Posts

Showing posts from 2016

పవన్ కళ్యాణ్ కి కొన్ని ప్రశ్నలు ...

వంశీ కలుగోట్ల // పవన్ కళ్యాణ్ కి కొన్ని ప్రశ్నలు ... // ***************************************************** వ్యక్తిగా పవన్ కళ్యాణ్ మంచివాడే కావచ్చు, కానీ ఒక రాజకీయ నాయకుడిగా ఆయన ప్రస్థానంలో ప్రతి అడుగు ప్రస్నార్ధకంగానే ఉంది, అనుమానానికి తావిచ్చేదిగా ఉంది. ప్రశ్నించే మీరు సమాధానాలు కూడా చెప్పడం నేర్చుకోవాలి ... ప్రయత్నించండి.  - ఇచ్చిన హామీల గురించి మోడీ గారిని, వెంకయ్య నాయుడు గారిని విమర్శించారు. మరి అసలు హామీలు అంటేనే చిర్రెత్తుకొచ్చేలా హామీల వర్షం కురిపించిన చంద్రబాబు గారిని మాత్రం పల్లెత్తు మాట అనలేదు. అవును కొత్తగా ఏర్పడిన ప్రభుత్వానికి కాస్త సమయం ఇవ్వాలి, ఇచ్చారు రెండున్నర సంవత్సరాల కాలం. కానీ అది రాష్ట్ర ప్రభుత్వానికి కూడా వర్తించాలి కదా? మరి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎందుకు ప్రశ్నించటం లేదు? ప్రశ్నించానన్న ప్రతిసారీ తెల్లారి చంద్రబాబు గారిని కలవడం 'అపోహలు తొలగాయి, ఆయన మీద నమ్మకం ఉంది' అనటం. అదేదో మోడీ గారిని కూడా ఒకపూట కలిస్తే ఆయన మీద కూడా నమ్మకం వస్తుంది కదా, ఎందుకు వెనుకాడుతున్నారు? - మరో విషయం - ప్రతిసారీ నా దగ్గర డబ్బుల్లేవు, డబ్బుల్లేవు అంటూ బీద అరుపులు 

ఇంతకీ నేను సెప్పొచ్చేదేంటంటే - 'జనతా గ్యారేజ్' గురించి ...

ఇంతకీ నేను సెప్పొచ్చేదేంటంటే - 'జనతా గ్యారేజ్' గురించి ...  ************************************************************************           'జనతా గ్యారేజ్' సినిమా వివరాల్లోకి వెళ్లేముందు ముగ్గురి గురించి చెప్పాలి. ఒకటి దేవిశ్రీప్రసాద్ - ఈ సినిమా చూశాక తనమీద నాకున్న అభిమానం, గౌరవం మరింత పెరిగాయి. సినిమాలో కొన్ని బలహీన సన్నివేశాలను తన సంగీతంతో పైకి లేపాడు. ముఖ్యంగా మోహన్ లాల్ ఉన్న చాలా సన్నివేశాలు పేలవంగా ఉన్నప్పటికీ తన నేపథ్య సంగీతంతో వాటికి ఊపిరి పోశాడు. మరోటి ఎక్కడా తన సంగీతం కథను మించకుండా చూసుకున్నాడు, చివరికి పాటలు కూడా. సినిమా చూడకముందు పాటలు విన్నప్పుడు తన మామూలు తరహాలో ఊపునిచ్చేలా లేదేంటి అనుకున్నాను. కానీ, మొదటి పాత చూడగానే అర్థమైంది ఎందుకలా అని. రెండో వ్యక్తి ఆ పేరు పెట్టుకున్నందుకు ప్రతిభతో ఆ పేరుకు న్యాయం చేసే సత్తా ఉన్న జూనియర్ తారక రామారావు. ఎక్కడా పాత్రను మించిపోలేదు, పాత్రకి లోబడి నటించాడు. తాను మారుతున్న తీరు చూస్తోంటే ముచ్చటేస్తోంది. 'నాన్నకు ప్రేమతో' చిత్రంలో ఎలాగైతే పరిణితి చెందిన నటనను ప్రదర్శించాడో ఈ చిత్రంలో కూడా అంతే. సంభాషణలు పలక

నేనింతేరా నాయనా ...

