Posts

... నన్ను కాదు, దమ్ముంటే వాడిని కొట్టు

వంశీ కలుగోట్ల // ... నన్ను కాదు, దమ్ముంటే వాడిని కొట్టు // **************************************************           వెనకటికెవడో నన్ను కాదు, దమ్ముంటే వాడిని కొట్టు అన్నాడట, అలా ఉంది నేటి హిందూ సంఘాల వ్యవహారం. హిందూ ధర్మ సంప్రదాయాలను, ఆచారవ్యవహారాలను, దేవీదేవతలను మేధావి వర్గంగా ముద్రపడిన వారు తెగ విమర్శిస్తున్నారు. అది ఈనాడు కొత్తగా జరుగుతున్నది కాదు, దశాబ్దాలుగా జరుగుతున్నది. దాని వెనుక కారణాలు అన్వేషించే ఆలోచన కూడా ఇరువైపులవారికీ లేదు. స్వాతంత్రోద్యమ సమయంలో మహాత్మా గాంధీ ముందుగా అణగారిన వర్గాలను (అణచివేయబడిన వర్గాలు అనడం సరియైనది ఏమో) తన పోరాటంలో భాగం చేశాడు. వారు ప్రధానంగా ఎదుర్కుంటున్న అనేకానేక సమస్యలను ఎక్కడికక్కడ స్థానికంగా వీలైనంత పరిష్కారం లేదా సర్దుబాటు వంటివి చేసి అందరినీ స్వాతంత్ర్యోద్యమం దిశగా నడిపించాడు. (సరే ... గాంధీ ఉద్యమతీరు గురించి మరో వ్యాసంలో చెప్పుకుందాం.) అణగారిన/అణచివేతకు గురైన వర్గాలు అంటే ప్రధానంగా దళితులు, తదితరుల వెనుకబాటు తనానికి అగ్రవర్ణాల అణచివేత, బహిష్కరణ, తక్కువచేసి చూడటం వంటి అనేకానేక కారణాలు వారికి హిందూ ధర్మం పట్ల ద్వేషభావాన్ని పెంపొందించాయ…

వంశీ వ్యూ పాయింట్ - 'మహానటి'

వంశీ వ్యూ పాయింట్ - 'మహానటి' ************************************* సావిత్రి చరిత్ర పతనం కాలేదు  సావిత్రి పతనం చరిత్ర అయింది 
          'మహానటి' చిత్రంపై సమీక్ష లేదా నా అభిప్రాయం చెప్పే ముందుగా ఒక మాట - 'ఒక సినిమాపై సమీక్ష చేయబోయే ముందు, ముందుగా ఆ సినిమా రూపొందించిన వ్యక్తి ఉద్దేశం ఏమిటి?' అనేది మనం గ్రహించగలగాలి. రూపకర్త ముఖ్య ఉద్దేశం తెలుసుకోకుండా అలా ఉంది, ఇలా ఉంది అంటే అందులో అర్థం ఉండదు. ఒక శృంగార చిత్రం చూసి, అందులో భక్తి గీతాలు లేవు అంటే ఎలా ఉంటుంది? 'మహానటి' చిత్రం రూపొందించడంలో దర్శకుడు నాగ్ అశ్విన్ ముఖ్య ఉద్దేశం తెలుగు, తమిళ చిత్ర రంగాలలో (దక్షిణాది సినిమా రంగంలో అని చెప్పవచ్చు) 'మహానటి' గా పేరు పొందిన సావిత్రి గారి జీవితాన్ని తెరపై (కొన్ని పరిమితులకు లోబడి) ఆవిష్కరించడమే కానీ సమాజానికి సందేశం ఇవ్వడమో లేక వినోదాన్ని అందించడమో కాదు. నాగ్ అశ్విన్ ఆ విషయాన్ని అర్థం చేసుకొని, ఎక్కడా సందేశం లేదా వినోదం వంటివి జొప్పించకుండా సావిత్రిగారి జీవితాన్ని ఒక జర్నలిస్ట్ పరిశోధనగా చూపాడు. జర్నలిస్ట్ నేపథ్యాన్ని చూపటానికి కూడా 80ల నేపథ్యాన్ని ఎంచుకోవడం ఆ…

