Posts

Showing posts from April, 2021

... ఏమంటారో? ఏమనుకుంటారో?

వంశీ కలుగోట్ల // ... ఏమంటారో? ఏమనుకుంటారో? // ****************************** ***************             నేను చిన్నపుడు, బహుశా దాదాపు 8 సంవత్సరాల వయసున్నపుడు అనుకుంటా ఒకరోజు పేపర్ లో ఒక వార్త చూశాను - నందికొట్కూరులో ఎవరో చెత్తకుండీలో పడేసిన పసికందును కుక్కలు పీక్కుతిన్నాయన్నది ఆ వార్త. చాలా హృదయవిదారకమైనది, కదిలించివేసింది ఆ వార్త. అది చూసిన చాలారోజుల వరకూ ఏదో తెలియని బాధ వెంటాడుతూనే ఉండేది. వివాహేతర లేదా వివాహానికి పూర్వమే ప్రేమ పేరుతొ వంచించబడిన మహిళ, సమాజానికి/కట్టుబాట్లకు భయపడి ఆ బిడ్డను వదిలించుకుందేమో బహుశా. చాలా చాలా బాధతో పాటు, ఆలోచనకూ కారణమైంది. అటువంటివి జరగకుండా ఉండాలంటే ఏమి చేస్తే బావుంటుంది అన్న ఆలోచన మొదలైంది. చదువు కొంతవరకూ మేలేమో అనిపించింది, అంటే చదువుకుంటే అవగాహన వస్తుంది అనే ఉద్దేశంతో.             అయితే ఇపుడు కూడా జరుగుతున్న పలు ఘటనలు చూసిన/చదివిన తరువాత చదువు ప్రభావం ప్రస్నార్ధకమే అని అనిపిస్తోంది. సమాజం/కట్టుబాట్ల పట్ల ఉన్న విపరీత భయమే అటువంటి ఘటనలకు కారణం కావచ్చు. ఎవరో ఏమో అనుకుంటారని, తమను తాము అణచేసుకుంటూ, చంపేసుకుంటూ బతుకీడుస్తున్న వాళ్ళను నా అనుకునే వాళ్ళలో కూ

... మూడో కూటమి

వంశీ వ్యూ పాయింట్ // ... మూడో కూటమి // **************************************             తెలంగాణాలో ఎన్నికలు వచ్చినపుడు కెసిఆర్ గారు జాతీయ స్థాయిలో మోదీకి వ్యతిరేకంగా మూడో కూటమి ఆలోచనలు చేశారు, అనేకమందిని కలిశారు. ఎన్నికల అనంతరం ఆ కూటమి ఏమైందో తెలియదు. ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు వచ్చినపుడు చంద్రబాబు నాయుడు గారు మోదీకి వ్యతిరేకంగా విస్తృతస్థాయిలో ప్రచారం చేశారు, అనేకమంది ప్రాంతీయ నాయకులను కలిసి కలిసి, కొత్త కూటమి కోసం విశ్వప్రయత్నాలు చేశారు. అయితే ఎన్నికల అనంతరం ఆయన చరిత్రలో ఎరుగని ఓటమితో కుదేలయ్యారు. మోదీ మాట్లాడటానికి  కూడా సాహసించటం లేదు.  పశ్చిమ బెంగాల్ లో ఎన్నికలు జరుగుతున్నాయి - దీదీ దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందని, మూడో కూటమి ఏర్పడవలసిన అవసరం ఉందని అనేకమంది ప్రాంతీయ నాయకులకు ఉత్తరాలు రాశారు. కొత్త కూటమికి ప్రయత్నాలు చేస్తున్నారు.             వీళ్ళంతా తమకు కాసింత సెగ తగలగానే ఎగిరెగిరిపడి, ఆ తరువాత నిమ్మకుంటున్నారు. కారణాలు, అవసరాలు ఏవైనా ఒక్క కాంగ్రెస్ మినహాయించి వేరే ఏ పార్టీ కూడా మోదీకి వ్యతిరేకంగా స్థిరంగా పోరాడటం లేదు. కాంగ్రెస్ కు శక్తి సరిపోవడం లేదు, మిగతావారు ఎందుచేతనో