Posts

Showing posts from June, 2017

మనలో ఒకరు (5): ఒక మంచి మనిషి ... నీరజ

Image
వంశీ కలుగోట్ల // మనలో ఒకరు (5): ఒక మంచి మనిషి ... నీరజ // ****************************************************             చిరంజీవి నటించిన 'స్టాలిన్' చిత్రంలో కథ అంతా ఒక సందేశం చుట్టూ అల్లబడి ఉంటుంది. ఆ సందేశం ఏంటంటే 'మీరు ముగ్గురుకి సహాయం చెయ్యండి, ఆ ముగ్గురిని ఒక్కొక్కరు మరో ముగ్గురికి సహాయం చేయమనండి.' అలా ఒక గొలుసుకట్టులాగా సహాయం అన్న ప్రక్రియ సాగాలి, మనిషికి మనిషి సహాయం చేసుకోవాలి అన్నది అంతర్లీనంగా సందేశం. అది ఎదో హాలీవుడ్ లేదా కొరియన్ సినిమా నుండి తీసుకున్నది, ఆ సినిమా పేరు గుర్తు లేదు. అయినా నేను ఇపుడు ఈ వ్యాసం ముఖ్యోద్దేశం ఆ సినిమా గురించి చర్చించటం కాదు కాబట్టి ఆ విషయం అప్రస్తుతం. నా జీవితంలో జరిగిన ఒక చిన్న సంఘటన గురించి చెప్పాలనుకుంటున్నాను, దానికి ఇది ప్రవేశిక లాంటిది.             2000 సంవత్సరం, అప్పుడే డిగ్రీ పూర్తయ్యింది. రెండో అక్క గాయత్రి/నాగలతకు పెళ్లి కుదిరింది. అప్పటికింకా ఏమి చెయ్యలో, ఎటు వెళ్ళాలో డిసైడ్ చేసుకోలేదు కాబట్టి డిగ్రీ అయి కొన్ని నెలలు అయినా బేవార్సుగానే ఉన్నా. ఆగస్టులో పెళ్ళి. జులై లో పెళ్లి పత్రికలు పంచటం అనే ప్రక్రియ

'సారీ వరలక్ష్మి' లఘు చిత్రం సమీక్ష

వంశీ కలుగోట్ల // 'సారీ వరలక్ష్మి' లఘు చిత్రం సమీక్ష // ****************************** ****************             'జీవితంలో ఏ క్షణమూ ఒకేలా ఉండదు', 'జీవితాన్ని ఉదయం తొమ్మిది నుండి సాయంత్రం అయిదువరకు కంప్యూటర్స్ ముందు కాదు ప్రకృతి ముందు ఖర్చు పెట్టండి' అన్న రెండు సంభాషణలే మూలాధారంగా మారిన కథే శంకర్ సిద్ధం లఘు చిత్రం 'సారీ వరలక్ష్మి'. ఈ చిత్రానికి కథ, చిత్రానువాదం (స్క్రీన్ ప్లే), నిర్మాణం, దర్శకత్వం, సంభాషణలతో పాటు ప్రధాన పాత్ర కూడా పోషించిన శంకర్ అన్నింట్లోనూ రాణించాడు. ఈ చిత్రంలోని ఏ అంశంపైనైనా సమీక్ష చేస్తూ వ్యాఖ్య చేయబోయే ముందు గుర్తుంచుకోవలసింది ఇది అత్యంత పరిమిత వనరులతో తీసిన లఘు చిత్రం. కానీ, ఆ ఛాయలు ఎక్కడా కనబడకుండా మంచి నాణ్యమైన చిత్రాన్ని అందించారు అని చెప్పవచ్చు.             ముందుగా కథ - పైన పేర్కొన్నట్టు ఆ రెండు సంభాషణలే చిత్రం కథను, కథా గమనాన్ని తెలుపుతాయి. విదేశాలలో ఉన్న ఒక యువకుడి కథ అన్నది అదనపు హంగు. ఉన్నత చదువుల కోసం లండన్ లో దిగిన అభినవ్, తాననుకున్న లండన్ వేరు చూసే లండన్ వేరు అని త్వరలోనే తెలుసుకుంటాడు. కానీ, నిరాశ

నేనూ - వాడూ: ఒక సంభాషణ

వంశీ కలుగోట్ల // నేనూ - వాడూ: ఒక సంభాషణ // ****************************** ************ వాడు: ఎపుడో శతాబ్దాల క్రితం రాయబడిన ఆ పుస్తకంలో పేర్కొనబడిన ఆ చెడు విషయాన్ని ఖండఖండాలుగా ఖండించి తీరాల్సిందే. రాతలే రాయబడాలో, చిత్రాలే తీయబడాలో, మరింకేమైనా చెయ్యాలో కానీ, ఖండించి తీరాల్సిందే.  నేను: అవును, చెడును ఖండించాల్సిందే. అవునూ, ఇంతకీ అవన్నీ ఖండిస్తూ నువ్వు తీసిన ఆ చిత్రంలో లేదా రాసిన రాతలో ఆ కాస్త యెర్రితనం, ఆ కాసింత బూతు, ఆ కొద్ది రక్తపాతం/హింస లేకపోయుంటే ఎంత బావుండేది మిత్రమా? వాడు: అవునా!!! అయితే నీకర్థం కాలేదన్నమాట. ఇంకాస్త ఎదగాలి నువ్వు. ఊరికే అలా అనకపోతే ఆ చెడు, బూతు, హింస గట్రా ఏవైతే ఉన్నాయో వాటిని వదిలేసి మిగతావాటిని చూడవచ్చు కదా! నేను అన్ని అంశాలు కలిపి తీస్తే/రాస్తే నీకు అవి మాత్రమే కనిపించాయి అంటే నువ్వు అలాంటివాడివి అని అర్థం. ఇంకెప్పుడు ఎదుగుతావు!!!? అయినా నన్నూ, నా మాటలనూ అర్థం చేసుకోవాలంటే నీకు, నీలాంటివారికీ కనీసం ఇంకో అర్థ శతాబ్ది అయినా పడుతుంది. నేను: అవును నిజమేనేమో మిత్రమా. నువ్వు తీసిన/రాసిన