వంశీ కలుగోట్ల // నేనింతేరా నాయనా ... // ****************************************   "సముద్రం ఒకడి కాళ్ళ దగ్గర కూర్చుని మొరగదు తుఫాను గొంతు చిత్తం అనడం ఎరగదు పర్వతం ఎవ్వడికి ఒంగి సలామ్ చెయ్యదు నేనింకా ఒక పిడికెడు మట్టే కావచ్చు  కాని కలమెత్తితే ఒక దేశపు జండాకున్నంత పొగరుంది."- శేషంద్ర           ఒక రచయితగా/కవిగా లేదా రచయితను/కవిని అనుకునేవాడిగా ఇప్పటికి ఆరు వందలకు పైగా కవితలు, ముప్ఫయికి పైగా రాజకీయ వ్యంగ్య కథలు/కథానికలు; వందకు పైగా విశ్లేషణాత్మక వ్యాసాలు, ఒక బుర్రకథ, పది ప్రచురిత పుస్తకాలు (వ్యక్తిత్వ వికాసం సంబంధిత అంశాలపై), పది మాసాల పాటు 'జాగృతి' మాస పత్రికలో అసోసియేట్ సబ్ ఎడిటర్ గిరీ, ఆరు మాసాలపాటు 'శ్రీ దత్త ఉపాసన' మాస పత్రికకు సబ్ ఎడిటర్ గిరీ వెలగబెట్టటం వంటివి చేశాను. (మధ్యలో దాదాపు పన్నెండు సంవత్సరాల అస్త్రసన్యాసంతో కలుపుకుని). నేను రాసిన వాటిలో ఎక్కువగా రాజకీయ వ్యంగ్య రచనలే అయినప్పటికీ దాదాపు అన్ని అంశాలను స్పృశించాను. ప్రేమ, స్నేహం, ఆధ్యాత్మికత, అణచివేతలు, శృంగారం, రాజ్యహింస, అసహనం, నిష్క్రియాపరత్వం, బాధ్యతారాహిత్యం, సాంప్రదా

This is MAHABHARAT and BHARAT - VK view

This is MAHABHARAT and BHARAT - VK view ******************************************************* I have received a message on Whats App with comparisons between few Mahabharata characters and today's politicians, it was termed as 'Mahabharat and Bharat'. I think this was fabricated by fans/followers of one particular group/person and seems like they are unaware of the characterisics of Mahabharata characters or ignored them intelligently (what they may be thinking of themselves) to their satisfaction). Original message is given below ... ================= */ *Duryodhan & Rahul Gandhi* ```Both without talent. But yet wanted to be rulers on the principle of birth-right.``` *Bhishma & Advani* ```Never crowned. Got respect & yet became helpless at the end of their lives.``` *Arjun & Narendra Modi* ```Both talented. Reached the highest position due to being on the side of dharma. But realise how difficult it is to follow and practice.``` *Karna & Manmohan

ఉత్తరకుమారత్వం ...

వంశీ కలుగోట్ల // ఉత్తరకుమారత్వం ... // ****************************** *********** 1 మహాభారతంలో ఉత్తరకుమారుడు అని పాత్ర ఉంటుంది. అతడు ఎప్పుడూ అంతఃపురంలో తన చెల్లెలి చెలికత్తెలతో తన వీరత్వం గురించి ప్రగల్భాలు పలుకుతూ ఉంటాడు, వారితో తన వీరత్వాన్ని (???) పొగిడించుకుంటూ ఉంటాడు. కానీ, అసలుకు అతడికి కత్తి పట్టడం కూడా సరిగా రాదు, యుద్ధం అనగానే వెన్నులో వణుకు పుడుతుంది. అలాంటి పాత్ర అన్నమాట.  2 ఇప్పుడు ప్రస్తుతానికి వద్దాం.  మొన్నటికి మొన్న రాజ్యసభలో జైట్లీగారు 'ప్రత్యేక హోదా ఇవ్వడం కుదరదు, మిగతా ఇరభై ఎనిమిది రాష్ట్రాలతో పాటూ మీరూ ఒకరు, ఏం హీక్కుంటారో హీక్కోపోండి' అని తేల్చేసిన తరువాత పత్రికా సమావేశంలో ఆవేదనతో కూడిన వచ్చిన ఆవేశం వల్ల మన గౌరవనీయ ముఖ్యమంత్రి గారు 'కేంద్రంతో మాట్లాడతాను, పోరాడతాను, తేల్చేసుకుంటాను, ఇట్ ఈస్ వెరీ దారుణం, రెండు రోజుల్లో ఢీల్లీ వెళతాను' అంటూ ప్రకటించారు.  ఢీల్లీకి వెళ్లారు పచ్చ మీడియాలో కూడా ప్రత్యేకహోదాపై తేల్చుకోవడానికి వెళ్తున్నారు, ఇక తాడో పేడో తేలిపోవాల్సిందే అని ఊహాగానాలు రాసేశారు. సివరాకరికి బాబుగారు అందరినీ కలిసి వచ్చాక మళ్ళీ పత్రికా

