రాజకీయ నాయకుని లెక్క అను ఒప్పుకుంటా" "కొత్తగా ఇదేందిరా, రాజకీయాల మీద గాని మనసు మళ్ళిందా ఏంటి?" "అవున్రా ... దాని కోసమే గడ్డం పెంచుతున్నా." "ఇదేం లింకురా - ఆడెవడో సేప్పినట్టు బోడిగుండుకి మోకాలికి లింకేముంటాది?" "అరే తెలీకపోతే తెలీనట్టుండాలి గాని సామెతలు సేప్పకూడదురోయ్ ... నువ్వేమన్నా త్రివిక్రమ్ అనుకున్నావా పంచ్ లేయనీకి?" "అబ్బా ఈ త్రివిక్రమ్ జనాలందరికీ పంచ్ పిచ్చి ఎక్కించి సేడగోట్టాడు. సర్లే గాని సాంబడు నీ గడ్డం కతేందో సెప్పు ..." "అరె ఈ గడ్డం అడ్డమనుకుంటాం గానీ గడ్డం శానా అదృష్టం తెస్తాదిరోయ్ ... సప్పోస్ ఉదాహరణకి మన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారిని తీస్కో, ఆయన ఎప్పుడైనా రాజకీయాల్లో ఉన్నాడా, పోటీ గిట్ల సేసినాడా ఏకంగా ప్రధాన మంత్రి ఐపోయిండు ఎందువల్లసేతనంటే గడ్డం వల్ల. అంతెందుకు, మన మోడీగారిని సూడు, ఎప్పుడు సూసినా గడ్డంతోనే ఉంటాడు. అనుకున్నామా, మల్ల ఒక్క పార్టీకే ఫుల్లు మెజారిటీ వస

నన్ను చంపిందెవరు

నన్ను చంపిందెవరు --- ఈ కథాంశం, ఇందులోని పాత్రలు కేవలం కల్పితం. ఈ మధ్య నేను చదివిన కొన్ని వార్తల/సంఘటనల ఆధారంగా అల్లుకున్న కాల్పనిక రచన మాత్రమే. **********************************************************************************           కళ్ళు నెమ్మదిగా మసకబారుతున్నాయి, చీకటి  - కళ్ళ ముందు ఉన్న వెలుతురు నెమ్మదిగా చీకటిగా మారుతోంది. నొప్పి కంటే ఎక్కువగా బాధ కలుగుతోంది. అవును కత్తి గుండెలోకి దిగుతున్నప్పుడు నొప్పి కలిగింది కానీ ఇప్పుడు అంతకంటే ఎక్కువగా బాధ కలుగుతోంది. ఎందుకు? అనుకున్నది చెయ్యలేకపోయాననా? ఏమో తెలీదు. చనిపోతున్నందుకు బాధ లేదు, ఎప్పుడో ఒకప్పుడు చావాలి కదా? కళ్ళు మూతలు పడుతున్నా, కంటి ముందు 'రవీ రవీ' అంటూ ఏడుస్తోన్న అంజలి కనిపిస్తోంది. ప్రేమించి పెళ్లి చేసుకున్నాను తనని, జీవితాంతం తోడుంటా అని ఇచ్చిన మాట నిలబెట్టుకోలేనందుకా ఈ బాధ.           రవి - ఈ పేరు ఎందుకు పెట్టారా అనుకునేవాడిని. చిన్నప్పుడు నాన్న విడమరిచి చెప్పేవాడు "అరేయ్ రవి అంటే సూర్యుడురా. సూర్యుడు ప్రపంచానికి వెలుగు పంచుతాడు, చీకట్లను పారద్రోలుతాడు. సూర్యుడు అంటే నాకు చాలా ఇష్టంరా అందుకే నీకు ఆ