Posts

Showing posts from 2015

ఏమవుతాది ?

వంశీ కలుగోట్ల // ఏమవుతాది ? // ***************************** సుబ్బిగాడు: ఒరేయ్ అప్పిగా, ఏందిరా అట్టా ఉన్నావు ఇయ్యాల? ఏమైనాదేటి? అప్పిగాడు: అది గాదురా సుబ్బిగా. మన గడ్డం సామిని సూసి శానా రోజులైపోనాది. ఈ కాల్ మనీ స్కాం ఏందో తెగ మాట్టాడేసుకుంటున్నారు గందా, మా సామి ఏమన్నా జనాల్లోకి వస్తాడేమో సూద్దామని ఎదురు సూత్తన్నానురా. సుబ్బిగాడు: ఒరే ... నువ్వు మీ సామి గురించి సెప్తే గుర్తొచ్చినాదిరా. మీ లెక్క అట్టా నిమ్మకుండ సల్లంగా ఎట్టా ఉండాలో నేర్సుకోవాలిరా. సన్యాసులైతే దాన్నేదో అంటారురా ఆ 'స్థితప్రజ్ఞత' అని మా నాయన సేప్పెవోడు సిన్నప్పుడు. ఏమైనా మీ సామి శానా గోప్పోడురా. అప్పిగాడు: అదేందిరా అట్టా అంటావు? సుబ్బిగాడు: అట్టా గాదురా ఫర్ ఎజ్జంపుల్ ఇప్పుడు ఆ అమరావతి కాడ భూముల ఇసయమే తీసుకో ఏం సేసినాడు. ఆడ జనాల కాడికి బోయినాడు ఆళ్ళ గోడు ఇని బాబు కాడికి బోయినాడు, బయటకొచ్చి 'బాబు మీద నమ్మకం ఉండాది, ఆయన అంతా మంచే సేత్తాడు' అనె. ఆ తరువాత ఆడ కొన్ని ఊర్ల పెజలు ఏడ్సినా కూడా పట్టించుకోకపాయే. ఆ తరువాత ఋషితేశ్వరి యవ్వారంలో అయితే నోరు కూడా మెదపకపాయే. మొన్నటికి మొన్న అదేందదీ ఆ

ద్యావుడా ... ఇదేనా సహనం అంటే

వంశీ కలుగోట్ల // ద్యావుడా ... ఇదేనా సహనం అంటే? // **********************************************************      మనం మీడియాని ఎప్పుడూ తిడుతుంటాం - ఎందుకంటే వారు ఒక వర్గానికి మాత్రమే కొమ్ము కాస్తూ, రెండో వర్గానికి చెందిన విషయాలలో 'కోడి గుడ్డు మీద ఈకలు వెతికే' తరహాలో వ్యవహరిస్తుంటారు కాబట్టి. వారికి సహనం లేదు అంటుంటాంఎందుకంటే కాంగ్రెస్ లేదా యుపియే పదేళ్ళ కాలంలో సాధించలేనిది మోడీ పద్దెనిమిది నెలల కాలంలోనే సాధించలేదని విమర్శిస్తున్నారని. గత పాలనలో వారు వారు వేసిన ముళ్ళను, చెత్తను ఏరుకుంటూ వస్తున్నాడు. కొత్తగా ఏదైనా చేయాలంటే ముందు ఈ చెత్తను ఏరేయ్యాలి కదా అంటూ సహనంగా ఉండాలని మంచిని, నీతిని బో ధిస్తాం. (ఆయనేం చేస్తున్నాడో అన్నది ఎవరికెరుక. భజనబృందం స్తోత్రపాఠాలలో మన గొంతుకలు వినబడే అవకాశం ఉందంటారా? అది పక్కన పెడదాం - ఇక్కడ విషయం అది కాదు కాబట్టి.)  కానీ, అదే వేరే వాళ్ళ విషయంలో అయితే వారు ఇంకా కార్యాలయంలో అడుగు కూడా పెట్టకుండానే విమర్శలు మొదలెడతాం. తండ్రిని చూపి వీళ్ళను పని కూడా మొదలెట్టక ముందే విమర్శించడం ఎందుకూ అంటే వెంటనే వాళ్ళ సమర్థకుడివంటూ ఆ గాటన కట్టేస్తారు. ఆ తండ్రి పరమ అ