వార్తలు ... వాళ్ళ ఇష్టం

వార్తలు ... వాళ్ళ ఇష్టం **********************   (ఊరికే సరదాకి ...) మన గౌరవనీయ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ప్రత్యేక హోదాపై పోరాటంలో (నవ్వకండి) భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారితో తాడో పేడో తేల్చుకుందామని ఆవేశంతో ఊగిపోతూ ఢీల్లీకి వెళ్లారు.  # బాబు గారు రాష్ట్రపతిని కలిశారు. 'మీలాంటి వారు రాష్ట్రానికొక్కరు ఉంటే ఈ దేశం ఎప్పుడో అభివృద్ధి సాధించేది. మీలాంటి గొప్పవారు ఒక్క రాష్ట్రానికే పరిమితమవుతే ఎలా? మీరు ప్రధాని కావాలి' అని అన్నారు ఆయన. అలానే పనిలో పనిగా 'అద్భుతంగా పాలిస్తున్నారు, ఆంధ్రని అమెరికా సరసన నిలిపేలా అభివృద్ధి చేస్తున్నారు' అంటూ తెగ పొగిడారు. దాంతో ఎప్పటిలానే పొగడ్తలు గిట్టని బాబు గారు సిగ్గుతో నిర్ణీత సమయానికంటే ముందే సమావేశాన్ని ముగించి వచ్చేశారు. # ప్రధానమంత్రితో సమావేశయ్యారు. (ఎన్నోసారో సరిగ్గా గుర్తులేదు కానీ) ఆంద్ర ప్రదేశ్ పరిస్థితి గురించి ఆయనకు వివరించి, హోదా ఇచ్చి తీరాల్సిందేనని లేకపోతే తానూ ఊరుకోనని కుండబద్దలు కొట్టేశారు. దాంతో భయంతో కూడిన బాధవల్ల వచ్చిన ఆందోళనతో మోడీగారు సానుకూలంగా స్పందించారు. పార్లమెంట్ సమావేశాల అన

బంద్, హోదా, ప్రతిపక్షం

బంద్, హోదా, ప్రతిపక్షం *********************** # ప్రజాస్వామ్యంలో ప్రజలు కానీ, ప్రతిపక్షాలు కానీ తమ నిరసనను తెలపటానికి బంద్, ధర్నా, రాస్తారోకో వంటివి చెయ్యటం అన్నది మామూలే. అవి హింసాత్మకంగా మారనంతవరకూ మంచిదే. ఇప్పుడు అధికారంలో ఉన్నవారు కూడా ప్రతిపక్షంలో ఉన్నపుడు రకరకాల కారణాలు చూపి లెక్కకు మిక్కిలి బంద్ లు, ధర్నాలు, రాస్తారోకోలు చేసినవారే. ఆ సమయంలో లెక్కలేనంత ప్రభుత్వ ఆస్థి నష్టం, హింస జరిగాయి కూడా. ఆ కోణంలో పోల్చి చూస్తే నిన్న జరిగిన ఆంధ్రప్రదేశ్ రాష్త్ర బంద్ ద్వారా ప్రభుత్వం కొన్నిరంగాలలో ఒకరోజు ఆదాయం కోల్పోయిందేమో కానీ హింసాత్మక చర్యలు జరిగినట్టు కనీసం ఆ రెండు పత్రికలలో కూడా రాలేదు. (నాకు తెలిసినంతవరకూ) కానీ, అసలు బంద్ చెయ్యడం అన్నదే తప్పు అంటే అటువంటి తప్పులు గతంలో ఇప్పటి అధికార పార్టీవారు లెక్కకు మిక్కిలి చేశారు. ఒక్క విషయం ఇప్పటి ప్రతిపక్షం చేసిన బంద్ లలో హింస శాతం, ప్రభుత్వ ఆస్థుల విధ్వంసం (నిన్న ఒక్కరోజు మాత్రమే కాదు, గతంలో కూడా) గత ప్రతిపక్షంతో పోలిస్తే చాలా తక్కువ. నిన్న జరిగిన ఒక్క బంద్ ను మాత్రమే ఖండించాలి, బాధ్యతారాహిత్య చర్యగా ముద్రవేయాలి అని ప్రయత్ని

