Posts

Showing posts from 2018

వంశీ వ్యూ పాయింట్ - రంగస్థలం

వంశీ కలుగోట్ల // వంశీ వ్యూ పాయింట్ - రంగస్థలం // *****************************************************           రంగస్థలం సినిమా గురించి రాసేముందు ఒక ముందుమాట లాంటిది. మనం సాధారణంగా గొప్ప నటులు, స్టార్స్ అంటూ సినీ నటులను రెండు వర్గాలుగా విభజిస్తుంటాం. స్టార్స్ నటించలేరని దాని భావం కాదు. స్టార్స్ గా ఎదిగిన వారిలో కథానుగుణంగా పాత్రలో ఇమిడిపోదామనే తపన కంటే పాత్రను ఓన్ చేసుకొని, తమ ప్రత్యేకతను చూపుకోవాలనే కోరిక అధికంగా ఉంటుంది - ఆ కోరిక వారిలోని నటుడిని డామినేట్ చేసి, కొన్నిసార్లు పాత్రను కథకంటే పెద్దదిగా చేస్తుంది. ఒకసారి అలాంటి చట్రంలో పడిపోయాక ముందుగా పాత్రను అనుకుని, దాని చుట్టూ కథ అల్లడం మొదలవుతుంది. ఇక పాత్రలోకి ఇమిడిపోవాలనే తపన ఉన్నవారు, కథలో భాగంగా ఉంటారు - గొప్ప నటులుగా ఎదుగుతారు. కమల్ హాసన్ మొదటినుండి కథలో భాగంగా కథానుగుణంగా పాత్రలోకి ఇమిడిపోయే తరహా చిత్రాలే అత్యధికంగా చేయడానికి ప్రాధాన్యతనివ్వడంతో గొప్ప నటుడుగా గుర్తింపు పొందాడు. అదే సమయంలో రజని కాంత్, చిరంజీవి వంటివారు పాత్రను తమశైలిలోకి మలచుకుని, కథను/సినిమాను తమ చుట్టూ తిప్పుకుంటూ గొప్ప స్టార్స్ గా, సినీ వ్యాపారాన్ని ప్రభావితం…

... ఓహ్ ఇదొకటుందా

వంశీ కలుగోట్ల // ... ఓహ్ ఇదొకటుందా //
********************************** బ్యాంకు అకౌంట్ కాసింత వీక్ గా ఉన్నపుడు, ఏదైనా కాస్త పెద్ద మొత్తం బిల్ పే చెయ్యటానికి క్రెడిట్ కార్డు వాడచ్చులే అని సంబరపడేలోపు క్రెడిట్ కార్డుపై రెండు శాతం సర్వీస్ టాక్స్ ఉంటుంది అని చావుకబురు చల్లగా తెలిసినపుడు
* అజ్ఞాతవాసంలో పాండవుల ఆయుధాలలాగా అవసరాలన్నీ కట్టగట్టి ఎక్కడో పెట్టి ... అక్కడా, ఇక్కడా ఊడ్చేసుకున్న డబ్బులతో ఒక ఇల్లు కొనుక్కోవచ్చని సంబరపడేలోపు; ఇంటి ధర కంటే రిజిస్ట్రేషన్ ఫీజు భయపెట్టినపుడు, ఇవ్వాల్సిన మామూళ్ళు బెదరగొట్టినపుడు
* కాలేజీలోనో, కంపెనీ కాంప్లెక్స్ లోనో కంటికింపుగా కనబడింది కదా అని వెంటపడి; కావాల్సిన వివరాలన్నీ కనుక్కుని, ఒక అమ్మాయికి ఐ లవ్ యు అని చెప్తే - పెళ్ళెప్పుడు చేసుకుందాం అన్న ప్రశ్న ఎదురైనపుడు
* అనుభవాలని నుదుటిమీద గీతలుగానో, కళ్ళ కింద గుంతలుగానో కలిగిన వాళ్ళు 'ఆలోచించి అడుగెయ్యండిరా' అని చెప్పినపుడు; గతకాలపు తెలియనితనంగానే అనిపిస్తుంది. మనదాకా వచ్చినపుడు తెలిసొస్తుంది... ఓహ్ ఇదొకటుందా అనిపిస్తుంది