గాలి మేడలు (ఓ చిన్న కథలాంటిది ☺)

Image
వంశీ కలుగోట్ల //గాలి మేడలు (ఓ చిన్న కథలాంటిది ) // ***************************************************      ఈ మధ్యన పోతురాజుకు మనసు ఏమీ బావుండట్లేదు, అంతా ఏదోలా ఉంటోంది. అలవాటైపోయిన ప్రాణానికి నాటకం వేయక చాలా రోజులయ్యేసరికి సిరాకు దొబ్బుతోంది. అలాగని ఏదో ఒకటిలే అని ఏది పడితే ఆ నాటకం ఒప్పెసుకునే తత్త్వం కాదాయె పోతురాజుది. నచ్చకపోతే చివరకి దేవుడు చెప్పినా వినే రకం కాదు, మహా మొండి రకం. సరే, సొంతంగా రాసుకుందామా అంటే మనసు కుదురుగా ఉండట్లేదు. అందుకే ముందు మనసును అదుపులోకి తెచ్చుకోవడానికి ధ్యానం మొదలెట్టాడు. పోతురాజు ధ్యానం మొదలెట్టాడు అంటే, అప్పుడు పోతురాజును కదిలించే దమ్ము ఒక్క సాంబడికి తప్ప మరెవరికీ లేదని అందరూ అనుకుంటారు.      ఆ రోజు సాంబడికి మహా ఉత్సాహంగా ఉంది. కారణం ఏంటంటే పొద్దున్నే సాంబడికి సారా చుక్క కూడా పడకుండానే బ్రహ్మాండమైన ఆలోచన వచ్చింది. సాంబడికి తనవారంటూ ఎవరూ లేరు. మంచైనా, చెడైనా పంచుకునేది ఒక్క పోతురాజే. అందుకే వెంటనే పోతురాజు దగ్గరకు బయల్దేరాడు ... సాంబడు: "సామీ ఎట్టున్నావ్ సామీ! ఈ మద్దెన మరీ నల్లపూస లెక్క అయిపోతివి, అసలు జనాలకి కనబడటమే మానేస్తివి.

దేవుడికి, మనిషికి తేడా కేవలం గుణం మాత్రమే ...

దేవుడికి, మనిషికి తేడా కేవలం గుణం మాత్రమే ... ****************************** ****************** "అవును! రాముడు, కృష్ణుడు, జీసస్, ప్రవక్త ... అందరూ గొప్పవారే! అయితే నీకేమిటి, నీవేమిటి? నీవెప్పుడు ఉన్నతిని సాధిస్తావు? గుర్తుంచుకోండి ... ఈ భూమి మహాత్ముల, నాయకుల చేత పునీతం కాబదినది. ఈ క్షణాన్నే నీవు ఏమి చేయదలచుకుంటున్నావో, ఏమి కాదలచు కుంటున్నావో నిర్ణయించుకో. ప్రయాణాన్ని ప్రారంభించు."       మనిషి అశాశ్వతమైనవాడు, గుణం శాశ్వతమైనది. మనిషిని, గుణాన్ని వేరు చేసి చూడగలగాలి. మనిషి కేవలం ఒక వాహకం లాంటి వాడు మాత్రమే. ప్రవహించే నది లాంటిది గుణం; అది వచ్చిన వారిని తనలో కలుపుకుంటుంది, పోయేవారిని పోనిస్తుంది. మనిషిని, గుణాన్ని వేరు చేసి చూడలేకపోవడం అన్న రుగ్మత వల్లనే ఇవ్వాళ 'వారసత్వం' అన్నది రాజ్యమేలుతోంది. గుణం వాహకంగా ఉపయోగించుకున్న కొంతమంది మనుషులని అభిమానిస్తూ, ఆరాధిస్తూ, పూజిస్తూ వారిని దేవుళ్ళను చేస్తున్నాం. గతంలో (ప్రాచీన కాలంలో) ఈ పైత్య ప్రకోప ధోరణులు ఇంతగా ఉండేవి కావు. ఉదాహరణకి రాముడి పిల్లలు దేవుళ్ళుగా పూజింపబడలేదు, కృష్ణుడి పిల్లలు దేవుళ్ళుగా కీర్తిం

దేశమంటే మనుషులోయ్ ..