... మేలుకోండి అధ్యక్ష్యా

# నదులు, చెరువులు అనుసంధానం అన్నది నిజంగానే చాలా చక్కటి ఆలోచన. ఆచరణ దిశగా అడుగులు వేస్తున్నందుకు చంద్రబాబు నిజంగా అభినందనీయుడే. కాకపోతే ఈ ప్రచారకండూతితో రేపటికి చెయ్యాలి, ఎల్లుండికి చెయ్యాలి అన్న ఆతృత తప్పటడుగులు వేయిస్తోంది. అయ్యా, భవిష్యత్తుకు పనికి వచ్చే ఒకానొక మహత్తర కార్యాన్ని ఆతృతగా చెయ్యాలనే ప్రయత్నంలో చెడగొట్టకండి. # వనం - మనం: హరితహారానికి బదులు అనుకోవాలేమో. కానీ, లక్షల ఎకరాల పంటభూమిని నాశనం చేసి ఇప్పుడు పర్యావరణం గురించి, మొక్కల గురించి మాట్లాడుతుంటే అదేదో ఎవరో వేదాలు వల్లించినట్టు ఉంది. # ప్రతి పూజా కార్యక్రమంలో బూట్లు వేసుకుని కార్యక్రమం నిర్వహించడం బాగోలేదు. పచ్చ మీడియా పట్టించుకోకపోవచ్చు. తమరితో అంటకాగుతున్నారు కాబట్టి భాజపా వారు పట్టించుకోకపోవచ్చు. కానీ, తమరి విజ్ఞత ఏమైంది? సాంప్రదాయాలకు విలువ ఇవ్వాలి కదా. ఏ దేశమేళితే అక్కడి సాంప్రదాయ దుస్తుల్లో కనిపిస్తున్నారే ఇక్కడి సాంప్రదాయాలకు విలువ ఇవ్వరా? ఇఫ్తార్ విందు ఇచ్చినప్పుడు నెత్తిన టోపీ మాత్రం మరిచిపోరు. కాస్త స్వసంప్రాదాయాలకు విలువ ఇవ్వడానికి ప్రయత్నించండి. # మన దేశంలో, మన దేశపు సాంకేతిక నిపుణులు

What I am saying is - 'Sultan' movie review

What I am saying is - 'Sultan' movie review ********************************************** First thing - if you want to watch Salman Khan the star, then better not to go for this movie. Just sit back at home and watch his old movies. If you want watch Salman Khan the actor and the performer, here you have got the best (as of today) option - it's his latest offering 'Sultan'. I managed to watch 'Sultan' movie yesterday, I would have watched this on day one of its release but missed it due to my Europe trip. Well, I would like to term it as a life of a person rather than just a film. It has got life in it; Salman Khan put his heart and body in this movie, you can see it in every part and every act. An amazing movie and a must watch, don't miss it.  Story - this is a story about a person's journey of life (or fight) from a normal Haryani aimless guy to 'King of Ring' in wrestling. That's not all about it, that's ju

What I am saying is - 'Kabaali' review

What I am saying is - 'Kabaali' review ************************************************ 'Kabaali' - watched the movie. Before stepping into the full review, on first note - I realised that Rajni is also a normal human being like us and he too have to slow down due to age. His diction, walking, body language - you can see everywhere that he is slow though style factor is there. I went to watch Rajni, I did not expected a gret story and narration etc. But, director Pa Ranjith failed to narrate the story in right manner. Story has got all the ingredients to make it a commercial blockbuster if executed well. Not sure what Pa Ranjith's thoughts but the narration is very very slow, it's like snail pace. Movie starts on a promising note and continues for the first 15/20 min and then slow down, that's it - it never picked up the momentum again and revolves aimlessly at places. To add more to the disappointment there is no entertainment and romance factors. So, t

ఇంతకీ నేను సెప్పొచ్చేదేంటంటే - 'కబాలి రా'

ఇంతకీ నేను సెప్పొచ్చేదేంటంటే - 'కబాలి రా' ****************************** *********** రజనీకాంత్ 'కబాలి' సినిమా నిన్న చూశాను. సినిమా ఎలా ఉంది అనే వివరణాత్మక విశ్లేషణలోకి వెళ్లేముందు ఒకమాట - ఈ సినిమా చూసిన తరువాత రజనీకాంత్ కూడా మనలాంటి మామూలు మనిషేనని అర్ధమయ్యి బాధేసింది. వయసు తెచ్చే మార్పులు రజనీకాంత్ ని అయినా సరే నెమ్మదింపజేస్తాయని తెలుసుకున్నాను కానీ అది నచ్చలేదు. ఇక సినిమా గురించి ... 'కబాలి' కథ గురించి - కథ పరంగా చెప్పాలంటే కథలో ఎటువంటి కొత్తదనం కానీ ఉపయోగం కానీ లేనిది ఇది. ఇప్పటికే ఎన్నో వందలసార్లు తెరకెక్కిన కథ. ఈ సినిమాలో కబాలీశ్వరన్ మలేసియాలో తమిళుల కోసం పోరాడతాడు, ఆ క్రమంలో పెద్ద డాన్ గా ఎదుగుతాడు. శత్రువుల కుట్రకు కుటుంబాన్ని పోగొట్టుకుని పాతిక సంవత్సరాల జైలు శిక్ష అనుభవించి బయటకు వచ్చి శత్రువుల మీద పగ తీర్చుకుంటాడు. అదే క్రమంలో పోయిందనుకున్న తన కుటుంబాన్ని తిరిగి పొందుతాడు. ఇటువంటి ఒక సాధారణ కథను రజని తరహాలో తెరకెక్కించాలన్న ప్రయత్నంలో దర్శకుడు పా రంజిత్ విజయం సాధించలేకపోయాడు. నత్త నడకన తెరకెక్కించి ప్రేక్షకుల సహనాన్ని పరీక్

