Posts

Showing posts from May, 2019

... వాడు - వీడు: మనోభావాలు

వంశీ కలుగోట్ల // ... వాడు - వీడు: మనోభావాలు //  *************************************************** వాడు: అరేయ్ ఇట్రా  వీడు: అరేయ్, ఒరేయ్ అనకు. మా మనోభావాలు దెబ్బతింటాయి  వాడు: ఉన్నట్టుండి ఏమైంది? తిక్కతిక్కగా ఉందా?  వీడు: అలా అనకు, తిక్కోళ్ళ మనోభావాలు దెబ్బతింటాయి  వాడు: అసలు ఏమనుకుంటున్నావురా? వీడు: అలా అనకు, ఏమీ అనుకోని వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయి  వాడు: ఓరి దేవుడో, ఏందీ ఈ గోల  వీడు: అలా అన్నావంటే, దేవుడిని నమ్మేవాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయి  వాడు: నీ ... వద్దులే, ఈ పెంటతో నాకెందుకు వీడు: అలా అన్నావంటే అస్సలు బావోదు. పెంట సంబంధిత పనులు (లెట్రిన్ గుంతలు క్లీనింగ్ గట్రా చేసేవారు) చేసేవాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయి. వాళ్ళు పనిమానేస్తే కష్టం.  వాడు: అసలేమైంది నీకు? ఈ మధ్య ఆర్జీవీ సినిమా ఏమైనా చూశావా?  వీడు: నీకు దండం ఉంటాది. ఈ ప్రపంచంలో ఎవరి మనోభావాలనైనా దెబ్బ తియ్, పర్లేదు. మహా అయితే కేసులు పెడతారు, దాడులు చేస్తారు. కానీ ఆర్జీవీ మనోభావాలను దెబ్బ తీయకు. దెబ్బ తిన్న మనోభావాల కోసం, ఆ మనోభావాలను దెబ్బ తీసిన వారి మనోభావాలు దెబ్బతినేలా సినిమా

... కిం కర్తవ్యం?

వంశీ కలుగోట్ల // ... కిం కర్తవ్యం? // ****************************** *****             అనుకున్నంతా అయింది తెలుగుదేశం ఓడిపోయింది. అనుకున్నదానికంటే ఘోరంగా ఓడిపోయింది. తెలుగుదేశానికి ఓటమి కొత్తేమీ కాదు కదా. 1989, 2004, 2009 ఎన్నికలలో ఓడిపోయింది. అయినా ఓటమి ఎరుగని పార్టీ అంటూ ఉందా? ప్రజాస్వామ్యవ్యవస్థలో గెలుపోటములు భాగమే. కానీ, ఎందుకో గత ఓటముల సమయంలో కనబడని నైరాశ్యం ఇపుడు ఎక్కువగా కనబడుతోంది. ఓటమి ఖచ్చితంగా బాధిస్తుంది. కానీ, ఈ ఓటమి ఖచ్చితంగా తెలుగుదేశానికి ఒక కీలక మలుపు వంటిది. ఒకసారి గతం పరిశీలిస్తే తెలుగుదేశం వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ వయసు పైబడుతున్న సమయంలో తరువాత ఎవరు అన్న ప్రశ్న ఉదయించకముందే వెన్నుపోటు లేదా నాయకత్వ మార్పుతో చంద్రబాబు ఆ స్థానం చేజిక్కించుకోవడంతో చర్చకు ఆస్కారం లేకపోయింది. ఇంతవరకూ ఎదుర్కోని 'తరువాత ఎవరు?' అనే ప్రశ్న తెలుగుదేశపు భవిష్యత్తు ముంగిట ఉదయించేలా చేసింది ఈ ఓటమి. బహుశా, గెలిచి ఉంటే లోకేష్ రుద్దబడి ఉండేవాడేమో. కానీ, ఈ ఓటమి అతడి సామర్థ్యాన్ని ప్రశ్నర్థకం చేసింది. సభ్యుడిగా ఉండటం వేరు, పార్టీని నడిపించటం వేరు. అందునా తను ఇంతగా వ్యతిరేకించి, అవమా