... కత్తి మహేష్ గారికి కొన్ని ప్రశ్నలు

వంశీ కలుగోట్ల // ... కత్తి మహేష్ గారికి కొన్ని ప్రశ్నలు // ***************************************************** -> పోలీస్ స్టేషన్ లో ఇచ్చిన ఫిర్యాదు కేవలం 'కోడి గుడ్ల' దాడికే పరిమితం చేయటం ఏమిటి? బెదిరింపు కాల్స్ విషయం ఎందుకు ఫిర్యాదు చెయ్యలేదు? దాన్ని ఇంకొన్నాళ్ళు కొనసాగించే ఆలోచన ఉందా? ఇపుడు కోడిగుడ్ల దాడి వ్యవహారం సమసిపోయినట్టే, బెదిరింపు కాల్స్ వ్యవహారం కూడా సమసిపోయే అవకాశం ఉంది కదా.  -> ఇక కోడిగుడ్ల దాడి చేసినవారిపై గంటల వ్యవధిలో ఫిర్యాదును వాపసు తీసుకోవడం ఆనందమే కాదు కాస్త ఆశ్చర్యంగా కూడా అనిపించింది. ఇక్కడ అర్థమవుతోందేమిటంటే సమస్య పవన్ కళ్యాణ్ తో కాదు, అతగాడి పేరు చెప్పుకుని (ఈ పదాలు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి) చెడ్డపనులు చేస్తున్నవారితో అని. అంతే కదా, అటువంటప్పుడు బెదిరింపు కాల్స్ వ్యవహారంలో తాత్సారం ఎందుకు?  -> మరో విషయం - కోడిగుడ్ల దాడి ఘటన టీవీ9 స్టూడియో దగ్గరకు తమరు క్యాబ్ లో వచ్చినపుడు జరిగిన హఠాత్ పరిణామం కదా. అటువంటపుడు దాడి జరిగిన వెంటనే ఆ క్లోజ్ అప్ షాట్స్, అంతటి విపులమైన కవరేజ్ వీడియోస్ ఎలా సాధ్యమయ్యాయి? అంటే టీవీ 9 వారు మీరు క్యాబ్ దిగిన దగ్గరనుండి ప్…

... 'అజ్ఞాతవాసి' సినిమా గురించి

వంశీ కలుగోట్ల // ... 'అజ్ఞాతవాసి' సినిమా గురించి //
*******************************************
కొన్ని సినిమాలు చూసినపుడు 'ఇది సినిమానా!' అని అబ్బురపోయేలా చేస్తాయి, అటువంటి సినిమాలు అరుదుగా వస్తుంటాయి.
కొన్ని సినిమాలు చూసినపుడు 'ఇదీ సినిమానేనా?' అని కుంగిపోయేలా, దాన్ని చూడటానికి ఎగేసుకుంటూ థియేటర్ కు వెళ్ళినందుకు బాధపడేలా చేస్తాయి.
          తాజాగా విడుదలైన 'అజ్ఞాతవాసి' చిత్రం ఏ కోవలోకి వస్తుందో చూసి, ఆ బాధను అనుభవించిన వారే నిర్ణయించుకోవచ్చు. ఇపుడు పవన్ కళ్యాణ్ ఒక మామూలు వ్యక్తి కాదు, కేవలం స్టార్ హీరో మాత్రమే కాదు, కేవలం రాజకీయ శక్తి కాదు - 'అతడు ఒక అద్భుతం, దేవుడు, మహానుభావుడు' అంటూ ఉప్పొంగిపోతున్న అభిమానులను నేల మీదకు తీసుకువచ్చేలా 'అజ్ఞాతవాసి' చిత్రం రూపొందించబడింది అని చెప్పటం తప్పు కాదని నా అభిప్రాయం. మొదట చెప్పబడిన అభిప్రాయాలు సరియైనవని అనిపిస్తే, నా రెండవ అభిప్రాయం కూడా సరియైనదే అవుతుంది. సరేలే, అభిప్రాయాలు పక్కనబెడదాం ... ఈ సంవత్సరానికి మొదటి అత్యంత భారీ చిత్రంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన అజ్ఞాతవాసి గురించి మాట్లాడుకుందా…