అవీ ... ఇవీ అనబడు సాంబడి అనుమానాలు

వంశీ కలుగోట్ల // అవీ ... ఇవీ అనబడు సాంబడి అనుమానాలు // ****************************** ****************************** ************* 1. ఓహ్ వ్వావ్ అద్భుతం, ఆశ్చర్యం, పరమాద్భుతం - మీడియా అనగా అదేనండీ పచ్చమీడియా లేదా ఆ రెండు పత్రికలు గత కొద్దిరోజులుగా పాటించిన స్వీయ నియంత్రణ గురించి చెబుతున్నాను. ముద్రగడ కాపు రేజర్వేషన్స్ ఉద్యమం విషయంలో ఆ రెండు పత్రికలు పాటించిన స్వీయ నియంత్రణ అత్యంత ఆశ్చర్యకరమైన అద్భుతమైన పరమ వ్వావ్ అన్నమాట. ఇంతటి జ్ఞానమే కనుక వారికి ఎన్నికల ప్రచార సమయంలో కలిగి ఉంటే ఆ సమయంలో బాబు గారు నోటికి అదుపు లేకుండా, విలేఖరుల చేతులు నొప్పెట్టేలా రాసుకునేంతటి లిస్ట్ లో హామీలు గుప్పించిన సమయాన ఈ నియంత్రణ పాటించి ఉంటే అసలు అలాంటి హామీ అంటూ ఒకటి ఇచ్చాడని కాపు జనాలకు తెలిసేది కాదు కదా. ఓ అలా అయితే ఆయన అధికారంలోకి ఎలా వస్తాడనే భయం కాబోలు.  2. మేధావులు వచ్చారండీ - ముద్రగడకు కొన్ని ప్రశ్నలు అంటూ తెగ పోస్టుతున్నారు. అయ్యలూ అదేదో బాబు గారికి కూడా సంధించొచ్చుగా తవరి ప్రశ్నలు. అసలు ఇంతటికీ మూలకారణం ఆయనగారి హామీలే కదా. ఆ హామీల చిట్టా తీసి ప్రశ్నలు సాధించండి. ఊహూ అలా చేస్తే తవరందరూ మేధావు

ఇంతకీ నేను సెప్పోచ్చేదేమిటంటే ... 'అ ఆ' సినిమా గురించి

వంశీ కలుగోట్ల// ఇంతకీ నేను సెప్పోచ్చేదేమిటంటే ... 'అ ఆ' సినిమా గురించి // ****************************** ****************************** *****************************        విడుదలై, విజయదుందుభి మోగిస్తున్న 'అ ఆ' సినిమాను ఇన్నాళ్ళకి చూడటం తటస్థించింది. సినిమా ఎలా వుంది అనేది ఇప్పటికే తీర్మానించేసి, ఇతర వేరే చూడదగ్గ సినేమాలేమీ కూడా లేకపోవడంతో ప్రేక్షకులు తమ అభిమానధన వర్షాన్ని 'అ ఆ' పై కురిపిస్తున్నారు. తనకు అడ్డు చెప్పే గొప్ప తారలు లేకపోవడం త్రివిక్రమ్ కి బాగా కలిసివచ్చింది. ఇక నా తరహా పోస్ట్ మార్టం చేసుకుందాం :)  కథ: ఇప్పటికే విశ్లేషకులు, వంకలు వెతికేవారు, గతం గుర్తున్నవారు అందరూ కలిసి త్రివిక్రమ్ యధ్ధనపూడి గారి 'మీనా' నవలను, అదే పేరుతో తెరకెక్కిన సినిమాను ఫ్రీమేక్ చెసేశాడని తీర్మానించారు కాబట్టి ఆ విషయం కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. కానీ, ప్రస్తుతం నడుస్తున్న ఫార్ములా తరహా కుటుంబకథా చిత్రాల మధ్య ఈ సినిమా తన ప్రత్యేకతను నిలుపుకుంది. పరిస్థితులనే ప్రతినాయకులుగా మలచటంలో (సినిమాలలో) ఈతరం దర్శకులలో త్రివిక్రమ్ ను మించినవారు లేరు అని నా అభిప్రాయం. అ

ముసుగులేని పత్రిక ...