... కొన్ని క్షణాలు

వంశీ కలుగోట్ల // ... కొన్ని క్షణాలు // **********************************           దాచేపల్లిలో మైనర్ బాలికపై అత్యాచారం జరిగిన ఘటనలో నిందితుడు సుబ్బయ్య చనిపోయాడు - అది హత్యనా లేక స్వీయ మరణమా అన్నది విచారణలో తేలుతుంది. ఏదో ఒక రకంగాఅత్యధికులు అతడి మరణాన్ని కోరుకున్నవారే. మరిప్పుడు, అతడు చనిపోయాడు - ఎలా అయితేనేం అనుకోవట్లేదు లేదా చట్టం తనపని తను చేసుకుపోతుందని అనుకోవట్లేదు. ముందు అతడి చర్యను విమర్శించిన వారు, ఇపుడు అతడి మరణం రీతినివిమర్శిస్తున్నారు. అతడిని ఉరి తీయాలి, నరికెయ్యాలి అంటూ ఊగిపోయినవారు అతడి మరణంలో కుట్ర కోణాన్ని వెదుకుతున్నారు. ప్రతిదీ మనం చెప్పినట్టే జరగాలి, మన వేలికొసన ప్రపంచం నడవాలి అనే ఆలోచన తీరుకు ఆడో దర్పణం. (అయినా దాని గురించి మరొక వ్యాసంలో చర్చిద్దాం.)              ఈ ఘటనకు (ఇటువంటి ఇతర ఘటనలకు సంబంధించి) సంబంధించి పలువురి వ్యాఖ్యలు, వ్యాఖ్యానాలు, విశ్లేషణాత్మక వ్యాసాలు చదివాను. వాటన్నిటికంటే ఆలోచింపజేసిన ఒక విషయం/వాక్యం - దాచేపల్లి ఘటనలో నిందితుడు సుబ్బయ్య చివరిసారిగా తన బంధువులతో  కాల్ లో మాట్లాడాడు అని చెప్పబడిన ఒక వాక్యం '... అందరికీ మంచి చెప్పి బతికేవాడిని, కానీ అ…

...స్పందించకపోతే

వంశీ కలుగోట్ల // ...స్పందించకపోతే // **************************************           అవును మన తెలుగు సినీ నటులెవ్వరూ హోదా విషయంలో పోరాటానికి ముందుకు రావటం లేదు, ఇపుడే కాదు గతంలో తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా బహిరంగంగా మద్దతుగానో, వ్యతిరేకంగానో బయటపడినవారు అతి తక్కువ. ఇటువంటి ఘటన జరిగిన ప్రతిసారీ తమిళ నటులతో పోలిక వస్తుంటుంది. తమిళ నటీనటులు జల్లికట్టు విషయంలో కానీ, కావేరి జలవివాదం విషయంలో కానీ తమిళనాడు రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడిన తీరు నిజంగా ఆదర్శనీయమే అందులో ఎటువంటి సందేహమూ లేదు. కానీ, తెలుగు సినీ రంగానికి వస్తే అత్యంత కీలకమైన అంశమైన ప్రత్యేక హోదా విషయంలో కూడా ఎవరూ స్పందించడం లేదు. మొన్న మొన్నటివరకూ రాజ్యసభ సభ్యుడిగా ఉన్న చిరంజీవి; రాష్ట్ర శాసనసభ సభ్యుడిగా ఉన్న బాలకృష్ణ; ఇంకా చట్ట సభల్లో సభ్యులుగా ఉన్న మురళీమోహన్, శివప్రసాద్; విపరీతమైన ప్రజాదరణ ఉన్న పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్, ప్రభాస్ వంటివారు; శర్వానంద్, నాని, రామ్, సందీప్ కిషన్, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్ వంటి యువనటులు; ఇంకా తెలుగమ్మాయిలు, తెలుగు సినిమా ద్వారా పేరొందిన ఇతర అమ్మాయిలు ఎవరూ కూడా …

... మూర్ఖులను శిక్షించాలి

వంశీ కలుగోట్ల // ... మూర్ఖులను శిక్షించాలి //
**************************************
గత కొద్ది రోజులుగా ప్రతి రోజూ కనీసం ఒక రేప్ ఘటన గురించి వార్తల్లో వస్తోంది, ఆవును ప్రతిరోజూ. అది కూడా తల్లి, చెల్లి తో సహా వావి వరసలు చూడకుండా; పిల్లా పెద్దా తేడా లేకుండా ఎవరిని పడితే వారిని రేప్ చేస్తున్నారు. -> జమ్ము - కాశ్మీర్ లోని కథువా గ్రామంలో అసిఫా ఘటన (విచారణ కొనసాగుతోంది, మైనర్ బాలుడు కూడా నిందితుడు)
-> ఉత్తర ప్రదేశ్ లోని ఉన్నావ్ లో పక్కింటి యువతిపై ఉద్యోగమిప్పిస్తానని పిలిపించి ఎమ్మెల్యే అత్యాచారం (విచారణ కొనసాగుతోంది)
-> పోర్న్ వీడియోలు చూసిన ప్రభావంతో కని పెంచిన తల్లిని చెరిచాడు ఒకడు (గుజరాత్)
-> ఇద్దరు అన్నదమ్ములు కలిసి తమ బాబాయి కూతురు (చెల్లి వరుస) అయిన అయిదేళ్ళ అమ్మాయిని కొన్ని రోజుల పాటు రేప్ చేశారు (వరంగల్) -> తాగిన మైకంలో చెల్లిని రేప్ చేసిన వ్యక్తి (తమిళనాడు) -> ట్యూషన్ వెళ్లిన 8 ఏళ్ల పాపను, ట్యూషన్ టీచర్ కొడుకు (మైనర్ బాలుడు) రేప్ చేశాడు (గుంటూరు) -> నాలుగు నెలల పసిపాపను 60 పై వయసున్న వాచ్మన్ రేప్ చేశాడు (మధ్యప్రదేశ్ అనుకుంటా, గుర్తు లేదు) -> పెళ్ళికి వెళ్లిన …

