Posts

Showing posts from December, 2015

ఏమవుతాది ?

వంశీ కలుగోట్ల // ఏమవుతాది ? // ***************************** సుబ్బిగాడు: ఒరేయ్ అప్పిగా, ఏందిరా అట్టా ఉన్నావు ఇయ్యాల? ఏమైనాదేటి? అప్పిగాడు: అది గాదురా సుబ్బిగా. మన గడ్డం సామిని సూసి శానా రోజులైపోనాది. ఈ కాల్ మనీ స్కాం ఏందో తెగ మాట్టాడేసుకుంటున్నారు గందా, మా సామి ఏమన్నా జనాల్లోకి వస్తాడేమో సూద్దామని ఎదురు సూత్తన్నానురా. సుబ్బిగాడు: ఒరే ... నువ్వు మీ సామి గురించి సెప్తే గుర్తొచ్చినాదిరా. మీ లెక్క అట్టా నిమ్మకుండ సల్లంగా ఎట్టా ఉండాలో నేర్సుకోవాలిరా. సన్యాసులైతే దాన్నేదో అంటారురా ఆ 'స్థితప్రజ్ఞత' అని మా నాయన సేప్పెవోడు సిన్నప్పుడు. ఏమైనా మీ సామి శానా గోప్పోడురా. అప్పిగాడు: అదేందిరా అట్టా అంటావు? సుబ్బిగాడు: అట్టా గాదురా ఫర్ ఎజ్జంపుల్ ఇప్పుడు ఆ అమరావతి కాడ భూముల ఇసయమే తీసుకో ఏం సేసినాడు. ఆడ జనాల కాడికి బోయినాడు ఆళ్ళ గోడు ఇని బాబు కాడికి బోయినాడు, బయటకొచ్చి 'బాబు మీద నమ్మకం ఉండాది, ఆయన అంతా మంచే సేత్తాడు' అనె. ఆ తరువాత ఆడ కొన్ని ఊర్ల పెజలు ఏడ్సినా కూడా పట్టించుకోకపాయే. ఆ తరువాత ఋషితేశ్వరి యవ్వారంలో అయితే నోరు కూడా మెదపకపాయే. మొన్నటికి మొన్న అదేందదీ ఆ

ద్యావుడా ... ఇదేనా సహనం అంటే

వంశీ కలుగోట్ల // ద్యావుడా ... ఇదేనా సహనం అంటే? // **********************************************************      మనం మీడియాని ఎప్పుడూ తిడుతుంటాం - ఎందుకంటే వారు ఒక వర్గానికి మాత్రమే కొమ్ము కాస్తూ, రెండో వర్గానికి చెందిన విషయాలలో 'కోడి గుడ్డు మీద ఈకలు వెతికే' తరహాలో వ్యవహరిస్తుంటారు కాబట్టి. వారికి సహనం లేదు అంటుంటాంఎందుకంటే కాంగ్రెస్ లేదా యుపియే పదేళ్ళ కాలంలో సాధించలేనిది మోడీ పద్దెనిమిది నెలల కాలంలోనే సాధించలేదని విమర్శిస్తున్నారని. గత పాలనలో వారు వారు వేసిన ముళ్ళను, చెత్తను ఏరుకుంటూ వస్తున్నాడు. కొత్తగా ఏదైనా చేయాలంటే ముందు ఈ చెత్తను ఏరేయ్యాలి కదా అంటూ సహనంగా ఉండాలని మంచిని, నీతిని బో ధిస్తాం. (ఆయనేం చేస్తున్నాడో అన్నది ఎవరికెరుక. భజనబృందం స్తోత్రపాఠాలలో మన గొంతుకలు వినబడే అవకాశం ఉందంటారా? అది పక్కన పెడదాం - ఇక్కడ విషయం అది కాదు కాబట్టి.)  కానీ, అదే వేరే వాళ్ళ విషయంలో అయితే వారు ఇంకా కార్యాలయంలో అడుగు కూడా పెట్టకుండానే విమర్శలు మొదలెడతాం. తండ్రిని చూపి వీళ్ళను పని కూడా మొదలెట్టక ముందే విమర్శించడం ఎందుకూ అంటే వెంటనే వాళ్ళ సమర్థకుడివంటూ ఆ గాటన కట్టేస్తారు. ఆ తండ్రి పరమ అ

గాలి మేడలు (ఓ చిన్న కథలాంటిది ☺)