వంశీ కలుగోట్ల// ముసుగులేని పత్రిక ... // ****************************************           ఇప్పుడు సాక్షి తీరుపై విమర్శలు చేస్తున్నవారు గమనించవలసిన ఒక విషయం ఏంటంటే అసలు సాక్షి పుట్టుక అనేదే మిగతా మాధ్యమాల ఒంటెద్దుపోకడలు, ఒక వర్గానికే కొమ్ముకాయడం కారణం అనేది. ఇప్పుడు సాక్షి కాకపొతే మరోటి పుట్టుకువస్తుంది. ప్రధానంగా అత్యంత ఆదరణ కలిగి ప్రజలదగ్గరకి చేరుతుండిన ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికల ఈ ధోరణి ఒక్కప్పుడు 'వార్త' దినపత్రిక పుట్టుకకు కారణమయ్యింది. కానీ, వివిధ కారణాల వల్ల వార్త దినపత్రిక ఆరంభంలో లభించిన ఆదరణను నిలబెట్టుకోలేకపోయింది. ఆ తరువాత ఆ రెండు పత్రికల ధోరణి మరింత పెచ్చుమీరి చివరకు 'సాక్షి' పుట్టుకకు కారణమయ్యింది. ఒక విషయం మాత్రం నిజం పుట్టుకనుండీ కూడా 'సాక్షి'కి ముసుగులు లేవు. వారి గొంతుక వినిపించాలనే ధ్యేయంతోనే సాక్షి ప్రారంభించారని అందరికీ తెలుసు. అంతేకానీ, మిగతా పత్రికలలాగా ప్రజల పక్షం అని ముసుగేసుకుని ఒక వర్గానికి కొమ్ముకాయడం అనే ముసుగేసుకోలేదు. అంతేకాదు పత్రికపై ఉన్న ఫోటో వారి తీరును ఎటువంటి ముసుగూ లేకుండా చూపుతుంది. అంటే మేమిది, మా రాత తీరిది, మేం చె

పత్రికలూ ... స్వేచ్చ: పత్రికాస్వేచ్చ

వంశీ కలుగోట్ల// పత్రికలూ ... స్వేచ్చ: పత్రికాస్వేచ్చ // *************************************************************        గతంలో అంటే కొద్ది సంవత్సరాల క్రితం ఆ ఆ అదే 2014 ఎన్నికలకంటే ముందు అన్నమాట ఆ కాలానికి వెళితే అప్పట్లో పేర్లెందుకు గాని ఆ రెండు పత్రికలలో ఇప్పటి ప్రతిపక్ష నేత జగన్ గురించి 'లక్ష కోట్లు, అంతకు రెండు రెట్లు మూడు కాదు కాదు పది రెట్లు అంటూ పదారు లక్షల కోట్లు అంటూ పరిశోధనాత్మక వ్యాసాలు రాసి పడేశాయి. ఆపైన లెక్కలు తెలియక ఆగిపోయారేమో మరి. కానీ, అధికారికంగా సిబిఐ వారు దాఖలు చేసిన పదికి మించిన ఛార్జ్ షీట్ లలో ఇంచుమించి పదహారు వేల కోట్లు అంటూ తేల్చారు. అందులో సగానికి పైగా కొట్టివేయబడ్డవి. మరి ఆ లెక్క ప్రకారం చూస్తే ఆ రెండు పత్రికలూ అసత్యాలను బల్లగుద్ది మరీ నిజాలు అన్నట్టు విపరీత ప్రచారం చేశారు, పేజీలకొద్దీ పరిశోధనాత్మక వ్యాసాల పేరుతో రోజుల/వారాల/నెలల తరబడి అసత్యాలను ప్రచారం చేశారని అనవచ్చు. ఆ కారణాలు చూపి ప్రభుత్వం ఆ పత్రికలను స్వాధీనం ఎందుకు స్వాధీనం చేసుకోకూడదు. అయినా ఇదంతా ఇప్పుడు ఎందుకు అంటే ఏదో జగన్ పుణ్యాత్ముడు, అవినీతి మకిలి అంటని మహానుభావుడు అని చెప్పాలని కా

