Posts

Showing posts from January, 2020

... కొత్తవంట

వంశీ కలుగోట్ల // ... కొత్తవంట // *****************************           అప్పుడప్పుడూ మనమూ గరిట పడతామండోయ్, మరీ నలభీమపాకం అని కాకపోయినా తినబుల్ గా ఉండే స్థాయిలో వండుతాం అనుకోండి. అయినా మానవన్నీ కొన్ని ఫిక్స్డ్ ఐటమ్స్, అవి దాటి చెయ్యం - అంటే ఏదో సాంబార్, రసం, పప్పు, వేపుళ్ళు, కొన్ని టిఫిన్ ఐటమ్స్ అన్నమాట. మొన్నీమధ్య అలానే ఒకసారి సాంబార్, వేపుడు చేశాను చాలా రోజుల తరువాత. అందరూ తినడం మొదలెట్టినప్పటినుండి, ఇక 'ఎలా ఉంది?' అని అడగటం మొదలెట్టాను. బావుంది, బావుంది అని చెప్పి చివరకు విసుగొచ్చి 'ఏరా అక్కడికి నువ్వేదో నవకాయ పిండివంటలు కొత్తగా చేసినట్టు అలా ఆడుతావేంటి? చేసింది అదే సాంబార్, ఆలుగడ్డ వేపుడు అంతే కదా. ఎప్పటిలానే ఉన్నాయి' అన్నారు. 'అదేంటి నేను ఎప్పటిలా ఎంటీఆర్ సాంబార్ పొడి కాకుండా, ఆచి సాంబార్ పొడి; ఎంటీఆర్ కారంపొడి కాకుండా ఆశీర్వాద్ కారంపొడి వాడానే' అన్నాను. 'అరేయ్ ఎదవ సాంబార్ పొడి, కారంపొడి బ్రాండ్స్ మారిస్తే పెద్ద కొత్త వంట చేసినట్టా? నువ్వూ, నీ వెధవ బిల్డ్ అప్పూనూ' అనలేదు కానీ, అదే ఫీలింగ్ తో ఒక లుక్ ఇచ్చి, తినడం ముగించారు.  *             మ

... ఓ సినిమా కథ - పార్ట్ 1

వంశీ కలుగోట్ల // ... ఓ సినిమా కథ - పార్ట్ 1// *************************************** (బొక్కలెతక్కుండా ఎంజాయ్ చెయ్యండి)             బాహుబలి మాతృ పెనిమిటి లాంటి సినిమాల రికార్డులు కూడా బద్దలు కొట్టగలిగే సినిమా కథ - ఎవరైనా ఫ్రీగా వాడుకోవచ్చు లేదా నా పేరు వేసుకొని మరీ వాడుకోవచ్చు.              హీరో ఒక తోపు, కానీ తాను తోపు అన్న సంగతి తెలియకుండా కాశ్మీర్ లో కూలీగా పని చేస్తుంటాడు. ఇక్కడ కూలీలతో ఒక సాంగ్. అలాగే కూలీలను బెదిరించటానికొచ్చిన ఉగ్రవాదులతో ఒక ఫైట్. అలా పగలు కాశ్మీర్ లో కూలీగా చేస్తూ, రాత్రి ఢిల్లీలో ఏదో విషయం మీద ఇఇన్వెస్టిగేషన్ చేస్తుంటాడు. సినిమాల్లో అది సాధ్యమే కాబట్టి, ఎలా అని అడక్కండి. హీరోయిన్ కూడా ఢిల్లీలోనే ఉంటుంది - ఆమె ఒకరోజు రాత్రి బాగా తాగి, రోడ్డు మీద పడిపోతే, అదే రోడ్డున పోతూ ఆమెను తీసికెళ్ళి తన రూమ్ లో పాడుకోబెడతాడు. హీరో ఔదార్యానికి హీరోయిన్ పడిపోతుంది. ఇక్కడ స్విట్జర్లాండ్ లొకేషన్స్ లో ఒక సాంగ్. తరువాత కట్ చేస్తే హీరో ఫోటో పట్టుకుని ఆంధ్రా/తెలంగాణాలో కొంతమంది సుమోలేసుకుని వెతుకుతుంటారు.              ముఖ్యమంత్రి మాత్రం తప్పిపోయిన (పారిపోయిన అనుకోండి) 

... పల్లెటూరోళ్ళు

వంశీ కలుగోట్ల // ... పల్లెటూరోళ్ళు // *******************************             నేను పుట్టి, పెరిగింది అంతా ఒక మారుమూల పల్లెటూరు. ఇపుడు బెంగళూరులో ఉంటున్నాను. కొన్ని రోజుల క్రితం అమ్మను హాస్పిటల్ లో చేర్చినపుడు ఒక రోజు అక్కడే ఉండాల్సి వచ్చింది. జనరల్ గా చాలా హాస్పిటల్స్ లో కొన్ని సెక్షన్స్ లో  పేషెంట్స్ ఉండే ప్రదేశానికి వెళ్ళేప్పుడు అంటే వార్డ్స్ లోకి వెళ్ళేప్పుడు చెప్పులు తీసి వెళ్ళమని చెపుతుంటారు, చెప్పులతో లోపలకు పంపడం ఉండదు. అక్కడ ఆ సెక్షన్స్ లోకి కూడా చెప్పులతో పంపడం లేదు. నేను ఫస్ట్ టైం వెళ్ళినపుడు సెక్యూరిటీ గార్డ్ చెప్పాడు, నేను పాటించాను. కాసేపయ్యాక ఇంకో పేషెంట్ ఎవరినో తీసుకువచ్చారు. పేషెంట్ ను లోపలకు తీసుకెళ్ళిన కాసేపటికి ఆ పేషెంట్ సంబంధీకులు ఇద్దరు మగవారు వచ్చారు, ఇద్దరూ దాదాపు 40  + వయసువారే. వారు సెక్యూరిటీ గార్డ్ తో గొడవ పెట్టుకున్నారు - కారణం ఏంటంటే సెక్యూరిటీ గార్డ్ చెప్పులు వేసుకుని వెళ్ళటానికి వాళ్ళను అనుమతించటం లేదు, వాళ్ళేమో చల్లగా ఉంది చెప్పుల్లేకుండా ఎలా వెళతాం అంటున్నారు. అక్కడికి నేను కూడా చెప్పాను, 'అయ్యా అక్కడ పేషెంట్స్ కు ఇబ్బంది అవుతుంది, ఇన్ఫెక్