వంశీ కలుగోట్ల // దేశమంటే మనుషులోయ్ ...  // *************************************************      దేశం లేదా సమాజం అంటే అదేమీ ఒక పదార్ధం కాదు లేదా ఎక్కడినుండో ఊడి పడేదీ కాదు. మనమంతా కలిస్తేనే సమాజం. రాష్ట్రమైనా, దేశమైనా లేక మరోటైనా మనుషులతోనే. అందుకే గురజాడగారు అన్నది 'దేశమంటే మట్టి కాదోయ్ ... దేశమంటే మనుషులోయ్' అని. ఎవరో చెప్పినట్టు ఇది ఒక అద్దం లాంటిది ... అద్దంలో నువ్వు ఎలా ఉంటావో అలా కనిపిస్తావు అలానే సమాజం లేదా ఎదుటివారితో నువ్వు ఎలా ప్రవర్తిస్తావో దాదాపుగా వారు నీతో అలానే ఉంటారు. సమానత్వం కావాలి, సమస్థాయి ఇవ్వాలి, ఇంకేదో కావాలి ... గట్రా ఇలాంటివన్నీ ఎదుటివారి నుంచి ఆశించే ముందు మనం ఇస్తున్నామా అనేది అతి ముఖ్యంగా గమనించవలసిన విషయం. అ వన్నీ భౌతికమైనవి కావు ఎక్కడో అక్కడ దొరుకుతాయి అంటే వెళ్లి కొనుక్కోవడానికి, అలానే అవేమీ ఎవరో ఒకరి అధీనంలో ఉండేవి కూడా కావు పోరాడితే సాధించుకోవచ్చులే అనుకోవటానికి. ఈ సమానత్వం, సమస్థాయి గట్రా ఇలాంటి వాటి మాటున ప్రతి ఒక్కరు కోరుకునేది, ఆశించేది ఎదుటివారి నుంచి 'కనీస గౌరవం/విలువ'.     ఈరోజుల్లో మనం ఒక వ్యక్తికి ఇచ్చే వి

అన్వేషణకు అన్నీ అందుతాయి ...

అన్వేషణకు అన్నీ అందుతాయి ...  ****************************** *** కంటికి కనిపించేదంతా నిజం కాదు. మన ముందే మనిషి ఉంటాడు, కంటికి కనిపిస్తూ ఉంటాడు, కానీ అర్థం కాడు! అతని గుణగణాలు, మనసు కోసం లోతుగా చూడాలి, అన్వేషించాలి, పరిశీలించాలి. అర్థం అవుతాడా? కాడు. అన్వేషణకు అన్నీ అందుతాయి ... ఒక్క తాను తప్ప. (దాశరథి రంగాచార్య)     "లోకంలో అత్యంత విచిత్రమైన విషయమేది?" అని యక్షుడు ధర్మరాజును ప్రశ్నిస్తే, "ప్రతిదినమూ జనులు మన చుట్టూ మరణిస్తూనే ఉన్నారు. కానీ, తాము మరణించమని మిగిలిన వాళ్ళు అనుకుంటూ ఉంటారు" అని బదులిచ్చాడట. దీన్నే 'మాయ' అంటారు. ఈ మాయే మనుష్యులని అనేక రకాల ఆకర్షణల వైపు పరుగులు తీయిస్తుంది. కళ్ళముందే ఉన్నా కూడా వాస్తవాన్ని అర్థం చేసుకోలేనంతగా కళ్ళకు పొరలు కప్పేస్తుంది. ఈ మాయను వదిలించుకుని వాస్తవాన్ని గ్రహించగలిగిన వారు మహాత్ములయ్యారు, మాయలో పడి కొట్టుకున్నవారు 'గానుగెద్దు'లా అలానే తిరుగుతూనే ఉన్నారు.      ఆధునికత పేరుతో యాంత్రిక జీవనం గడుపుతూ ప్రేమలను, అనుబంధాలను, ఆప్యాయతలను ... చివరకు మనల్ని మనమే కోల్పోతున్నాం. డబ్బు, ఆస్తుల

సామాన్యుడి సింహాసనం ... (సరదాకి ఓ పిడకల వేట)

