Posts

Showing posts from August, 2016

నేనింతేరా నాయనా ...

వంశీ కలుగోట్ల // నేనింతేరా నాయనా ... //
****************************************
"సముద్రం ఒకడి కాళ్ళ దగ్గర కూర్చుని మొరగదు తుఫాను గొంతు చిత్తం అనడం ఎరగదు పర్వతం ఎవ్వడికి ఒంగి సలామ్ చెయ్యదు నేనింకా ఒక పిడికెడు మట్టే కావచ్చు  కాని కలమెత్తితే ఒక దేశపు జండాకున్నంత పొగరుంది."- శేషంద్ర
ఒక రచయితగా/కవిగా లేదా రచయితను/కవిని అనుకునేవాడిగా ఇప్పటికి అయిదు వందలకు పైగా కవితలు, ముప్ఫయికి పైగా రాజకీయ వ్యంగ్య కథలు/కథానికలు; వందకు పైగా విశ్లేషణాత్మక వ్యాసాలు, ఒక బుర్రకథ, పది ప్రచురిత పుస్తకాలు (వ్యక్తిత్వ వికాసం సంబంధిత అంశాలపై), పది మాసాల పాటు 'జాగృతి' మాస పత్రికలో అసోసియేట్ సబ్ ఎడిటర్ గిరీ, ఆరు మాసాలపాటు 'శ్రీ దత్త ఉపాసన' మాస పత్రికకు సబ్ ఎడిటర్ గిరీ వెలగబెట్టటం వంటివి చేశాను. (మధ్యలో దాదాపు పన్నెండు సంవత్సరాల అస్త్రసన్యాసంతో కలుపుకుని). నేను రాసిన వాటిలో ఎక్కువగా రాజకీయ వ్యంగ్య రచనలే అయినప్పటికీ దాదాపు అన్ని అంశాలను స్పృశించాను. ప్రేమ, స్నేహం, ఆధ్యాత్మికత, అణచివేతలు, శృంగారం, రాజ్యహింస, అసహనం, నిష్క్రియాపరత్వం, బాధ్యతారాహిత్యం, సాంప్రదాయాలు, సంస్కృతి, చరిత్ర, వ్యక్తిత…

This is MAHABHARAT and BHARAT - VK view

This is MAHABHARAT and BHARAT - VK view *******************************************************
I have received a message on Whats App with comparisons between few Mahabharata characters and today's politicians, it was termed as 'Mahabharat and Bharat'. I think this was fabricated by fans/followers of one particular group/person and seems like they are unaware of the characterisics of Mahabharata characters or ignored them intelligently (what they may be thinking of themselves) to their satisfaction). Original message is given below ...

================= */
*Duryodhan & Rahul Gandhi*
```Both without talent. But yet wanted to be rulers on the principle of birth-right.```

*Bhishma & Advani*
```Never crowned. Got respect & yet became helpless at the end of their lives.```

*Arjun & Narendra Modi*
```Both talented. Reached the highest position due to being on the side of dharma. But realise how difficult it is to follow and practice.```

*Karna & Manmohan Singh*
```Both…

ఉత్తరకుమారత్వం ...

