... కరోనా కంటే ఎక్కువగా భయపెడుతున్న అంశం?

వంశీ కలుగోట్ల // ... కరోనా కంటే ఎక్కువగా భయపెడుతున్న అంశం? //
************************************************************
            చిరంజీవి గారికి కరోనా నెగటివ్ అని, మొదటి సారి పాజిటివ్ వచ్చింది కూడా ఫాల్టి టెస్ట్ కిట్ వల్ల అని తెలిసిందని ఆయనే స్వయంగా ప్రకటించారు. మంచిది, ఆయనకు కరోనా నెగటివ్ అని తెలియడం ఆయను విపరీతంగా అభిమానించే నాలాంటి కోట్లాది మందికి సంతోషాన్నిచ్చే విషయం. కానీ, అంతటి మెగాస్టార్ గారి విషయంలోనే మొదటి రిజల్ట్ ఫాల్టి కిట్ ద్వారా అని, అది కూడా మూడు వేర్వేరు ఇతర పరీక్షల అనంతరం నిర్ధారించబడిందని అంటే ఇక ఇపుడు బయట పడుతున్న అసీంప్టమాటిక్ కేసులలో ఎన్ని నిజానికి కరోనా పాజిటివ్ మరియు ఎన్ని ఫాల్టి కిట్స్ ద్వారా తప్పుడు ఫలితాలు? పాజిటివ్ కాదు అని నిర్ధారించబడేంతవరకూ చిరంజీవి గారు ఖచ్చితంగా కొంత భయం, మనోవేదన అనుభవించి ఉంటారు. అలాంటిది ఇక సామాన్యుల బాధల గురించి ప్రత్యేకంగా చెప్పాలా?
            నిజానికి ఈ కరోనా టెస్ట్ మరియు ట్రీట్మెంట్ అన్నవి ఇపుడు మాఫియాలా తయారైంది. ప్రైవేట్ సంస్థలకు టెస్ట్ బాధ్యతలు అప్పగించడం ద్వారా ఎక్కువమందికి టెస్ట్ చేయడం సాధ్యపడిందన్నది నిజమే, కానీ అదే సమయంలో వారు లింక్డ్ హాస్పిటల్స్ తో బేరం కుదుర్చుకుని, పాజిటివ్ అని చెప్పి హాస్పిటల్ ప్యాకేజీ అడ్మిషన్స్ జరుపుతున్నారు. గత కొన్ని నెలల్లో లాబ్స్, హాస్పిటల్స్ ఈ వ్యవహారం ద్వారా కొన్ని వందల కోట్లు వెనకేసుకొని ఉంటాయని ఒక అంచనా, అది కూడా కేవలం మన తెలుగు రాష్ట్రాల వరకే. ప్రైవేట్ ల్యాబ్ లో పాజిటివ్ వచ్చి, గవర్నమెంట్ ల్యాబ్/హాస్పిటల్ కు వెళ్ళి టెస్ట్ చేస్తే నెగటివ్ వచ్చిన వ్యక్తులు నాకు పరిచయం ఉన్నవారిలో ఉన్నారు. అంతేకాదు పాజిటివ్ వచ్చాక ఎటువంటి సీరియస్ సింప్టమ్స్ లేనపుడు, ఇంట్లోనే ఉంది తెలిసిన డాక్టర్స్ తో ఫోన్ లో టచ్ లో ఉంటూ మెడిసిన్ తీసుకుని, కోలుకున్న వారూ ఉన్నారు.
కరోనా కంటే ఈ హాస్పిటల్ ఖర్చు మరింత భయపెడుతోంది సామాన్యులను. కరోనా పాజిటివ్ వచ్చి, ప్రైవేట్ హాస్పిటల్ లో ట్రీట్మెంట్ తీసుకోవాలంటే లక్షల ఖర్చు వ్యవహారం. అయినా కొందరు ప్రైవేట్ హాస్పిటల్స్ వైపు చూస్తున్నారు. దీనికి కారణం ప్రభుత్వం హాస్పిటల్స్ లో సరిగా చూడరు, సరైన సౌకర్యాలు ఉండవు అనే అభిప్రాయం. ప్రైవేట్ హాస్పిటల్స్ పై నియంత్రణ ఎలా అన్నది ఒక పెద్ద ప్రశ్న. చిన్న చిన్న ప్రయత్నాలు చేస్తేనే, వారు కోర్ట్ మెట్లెక్కడం, వారికి అనుకూలమైన తీర్పులు రావడం జరుగుతోంది. ప్రభుత్వాల తరఫున వాదన బలంగా వినిపించకపోవడం, సరైన సాక్ష్యాధారాలను చూపకపోవడం అందుకు కారణాలు కావచ్చు. అయినా ఇప్పటికిపుడు ఇది మారేది కాకపోయినా ప్రభుత్వ వైద్యశాలలను అందరికి అందుబాటులోకి తీసుకురావడంతో పాటు, అక్కడ అందరికి సరైన వైద్యం అందించబడుతుందనే నమ్మకాన్ని జనాల్లో కలిగించటానికి ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి.

Comments

  1. పైపెచ్చు ఇంకా కోలుకోకపోయినా ఫాల్టీ కిట్ లో నెగెటివ్ వచ్చే ప్రమాదం కూడా ఉంది.
    అసలు బాలు గారికి నెగెటివ్ అని రిజల్ట్ ఇచ్చిన టెస్ట్ కిట్ సరైనదేనా అని అనుమానం కలుగుతోంది.
    రిజల్ట్ రావడానికి కొన్ని గంటలు పట్టినా సరే ఖచ్చితమైన ఫలితాన్ని ఇచ్చే టెస్ట్ విధానాన్నే ఆమోదిస్తే సరిపోయేది

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

... మూడో కూటమి

... 2019 ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు - జనసేన