సామాన్యుడి సింహాసనం ... (సరదాకి ఓ పిడకల వేట) ****************************** **********************      నిన్న 'మా' టీవీ చూస్తోంటే మధ్యలో 'మీలో ఎవరు కోటీశ్వరుడు' కార్యక్రమంకు సంబంధించి ప్రకటన వచ్చింది. (చాలా రోజుల్నించి వస్తూండచ్చు లేదా ఇంతకు ముందటి భాగాలలో కూడా వచ్చిండవచ్చు, కానీ నేను ఇప్పుడే చూశాను/గమనించాను) అందులో నాగార్జున అంటాడు 'ఇది సామాన్యుడి సింహాసనం' అని. ఎందుకో నాకు అది అసంబంద్ధంగా అనిపించింది. అది సామాన్యుడి సింహాసనం ఎలా. యే ప్రాతిపదికన అవుతుంది. సామాన్యుడు అని ఏ ప్రాతిపదికన నిర్ణయిస్తారు? అంటే వారు ఇచ్చిన టెలిఫోన్ నంబర్స్ కు వచ్చే ఫోన్ కాల్స్, మెసేజెస్ ని సామాన్య, అసామాన్య వర్గాలుగా విడదీస్తారా? లేక కుల, మాట ప్రాతిపదికన నిర్ణయిస్తారా? లేక ఏమైనా రిజర్వేషన్స్ ఉన్నాయా? ఒకవేళ ఉంటే అందులో మహిళలకు, వికలాంగులకు, వెనుకబడిన వర్గాలను తగిన ప్రాధాన్యత లభిస్తోందా? ఎన్ని ప్రశ్నలకని సమాధానం వెతకాలి? ఏ ఒక్కదానికి నాకు సమాధానం దొరకలేదు. కార్యక్రమ నిర్వాహకులను ఎలా సంప్రదించాలో తెలీట్లేదు - ఈ సమాచారం అర్.టి.ఐ చట్టం పరిధిలోకి వస్తుందేమో తెలుసుకోవాలి.

చెన్నై విషాదం ... ఓ అస్తిత్వపు బలి

చెన్నై విషాదం ... ఓ అస్తిత్వపు బలి ****************************** **     గత వంద సంవత్సరాలలో ఎన్నడూ ఎరుగని భీభత్సం; ఉప్పెన కంటే ఎక్కువగా వర్షం సృష్టించిన వినాశనం; దిక్కుతోచని సాధారణ ప్రజలు, నగరాన్ని వదిలి బయటకు పోవాలన్నా ఎలా పోవాలో అర్థం కాక వారు పడుతున్న ఇబ్బందులు వర్ణనాతీతం. ఇదీ భారీ వర్షాలకు అతలాకుతలమవుతున్న నేటి చెన్నై పరిస్థితి. అక్కడి దృశ్యాలు చిత్రాలలో చూస్తుంటేనే భయం వేస్తోంటే ఇక అక్కడ ఉండి కళ్ళారా చూస్తూ స్వయంగా అనుభవిస్తున్న వారి పరిస్థితి ఏంటి? సైన్యం, పోలీసులు, డిజాస్టర్ రికవరీ బృందంలతో పాటు పలు స్వచ్చంద సేవా సంస్థలు, వ్యక్తులు సాధ్యమైనంత వరకు సహాయక చర్యలు చేపడుతున్నారు. కానీ కొనసాగుతున్న వర్షంతో ఎక్కడికక్కడ నిలిచిపోయిన నీటి మట్టం రోజు రోజుకూ పెరుగుతూ పరిస్థితిని మరింత దిగాజారుస్తోంది. చెన్నై పరిస్థితికి చలించిన పలువురు తమకు తోచిన రీతిలో స్పందిస్తున్నారు. ఇప్పుడు జరుగుతున్న దాని గురించి పెద్దగా వివరించనక్కరలేదు. అలానే అక్కడ జరిగినట్టు ఇక్కడ జరగలేదు, మనం ప్రస్తుతానికి భద్రంగానే ఉన్నాం అని సంతోషపడటం కంటే అక్కడ ఎందుకు అలా జరిగింది అన్నది అత్యంత ముఖ్యంగా గమన