ప్రాంతాలూ ... సాంప్రదాయాలూ

ప్రాంతాలూ ... సాంప్రదాయాలూ ****************************** ** ఇంగ్లీష్ వాడు హెల్లో అంటాడు  స్పానిష్ వాడు ఓలా/హొలా అంటాడు  తమిళుడు వణక్కం అంటాడు  కన్నడిగుడు నమస్కారవరె అంటాడు  తెలుగువాడు నమస్కారం అంటాడు         సాంప్రదాయం అంటే ఎదుటివారిని ఎలా గౌరవించాలో నేర్పించేది. అంతే కానీ, ఎదుటివాడిని ఎలా తిట్టాలో నేర్పించేది కాదు. మర్యాదపూర్వకంగా ఎలా ఉండాలో చెప్పేదే కానీ అమర్యాదపూర్వకంగా ఉండమని చెప్పేది సాంప్రదాయం కాదు. మనకు నచ్చినా, నచ్చకపోయినా కొన్ని ప్రాంతాల్లో సాంప్రదాయాలు వేరేలా ఉంటాయి. ఉదాహరణకు కొన్ని దేశాల్లో ముక్కూ, ముక్కూ రాసుకుంటారు; కొన్ని దేశాల్లో ఆలింగనం చేసుకున్తారు; కొన్ని ప్రాంతాల్లో కరచాలనం చేసుకుంటారు; కొన్ని ప్రాంతాల్లో చెంప/బుగ్గ మీద ముద్దు పెట్టుకుంటారు. మన సాంప్రదాయం అలా చెప్పలేదు కాబట్టి అది తప్పు అనకూడదు.         కానీ, ఇప్పుడు ఎవరో ఒకరు కాస్త జనం గుర్తించగలిగే స్థాయి ఉన్న నాయకుడు వచ్చి ఆవేశంలోనో, అవసరార్థమో, ఆపుకోలేకనో నోటికొచ్చినదంతా వాగేసి ఎవరన్నా ఏమన్నా అంటే మా ప్రాంతంలో అంతే అంటున్నారు. ఏ ప్రాంత సంప్రదాయమూ ఎదుటివాడిని కొట్టమని కానీ, తిట్టమని

ఇంతకీ నేను సెప్పొచ్చేదేమిటంటే - 'బ్రమ్హోత్సవం' సినిమా గురించి

ఇంతకీ నేను సెప్పొచ్చేదేమిటంటే - 'బ్రమ్హోత్సవం' సినిమా గురించి **************************************************************************        బ్రమ్హోత్సవం సినిమా గురించి - అబ్బో ఏమి చెప్పాలి. ఎప్పుడు యే సన్నివేశంలో చూసినా కనీసం పదిమంది తెరమీద కనిపిస్తారు. సినిమా గురించి చెప్పుకోవాలంటే ముందుగా చెప్పుకోవాల్సింది శ్రీకాంత్ అడ్డాల గురించి. నిజంగా ఈ సినిమాకి మూలస్థంభం తనే. అసలు ఏమీ లేకుండా రెండున్నర గంటలు సినిమాగా అందునా మహేష్ బాబు లాంటి టాప్ స్టార్ తో ఏమి చెప్పి ఒప్పించాడో, ఎలా ఒప్పించాడో తెలీదు - అందుకే తనే ఈ సినిమాకి అన్నీ. తను ఏమి రాసుకున్నాడో తెలీదు కానీ, దాన్ని కథగా తను అనుకోవడమే కాక నిర్మాత, మహేష్ బాబు లాంటివారందరితో ఒప్పించి అన్ని కోట్లు పెట్టించి సినిమాగా తీయడం ఆహా ఓహో తన సామర్థ్యానికి కేకో కేక దండాలు. మూలకథ విషయానికి వస్తే అలెక్స్ హెలీ 'ది రూట్స్' పుస్తకం నుండి తీసుకుని దానికి సినిమా ప్రథమార్థంలోని కథ(అదే తను కథ అనుకున్న దాన్ని), కొన్ని పాత్రలని జోడించి సినిమాగా తియ్యాలనే ప్రయత్నం చేశాడు. వినటానికి నిజంగానే ఆసక్తికరంగా ఉండే అంశం ఇది అందునా 'ది రూట్స్

ఇంతకీ నేను సెప్పోచ్చేది ఏంటంటే - 'సరైనోడు' సినిమా గురించి

ఇంతకీ నేను సెప్పోచ్చేది ఏంటంటే - 'సరైనోడు' సినిమా గురించి ****************************** *****************************        "ఆత్మ నాశనం లేనట్టిది. ఆయుధములతోనో, మరే విధమైన రీతులలోనో ఎవరూ ఆత్మను నాశనమొందింపజాలరు." అని ఆ భగవంతుడు ఏనాడో మహాభారత యుద్ధకాలంలోనే చెప్పాడు. పాపం మన చిత్రాలలోని ప్రతినాయకులు ఈ సత్యమును తెలుసుకోనలేక అనవసరంగా నాయకుడిపై యుద్ధం చేస్తుంటారు, ఆయుధాలు ప్రయోగిస్తుంటారు. ఎన్నో వందల, వేల చిత్రాలలో ఇప్పటికే నిరూపితమైనప్పటికీ మళ్ళీ ఈ సరైనోడు సినిమాలో కూడా ఆది పినిశెట్టి తెలివిలేకుండా మళ్ళీ అదే పని చేశాడు. ఎవరన్నా పూనుకుని మన ప్రతినాయకులని ఎడ్యుకేట్ చెయ్యండయ్యా. ఇక 'సరైనోడు' సినిమా గురించి. రెండు వేర్వేరు తరహా ఇమేజ్ లు ఉన్న అల్లు అర్జున్, బోయపాటి శ్రీనులు కలిసి పని చేస్తున్న సినిమా అయినప్పటికీ రూపకర్తలు ముందే జనాలకు క్లారిటీ ఇచ్చారు 'ఇది ఊర మాస్' సినిమా అని. కానీ, అటు బోయపాటి తరహాలోనూ కాక, ఇటు అల్లు అర్జున్ తరహాలోనూ కాక ఇంకోలా తయారయ్యింది సినిమా. కథ పరంగా చెప్పుకోవడానికేమీ పెద్దగా లేదు, ఆశించకూడదు కూడా. ఇక బోయపాటి శ్రీను బహు