Image
వంశీ కలుగోట్ల //గాలి మేడలు (ఓ చిన్న కథలాంటిది ) // ***************************************************      ఈ మధ్యన పోతురాజుకు మనసు ఏమీ బావుండట్లేదు, అంతా ఏదోలా ఉంటోంది. అలవాటైపోయిన ప్రాణానికి నాటకం వేయక చాలా రోజులయ్యేసరికి సిరాకు దొబ్బుతోంది. అలాగని ఏదో ఒకటిలే అని ఏది పడితే ఆ నాటకం ఒప్పెసుకునే తత్త్వం కాదాయె పోతురాజుది. నచ్చకపోతే చివరకి దేవుడు చెప్పినా వినే రకం కాదు, మహా మొండి రకం. సరే, సొంతంగా రాసుకుందామా అంటే మనసు కుదురుగా ఉండట్లేదు. అందుకే ముందు మనసును అదుపులోకి తెచ్చుకోవడానికి ధ్యానం మొదలెట్టాడు. పోతురాజు ధ్యానం మొదలెట్టాడు అంటే, అప్పుడు పోతురాజును కదిలించే దమ్ము ఒక్క సాంబడికి తప్ప మరెవరికీ లేదని అందరూ అనుకుంటారు.      ఆ రోజు సాంబడికి మహా ఉత్సాహంగా ఉంది. కారణం ఏంటంటే పొద్దున్నే సాంబడికి సారా చుక్క కూడా పడకుండానే బ్రహ్మాండమైన ఆలోచన వచ్చింది. సాంబడికి తనవారంటూ ఎవరూ లేరు. మంచైనా, చెడైనా పంచుకునేది ఒక్క పోతురాజే. అందుకే వెంటనే పోతురాజు దగ్గరకు బయల్దేరాడు ... సాంబడు: "సామీ ఎట్టున్నావ్ సామీ! ఈ మద్దెన మరీ నల్లపూస లెక్క అయిపోతివి, అసలు జనాలకి కనబడటమే మానేస్తివి.

దేవుడికి, మనిషికి తేడా కేవలం గుణం మాత్రమే ...

దేవుడికి, మనిషికి తేడా కేవలం గుణం మాత్రమే ... ****************************** ****************** "అవును! రాముడు, కృష్ణుడు, జీసస్, ప్రవక్త ... అందరూ గొప్పవారే! అయితే నీకేమిటి, నీవేమిటి? నీవెప్పుడు ఉన్నతిని సాధిస్తావు? గుర్తుంచుకోండి ... ఈ భూమి మహాత్ముల, నాయకుల చేత పునీతం కాబదినది. ఈ క్షణాన్నే నీవు ఏమి చేయదలచుకుంటున్నావో, ఏమి కాదలచు కుంటున్నావో నిర్ణయించుకో. ప్రయాణాన్ని ప్రారంభించు."       మనిషి అశాశ్వతమైనవాడు, గుణం శాశ్వతమైనది. మనిషిని, గుణాన్ని వేరు చేసి చూడగలగాలి. మనిషి కేవలం ఒక వాహకం లాంటి వాడు మాత్రమే. ప్రవహించే నది లాంటిది గుణం; అది వచ్చిన వారిని తనలో కలుపుకుంటుంది, పోయేవారిని పోనిస్తుంది. మనిషిని, గుణాన్ని వేరు చేసి చూడలేకపోవడం అన్న రుగ్మత వల్లనే ఇవ్వాళ 'వారసత్వం' అన్నది రాజ్యమేలుతోంది. గుణం వాహకంగా ఉపయోగించుకున్న కొంతమంది మనుషులని అభిమానిస్తూ, ఆరాధిస్తూ, పూజిస్తూ వారిని దేవుళ్ళను చేస్తున్నాం. గతంలో (ప్రాచీన కాలంలో) ఈ పైత్య ప్రకోప ధోరణులు ఇంతగా ఉండేవి కావు. ఉదాహరణకి రాముడి పిల్లలు దేవుళ్ళుగా పూజింపబడలేదు, కృష్ణుడి పిల్లలు దేవుళ్ళుగా కీర్తిం

దేశమంటే మనుషులోయ్ ..