... చివరి పేజీ

వంశీ కలుగోట్ల// ... చివరి పేజీ// *************************** "నుదుటినుండి స్వేదం చిందకుండా చేసేపనికి విలువ లేదు. భారతీయ మేధ ఏ ఒక్కరికీ తీసిపోదు. కానీ, మనకు ధైర్యం పాళ్ళు తక్కువ. దేశంలో యువతకు కావలసింది అపజయాన్ని చవిచూస్తామన్న భయాన్ని శాశ్వతంగా నిర్మూలించటం. విజయాభిలాషను పెంపొందించుకోవటం" - సి.వి. రామన్  *                *                 *       అతని పేరు 'కె'. ఒక సాధారణ మధ్య తరగతి కుటుంబంలో జన్మించాడు. ఆర్థికంగా కుటుంబ పరిస్థితి అంతంతమాత్రం. ఆ వయసులో తను పేపర్ బాయ్ గా పనిచేస్తూ, వచ్చిన డబ్బుతో చదువును కొనసాగించాడు. ఆ పేపర్స్ లో వచ్చే విమానాల బొమ్మలను చూసి తనూ విమానాలను నడిపే పైలట్ గానో, లేదా సంబంధిత శాఖలో ఏదో ఒక ఉద్యోగమో సంపాదించాలనుకున్నాడు. అప్పుడు అతని వద్దనున్న ఆయుధాలు ఆత్మ విశ్వాసం, కష్టించే గుణం, పట్టుదల అంతే. తన లక్ష్య సాధన కోసం నిరంతరం శ్రమించాడు. తన లక్ష్యసాధనలో ఆతను ఎంత ఎత్తుకు ఎదిగాడో అతనికి తెలుసో లేదో తెలియదు కానీ - నేడు అతడిని, అతడందించిన స్ఫూర్తిని గుండెల నిండా నింపుకున్న ఈ దేశం మొత్తానికి తెలుసు. అతడి పేరు 'అబ్దుల్ కలా

'మార్పు'కు బాధ్యత ఎవరిది?

వంశీ కలుగోట్ల // 'మార్పు'కు బాధ్యత ఎవరిది? // ******************************************      "ఆలోచన" మతం లాంటిది. నువ్వు దాన్ని ఎంత బలంగా నమ్ముతావో అంత బలంగా ఆచరిస్తావు ... ప్రపంచంలో ప్రతి మతం, సిద్ధాంతం, విప్లవం, మార్పు పేరేదైనా కానివ్వండి అది ఒక ఆలోచనలోంచే ఉద్భవించింది ... అందుకే స్వామి వివేకానంద చెప్పినట్లు "ఒక మహోన్నతమైన ఆదర్శాన్ని నీ జీవిత ధ్యేయంగా చేసుకో. దాన్ని గురించే ఆలోచించు. దానికి అనుగుణంగా జీవించు. నీ మెదడు, నరాలు, కండరాలు, నీ శరీరమంతా నీ ఆదర్శంతో/ఆలోచనతో నిండాలి."           దేవుడు అంటే ఒక రూపం కాదు. దేవుడు అంటే మంచి. మంచి చేసే ప్రతి ఒక్కరూ దేవుడి ప్రతి రూపాలే. అందుకే మంచి చేసిన ప్రతి ఒక్కరిని దేవుళ్ళను చేశాం, కానీ వారు చేసిన మంచిని మాత్రం ఆచరించటం లేదు. ఇలాగే మంచి చేసే వాళ్ళందరినీ దేవుళ్ళుగా చేస్తూ మనం మాత్రం దానవులుగా మిగిలిపోతున్నాం. మనం వ్యవస్థలో మార్పు రావాలి రావాలి అంటూ ఉంటాం కాని ఆ వ్యవస్థలో మనమూ భాగమనే విషయం మర్చిపోయి ఎవరో మార్పు తీసుకుని రావాలి అంటూ ఉంటాం. ఈ వాక్యాలు ఎవరో ఒకరిని ఉద్దేశించి చెప్పడం లేదు ... అలాంటి వ్యవ

