Posts

Showing posts from May, 2017

శ్వేతపత్రాలు ఏమయ్యాయి?

వంశీ కలుగోట్ల // శ్వేతపత్రాలు ఏమయ్యాయి? // *****************************************
ఎక్కువొద్దురా నాయనా సామీ, ఆ ఇచ్చేదేదో హోదానే ఇవ్వు అని 2014 నుండీ మొత్తుకుంటుంటే ఇపుడు మళ్ళీ తాజాగా ఎప్పటినుండో పాడిన పాతపాటనే పాడతారేంటి అమిత్ షాజీ!? మీరిచ్చిన డబ్బులు కావాలంటే ఎనక్కి తీసుకోండి, హోదా ఇవ్వండి చాలు. అవునూ, అమిత్ షా గారేం ఒక లక్షా డెబ్బై అయిదువేల కోట్లు ఇచ్చామని అంటున్నారు కదా, మరి అయితే క్రింది ప్రశ్నలకు వివరణ ఇస్తూ బాబుగారేమన్నా తెల్లకాయితం అదేనండీ శ్వేతపత్రం ఏమైనా విడుదల చేస్తారా లేక చెయ్యగలరా?

-> అమిత్ షా గారు పేర్కొంటున్నట్టు అంతటి భారీస్థాయిలో నిధులు/డబ్బులు నిజంగానే ఇచ్చారా? -> ఒకవేళ అంతటి భారీ స్థాయిలో నిధులు ఇచ్చి ఉంటే, వేటికి ఉపయోగించారు? -> అమిత్ షా గారు పేర్కొన్న నిధులు గత సంవత్సర కాలంలో ఇచ్చినవా లేక గత మూడు సంవత్సరాల కాలంలో ఇచ్చినవా లేకపోతే 2019 వరకూ ఇవ్వాలని అనుకుంటున్నా వాటితో కలిపి చెప్పిన లెక్కనా? -> ఆ నిధుల ఉపయోగించిన వివరాలేమిటి అంటే ఏయే పథకాలు లేదా కార్యక్రమాలకు వినియోగించారు? -> ఇచ్చిన డబ్బులు హోదా, ప్రత్యేక ప్యాకేజీ తదితరాలకు సంబంధం లేకుండా మిగత…

ఇంతకీ నేను చెప్పొచ్చేదేమిటంటే - శర్వానంద్ 'రాధ' చిత్రం గురించి

ఇంతకీ నేను చెప్పొచ్చేదేమిటంటే - శర్వానంద్ 'రాధ' చిత్రం గురించి  *******************************************************************************             విభిన్న తరహా చిత్రాలతో, వరుస విజయాలతో దూసుకెళుతున్న యువ కథానాయకుడు శర్వానంద్ తాజా చిత్రం 'రాధ'. ఈ చిత్రం వివరాల్లోకి వెళ్ళేముందు ఒక చిన్నమాట ... సినిమా జనాలందరికీ ఒక చిన్న 'పిచ్చ' ఉంటుంది. ఏదో ఒక సందర్భంలో ఆ పిచ్చ ప్రతి ఒక్కరిని పట్టి పీడించి తీరుతుంది. ఆ పిచ్చ పేరే 'మార్స్ సినిమాలు. ఇప్పుడు ఆ పిచ్చ కాస్తా శర్వానంద్ కు కూడా పాకినట్టు ఉంది. కాకపొతే శర్వానంద్ కు మొహమాటంతో కూడిన సిగ్గుతో కూడిన భయంతో వచ్చిన జాగ్రత్తవల్ల మరీ పూర్తిగా ఊర మాస్ తరహాలో వెళ్ళటానికి ఇబ్బంది పడినట్టున్నారు. సీసాను కాస్త అటూ ఇటూగా మార్చి అదే మందును పోశారు. 'రన్ రాజా రణ్ కూడా అలాంటిదే అయినా సుజీత్ దర్శకత్వ, చిత్రానువాద (స్క్రీన్ ప్లే) ఆ సినిమాకు ప్రాణం పోసి ఆసక్తిగా చూసేలా చేసింది. 'రాధ' సినిమాకు వస్తే ఆ రెండు అంశాలే ప్రధాన లోపాలుగా మిగిలి నూతన దర్శకుడు చంద్రమోహన్ ప్రత్యేకించి చిత్రానువాదం మీద మరింత పట్టు సాధించాల్సిన ఆవశ్యక…

... తొందరపడి

వంశీ కలుగోట్ల // ... తొందరపడి //
***************************** ప్రతిపక్ష నేత జగన్, ప్రధాని మోడీతో సమావేశం గురించి రాష్ట్ర తెదేపా చేస్తున్న వ్యాఖ్యలు అత్యంత హాస్యాస్పదంగా ఉన్నాయి.
-> మొదటి ఆరోపణ 'ఈ సమావేశం గురించి ముందుగా చెప్పలేదు'. ఎందుకు చెప్పాలి, ఎవరికీ చెప్పాలి? ఆయన చేసే ప్రతిదీ తెదేపాకు చెప్పి చెయ్యాలా!? మరి పెదబాబు, చినబాబు అంతర్రాష్ట్ర, అంతర్జాతీయ పర్యటనల (అధికారిక/అనధికారిక) గురించి ప్రతిపక్షానికి ముందుగా సమాచారం ఇస్తారా? -> రెండవ ఆరోపణ, 'కేసులనుండి తప్పించుకోవడానికి మోడీని కలిసారు'. ఒకవేళ వీరన్నట్టు కేసుల విషయంగానే కలిశాడు అనుకుందాం, అయితే ఏమిటట? కేంద్రంలో అనగా మోడీగారి దగ్గర చక్రం తిప్పగల తమ నాయకుడు బాబు ఉండగా జగన్ మోడీ గారిని కలిసి ఉద్ధరించేది ఇంకేముంటుంది? అయినా ప్రతిపక్షనేత ఢీల్లీ వెళ్ళిన ప్రతిసారీ ఇంకే కారణాలూ ఉండవా లేక మోడీగారి దగ్గర బాబు గారి ప్రాభవం ఏమన్నా తగ్గుతోందని అనుమానమా? అనవసర ఉలికిపాటు ఎందుకు? -> మూడవ ఆరోపణ - 'ఈ సమావేశం గురించి చివరికి చాలామంది వైకాపా ఎమ్మెల్యేలకు కూడా సమాచారం లేదు'. వారికి సమాచారం ఉందో లేదో అది తమరి…