Posts

Showing posts from May, 2016

ఇంతకీ నేను సెప్పొచ్చేదేమిటంటే - 'బ్రమ్హోత్సవం' సినిమా గురించి

ఇంతకీ నేను సెప్పొచ్చేదేమిటంటే - 'బ్రమ్హోత్సవం' సినిమా గురించి **************************************************************************        బ్రమ్హోత్సవం సినిమా గురించి - అబ్బో ఏమి చెప్పాలి. ఎప్పుడు యే సన్నివేశంలో చూసినా కనీసం పదిమంది తెరమీద కనిపిస్తారు. సినిమా గురించి చెప్పుకోవాలంటే ముందుగా చెప్పుకోవాల్సింది శ్రీకాంత్ అడ్డాల గురించి. నిజంగా ఈ సినిమాకి మూలస్థంభం తనే. అసలు ఏమీ లేకుండా రెండున్నర గంటలు సినిమాగా అందునా మహేష్ బాబు లాంటి టాప్ స్టార్ తో ఏమి చెప్పి ఒప్పించాడో, ఎలా ఒప్పించాడో తెలీదు - అందుకే తనే ఈ సినిమాకి అన్నీ. తను ఏమి రాసుకున్నాడో తెలీదు కానీ, దాన్ని కథగా తను అనుకోవడమే కాక నిర్మాత, మహేష్ బాబు లాంటివారందరితో ఒప్పించి అన్ని కోట్లు పెట్టించి సినిమాగా తీయడం ఆహా ఓహో తన సామర్థ్యానికి కేకో కేక దండాలు. మూలకథ విషయానికి వస్తే అలెక్స్ హెలీ 'ది రూట్స్' పుస్తకం నుండి తీసుకుని దానికి సినిమా ప్రథమార్థంలోని కథ(అదే తను కథ అనుకున్న దాన్ని), కొన్ని పాత్రలని జోడించి సినిమాగా తియ్యాలనే ప్రయత్నం చేశాడు. వినటానికి నిజంగానే ఆసక్తికరంగా ఉండే అంశం ఇది అందునా 'ది రూట్స్