పోరాటం ఆపవద్దు

పోరాటం ఆపవద్దు  ******************** ఈ ప్రపంచం మొత్తం మీద 'ప్రయత్నం' ఒక్కటే నిజం, మిగిలినదంతా 'అబద్ధం' - గౌతమ బుద్ధుడు        గ్రీకు పురాణాల్లో 'ఫీనిక్స్' అని ఒక పక్షి ప్రస్తావన ఉంది. దాని విశిష్టత ఏమిటంటే - దాన్ని చంపి, కాల్చి, బూడిద చేసిన తరువాత కూడా అది ఆ బూడిద నుండి కూడా పునరుజ్జీవం పొందుతుంది. అది నిజమా, కాదా అన్నది అటుంచితే మనవాళ్ళు ఈ మొత్తం చర్యను ఒక అందమైన పదంతో నిర్వచించారు - 'పునరుత్థానం'.      అంతా అయిపోయిందని అనుకున్న తరువాత కూడా నేలకేసి కొట్టిన బంతిలా ఉవ్వెత్తున ఎగసి ఎదిగే వాళ్ళను చూసే ఉంటారు. సముద్రాన్ని ఎప్పుడైనా చూశారా? ఆకాశాన్ని చుంబించాలని ప్రయత్నించే ఆ అలల్ని గమనించారా? అవి కింద పడుతూనే ఉంటాయి కానీ, ప్రయత్నాన్ని మాత్రం ఎప్పటికీ మానవు, ఆశ వదులుకోవు. మళ్ళీ అంబరాన్ని చుంబించాలనే ప్రయత్నాన్ని మాత్రం మానవు. విజయమంటే ముందు ప్రయతించటం, సాధించేవరకు ఆ ప్రయత్నాన్ని వదలకపోవటం. చిన్న చిన్న ఆటంకాలకు, అవరోదాలకు నీరుగారిపోయి నీరసించి ఉంటే ఈనాడు మనం చూస్తున్న నాగరికత ఉండేది కాదు. ఎక్కడో చదివాను 'థామస్ ఆల్వా ఎడిసన్ బల్బు కనుగొనే ప్రక్

జపమో ధ్యానమో ... ఏదో ఒకటి ఆచరించి చూడండి

జపమో ధ్యానమో ... ఏదో ఒకటి ఆచరించి చూడండి ************************************************   'జ'కారశ్చ జన్మవిచ్చేదః 'ప'కారః పాపనాశనః  తస్మాజ్జప ఇతిప్రోక్తో జన్మపాప వినాశకః ॥  --- 'జ' అనగా రాహిత్యం జన్మరాహిత్యం, 'ప' అనగా పాపనాశనం. కావున 'జప'మనగా జన్మరాహిత్యం, పాప వినాశనం కలుగజేసేది అని అర్థం.      మనిషి పుట్టుకతో మానసింకంగా ఎంతో బలవంతుడు. కానీ, పెరుగుతూ వస్తూ ప్రపంచం లోని అనేకమైనటువంటి, తనకు అనవసరమైన విషయాలను పట్టించుకుంటూ, కల్మషాలను అంటించుకుంటూ దుర్బలుడుగా తయారవుతున్నారు. పుట్టుకతో అత్యంత శక్తివంతంగా ఉండే ఇంద్రియాల శక్తి వివిధ ఆకర్షణలకు, మోహాలకు లోనై శక్తిని కోల్పోతూ బలహీనమవుతున్నాయి. ఇంద్రియాలను అదుపులో ఉంచవలసిన మనసే ప్రాపంచిక సుఖాలకు, భోగలాలసతకు లోనై అదుపు పక్కదారులు పడుతోంది. మనవ పరిణామ క్రమంలో  నాగరికుడుగా ఎదుగుతూ వస్తూన్న సమయంలోనే కొందరు మేధో వంతులు ఈ విషయాన్ని గమనించారు. ఆ దశలో ఏదైనా సమస్య వస్తే దాని మూలాలు వెతికి, పరిష్కార మార్గం కనుగొనే సహనం, ఓపిక ఉండేవి. ఇప్పటిలా తాత్కాలిక ఉపశమనం కలిగించే చర్యలు చేపట్టి, మళ్ళీ మళ్ళీ

