Posts

Showing posts from July, 2019

... ప్రస్తుత అసెంబ్లీలో ప్రతిపక్షాల తీరు

వంశీ వ్యూ పాయింట్ // ... ప్రస్తుత అసెంబ్లీలో ప్రతిపక్షాల తీరు // ********************************************************** తెదేపా                అవమానాల్ని, ఓటముల్ని తట్టుకోవటం తెదేపాకు, చంద్రబాబు గారికి అలవాటే. తట్టుకుని నిలబడ్డారు కాబట్టే, నేను అత్యంత సీనియర్ ని అని చెప్పుకోగలిగే స్థాయిని సంపాదించుకుని నిలబడ్డారు. ఈ ఓటమికంటే, ఈ శతృవు చేతిలో ఓటమి ఆయనను ఎక్కువగా ఆబాధిస్తున్నట్టుంది. అయినా అదంతా పక్కనబెట్టి, సభలో చక్కగానే వ్యవహరిస్తున్నారు. మరీ గొప్పగా అని చెప్పలేం కానీ, గత అయిదేళ్లతో పోల్చితే ఇపుడు వ్యవహరిస్తున్న తీరు బెటర్ అని చెప్పవచ్చు.తెదేపా అభిమానులను బాధిస్తున్న అంశం ఏంటంటే పార్టీ నాయకుల తీరు. గెలిచినా 23 మంది అయినా గట్టిగా పోరాడుతున్నారా అంటే లేదు, భాజపా తమతో 18 మంది టచ్ లో ఉన్నారు అన్నా కూడా ఎవరూ స్పందించటం లేదు. అంతేకాక సభలో చంద్రబాబు గారు, అచ్చెన్నాయుడు, బుచ్చయ్య గారు, అప్పుడప్పుడు పయ్యావుల కేశవ్ మినహా మిగతావారు పెద్దగా నోరు మెదపట్లేదు. వారు భయపడుతున్నారా లేక పార్టీ వీడటానికి మంత్రాంగం నడుపుతున్నారా అన్నది చెప్పలేకపోయినప్పటికీ వారి మౌనం మాత్రం పార్టీ అభిమానులతో సహా బాబుగారిని …

... కత్తిమీద సాము చేస్తున్న జగన్

వంశీ వ్యూ పాయింట్ // ... కత్తిమీద సాము చేస్తున్న జగన్ // ********************************************************             ఇపుడు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న పరిస్థితులకు కారణమెవరు అన్నది పెద్ద ప్రశ్న కాదేమో - రాజకీయ గెలుపోటములు నేర నిర్ధారణలు కాకపోయినా ప్రజల అభిప్రాయాన్ని ఆవిష్కరిస్తాయి. ప్రజలు బలంగా నమ్మారు కాబట్టే ఒకరు ఘోర ఓటమితో అవమానభారాన్ని ఎదుర్కొనగా, ఊహించని విజయాన్ని పొందిన మరొకరు అధికారపీఠం ఎక్కారు. పరిస్థితులకు కారణం ఎవరైనా సరే, ముందు పరిస్థితులు చక్కదిద్దబడాలి. వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టాలి. అదే సమయంలో గత ప్రభుత్వపు మితిమీరిన అవినీతిని తవ్వి తీయాల్సిందే. ఎందుకంటే ఇపుడు ఉన్న పరిస్థితుల దృష్ట్యా కొన్ని పనులు సాధ్యపడవు, కొన్ని చోట్ల అప్పులు పుట్టవు, కేంద్ర ప్రభుత్వం పాత ప్రభుత్వపు ఖర్చుల లెక్కలు అడుగుతోంది - అవి సమీకరించటానిక్ ఇసయం పట్టవచ్చు - అంతవరకూ కేంద్రం అదనపు నిధులు ఇవ్వకపోవచ్చు. ఇందుకు కారణం ఖచ్చితంగా గత ప్రభుత్వమే కదా, మరి వారిని ప్రజల ముందు దోషిగా నిలబెట్టాల్సిందే. ఇపుడున్న పరిస్థితుల్లో ఇపుడు ప్రాధాన్యత క్రమం ఏది అని చెప్పటం బహు క్లిష్టమైన అంశం - అదుపు తప్పిన వ్యవస్థలను…

... ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు

వంశీ వ్యూ పాయింట్ // ... ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు // ************************************************************             సాధారణంగా శాసనసభ సమావేశాలు వంటివి చూడను, వాటి గురించి వార్తాపత్రికలలో చదువుతాను. 2019 ఎన్నికల తరువాత కొంత ఆసక్తి కలిగింది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఒక ఘోర ఓటమి తరువాత ఎలా వ్యవహరిస్తారు, ఊహించనంతటి విజయాన్ని సొంతం చేసుకున్న జగన్ గారు ఎలా వ్యవహరిస్తారు అని ఆసక్తి కలిగింది. ముఖ్యంగా ఇంతకాలం వైరివర్గ ప్రోద్బలిత కష్టాలు అనేకం ఎదుర్కొన్న జగన్ గారు, ఈ విజయం తరువాత సహనంతో ఉండే తన తీరును అలానే ఉంచుకోగలరా అనే సంశయం కలిగింది. అదే సమయంలో అనేక దిగ్గజాలను ఎదుర్కొని నిలబడిన చంద్రబాబు గారు ఇపుడు దాదాపు తన అనుభవమంత వయసున్న జగన్ గారిని సభలో ఎలా ఎదుర్కొంటారు అని కూడా ఆసక్తి కలిగింది. ఇపుడు శాసనసభ సమావేశాలు చూస్తోంటే "ఇలాంటి శాసనసభ సమావేశాలు ఇలా చూసి ఎన్నేళ్ళయింది?" అని అనిపిస్తోంది ... 
నేను గమనించిన కొన్ని అంశాలు  - ముందుగా సభాపతి స్థానంలో ఉన్న తమ్మినేని సీతారాం గారి గురించి చెప్పుకోవాలి. నేను సీరియస్ గా రాజకీయాలను గమనించటం మొదలుపెట్టినప్పటి నుండి ఇప్పటివరకూ సభన…