వంశీ కలుగోట్ల // ఉత్తరకుమారత్వం ... //
*****************************************
1
మహాభారతంలో ఉత్తరకుమారుడు అని పాత్ర ఉంటుంది. అతడు ఎప్పుడూ అంతఃపురంలో తన చెల్లెలి చెలికత్తెలతో తన వీరత్వం గురించి ప్రగల్భాలు పలుకుతూ ఉంటాడు, వారితో తన వీరత్వాన్ని (???) పొగిడించుకుంటూ ఉంటాడు. కానీ, అసలుకు అతడికి కత్తి పట్టడం కూడా సరిగా రాదు, యుద్ధం అనగానే వెన్నులో వణుకు పుడుతుంది. అలాంటి పాత్ర అన్నమాట.  2
ఇప్పుడు ప్రస్తుతానికి వద్దాం. 
మొన్నటికి మొన్న రాజ్యసభలో జైట్లీగారు 'ప్రత్యేక హోదా ఇవ్వడం కుదరదు, మిగతా ఇరభై ఎనిమిది రాష్ట్రాలతో పాటూ మీరూ ఒకరు, ఏం హీక్కుంటారో హీక్కోపోండి' అని తేల్చేసిన తరువాత పత్రికా సమావేశంలో ఆవేదనతో కూడిన వచ్చిన ఆవేశం వల్ల మన గౌరవనీయ ముఖ్యమంత్రి గారు 'కేంద్రంతో మాట్లాడతాను, పోరాడతాను, తేల్చేసుకుంటాను, ఇట్ ఈస్ వెరీ దారుణం, రెండు రోజుల్లో ఢీల్లీ వెళతాను' అంటూ ప్రకటించారు. 
ఢీల్లీకి వెళ్లారు పచ్చ మీడియాలో కూడా ప్రత్యేకహోదాపై తేల్చుకోవడానికి వెళ్తున్నారు, ఇక తాడో పేడో తేలిపోవాల్సిందే అని ఊహాగానాలు రాసేశారు. సివరాకరికి బాబుగారు అందరినీ కలిసి వచ్చాక మళ్ళీ పత్రికా సమావేశంలో 'తూ…

వార్తలు ... వాళ్ళ ఇష్టం

వార్తలు ... వాళ్ళ ఇష్టం
**********************
(ఊరికే సరదాకి ...)
మన గౌరవనీయ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ప్రత్యేక హోదాపై పోరాటంలో (నవ్వకండి) భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారితో తాడో పేడో తేల్చుకుందామని ఆవేశంతో ఊగిపోతూ ఢీల్లీకి వెళ్లారు. 

# బాబు గారు రాష్ట్రపతిని కలిశారు. 'మీలాంటి వారు రాష్ట్రానికొక్కరు ఉంటే ఈ దేశం ఎప్పుడో అభివృద్ధి సాధించేది. మీలాంటి గొప్పవారు ఒక్క రాష్ట్రానికే పరిమితమవుతే ఎలా? మీరు ప్రధాని కావాలి' అని అన్నారు ఆయన. అలానే పనిలో పనిగా 'అద్భుతంగా పాలిస్తున్నారు, ఆంధ్రని అమెరికా సరసన నిలిపేలా అభివృద్ధి చేస్తున్నారు' అంటూ తెగ పొగిడారు. దాంతో ఎప్పటిలానే పొగడ్తలు గిట్టని బాబు గారు సిగ్గుతో నిర్ణీత సమయానికంటే ముందే సమావేశాన్ని ముగించి వచ్చేశారు. # ప్రధానమంత్రితో సమావేశయ్యారు. (ఎన్నోసారో సరిగ్గా గుర్తులేదు కానీ) ఆంద్ర ప్రదేశ్ పరిస్థితి గురించి ఆయనకు వివరించి, హోదా ఇచ్చి తీరాల్సిందేనని లేకపోతే తానూ ఊరుకోనని కుండబద్దలు కొట్టేశారు. దాంతో భయంతో కూడిన బాధవల్ల వచ్చిన ఆందోళనతో మోడీగారు సానుకూలంగా స్పందించారు. పార్లమెంట్ సమావేశాల అనంతరం (???) తగిన నిర్ణయ…

