Posts

Showing posts from June, 2016

అవీ ... ఇవీ అనబడు సాంబడి అనుమానాలు

వంశీ కలుగోట్ల // అవీ ... ఇవీ అనబడు సాంబడి అనుమానాలు // ****************************** ****************************** ************* 1. ఓహ్ వ్వావ్ అద్భుతం, ఆశ్చర్యం, పరమాద్భుతం - మీడియా అనగా అదేనండీ పచ్చమీడియా లేదా ఆ రెండు పత్రికలు గత కొద్దిరోజులుగా పాటించిన స్వీయ నియంత్రణ గురించి చెబుతున్నాను. ముద్రగడ కాపు రేజర్వేషన్స్ ఉద్యమం విషయంలో ఆ రెండు పత్రికలు పాటించిన స్వీయ నియంత్రణ అత్యంత ఆశ్చర్యకరమైన అద్భుతమైన పరమ వ్వావ్ అన్నమాట. ఇంతటి జ్ఞానమే కనుక వారికి ఎన్నికల ప్రచార సమయంలో కలిగి ఉంటే ఆ సమయంలో బాబు గారు నోటికి అదుపు లేకుండా, విలేఖరుల చేతులు నొప్పెట్టేలా రాసుకునేంతటి లిస్ట్ లో హామీలు గుప్పించిన సమయాన ఈ నియంత్రణ పాటించి ఉంటే అసలు అలాంటి హామీ అంటూ ఒకటి ఇచ్చాడని కాపు జనాలకు తెలిసేది కాదు కదా. ఓ అలా అయితే ఆయన అధికారంలోకి ఎలా వస్తాడనే భయం కాబోలు.  2. మేధావులు వచ్చారండీ - ముద్రగడకు కొన్ని ప్రశ్నలు అంటూ తెగ పోస్టుతున్నారు. అయ్యలూ అదేదో బాబు గారికి కూడా సంధించొచ్చుగా తవరి ప్రశ్నలు. అసలు ఇంతటికీ మూలకారణం ఆయనగారి హామీలే కదా. ఆ హామీల చిట్టా తీసి ప్రశ్నలు సాధించండి. ఊహూ అలా చేస్తే తవరందరూ మేధావు

ఇంతకీ నేను సెప్పోచ్చేదేమిటంటే ... 'అ ఆ' సినిమా గురించి

వంశీ కలుగోట్ల// ఇంతకీ నేను సెప్పోచ్చేదేమిటంటే ... 'అ ఆ' సినిమా గురించి // ****************************** ****************************** *****************************        విడుదలై, విజయదుందుభి మోగిస్తున్న 'అ ఆ' సినిమాను ఇన్నాళ్ళకి చూడటం తటస్థించింది. సినిమా ఎలా వుంది అనేది ఇప్పటికే తీర్మానించేసి, ఇతర వేరే చూడదగ్గ సినేమాలేమీ కూడా లేకపోవడంతో ప్రేక్షకులు తమ అభిమానధన వర్షాన్ని 'అ ఆ' పై కురిపిస్తున్నారు. తనకు అడ్డు చెప్పే గొప్ప తారలు లేకపోవడం త్రివిక్రమ్ కి బాగా కలిసివచ్చింది. ఇక నా తరహా పోస్ట్ మార్టం చేసుకుందాం :)  కథ: ఇప్పటికే విశ్లేషకులు, వంకలు వెతికేవారు, గతం గుర్తున్నవారు అందరూ కలిసి త్రివిక్రమ్ యధ్ధనపూడి గారి 'మీనా' నవలను, అదే పేరుతో తెరకెక్కిన సినిమాను ఫ్రీమేక్ చెసేశాడని తీర్మానించారు కాబట్టి ఆ విషయం కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. కానీ, ప్రస్తుతం నడుస్తున్న ఫార్ములా తరహా కుటుంబకథా చిత్రాల మధ్య ఈ సినిమా తన ప్రత్యేకతను నిలుపుకుంది. పరిస్థితులనే ప్రతినాయకులుగా మలచటంలో (సినిమాలలో) ఈతరం దర్శకులలో త్రివిక్రమ్ ను మించినవారు లేరు అని నా అభిప్రాయం. అ

ముసుగులేని పత్రిక ...

వంశీ కలుగోట్ల// ముసుగులేని పత్రిక ... // ****************************************           ఇప్పుడు సాక్షి తీరుపై విమర్శలు చేస్తున్నవారు గమనించవలసిన ఒక విషయం ఏంటంటే అసలు సాక్షి పుట్టుక అనేదే మిగతా మాధ్యమాల ఒంటెద్దుపోకడలు, ఒక వర్గానికే కొమ్ముకాయడం కారణం అనేది. ఇప్పుడు సాక్షి కాకపొతే మరోటి పుట్టుకువస్తుంది. ప్రధానంగా అత్యంత ఆదరణ కలిగి ప్రజలదగ్గరకి చేరుతుండిన ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికల ఈ ధోరణి ఒక్కప్పుడు 'వార్త' దినపత్రిక పుట్టుకకు కారణమయ్యింది. కానీ, వివిధ కారణాల వల్ల వార్త దినపత్రిక ఆరంభంలో లభించిన ఆదరణను నిలబెట్టుకోలేకపోయింది. ఆ తరువాత ఆ రెండు పత్రికల ధోరణి మరింత పెచ్చుమీరి చివరకు 'సాక్షి' పుట్టుకకు కారణమయ్యింది. ఒక విషయం మాత్రం నిజం పుట్టుకనుండీ కూడా 'సాక్షి'కి ముసుగులు లేవు. వారి గొంతుక వినిపించాలనే ధ్యేయంతోనే సాక్షి ప్రారంభించారని అందరికీ తెలుసు. అంతేకానీ, మిగతా పత్రికలలాగా ప్రజల పక్షం అని ముసుగేసుకుని ఒక వర్గానికి కొమ్ముకాయడం అనే ముసుగేసుకోలేదు. అంతేకాదు పత్రికపై ఉన్న ఫోటో వారి తీరును ఎటువంటి ముసుగూ లేకుండా చూపుతుంది. అంటే మేమిది, మా రాత తీరిది, మేం చె

