... పవర్ స్టార్ - పార్ట్ 1 (నో పాలిటిక్స్)
వంశీ కలుగోట్ల // ... పవర్ స్టార్ - పార్ట్ 1 (నో పాలిటిక్స్) //
**************************************************
1996 లో నేను కర్నూలులో ఇంటర్మీడియేట్ చదువుతున్నాను, నేను హాస్టల్ లో ఉండేవాడిని. మా కాలేజీ సిటీకి దూరంగా, నందికొట్కూరు రోడ్ లో ఉండేది. ప్రతి ఆదివారం హాస్టల్ లో ఉండే అందరినీ కాలేజీ బస్సులు సిటీ సెంటర్ లో డ్రాప్ చేసి, మళ్ళీ సాయంకాలం హాస్టల్ కి తీసుకెళ్ళేవి. నాకు బాగా గుర్తు ... అప్పట్లో కొన్ని పోస్టర్స్ వచ్చాయి 'ఎవరీ అబ్బాయి' అంటూ. ఈవీవీ సత్యనారాయణ సినిమా అని తెలుసు, కానీ హీరో ఎవరో అర్థం కాలేదు. కొన్నాళ్ళకు తెలిసింది ఆ సినిమాలో హీరో మెగాస్టార్ చిరంజీవి చిన్న తమ్ముడు కళ్యాణ్ బాబు అని. అప్పటికి దాదాపు రెండు మూడేళ్ళ నుండి చిరంజీవికి సరైన హిట్ పడక, 1996 లో అప్పటివరకూ చిరంజీవి సినిమా లేక చిరంజీవి అభిమానులు డీలాగా ఉన్న సమయం అది. ఆ సమయంలో చిరంజీవి తమ్ముడి సినిమా ఖచ్చితంగా హిట్ అవ్వాల్సిందే కదా. సినిమా రిలీజ్ అయింది, ఫుల్ హంగామా. సినిమా చూశాక మొదట అనుకున్నది డాన్సుల్లో చిరంజీవి పేరు సెడగొట్టేట్టు ఉన్నాడు కదరా అని, ఇక నటన గురించి అంటారా 'ఆ వచ్చేస్తాదిలే, ఇది ఇంకా ఫస్ట్ సినిమానే కదా' అని అనుకున్నాం.
ఆ తర్వాత ఆ సినెమాలో చేసిన కొన్ని ఫీట్స్ అంతా టెక్నిక్స్ అని అన్నారని, ట్యాంక్ బండ్ దగ్గర అనుకుంటా ప్రదర్శన ఏర్పాటు చేశారు. సినిమాలో చేసిన ఫీట్స్ అక్కడ చేసి, తన మార్షల్ ఆర్ట్స్ గురువు చేతుల మీదుగా ప్రశంసతో పాటు 'పవన్' అనే బిరుదు పొందాడు. అప్పటినుండి కళ్యాణ్ బాబు కాస్త పవన్ కళ్యాణ్ అయ్యాడు. ఆంజనేయస్వామి పేరు లేకనే మొదటి సినిమా దెబ్బ తినింది, (ఆశించినంత బ్రేక్ రాలేదు) అదే కారణం చేత పెద్దతమ్ముడు నాగబాబు హీరోగా సక్సెస్ కాలేకపోయాడు అని చిరంజీవి కన్విన్స్ కావడంతో ఆ కార్యక్రమమంతా కేవలం కళ్యాణ్ బాబు పేరు ముందు ఆంజనేయస్వామి పేరైన ఆ 'పవన్' చేర్చడానికి అని చదివాను. అప్పట్లో 'తార సితార' అని ఒక ఫిలిం మ్యాగజిన్ వచ్చేది, అందులో ఇలాంటి ఫన్నీఅట్రాక్టీవ్ గాసిప్స్ వచ్చేవి, భలే ఉండేవి అవన్నీ నమ్మబుల్ గా ఉండేవి. ఆంజనేయస్వామి పేరు చేర్చడానికి అన్నది ఎంత నిజమో తెలియదు కానీ, పేరులో 'పవన్' వచ్చాక కళ్యాణ్ గ్రాఫ్ మారిపోయింది. గోకులంలో సీత, సుస్వాగతం హిట్ అయ్యాయి. కానీ పవన్ కళ్యాణ్ మార్క్ అంటూ ఏమీ లేదు, జస్ట్ హిట్ సినిమాలు అంతే. తరువాత వచ్చింది 'తొలిప్రేమ', ఒక కల్ట్ హిట్ అది. ఆ సినిమాతో మొదలైన పవన్ మానియా, ఖుషీ సినిమాతో పీక్స్ కో పోయింది. ముఖ్యంగా సినిమాల్లో విషయం కంటే పవన్ స్టైల్, వెరైటీ స్టంట్ కోరియోగ్రఫీ, కొత్త తరహా సంగీతం (పాశ్చాత్య సంగీతం నుండి కాపీ అనేది అప్పట్లో తెలీదు) వంటివి పవన్ ని ఒక ఐకాన్ చేశాయి.
మరొక విషయం ఏంటంటే పవన్ సినిమాల కంటే, పవన్ ఒక వ్యక్తిగా ఆకట్టుకోవడం ఎక్కువైంది. అపుడైనా, ఇపుడైనా పవన్ గొప్ప పాత్రలు ఏమీ పోషించలేదు అలాగే గొప్ప నటుడు అని చెప్పుకునే పాత్రలు చేయలేదు. ఆ విషయం పవన్ డైరెక్ట్ గా ఒప్పుకునేవాడు. పవన్ మాట్లాడ్డమే తక్కువ, ఆ అతి తక్కువ ఇంటర్వూస్ భలే ఉండేవి. 'నేను అన్నయ్యంత గొప్ప డాన్సర్ ను కాదు, నాకు డాన్స్ సరిగా రాదు, నేనేం గొప్ప నటుడిని కాదు నాకు వచ్చింది చేయగలిగిన పాత్రలు మాత్రమే చేస్తున్నాను, చిరంజీవి గారిలా చెయ్యడానికి నేనెందుకు ఆయనే ఉన్నారుగా' ... ఇలాంటి సమాధానాలు భలే ఉండేవి. నులక మంచం మీద కూచొని, గార్డెనింగ్ చేస్తూ ఇలా ఫొటోస్ కూడా మిగతా అందరిలో పవన్ ను ప్రత్యేకంగా నిలిపాయి. పవన్ సాయం చేసే గుణం గురించి పావలా శ్యామల వంటివారు చెప్పినవి కొన్ని, వార్తల్లో వచ్చినవి కొన్ని ... పవన్ పట్ల అభిమానాన్ని పెంచుతూనే ఉండేవి. మొదటి భార్యతో విడాకులు, రేణు దేశాయ్ తో సహజీవనం వంటివి కూడా పెద్దగా పట్టించుకోదగ్గవిగా కనబడలేదు. పవన్ సినిమాల కంటే అతడి తీరు ఎక్కువమందిని ఆకట్టుకుంది అని చెప్పవచ్చు. సినిమాలకు అతీతంగా అతడి ఇమేజ్ పెరిగింది అందుకే అని నా అభిప్రాయం. చిరంజీవి అంత అని చెప్పను కానీ, పవన్ అంటే కూడా విపరీతమైన అభిమానం (సినిమాల వరకూ).

(పార్ట్ 2 లో మరికొంత)
Comments
Post a Comment