"... సంస్కారి సరసం" అనబడు గొప్ప రొమాంటిక్ చిత్రం/కథ

వంశీ కలుగోట్ల // "... సంస్కారి సరసం"  అనబడు గొప్ప రొమాంటిక్ చిత్రం/కథ //
******************************************************************
అతడు అతడే 
ఆమె ఆమే 
అవును వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు 
కానీ ఆమె తండ్రి, అతడి తల్లి వారి ప్రేమను ఒప్పుకోలేదు. 
అయినప్పటికీ ప్రేమకు ధైర్యం ఎక్కువ కాబట్టి, వారు రహస్యంగా, కరోనా నిబంధనలకు అనుగుణంగా భౌతిక దూరం పాటిస్తూ కలుసుకునేవారు. 
ఒకరోజు ఆమె ఒక చిన్న కోరిక కోరింది  

ఆమె: ఏమోయ్ నన్ను అంతగా ప్రేమిస్తున్నానంటావు కదా, నా మీద ఏదైనా కవితలాంటిది రాయొచ్చుగా

అతడు: నీ పరోక్షంలో విరహంతో నిశ్శబ్దమవుతాను, నీ సమక్షంలో స్వాంతన పొందుతూ ప్రేమను అనుభవిస్తాను. ఇక రాయడానికి ఏం మిగిలుంటాను?

ఆమె: ఈ మాటలకేం తక్కువలేదులే, ప్లీజ్ రా ఏదైనా కనీసం ఒక డైలాగు లాంటిది

అతడు: తప్పదంటావా

ఆమె: ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ ... (ఇక్కడ సెన్సార్ నిబంధనలకు అనుగుణంగా వారి ముద్దును కవర్ చేస్తూ పూవులు ఊపబడతాయి)

అతడు: సరే ... అయితే ఇదిగో ఇది నీ కోసమే - "మదీయ మది తమరి తలపులతో తన్మయమందుచున్నది సుకుమారలావణ్యలతాతన్వి సమానిత సుందరీ మా హృదయేశ్వరీ. ఏమీ ఏమేమీ ఆ సౌందర్యము ... పెనుగాలికి వణుకు వటవృక్షమువలె తమకంతో అదురుతున్న ఆ ఆధరములు; అహో పున్నమి శశిని నిశిన దాగుకొనులటుల చేయు ఆ వర్చస్సు; హిమవత్పర్వతసమానిత కుచోన్నతములు; పరవశమున పరిపరివిధముల పరుగులిడు సెలయేరున కలియదిరుగు సుగిగుండమువలె అలరారు నాభీ సౌందర్యము ... ఆగు ఆగు అంతటితో యని వారించునటుల ప్రణయాగ్ని శరములను సంధించు ఆ మీనముల వంటి నేత్రములు అహో సుందరీ ఏమీ ఏమేమీ మీ సమక్షమున మా మది కుదురుగానుండక పరిష్వఅంగనమునకై పరిపరివిధముల పరితపించుచున్నదే ... నీవు రగిలించిన ఈ ప్రణయాగ్నిని నీ పరిష్వఅంగమున సరససల్లాపములతో సేదదీర్చుము సుందరీ"

ఆమె:

--- సెన్సార్ నిబంధనల మేరకు తదనంతర సంభాషణలను బీప్ శబ్దములతోనూ, సన్నివేశములను పువ్వులతో కవర్ చేయబడతాయి అని గమనించగలరు ---

కట్ చేస్తే కళ్ళు తిరిగి పడిపోయిన ఆమెను అతడు హాస్పిటల్ కు తీసుకెళతాడు. అక్కడ డాక్టర్ ఆమె నెల తప్పిందని చెప్తాడు. అపుడు పరువు కోసం ఆమె తండ్రి, డబ్బు కోసం అతడి తల్లి వాళ్ళిద్దరికీ పెళ్ళి చేస్తారు. 

వాళ్ళు ఊటీకి (బడ్జెట్ పరిమితులు మరియు కరోనా నిబంధనల కారణంగా స్విట్జర్లాండ్ లొకేషన్ సాధ్యం కాదు కాబట్టి) మనం ఇంకో పోస్ట్ కి ... అంతే 

*** శుభం ***

Comments

  1. Ha Ha . The poetry is similar to bony Nani అక్షర అరణ్యం.

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

... మూడో కూటమి

... కరోనా కంటే ఎక్కువగా భయపెడుతున్న అంశం?

... 2019 ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు - జనసేన