... మాది రాయలసీమ

వంశీ కలుగోట్ల // ... మాది రాయలసీమ //  ************************ ****************** రాయలసీమ రౌడీలు  కడప రౌడీలు  పులివెందుల గూండాలు              ఇవీ మన గౌరవ మాజీ ముఖ్యమంత్రివర్యులు మరియు మహా ప్రముఖ నటులు, జనసేనాని అనేక సందర్భాలలో వాడిన పదాలు. నిజంగా రాయలసీమవాసులు వారు పేర్కొనేంతటి కరడుగట్టిన రౌడీలు అయ్యుంటే, రాయలసీమలోకి వచ్చాక సరిహద్దులు దాటి అడుగు బయటకు పెట్టగలిగేవాళ్ళు కాదు. కానీ, తన మీద హత్యాయత్నం చేసిన ప్రాంతం వారిని జగన్ ఏనాడూ రౌడీలనో, హంతకులనో  అనలేదు. ఒక్కరి/కొందరి చర్యలకు, ప్రాంతానికి సంబంధం లేదన్న కనీసపాటి విజ్ఞత లేని వాడిలా ప్రవర్తించలేదు. జరిగిన ప్రతి ఘటననూ ప్రతిపక్షానికే ఆపాదించి, రాయలసీమ రౌడీలని (తనదీ రాయలసీమేనన్న ఇంగిత జ్ఞానం కూడా లేకుండా) ఆయన అనటం; ఆ తరువాత కొన్నాళ్ళకు పులివెందుల గూండాల చర్యలను సహించనని జనసేనాని తందానా తాళమేయడం. ఇంతా చేసి ఆ ఇద్దరి మీదా ఎటువంటి వ్యక్తిగత దాడి కూడా వారు పేర్కొంటున్న ప్రాంతాల వారు చెయ్యలేదు, ఇక ఆ నటుడిపై జరుపడిందని చెప్పబడుతున్న దాడి కూడా ఇప్పుడాయన తందానా తాళమేస్తున్న పార్టీకి చెందినవారే చేశారని గాలివార్తలు.              అయినా అప

... ఆకాశం మీదఉమ్మేస్తున్నారు

వంశీ కలుగోట్ల // ... ఆకాశం మీదఉమ్మేస్తున్నారు //  ***************************************************             ఓడిపోయినవాళ్ళు  కొందరు  జనాలనుతిడుతున్నారు. డబ్బు పంచలేదు, సారా తాపలేదు కాబట్టి ఓడిపోయాం; మతం, కులం పని చేశాయి గట్రా అంటూ తెగ బాధపడుతూ జనాలను కించపరుస్తున్నారు. అయినా మీ అభిమాన హీరో రాజకీయాల్లోకి వచ్చేదాకా జనాలు పట్టని మీరా జనాలను గురించి మాట్లాడేది. ఒక్క విషయంరా అబ్బాయిలూ మరియు అమ్మాయిలూ జనాలను విమర్శించటమంటే ఆకాశం మీద ఉమ్మేయటమే. ఓటమిని హుందాగా అంగీకరించండి. జనాలకు నిజాయితీ కంటే ఎక్కువగా ఆదుకుంటారన్న భరోసా కలిగించగలగాలి. మంచితనం కంటే ఎక్కువగా సమర్థత అవసరం. మంచోడివైతే, నిజాయితీపరుడివైతే గౌరవిస్తారు - కానీ, పాలించాలంటే సమర్థత కావాలి.              నాకు ఇక్కడ సగటు విద్యార్థి తీరు గుర్తొస్తోంది - 'దేవుడా ప్రతి శనివారం గుడికొస్తాను, గుండు కొట్టించుకుంటానని మొక్కుకున్నాను, నూటొక్క టెంకాయలు కొట్టాను, ఇంకా చాలా చేసాను అయినా నేను ఫెయిల్ అయ్యాను; ఏనాడూ గుడికి రాని వాడు పాస్ అయ్యాడు; ఇది దారుణం' అనుకుంటారు చూడు, అలాంటివారిని చాలామందిని చూశాను. విద్యార్థులే కాదు, ఉద్యోగ