... జాసన్ బౌర్న్ సిరీస్ మూవీస్
వంశీ వ్యూ పాయింట్ // ... జాసన్ బౌర్న్ సిరీస్ మూవీస్ //
************************************************
సీక్రెట్ ఏజెంట్ మూవీస్ లో ఆక్షన్ కు, థ్రిల్లింగ్ ఎలిమెంట్ కు, డ్రామాకు, సెంటిమెంట్ (దేశభక్తి)కు మంచి స్కోప్ ఉంటుంది. నిజానికి ఏ సీక్రెట్ ఏజెంట్ మూవీలో అయినా సెంట్రల్ థీమ్ ఒకటే ఉంటుంది. దేశానికి, ప్రపంచానికి ముప్పు తలపెట్టే ప్రయత్నం చేస్తున్న విలన్ గ్యాంగ్ ను ఏజెంట్ ఎదుర్కొని, వారి ప్రయత్నాలను వమ్ము చేయడం. ఈ స్పై మూవీస్ మొదలైంది 1914 లో The German Spy Peril అనే సినిమాతో. కానీ జనాల్లో ఆసక్తి, కమర్షియల్ స్కోప్ బాగా పెరిగింది మాత్రం ఇయాన్ ఫ్లెమింగ్ సృష్టించిన 'జేమ్స్ బాండ్' పాత్ర/సినిమాల ద్వారా అని చెప్పవచ్చు. జేమ్స్ బాండ్ అంటే ఒక స్టైల్, ఒక ట్రెండ్. జేమ్స్ బాండ్ సినిమా తరువాత స్పై థ్రిల్లర్స్ అన్నీ వాటిని అనుకరించడం మొదలైంది అని చెప్పవచ్చు. జేమ్స్ బాండ్ తరువాత, స్పై థ్రిల్లర్స్ మూవీస్లో ఒక డిఫరెంట్ పాటర్న్ లో వచ్చిన సిరీస్ జాసన్ బౌర్న్ సిరీస్ (ఇప్పటికి అయిదు సినిమాలు వచ్చాయి. మొదట మూడు సూపర్ సక్సెస్ కాగా, నాలుగోది పర్వాలేదనిపించిండి, అయిదోది పోయింది). బౌర్న్ పాత్ర ఆక్షన్ ఎలిమెంట్ కంటే ఎక్కువగా ఎమోషన్ తో ఆకట్టుకుంటుంది. స్పై మూవీస్ లో బౌర్న్ పాత్ర ఒక విభిన్నతతో కూడుకున్నది.
జాసన్ బౌర్న్ మూవీస్ కి ఆధారం 1980 దశకంలో లో రాబర్ట్ లాడ్లం రాసిన బౌర్న్ సిరీస్ నవలలు. ఒక అండర్ కవర్ ఏజెన్సీ (ట్రెడ్ స్టోన్) లో ఏజెంట్ అయిన బౌర్న్ ఒక ఆపరేషన్ మీద వెళ్ళినపుడు, తీవ్రంగా గాయపడతాడు. చావు బ్రతుకుల పరిస్థితులనుండి బయటపడ్డాక, గతం మర్చిపోతాడు. ఇక అక్కడి నుండి బౌర్న్ పాత్ర సంఘర్షణ, పోరాటం (వివిధ శతృవులతో) మొదలవుతుంది. కమ్యూనికేషన్ కట్ కావడంతో తమ ఏజెంట్ రోగ్ గా మారాడనుకుని ట్రెడ్ స్టోన్ ఏజెన్సీ మరియు అమెరికన్ గవర్నమెంట్ బౌర్న్ ను చంపేయాలనుకుంటాయి. బౌర్న్ పోరాటం త్రిముఖంగా సాగుతుంది - తనతో తాను, తనను చంపాలనుకుంటున్న అమెరికన్ ఏజెన్సీస్ మరియు ఇతరుల బారి నుండి తప్పించుకుంటూ - అసలు తానెవరో తెలుసుకోవాలని అతడి పోరాటం సాగుతుంది. ఆ ప్రాసెస్ లో సాగే సన్నివేశాలు ఆక్షన్ మరియు థ్రిల్ తో కూడుకుని ఉత్కంఠభరితంగా ఉంటాయి. నిజానికి సినిమాలోని కథ కంటే ఎక్కువగా బౌర్న్ పాత్రతో కనెక్ట్ అవుతాం.
జాసన్ బౌర్న్ సిరీస్ లో ఇప్పటికి 14 నవలలు వచ్చాయి. మొదటి మూడు రాబర్ట్ లాడ్లం రాయగా, ఆయన అనంతరం లాడ్లం ఎస్టేట్ అనుమతితో ఎరిక్ వాన్ లస్ట్బాడర్ మిగతా 11 నవలలు రాశారు. బౌర్న్ పాత్ర మినహాయించి, సినిమాలకు నవలలోని కథకు పెద్దగా సంబంధం ఉండదు. నేను మూవీస్ చూడటం కంటే ముందే నవలలు చదివాను. అఫ్ కోర్స్ నవలలు నచ్చినంతగా మూవీస్ నచ్చలేదు. బౌర్న్ మూవీస్ కు ప్రధాన బలం మాట్ డామన్, బౌర్న్ పాత్రలో మరొకరిని ఊహించుకోలేం, అంతగా జీవించేసాడు మాట్ డామన్ ఆ పాత్రలో. ఫిక్షన్ జానర్ లో క్రైమ్, స్పై థ్రిల్లర్స్ చదవడం ఇష్టపడేవారిని బౌర్న్ సిరీస్ నవలలు ఖచ్చితంగా అలరిస్తాయి. ఇక మూవీస్ జేమ్స్ బాండ్ తరహా కాకుండా, ఒక విభిన్న స్పై థ్రిల్లర్స్ ను చూశామన్న తృప్తినిస్తాయి. బౌర్న్ మూవీస్ గురించి కావాలనే ఎక్కువ వివరాయలు ఇవ్వట్లేదు - సినిమా చూస్తే ఆ థ్రిల్ వేరు. మొదటి మూడు మూవీస్ చూడండి, నాలుగు, అయిదు స్కిప్ చేసినా ఫరక్ పడదు. మాట్ డామన్, బాక్గ్రౌండ్ మ్యూజిక్, రిచ్ నెస్, ఆక్షన్ సీన్స్ ఖచ్చితంగా ఆకట్టుకుంటాయి. స్పై మూవీస్ లో బౌర్న్ స్థానం ప్రత్యేకం. బౌర్న్ మూవీస్ ప్రైమ్ వీడియోలో, నెట్ఫ్లిక్ లో ఉన్నాయి.
Comments
Post a Comment