Posts

Showing posts from April, 2018

...స్పందించకపోతే

వంశీ కలుగోట్ల // ...స్పందించకపోతే // **************************************           అవును మన తెలుగు సినీ నటులెవ్వరూ హోదా విషయంలో పోరాటానికి ముందుకు రావటం లేదు, ఇపుడే కాదు గతంలో తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా బహిరంగంగా మద్దతుగానో, వ్యతిరేకంగానో బయటపడినవారు అతి తక్కువ. ఇటువంటి ఘటన జరిగిన ప్రతిసారీ తమిళ నటులతో పోలిక వస్తుంటుంది. తమిళ నటీనటులు జల్లికట్టు విషయంలో కానీ, కావేరి జలవివాదం విషయంలో కానీ తమిళనాడు రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడిన తీరు నిజంగా ఆదర్శనీయమే అందులో ఎటువంటి సందేహమూ లేదు. కానీ, తెలుగు సినీ రంగానికి వస్తే అత్యంత కీలకమైన అంశమైన ప్రత్యేక హోదా విషయంలో కూడా ఎవరూ స్పందించడం లేదు. మొన్న మొన్నటివరకూ రాజ్యసభ సభ్యుడిగా ఉన్న చిరంజీవి; రాష్ట్ర శాసనసభ సభ్యుడిగా ఉన్న బాలకృష్ణ; ఇంకా చట్ట సభల్లో సభ్యులుగా ఉన్న మురళీమోహన్, శివప్రసాద్; విపరీతమైన ప్రజాదరణ ఉన్న పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్, ప్రభాస్ వంటివారు; శర్వానంద్, నాని, రామ్, సందీప్ కిషన్, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్ వంటి యువనటులు; ఇంకా తెలుగమ్మాయిలు, తెలుగు సినిమా ద్వారా పేరొందిన ఇతర అమ్మాయిలు ఎవర

... మూర్ఖులను శిక్షించాలి

వంశీ కలుగోట్ల // ... మూర్ఖులను శిక్షించాలి // ************************************** గత కొద్ది రోజులుగా ప్రతి రోజూ కనీసం ఒక రేప్ ఘటన గురించి వార్తల్లో వస్తోంది, ఆవును ప్రతిరోజూ. అది కూడా తల్లి, చెల్లి తో సహా వావి వరసలు చూడకుండా; పిల్లా పెద్దా తేడా లేకుండా ఎవరిని పడితే వారిని రేప్ చేస్తున్నారు. -> జమ్ము - కాశ్మీర్ లోని కథువా గ్రామంలో అసిఫా ఘటన (విచారణ కొనసాగుతోంది, మైనర్ బాలుడు కూడా నిందితుడు ) -> ఉత్తర ప్రదేశ్ లోని ఉన్నావ్ లో పక్కింటి యువతిపై ఉద్యోగమిప్పిస్తానని పిలిపించి ఎమ్మెల్యే అత్యాచారం (విచారణ కొనసాగుతోంది) -> పోర్న్ వీడియోలు చూసిన ప్రభావంతో కని పెంచిన తల్లిని చెరిచాడు ఒకడు (గుజరాత్) -> ఇద్దరు అన్నదమ్ములు కలిసి తమ బాబాయి కూతురు (చెల్లి వరుస) అయిన అయిదేళ్ళ అమ్మాయిని కొన్ని రోజుల పాటు రేప్ చేశారు (వరంగల్) -> తాగిన మైకంలో చెల్లిని రేప్ చేసిన వ్యక్తి (తమిళనాడు) -> ట్యూషన్ వెళ్లిన 8 ఏళ్ల పాపను, ట్యూషన్ టీచర్ కొడుకు (మైనర్ బాలుడు) రేప్ చేశాడు (గుంటూరు) -> నాలుగు నెలల పసిపాపను 60 పై వయసున్న వాచ్మన్ రేప్ చేశాడు (మధ్యప్రదేశ్ అనుకుంటా, గుర్తు లేదు

వంశీ వ్యూ పాయింట్ - 'భరత్ అనే నేను'