నువ్వూ ... నేనూ ... ఒక విమర్శ

వంశీ కలుగోట్ల // నువ్వూ ... నేనూ ... ఒక విమర్శ // ****************************** ***************      ఎప్పుడు అంటిందో ఎలా అంటిందో తెలీదు కాని మనందరికీ ఒక జబ్బు అంటింది. దీని మూలాలు ఏమిటో ఎలా తెలుసుకోవాలో కూడా అర్థం కానంతగా ముదిరిపోయింది. సమస్య ఏంటంటే మనం దాన్ని జబ్బుగా గుర్తించే స్థాయిని కూడా దాటిపోయెంతగా అది మన జీవితాలలో భాగంగా ఇమిడిపోయింది. వ్యక్తిని, వస్తువును వేరు చేసి చూడలేకపోవడమే ఆ జబ్బు. ఈ మధ్యనే ఎక్కడో చదివాను 'విమర్శ అనేది వస్తువు మీద ఉండాలి కాని వ్యక్తి మీద కాదు' అని. (రంగనాయకమ్మ గారి 'రామాయణ విషవృక్షం' పుస్తకం గురించిన చర్చలో పుస్తకంలోని వస్తువు మీద కాకుండా రంగనాయకమ్మ గారి మీద వ్యక్తిగత విమర్శలు మొదలెట్టాడు ఒక ప్రబుద్దుడెవరో. దానిని సున్నితంగా తిప్పికొడుతూ ఇంకొకాయన పైవిధంగా చెప్పారు.) కానీ అది ఎంతమంది పాటిస్తున్నారు ఈ రోజుల్లో ... పత్రికలు, న్యూస్ చానెల్స్ అంటే రాజకీయ పార్టీలకు బాకా ఊదే మాధ్యమాలుగా తయారయ్యాయి కాబట్టి వాటి గురించి మాట్లాడుకోవడం శుద్ధ దండగ. కానీ, ఈ సోషల్ మీడియాలో కొందరు అంతకు మించి తయారయ్యారు - విషాన్ని వెలిగక్కె రాతలత

యముడి భూలోక యాత్ర: ఒకటవ రోజు (కథ) - అమరావతి సందర్శనం

యముడి భూలోక యాత్ర ఒకటవ రోజు (కథ) - అమరావతి సందర్శనం ************************************** ముందుమాట: ఇది కొన్ని వాస్తవ ఘటనల నేపథ్యంలో అల్లుకున్న కాల్పనిక కథ. ఎవరినీ నొప్పించాలని, విమర్శించాలని కాదు. కేవలం రచయిత ఊహ మాత్రమే. *                *                 * అది యమసభ - పాపుల విచారణ, శిక్షల విధింపు ఆ రోజుకి పూర్తయ్యింది. ప్రతిరోజూలానే ఆ రోజు కూడా ఎలాంటి ప్రత్యేకత లేకుండా యుగాల తరబడి సాగుతున్న వారి దినచర్యలో భాగంగా మరో రోజుకు ముగింపు పలకడం తప్ప చేసినది ఏమీ లేదు. భూలోకం నుంచి వస్తున్న పాపుల సంఖ్య నానాటికీ పెరిగిపోతుండటం అటు చిత్రగుప్తుడికి, ఇటు యమధర్మరాజుకి శిరోభారంగా మారింది. తమ బాధ్యతల నుండి కాస్త విరామం తీసుకుని స్వర్గమునకో లేక మరియొక లోకమునకో కొద్దిరోజులు వెళ్లి రావాలని యోచింపసాగాడు యముడు. విచారణ పూర్తయినందువలన పాపులు, భటులు, మిగతా అందరూ వెళ్ళిపోవడం వలన సభా మందిరంలో నిశ్శబ్దం రాజ్యమేలుతోంది. బయలుదేరటానికి సిద్ధమవుతూ చిత్రగుప్తుడితో సంభాషణ మొదలు పెట్టాడు యమధర్మరాజు. యముడు: "గుప్తా! భూలోకమునుండి వచ్చు పాపుల సంఖ్యా నానాటికీ పెరిగిపోవుచున్నది, భూలోకమున పుట్టు వారి సం

Travelogue of Yamadharmaraja's visit to Bhoolok (Earth): Part 1 - Yama's visit to Amaravathi

Travelogue of Yamadharmaraja's visit to Bhoolok (Earth) ******************************************************************* Disclaimer: This is just fiction story with fantasy touch from author's imagination and views expressed in this writing are purely of writer own views. Prologue: --------------     For Yamadharmaraja and Chitragupta it was like any other days in their life, there was nothing special and exciting. Their day was filled with the routine - enquiring and punish the paapis (sinners) from Bhoolok (Earth). More than the process, the increasing number of paapis from Bhoolok every other day started bothering them. Yama was too much tired with the routine and felt like he need a break from this routine. Court hall was with filled with silence and emptyness with him and Chitragupta getting ready to move out. On the way back, he started discussing his ideas with Chitragupta. "Oh, Gupta! I am too much tired and bored with all this process. We a break and