వంశీ వ్యూ పాయింట్ - 'భరత్ అనే నేను'

వంశీ వ్యూ పాయింట్ - 'భరత్ అనే నేను'  **************************************           మొదటిసారి రాజకీయకోణంలో కథతో మహేష్ బాబు ముఖ్యమంత్రిగా నటించిన 'భరత్ అనే నేను' చిత్రం వచ్చింది. మహేష్ బాబు స్థాయి ఉన్న నటుడు ముఖ్యమంత్రి పాత్రతో అంటే, అంచనాలు ఊహకందని స్థాయిలో ఉంటాయి. అంతటి భారీ అంచనాలతో వచ్చిన 'భరత్ అనే నేను' అంచనాలు అందుకునే స్థాయిలో ఉందా లేదా ... చూద్దాం.   ముందుగా కథ - తెలుగులోనే శేఖర్ కమ్ముల దర్శకత్వంలో 2010 లో వచ్చిన 'లీడర్' చిత్రానికి ఈ చిత్రానికి అతి ఎక్కువస్థాయిలో సారూప్యతలున్నాయి అని మొదలైన కొన్ని నిముషాల్లోనే అర్థమవుతుంది. ఇక అక్కడనుండి అడుగడుగునా అవే పోలికలు కనబడతాయి - మధ్యలో 'ఒకే ఒక్కడు'తో చిన్న చిన్న పోలికలు అదనపు సౌలభ్యం. కాకపొతే లీడర్ చిత్రంలో రానా పాత్ర ఉన్నంత బలంగా ఇందులో భరత్ పాత్ర ఉందని అనిపించదు. తండ్రి చనిపోవడంతో, గత్యంతరం లేని పరిస్థితుల్లో భరత్ ను ముఖ్యమంత్రిగా చేయవలసి వస్తుంది. రాజకీయానుభవం లేదు కాబట్టి, తమ చేతిలో కీలుబొమ్మగా పెట్టుకుని ఆడించవచ్చులే అనుకున్న భరత్, ప్రమాణ స్వీకారం మొదటిరోజే వారికి ఝలక్ ఇవ్వడంతో భరత్ ప్రస్థానం…

వంశీ వ్యూ పాయింట్ - రంగస్థలం

వంశీ కలుగోట్ల // వంశీ వ్యూ పాయింట్ - రంగస్థలం // *****************************************************           రంగస్థలం సినిమా గురించి రాసేముందు ఒక ముందుమాట లాంటిది. మనం సాధారణంగా గొప్ప నటులు, స్టార్స్ అంటూ సినీ నటులను రెండు వర్గాలుగా విభజిస్తుంటాం. స్టార్స్ నటించలేరని దాని భావం కాదు. స్టార్స్ గా ఎదిగిన వారిలో కథానుగుణంగా పాత్రలో ఇమిడిపోదామనే తపన కంటే పాత్రను ఓన్ చేసుకొని, తమ ప్రత్యేకతను చూపుకోవాలనే కోరిక అధికంగా ఉంటుంది - ఆ కోరిక వారిలోని నటుడిని డామినేట్ చేసి, కొన్నిసార్లు పాత్రను కథకంటే పెద్దదిగా చేస్తుంది. ఒకసారి అలాంటి చట్రంలో పడిపోయాక ముందుగా పాత్రను అనుకుని, దాని చుట్టూ కథ అల్లడం మొదలవుతుంది. ఇక పాత్రలోకి ఇమిడిపోవాలనే తపన ఉన్నవారు, కథలో భాగంగా ఉంటారు - గొప్ప నటులుగా ఎదుగుతారు. కమల్ హాసన్ మొదటినుండి కథలో భాగంగా కథానుగుణంగా పాత్రలోకి ఇమిడిపోయే తరహా చిత్రాలే అత్యధికంగా చేయడానికి ప్రాధాన్యతనివ్వడంతో గొప్ప నటుడుగా గుర్తింపు పొందాడు. అదే సమయంలో రజని కాంత్, చిరంజీవి వంటివారు పాత్రను తమశైలిలోకి మలచుకుని, కథను/సినిమాను తమ చుట్టూ తిప్పుకుంటూ గొప్ప స్టార్స్ గా, సినీ వ్యాపారాన్ని ప్రభావితం…