వంశీ వ్యూ పాయింట్ - 'భరత్ అనే నేను'  **************************************           మొదటిసారి రాజకీయకోణంలో కథతో మహేష్ బాబు ముఖ్యమంత్రిగా నటించిన 'భరత్ అనే నేను' చిత్రం వచ్చింది. మహేష్ బాబు స్థాయి ఉన్న నటుడు ముఖ్యమంత్రి పాత్రతో అంటే, అంచనాలు ఊహకందని స్థాయిలో ఉంటాయి. అంతటి భారీ అంచనాలతో వచ్చిన 'భరత్ అనే నేను' అంచనాలు అందుకునే స్థాయిలో ఉందా లేదా ... చూద్దాం.             ముందుగా కథ - తెలుగులోనే శేఖర్ కమ్ముల దర్శకత్వంలో 2010 లో వచ్చిన 'లీడర్' చిత్రానికి ఈ చిత్రానికి అతి ఎక్కువస్థాయిలో సారూప్యతలున్నాయి అని మొదలైన కొన్ని నిముషాల్లోనే అర్థమవుతుంది. ఇక అక్కడనుండి అడుగడుగునా అవే పోలికలు కనబడతాయి - మధ్యలో 'ఒకే ఒక్కడు'తో చిన్న చిన్న పోలికలు అదనపు సౌలభ్యం. కాకపొతే లీడర్ చిత్రంలో రానా పాత్ర ఉన్నంత బలంగా ఇందులో భరత్ పాత్ర ఉందని అనిపించదు. తండ్రి చనిపోవడంతో, గత్యంతరం లేని పరిస్థితుల్లో భరత్ ను ముఖ్యమంత్రిగా చేయవలసి వస్తుంది. రాజకీయానుభవం లేదు కాబట్టి, తమ చేతిలో కీలుబొమ్మగా పెట్టుకుని ఆడించవచ్చులే అనుకున్న భరత్, ప్రమాణ స్వీకారం మొదటిరోజే వారికి ఝలక్

వంశీ వ్యూ పాయింట్ - రంగస్థలం

వంశీ కలుగోట్ల // వంశీ వ్యూ పాయింట్ - రంగస్థలం // *****************************************************           రంగస్థలం సినిమా గురించి రాసేముందు ఒక ముందుమాట లాంటిది. మనం సాధారణంగా గొప్ప నటులు, స్టార్స్ అంటూ సినీ నటులను రెండు వర్గాలుగా విభజిస్తుంటాం. స్టార్స్ నటించలేరని దాని భావం కాదు. స్టార్స్ గా ఎదిగిన వారిలో కథానుగుణంగా పాత్రలో ఇమిడిపోదామనే తపన కంటే పాత్రను ఓన్ చేసుకొని, తమ ప్రత్యేకతను చూపుకోవాలనే కోరిక అధికంగా ఉంటుంది - ఆ కోరిక వారిలోని నటుడిని డామినేట్ చేసి, కొన్నిసార్లు పాత్రను కథకంటే పెద్దదిగా చేస్తుంది. ఒకసారి అలాంటి చట్రంలో పడిపోయాక ముందుగా పాత్రను అనుకుని, దాని చుట్టూ కథ అల్లడం మొదలవుతుంది. ఇక పాత్రలోకి ఇమిడిపోవాలనే తపన ఉన్నవారు, కథలో భాగంగా ఉంటారు - గొప్ప నటులుగా ఎదుగుతారు. కమల్ హాసన్ మొదటినుండి కథలో భాగంగా కథానుగుణంగా పాత్రలోకి ఇమిడిపోయే తరహా చిత్రాలే అత్యధికంగా చేయడానికి ప్రాధాన్యతనివ్వడంతో గొప్ప నటుడుగా గుర్తింపు పొందాడు. అదే సమయంలో రజని కాంత్, చిరంజీవి వంటివారు పాత్రను తమశైలిలోకి మలచుకుని, కథను/సినిమాను తమ చుట్టూ తిప్పుకుంటూ గొప్ప స్టార్స్ గా, సినీ వ్యాపారాన్ని ప్