'బాబు' కేక

'బాబు' కేక  ************ ఈ 'బాబు' రాజకీయ బాబు కాదులెండి, సినిమా బాబు. సినిమా రంగంతో పరిచయం ఉన్నవారికి, అభిమాన సంఘాల వారికి 'బాబు' అంటే ఏంటో చాలా వివరంగా తెలుసు. ఈ 'బాబు'ల్లో రెండు రకాల బాబులు ఉంటారు. ఒక పెద్ద ఇమేజ్ ఉన్న కుటుంబంలోంచి వచ్చిన వారసులు ఒకటో రకం 'బాబు'లు, రెండో రకం 'బాబు'లు వరుసగా మాంచి హిట్లు సాధించి ఊపుమీదున్న హీరోలు అన్నమాట. ఈ 'బాబు'ల తీరు ఎలా ఉంటుందంటే  ... 'బాబు' ఒక సన్నివేశంలో నటించి పక్కకు వచ్చాడు అన్నమాట.  బాబు - ఎలా ఉంది మన (సెల్ఫ్ రెస్పెక్ట్ అన్నమాట) ఆక్టింగ్? దర్శకుడు - 'బాబూ, అసలు ఒక్క టేక్ లో మొత్తం 5 నిమిషాల సీన్ చించేశారు బాబూ. ఆశలు నేనైతే 'షాట్ ఓకే' అని చెప్పడం మర్చిపోయి అలా తన్మయత్వంతో ఉండిపోయాను అంటే నమ్మండి. అసలు మీరు ఇక్కడే ఉంది టైం వేస్ట్ చేస్తున్నారు బాబు.  బాలీవుడ్దో లేక హాలీవుడ్దో వెళ్ళారంటే అక్కడి హీరోలందరూ బుట్ట సర్డుకోవాల్సిందే.  హీరోయిన్ - ఓహ్ వావ్, నేను అస్సలు నమ్మలేకపోతున్నాను అంటే నమ్మండి బాబు గారు. అసలు హౌ కాన్ యు డు లైక్ దట్ బాబు గారు, యు అరె యాన్ అమేజిం

రాజకీయ సినిమా

రాజకీయ సినిమా   ******************* మున్నా సినిమా చూసిన వారికి అందులో ప్రకాష్ రాజ్ మరియు రాహుల్ దేవ్ పాత్రలు గుర్తుండే ఉంటాయనుకుంటాను. ప్రకాష్ రాజ్ తెలివిగా తన దగ్గర పనిచేసిన రాహుల్ దేవ్ ని తనకే ఎదురు తిరిగినట్టుగా చేసి ప్రత్యర్థిగా మారుస్తాడు. దాంతో, ప్రకాష్ రాజ్ అంటే పడని వారు రాహుల్ దేవ్ దగ్గరికి వెళ్తారు. ఇద్దరూ కలిసి వారిని బఫూన్ లను చెయ్యటం. ఇలా సాగుతుంది స్క్రీన్ ప్లే. ఇప్పుడు మన రాష్ట్ర రాజకీయాలు చూస్తుంటే నాకు ఎందుకో అదే గుర్తుకు వస్తోంది. ప్రభుత్వం పట్ల వ్యతిరేకత పెరుగుతోంది; శంఖుస్థాపనలు, వృధా ఖర్చులు, ప్రచార పటాటోపం తప్ప క్షేత్ర స్థాయిలో జరగుతున్నదేమీ లేదు. అందినకాడికి దోచుకుంటున్నారు. దాంతో, మూడేళ్ళ తరువాతి పరిస్థితి ఏంటి అనేది ఇప్పటినుంచే దార్సనికుడి బుర్రకు తట్టి, పక్కా స్క్రీన్ ప్లే రచించినట్టు అనిపిస్తోంది. తెర మీది 'అత్యంత శక్తివంతమైన' (???) బొమ్మ రంగంలోకి దిగింది. 'జనసేన' మళ్ళీ పెట్టెలోంచి బయటకు రాబోతోంది. దీని మూలంగా జరగబోయేది ఏమిటంటే - సొంత పార్టీలోని అసంతృప్తులు, ఇతర పార్టీలలోని ఆశావహులు 'జనసేన' వైపు మళ్ళే అవకాశాలు ఎక్కువగా