Posts

Showing posts from September, 2016

పవన్ కళ్యాణ్ కి కొన్ని ప్రశ్నలు ...

వంశీ కలుగోట్ల // పవన్ కళ్యాణ్ కి కొన్ని ప్రశ్నలు ... // ***************************************************** వ్యక్తిగా పవన్ కళ్యాణ్ మంచివాడే కావచ్చు, కానీ ఒక రాజకీయ నాయకుడిగా ఆయన ప్రస్థానంలో ప్రతి అడుగు ప్రస్నార్ధకంగానే ఉంది, అనుమానానికి తావిచ్చేదిగా ఉంది. ప్రశ్నించే మీరు సమాధానాలు కూడా చెప్పడం నేర్చుకోవాలి ... ప్రయత్నించండి.  - ఇచ్చిన హామీల గురించి మోడీ గారిని, వెంకయ్య నాయుడు గారిని విమర్శించారు. మరి అసలు హామీలు అంటేనే చిర్రెత్తుకొచ్చేలా హామీల వర్షం కురిపించిన చంద్రబాబు గారిని మాత్రం పల్లెత్తు మాట అనలేదు. అవును కొత్తగా ఏర్పడిన ప్రభుత్వానికి కాస్త సమయం ఇవ్వాలి, ఇచ్చారు రెండున్నర సంవత్సరాల కాలం. కానీ అది రాష్ట్ర ప్రభుత్వానికి కూడా వర్తించాలి కదా? మరి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎందుకు ప్రశ్నించటం లేదు? ప్రశ్నించానన్న ప్రతిసారీ తెల్లారి చంద్రబాబు గారిని కలవడం 'అపోహలు తొలగాయి, ఆయన మీద నమ్మకం ఉంది' అనటం. అదేదో మోడీ గారిని కూడా ఒకపూట కలిస్తే ఆయన మీద కూడా నమ్మకం వస్తుంది కదా, ఎందుకు వెనుకాడుతున్నారు? - మరో విషయం - ప్రతిసారీ నా దగ్గర డబ్బుల్లేవు, డబ్బుల్లేవు అంటూ బీద అరుపులు 

ఇంతకీ నేను సెప్పొచ్చేదేంటంటే - 'జనతా గ్యారేజ్' గురించి ...

ఇంతకీ నేను సెప్పొచ్చేదేంటంటే - 'జనతా గ్యారేజ్' గురించి ...  ************************************************************************           'జనతా గ్యారేజ్' సినిమా వివరాల్లోకి వెళ్లేముందు ముగ్గురి గురించి చెప్పాలి. ఒకటి దేవిశ్రీప్రసాద్ - ఈ సినిమా చూశాక తనమీద నాకున్న అభిమానం, గౌరవం మరింత పెరిగాయి. సినిమాలో కొన్ని బలహీన సన్నివేశాలను తన సంగీతంతో పైకి లేపాడు. ముఖ్యంగా మోహన్ లాల్ ఉన్న చాలా సన్నివేశాలు పేలవంగా ఉన్నప్పటికీ తన నేపథ్య సంగీతంతో వాటికి ఊపిరి పోశాడు. మరోటి ఎక్కడా తన సంగీతం కథను మించకుండా చూసుకున్నాడు, చివరికి పాటలు కూడా. సినిమా చూడకముందు పాటలు విన్నప్పుడు తన మామూలు తరహాలో ఊపునిచ్చేలా లేదేంటి అనుకున్నాను. కానీ, మొదటి పాత చూడగానే అర్థమైంది ఎందుకలా అని. రెండో వ్యక్తి ఆ పేరు పెట్టుకున్నందుకు ప్రతిభతో ఆ పేరుకు న్యాయం చేసే సత్తా ఉన్న జూనియర్ తారక రామారావు. ఎక్కడా పాత్రను మించిపోలేదు, పాత్రకి లోబడి నటించాడు. తాను మారుతున్న తీరు చూస్తోంటే ముచ్చటేస్తోంది. 'నాన్నకు ప్రేమతో' చిత్రంలో ఎలాగైతే పరిణితి చెందిన నటనను ప్రదర్శించాడో ఈ చిత్రంలో కూడా అంతే. సంభాషణలు పలక