పత్రికలూ ... స్వేచ్చ: పత్రికాస్వేచ్చ

వంశీ కలుగోట్ల// పత్రికలూ ... స్వేచ్చ: పత్రికాస్వేచ్చ // *************************************************************        గతంలో అంటే కొద్ది సంవత్సరాల క్రితం ఆ ఆ అదే 2014 ఎన్నికలకంటే ముందు అన్నమాట ఆ కాలానికి వెళితే అప్పట్లో పేర్లెందుకు గాని ఆ రెండు పత్రికలలో ఇప్పటి ప్రతిపక్ష నేత జగన్ గురించి 'లక్ష కోట్లు, అంతకు రెండు రెట్లు మూడు కాదు కాదు పది రెట్లు అంటూ పదారు లక్షల కోట్లు అంటూ పరిశోధనాత్మక వ్యాసాలు రాసి పడేశాయి. ఆపైన లెక్కలు తెలియక ఆగిపోయారేమో మరి. కానీ, అధికారికంగా సిబిఐ వారు దాఖలు చేసిన పదికి మించిన ఛార్జ్ షీట్ లలో ఇంచుమించి పదహారు వేల కోట్లు అంటూ తేల్చారు. అందులో సగానికి పైగా కొట్టివేయబడ్డవి. మరి ఆ లెక్క ప్రకారం చూస్తే ఆ రెండు పత్రికలూ అసత్యాలను బల్లగుద్ది మరీ నిజాలు అన్నట్టు విపరీత ప్రచారం చేశారు, పేజీలకొద్దీ పరిశోధనాత్మక వ్యాసాల పేరుతో రోజుల/వారాల/నెలల తరబడి అసత్యాలను ప్రచారం చేశారని అనవచ్చు. ఆ కారణాలు చూపి ప్రభుత్వం ఆ పత్రికలను స్వాధీనం ఎందుకు స్వాధీనం చేసుకోకూడదు. అయినా ఇదంతా ఇప్పుడు ఎందుకు అంటే ఏదో జగన్ పుణ్యాత్ముడు, అవినీతి మకిలి అంటని మహానుభావుడు అని చెప్పాలని కా

ప్రాంతాలూ ... సాంప్రదాయాలూ

ప్రాంతాలూ ... సాంప్రదాయాలూ ****************************** ** ఇంగ్లీష్ వాడు హెల్లో అంటాడు  స్పానిష్ వాడు ఓలా/హొలా అంటాడు  తమిళుడు వణక్కం అంటాడు  కన్నడిగుడు నమస్కారవరె అంటాడు  తెలుగువాడు నమస్కారం అంటాడు         సాంప్రదాయం అంటే ఎదుటివారిని ఎలా గౌరవించాలో నేర్పించేది. అంతే కానీ, ఎదుటివాడిని ఎలా తిట్టాలో నేర్పించేది కాదు. మర్యాదపూర్వకంగా ఎలా ఉండాలో చెప్పేదే కానీ అమర్యాదపూర్వకంగా ఉండమని చెప్పేది సాంప్రదాయం కాదు. మనకు నచ్చినా, నచ్చకపోయినా కొన్ని ప్రాంతాల్లో సాంప్రదాయాలు వేరేలా ఉంటాయి. ఉదాహరణకు కొన్ని దేశాల్లో ముక్కూ, ముక్కూ రాసుకుంటారు; కొన్ని దేశాల్లో ఆలింగనం చేసుకున్తారు; కొన్ని ప్రాంతాల్లో కరచాలనం చేసుకుంటారు; కొన్ని ప్రాంతాల్లో చెంప/బుగ్గ మీద ముద్దు పెట్టుకుంటారు. మన సాంప్రదాయం అలా చెప్పలేదు కాబట్టి అది తప్పు అనకూడదు.         కానీ, ఇప్పుడు ఎవరో ఒకరు కాస్త జనం గుర్తించగలిగే స్థాయి ఉన్న నాయకుడు వచ్చి ఆవేశంలోనో, అవసరార్థమో, ఆపుకోలేకనో నోటికొచ్చినదంతా వాగేసి ఎవరన్నా ఏమన్నా అంటే మా ప్రాంతంలో అంతే అంటున్నారు. ఏ ప్రాంత సంప్రదాయమూ ఎదుటివాడిని కొట్టమని కానీ, తిట్టమని