వంశీ కలుగోట్ల // దేశమంటే మనుషులోయ్ ...  // *************************************************      దేశం లేదా సమాజం అంటే అదేమీ ఒక పదార్ధం కాదు లేదా ఎక్కడినుండో ఊడి పడేదీ కాదు. మనమంతా కలిస్తేనే సమాజం. రాష్ట్రమైనా, దేశమైనా లేక మరోటైనా మనుషులతోనే. అందుకే గురజాడగారు అన్నది 'దేశమంటే మట్టి కాదోయ్ ... దేశమంటే మనుషులోయ్' అని. ఎవరో చెప్పినట్టు ఇది ఒక అద్దం లాంటిది ... అద్దంలో నువ్వు ఎలా ఉంటావో అలా కనిపిస్తావు అలానే సమాజం లేదా ఎదుటివారితో నువ్వు ఎలా ప్రవర్తిస్తావో దాదాపుగా వారు నీతో అలానే ఉంటారు. సమానత్వం కావాలి, సమస్థాయి ఇవ్వాలి, ఇంకేదో కావాలి ... గట్రా ఇలాంటివన్నీ ఎదుటివారి నుంచి ఆశించే ముందు మనం ఇస్తున్నామా అనేది అతి ముఖ్యంగా గమనించవలసిన విషయం. అ వన్నీ భౌతికమైనవి కావు ఎక్కడో అక్కడ దొరుకుతాయి అంటే వెళ్లి కొనుక్కోవడానికి, అలానే అవేమీ ఎవరో ఒకరి అధీనంలో ఉండేవి కూడా కావు పోరాడితే సాధించుకోవచ్చులే అనుకోవటానికి. ఈ సమానత్వం, సమస్థాయి గట్రా ఇలాంటి వాటి మాటున ప్రతి ఒక్కరు కోరుకునేది, ఆశించేది ఎదుటివారి నుంచి 'కనీస గౌరవం/విలువ'.     ఈరోజుల్లో మనం ఒక వ్యక్తికి ఇచ్చే వి

అన్వేషణకు అన్నీ అందుతాయి ...

అన్వేషణకు అన్నీ అందుతాయి ...  ****************************** *** కంటికి కనిపించేదంతా నిజం కాదు. మన ముందే మనిషి ఉంటాడు, కంటికి కనిపిస్తూ ఉంటాడు, కానీ అర్థం కాడు! అతని గుణగణాలు, మనసు కోసం లోతుగా చూడాలి, అన్వేషించాలి, పరిశీలించాలి. అర్థం అవుతాడా? కాడు. అన్వేషణకు అన్నీ అందుతాయి ... ఒక్క తాను తప్ప. (దాశరథి రంగాచార్య)     "లోకంలో అత్యంత విచిత్రమైన విషయమేది?" అని యక్షుడు ధర్మరాజును ప్రశ్నిస్తే, "ప్రతిదినమూ జనులు మన చుట్టూ మరణిస్తూనే ఉన్నారు. కానీ, తాము మరణించమని మిగిలిన వాళ్ళు అనుకుంటూ ఉంటారు" అని బదులిచ్చాడట. దీన్నే 'మాయ' అంటారు. ఈ మాయే మనుష్యులని అనేక రకాల ఆకర్షణల వైపు పరుగులు తీయిస్తుంది. కళ్ళముందే ఉన్నా కూడా వాస్తవాన్ని అర్థం చేసుకోలేనంతగా కళ్ళకు పొరలు కప్పేస్తుంది. ఈ మాయను వదిలించుకుని వాస్తవాన్ని గ్రహించగలిగిన వారు మహాత్ములయ్యారు, మాయలో పడి కొట్టుకున్నవారు 'గానుగెద్దు'లా అలానే తిరుగుతూనే ఉన్నారు.      ఆధునికత పేరుతో యాంత్రిక జీవనం గడుపుతూ ప్రేమలను, అనుబంధాలను, ఆప్యాయతలను ... చివరకు మనల్ని మనమే కోల్పోతున్నాం. డబ్బు, ఆస్తుల

సామాన్యుడి సింహాసనం ... (సరదాకి ఓ పిడకల వేట)

సామాన్యుడి సింహాసనం ... (సరదాకి ఓ పిడకల వేట) ****************************** **********************      నిన్న 'మా' టీవీ చూస్తోంటే మధ్యలో 'మీలో ఎవరు కోటీశ్వరుడు' కార్యక్రమంకు సంబంధించి ప్రకటన వచ్చింది. (చాలా రోజుల్నించి వస్తూండచ్చు లేదా ఇంతకు ముందటి భాగాలలో కూడా వచ్చిండవచ్చు, కానీ నేను ఇప్పుడే చూశాను/గమనించాను) అందులో నాగార్జున అంటాడు 'ఇది సామాన్యుడి సింహాసనం' అని. ఎందుకో నాకు అది అసంబంద్ధంగా అనిపించింది. అది సామాన్యుడి సింహాసనం ఎలా. యే ప్రాతిపదికన అవుతుంది. సామాన్యుడు అని ఏ ప్రాతిపదికన నిర్ణయిస్తారు? అంటే వారు ఇచ్చిన టెలిఫోన్ నంబర్స్ కు వచ్చే ఫోన్ కాల్స్, మెసేజెస్ ని సామాన్య, అసామాన్య వర్గాలుగా విడదీస్తారా? లేక కుల, మాట ప్రాతిపదికన నిర్ణయిస్తారా? లేక ఏమైనా రిజర్వేషన్స్ ఉన్నాయా? ఒకవేళ ఉంటే అందులో మహిళలకు, వికలాంగులకు, వెనుకబడిన వర్గాలను తగిన ప్రాధాన్యత లభిస్తోందా? ఎన్ని ప్రశ్నలకని సమాధానం వెతకాలి? ఏ ఒక్కదానికి నాకు సమాధానం దొరకలేదు. కార్యక్రమ నిర్వాహకులను ఎలా సంప్రదించాలో తెలీట్లేదు - ఈ సమాచారం అర్.టి.ఐ చట్టం పరిధిలోకి వస్తుందేమో తెలుసుకోవాలి.

