... మరి మీరేం చేశారు

వంశీ కలుగోట్ల // ... మరి మీరేం చేశారు //
*************************************
ఒక టీచర్ సోనూ సూద్ ను ఉదాహరణగా చూపుతూ, మిగతా నటీనటులందరినీ తిట్టాడు
... 'మీ టీచర్స్ గ్రూప్ లో, నీ పై లేదా క్రింది స్థాయి ఉద్యోగులలో ఎంతమంది సాయం చేశారు' అని అడిగామనుకోండి 'అది వేరు ఇది వేరు. మేమేం కోట్లు సంపాదించట్లేదుగా' అని సమాధానం వస్తుంది 
మరి పిల్లలకు చెప్పే పాఠంలో 'Every little helps' అని చెప్తావ్ కదా అంటే మౌనం
*
ఒక టీచర్ అనే కాదు - ఒక బ్యాంకు ఎంప్లాయ్, ఒక రెవిన్యూ ఉద్యోగి, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఒక వ్యాపారి ఇలా పలు రంగాల వారు ఇలానే అంటున్నారు. సోనూ సూద్ ను చూపడం, మిగతా అందరినీ, మరీ ప్రత్యేకించి తెలుగు నటులను తిట్టటం. మరి మీరేం చేశారు అంటే అధికుల వద్ద సమాధానం ఉండదు, సరే వారిలో ఎవరో ఒకరు చేతనైనంత చేశారనుకుందాం - మరి వాళ్ళ రంగంలో మిగతావాళ్ళెందుకు చెయ్యలేదు అంటే "అది వాళ్ళ ఇష్టం అండి. సాయం చెయ్యమని వాళ్ళను బలవంతం చెయ్యలేం కదా" అంటారు. ఇక్కడ నటులను మాత్రం వారు చేసిందానికన్నా, ఇంకా ఎక్కువ చేయలేదెందుకని తిడతారు. సోనూ సూద్ స్వయంగా చెప్పినట్టు, వలస కార్మికుల కష్టాలతో తన అనుభవాలను రిలేట్ చేసుకుని చలించిపోయాడు. ఇదే సోనూ సూద్ గతంలో ఇతర ప్రమాదాలు, ప్రకృతి వైపరీత్యాల సమయంలో సాయం చేశాడేమో కానీ ఇంతలా చేసిన ఉదంతాలు నాకు తెలిసి లేవు, ఎవరికైనా తెలిస్తే చెప్పండి. ఉదాహరణకు సైన్యానికి అక్షయ్ కుమార్ ఇచ్చినంత విరాళం ఇప్పటివరకూ మరే నటుడూ ఇవ్వలేదేమో; అలానే మహారాష్ట్రలో నానా పాటేకర్ రైతులకు అండగా నిలబడ్డట్టు మరే నటుడూ చెయ్యలేదేమో; చిరంజీవి ఐ అండ్ బ్లడ్ బ్యాంకు ద్వారా రక్తాదానాన్ని, నేత్రదానాన్నిప్రోత్సహించడం మరే నటుడూ చేయలేదేమో; బసవతారకం ఆసుపత్రి చారిటీ ద్వారా బాలకృష్ణ చేసినట్టు మరే నటుడూ చేయలేదేమో; 'బీయింగ్ హ్యూమన్' చారిటీ ద్వారా సల్మాన్ ఖాన్ చేసినట్టు మరే నటుడూ చేయలేదేదేమో ... ఇలా అనేకమంది తమకు తోచిన రీతిలో, తమ పరిధిలో చేస్తున్నారు. అయితే ఇపుడు ఆ గత సంఘటనలన్నిటిని పోల్చుతూ సోనూ సూద్ ను తిడదామా - అలా ఎందుకు చేయలేదని? సాయం ఎంత చేయాలి, ఎలా చేయాలి అన్నది వ్యక్తిగత విచక్షణ మరియు వితరణ. ఇంకా ఎందుకు చెయ్యలేదు అని అడగడం సరికాదు. సోనూ సూద్ చేసినది నిజంగా ప్రశంసనీయం, స్ఫూర్తివంతం. అతడు అన్ని ప్రశంసలకు అర్హుడు. అతడిని పోల్చి, మిగతావారిని తిట్టడం మాత్రం సమర్థనీయం కాదు. 😊🙏👍

Comments

  1. సోను సూద్, మిగతా నటుల గొడవ అలా ఉంచండి.
    అసలు ప్రభుత్వం చెయ్యవలసిన పనిని ఇలా వ్యక్తులు, సేవా సంస్థలు ఎందుకు చెయ్యవలసి వచ్చిందో ఎవరూ అడగరే?

    ReplyDelete
    Replies
    1. ప్రతి పనికి ప్రభుత్వం ను ఆరోపించడం సరికాదు. ఇన్ని కోట్ల మందికి ఏ ప్రభుత్వమూ చేయలేదు. ఉన్నంతలో బాగానే చేశారు. This is an unprecedented situation. In a country of 130 crore population, it is very difficult.

      I agree with vamshi Garu. Appreciate the god work of individuals. Don't blame others. We can't expect everyone to contribute.

      Delete
    2. అంటే రోజుకోసారి పెట్రోల్, డీజిల్ ధరలు పెంచడం తప్ప ప్రభుత్వానికి ఇంకే బాధ్యత లేదా?

      Delete
    3. Sir so far 2050 shramic trains have moved approx 30 lakh migrant workers to their home states. May be it is not sufficient. It is a huge task to safely run trains with all precautions.

      During lockdown period the government machinery did a good job. Certainly better than in normal times.

      AP, Telangana governments are doing well within the available resources.

      In crisis time, many individuals, communities, groups have contributed according to their ability and resources.

      In my opinion the government has handled the pandemic in a reasonably efficient manner.

      Delete
    4. Thank you both. Here I did not try to blame on anyone ... here in this article, I just pointed out that it's not good to blame other actors/actresses showing one Sonu Sood. And, I detailed it in the article. Government is doing to some extent, as it's an unexpected and worst ever pandemic yes they too facing many troubles in handling it. And, many individuals responding to their best limitations while some others finding fault with governments and individuals. Let's hope the situation will be better soon

      Delete

Post a Comment

Popular posts from this blog

... కరోనా కంటే ఎక్కువగా భయపెడుతున్న అంశం?

... మూడో కూటమి

... 2019 ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు - జనసేన