... వైద్యో నారాయణో హరిః
వంశీ కలుగోట్ల // ... వైద్యో నారాయణో హరిః //
***************************************
ఇపుడు జరుగుతున్న విషయం చెప్తాను.
పరిస్థితి ఎలా ఉందంటే కాస్త దగ్గో, జలుబో, ఒళ్ళు వెచ్చబడటమో జరిగితే లోలోపల దడ పుడుతోంది. అలాగని వెంటనే హాస్పిటల్, దగ్గరలో ఉన్న డాక్టర్ దగ్గరకో వెళ్ళటానికి కూడా భయం. మరేం చేయాలి ... ??? అపుడు గుర్తొస్తారు మన ఫ్రెండ్స్ లో డాక్టర్స్ లేదా తెలిసిన డాక్టర్, మన ఫ్రెండ్స్ డాక్టర్ - ఇలా వాళ్ళకు ఫోన్ చేసి వివరాలు చెప్పి, వాళ్ళ సలహా తీసుకుంటాం. ఇపుడు ఉన్న పరిస్థితుల్లో బయటకు, అదీ రద్దీ ఎక్కువగా ఉండే హాస్పిటల్స్ లాంటి ప్రదేశాలకు వెళ్లాలంటే భయం ఉంటుంది కాబట్టి అర్థం చేసుకోవచ్చు. ఇదే సమయంలో అనేక ప్రైవేట్ (వెల్, ప్రైవేట్ అనేకంటే కార్పొరేట్ హాస్పిటల్స్ అనాలేమో) హాస్పిటల్స్ సాధ్యమైనంత దండుకుంటున్నాయి. నిజానికి సీరియస్ కండిషన్ లేకపోతే హోమ్ క్వారంటైన్ లో ఉండి, డాక్టర్స్ సలహాలతో మందులు తీసుకుంటూ ఉండవచ్చు అని ప్రభుత్వాలు స్పష్టం చేసినప్పటికీ జనాలు పట్టించుకోవడం లేదు.
ఇక్కడ నష్టపోతున్నది ఎవరంటే ఆ డాక్టర్ ఫ్రెండ్స్. రోజూ ఫోన్ చేసి, ట్రీట్మెంట్ (ఫోన్ లో) తీసుకుంటూ, ఆరోగ్యం కుదుటపడ్డాక 'నువ్వు దేవుడిలాంటివాడివి' అని ఒక మాట చెప్పి, నాలు పొగడ్తలు పడేసేవారే కానీ ఎంతోకొంత ఫీస్ లాగ ఇద్దాం అనుకునేవారు అరుదు. ఏ అవసరమూ లేని దేవుడికి కూడా నైవేద్యం పెడతారు కదా, మరి ఎన్నో అవసరాలు ఉండే ఆ డాక్టర్ సంగతేంటి? డాక్టర్స్ అంటే ప్రభుత్వాసుపత్రుల్లో పనిచేసే వాళ్ళు, కార్పొరేట్ హాస్పిటల్స్ మైంటైన్ చేసేవాళ్ళే కాదబ్బా - ప్రైవేట్ ప్రాక్టీషనర్లు ఉంటారు. నాకు బాగా తెలిసిన కొంతమంది ఇలాంటి ప్రైవేట్ ప్రాక్టీషనర్లు గత నాలుగైదు నెలలుగా ఆదాయం లేక, ఇలా ఫోన్స్ లో ఇప్పటికే కొన్ని పదులమందికి ట్రీట్మెంట్ చేసినప్పటికీ, వారెవరూ ఫీజు లాంటిది ఇవ్వక, చాలా ఇబ్బంది పడుతున్నారు.
ప్రాణం తీయడానికి ఒక చిన్న గుండు సూది కూడా సరిపోద్దేమో! కానీ, పోతుందేమో అనేట్లుండే ప్రాణం నిలబెట్టాలంటే వైద్యుడివల్లనే సాధ్యమవుతుంది. దేవుడి ప్రతినిధులమని చెప్పుకునేవారు కూడా, దేవుడి దగ్గరకు వెళ్ళకుండా ఉండటానికి వైద్యుడి సహాయం తీసుకోవలసిందే. భూసురులు అని బ్రాహ్మలను పొరపాటున అని ఉంటారు, వైద్యులే భూసురులు. Respect the serivce you are getting, reward the treatment you got (over the phone from known friends) and remember that nothing comes for free in this world. There always be the other side to the coin ...
Sir
ReplyDeleteMany private practitioners are alsoaalso to pay fees through Google pay etc.