చెన్నై విషాదం ... ఓ అస్తిత్వపు బలి

చెన్నై విషాదం ... ఓ అస్తిత్వపు బలి ****************************** **     గత వంద సంవత్సరాలలో ఎన్నడూ ఎరుగని భీభత్సం; ఉప్పెన కంటే ఎక్కువగా వర్షం సృష్టించిన వినాశనం; దిక్కుతోచని సాధారణ ప్రజలు, నగరాన్ని వదిలి బయటకు పోవాలన్నా ఎలా పోవాలో అర్థం కాక వారు పడుతున్న ఇబ్బందులు వర్ణనాతీతం. ఇదీ భారీ వర్షాలకు అతలాకుతలమవుతున్న నేటి చెన్నై పరిస్థితి. అక్కడి దృశ్యాలు చిత్రాలలో చూస్తుంటేనే భయం వేస్తోంటే ఇక అక్కడ ఉండి కళ్ళారా చూస్తూ స్వయంగా అనుభవిస్తున్న వారి పరిస్థితి ఏంటి? సైన్యం, పోలీసులు, డిజాస్టర్ రికవరీ బృందంలతో పాటు పలు స్వచ్చంద సేవా సంస్థలు, వ్యక్తులు సాధ్యమైనంత వరకు సహాయక చర్యలు చేపడుతున్నారు. కానీ కొనసాగుతున్న వర్షంతో ఎక్కడికక్కడ నిలిచిపోయిన నీటి మట్టం రోజు రోజుకూ పెరుగుతూ పరిస్థితిని మరింత దిగాజారుస్తోంది. చెన్నై పరిస్థితికి చలించిన పలువురు తమకు తోచిన రీతిలో స్పందిస్తున్నారు. ఇప్పుడు జరుగుతున్న దాని గురించి పెద్దగా వివరించనక్కరలేదు. అలానే అక్కడ జరిగినట్టు ఇక్కడ జరగలేదు, మనం ప్రస్తుతానికి భద్రంగానే ఉన్నాం అని సంతోషపడటం కంటే అక్కడ ఎందుకు అలా జరిగింది అన్నది అత్యంత ముఖ్యంగా గమన

... చివరి పేజీ

వంశీ కలుగోట్ల// ... చివరి పేజీ// *************************** "నుదుటినుండి స్వేదం చిందకుండా చేసేపనికి విలువ లేదు. భారతీయ మేధ ఏ ఒక్కరికీ తీసిపోదు. కానీ, మనకు ధైర్యం పాళ్ళు తక్కువ. దేశంలో యువతకు కావలసింది అపజయాన్ని చవిచూస్తామన్న భయాన్ని శాశ్వతంగా నిర్మూలించటం. విజయాభిలాషను పెంపొందించుకోవటం" - సి.వి. రామన్  *                *                 *       అతని పేరు 'కె'. ఒక సాధారణ మధ్య తరగతి కుటుంబంలో జన్మించాడు. ఆర్థికంగా కుటుంబ పరిస్థితి అంతంతమాత్రం. ఆ వయసులో తను పేపర్ బాయ్ గా పనిచేస్తూ, వచ్చిన డబ్బుతో చదువును కొనసాగించాడు. ఆ పేపర్స్ లో వచ్చే విమానాల బొమ్మలను చూసి తనూ విమానాలను నడిపే పైలట్ గానో, లేదా సంబంధిత శాఖలో ఏదో ఒక ఉద్యోగమో సంపాదించాలనుకున్నాడు. అప్పుడు అతని వద్దనున్న ఆయుధాలు ఆత్మ విశ్వాసం, కష్టించే గుణం, పట్టుదల అంతే. తన లక్ష్య సాధన కోసం నిరంతరం శ్రమించాడు. తన లక్ష్యసాధనలో ఆతను ఎంత ఎత్తుకు ఎదిగాడో అతనికి తెలుసో లేదో తెలియదు కానీ - నేడు అతడిని, అతడందించిన స్ఫూర్తిని గుండెల నిండా నింపుకున్న ఈ దేశం మొత్తానికి తెలుసు. అతడి పేరు 'అబ్దుల్ కలా