బంద్, హోదా, ప్రతిపక్షం

బంద్, హోదా, ప్రతిపక్షం
***********************
# ప్రజాస్వామ్యంలో ప్రజలు కానీ, ప్రతిపక్షాలు కానీ తమ నిరసనను తెలపటానికి బంద్, ధర్నా, రాస్తారోకో వంటివి చెయ్యటం అన్నది మామూలే. అవి హింసాత్మకంగా మారనంతవరకూ మంచిదే. ఇప్పుడు అధికారంలో ఉన్నవారు కూడా ప్రతిపక్షంలో ఉన్నపుడు రకరకాల కారణాలు చూపి లెక్కకు మిక్కిలి బంద్ లు, ధర్నాలు, రాస్తారోకోలు చేసినవారే. ఆ సమయంలో లెక్కలేనంత ప్రభుత్వ ఆస్థి నష్టం, హింస జరిగాయి కూడా. ఆ కోణంలో పోల్చి చూస్తే నిన్న జరిగిన ఆంధ్రప్రదేశ్ రాష్త్ర బంద్ ద్వారా ప్రభుత్వం కొన్నిరంగాలలో ఒకరోజు ఆదాయం కోల్పోయిందేమో కానీ హింసాత్మక చర్యలు జరిగినట్టు కనీసం ఆ రెండు పత్రికలలో కూడా రాలేదు. (నాకు తెలిసినంతవరకూ) కానీ, అసలు బంద్ చెయ్యడం అన్నదే తప్పు అంటే అటువంటి తప్పులు గతంలో ఇప్పటి అధికార పార్టీవారు లెక్కకు మిక్కిలి చేశారు. ఒక్క విషయం ఇప్పటి ప్రతిపక్షం చేసిన బంద్ లలో హింస శాతం, ప్రభుత్వ ఆస్థుల విధ్వంసం (నిన్న ఒక్కరోజు మాత్రమే కాదు, గతంలో కూడా) గత ప్రతిపక్షంతో పోలిస్తే చాలా తక్కువ. నిన్న జరిగిన ఒక్క బంద్ ను మాత్రమే ఖండించాలి, బాధ్యతారాహిత్య చర్యగా ముద్రవేయాలి అని ప్రయత్నిస్త…

... మేలుకోండి అధ్యక్ష్యా

# నదులు, చెరువులు అనుసంధానం అన్నది నిజంగానే చాలా చక్కటి ఆలోచన. ఆచరణ దిశగా అడుగులు వేస్తున్నందుకు చంద్రబాబు నిజంగా అభినందనీయుడే. కాకపోతే ఈ ప్రచారకండూతితో రేపటికి చెయ్యాలి, ఎల్లుండికి చెయ్యాలి అన్న ఆతృత తప్పటడుగులు వేయిస్తోంది. అయ్యా, భవిష్యత్తుకు పనికి వచ్చే ఒకానొక మహత్తర కార్యాన్ని ఆతృతగా చెయ్యాలనే ప్రయత్నంలో చెడగొట్టకండి. # వనం - మనం: హరితహారానికి బదులు అనుకోవాలేమో. కానీ, లక్షల ఎకరాల పంటభూమిని నాశనం చేసి ఇప్పుడు పర్యావరణం గురించి, మొక్కల గురించి మాట్లాడుతుంటే అదేదో ఎవరో వేదాలు వల్లించినట్టు ఉంది. # ప్రతి పూజా కార్యక్రమంలో బూట్లు వేసుకుని కార్యక్రమం నిర్వహించడం బాగోలేదు. పచ్చ మీడియా పట్టించుకోకపోవచ్చు. తమరితో అంటకాగుతున్నారు కాబట్టి భాజపా వారు పట్టించుకోకపోవచ్చు. కానీ, తమరి విజ్ఞత ఏమైంది? సాంప్రదాయాలకు విలువ ఇవ్వాలి కదా. ఏ దేశమేళితే అక్కడి సాంప్రదాయ దుస్తుల్లో కనిపిస్తున్నారే ఇక్కడి సాంప్రదాయాలకు విలువ ఇవ్వరా? ఇఫ్తార్ విందు ఇచ్చినప్పుడు నెత్తిన టోపీ మాత్రం మరిచిపోరు. కాస్త స్వసంప్రాదాయాలకు విలువ ఇవ్వడానికి ప్రయత్నించండి.
# మన దేశంలో, మన దేశపు సాంకేతిక నిపుణులు నిర్మించ…