Posts

Showing posts from April, 2020

వంశీ వ్యూ పాయింట్ // ... 'ఆమిర్' (2008) //

క్వారంటైన్ ఫిలిం సజెషన్స్ -  1  ( క్వారంటైన్ అనే కాదు, జనరల్ గా కూడా)   వంశీ వ్యూ పాయింట్ // ... 'ఆమిర్' (2008) // ***************************************             నిద్దర్లో ఏదైనా పీడకల వస్తే, మెలకువ వచ్చాక తిరిగి నిద్రపోలేం - ఆ కల కలవరపెడుతుంది. జీవితంలో ఏదైనా అనుకోని షాకింగ్ ఘటన జరిగితే, కోలుకోవటానికి చాలాకాలం పడుతుంది. మనమెక్కడో దూరంగా ఉంటాం లేదా దూర ప్రాంతానికి వెళ్లి - తిరిగి మన ఊరు రాగానే - బస్సు స్టాండ్/రైల్వే స్టేషన్/ఎయిర్పోర్ట్ లో ఉండగానే ఎవరైనా ఫోన్ మీ కుటుంబ సభ్యులను కిడ్నాప్ చేశాం అని చెబితే ఎలా ఉంటుంది - బాధ, కోపం, ఉద్వేగం ఏమో మనం ఎన్ని రాసుకున్నా, అది అనుభవించేవాడికి ఒక తీవ్ర కష్టం. లండన్ నుండి కుటుంబాన్ని కలవడానికి వచ్చిన ఆమిర్ కు ఎయిర్పోర్ట్ లో ఉండగానే అలాంటి ఒక ఫోన్ కాల్ వస్తుంది. ఇక అక్కడి నుండి ఆమిర్ వాళ్ళు ఫోన్ లో చెప్పే రీతిలో చేయక తప్పని పరిస్థితులు కల్పిస్తూ, అతడి చేత తాము అనుకున్నపని చేయించాలని కనిపించని విలన్స్ చేసే ప్రయత్నమే ఆమిర్.              ఇవాళ్టి రోజుల్లో మనం అనేక ఆత్మాహుతి దాడుల గురించి వింటున్నాం. అందులో నిజంగా మూర్ఖంగా సిద్ధాంతా

... రెండు మాటలు

వంశీ కలుగోట్ల // ... రెండు మాటలు // ****************************** **             మొదటిది - ప్రధానమంత్రి మాట్లాడిన ప్రతిసారీ ముఖం చాలా బాధగా పెట్టి, ఏదేదో మాట్లాడుతున్నారు కానీ వలసకూలీల సమస్యల గురించి ప్రస్తావించటం లేదు. స్వాన్ (స్ట్రాండెడ్‌ వర్కర్స్‌ యాక్షన్‌ నెట్‌వర్క్‌) దేశవ్యాప్తంగా ఏప్రిల్‌ 9వ తేదీ వరకు (ఇవాళ 29 వ తేదీ, ఈ ఇరవై రోజుల్లో ఇంకెన్ని జరిగాయో అధికారిక లెక్కలు నాకైతే తెలియదు) 11 వేల మంది వలస కార్మికులను విచారించగా లాక్‌డౌన్‌‌ కారణంగా 189 మంది వలస కార్మికులు మరణించారు. వీరిలో ప్రయాణంలో ప్రాణం విడిచిన వారు, ఆకలితో మరణించినవారు, స్వీయమరణాలు పొందిన వారు ఉన్నారు. దేశవ్యాప్తంగా చిక్కుకుపోయిన లక్షలాది మంది వలస కార్మికుల్లో కేవలం ఆరు లక్షల మందికి వసతి కల్పించినట్లు, దాదాపు 22 లక్షల మందికి ఆహారం అందజేస్తున్నామని కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్‌ ఒకటవ తేదీన సుప్రీం కోర్టుకు తెలియజేసింది. ‘స్వాన్‌’ నిర్వహించిన సర్వే ప్రకారం 84 శాతం వలస కార్మికులకు యాజమాన్యం వేతనాలు చెల్లించలేదు. వారిలో 98 శాతం మంది ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆర్థిక సహాయం పొందలేదు. 70 శాతం మందికి రేషన్‌ అందలేదు. 50 శాతం మ

... ఒక తమ్ముడికి ఉత్తరం

వంశీ కలుగోట్ల // ... ఒక తమ్ముడికి ఉత్తరం // ****************************** ******** తమ్ముడూ నీవంటావు, కష్టాలు చుట్టుముట్టాయి, అయినవారు పట్టించుకోవట్లేదు ఇక దారి లేదు అని నిష్క్రమించే ఆలోచనలు వెంటాడుతున్నాయిని కానీ, కష్టాలు చుట్టుముట్టినపుడు, అవమానాలు ఎదురైనపుడు, అయినవారు అండగా లేనపుడు, కాలం కాలికిందేసి నలిపేయాలని ప్రయత్నించినపుడు - ఒకడు వివేకానందుడు అయ్యాడు - ఒకామె సావిత్రి అయింది - ఒకామె తలైవి జయలలిత అయింది - ఒకడు అమితాబ్ అయ్యాడు - ఒకడు చిరంజీవి అయ్యాడు - ఒకడు ఏ ఆర్ రెహమాన్ అయ్యాడు - ఒకడు పూరి జగన్నాథ్ అయ్యాడు - ఒకామె కంగనా రనౌత్ అయ్యింది . కష్టాలు చుట్టుముట్టినపుడు అవమానాలు ఎదురైనపుడు అయినవారు అండగా లేనపుడు తమ్ముడా, కష్టాలు మనుషులకు కాక మాన్లకు వస్తాయా అని ఊరడించను పోరాడమని మాత్రం చెప్తాను నీ కష్టాన్ని మరొకరు అనుభవించలేరు మరి నీ విజయాన్ని ఎందుకు మరొకరు ఆపగలుగుతున్నారు? తమ్ముడూ నీది ఒక నిండు జీవితం కష్టం బతుకెంత? దాని ఆయుష్షు ఎంత? నువ్వు గట్టిగా పోరాడితే పోయే ప్రాణం దానిది అటువంటి కష్టానికి ఎందుకు కృంగిపోతావు లే ... జస్ట్ కీప్ గోయింగ్, జస్ట్ కీప్ గోయింగ్ గుర్తుంచుకో తమ్ముడా ... రేపొక

... విషయమా, వ్యక్తా - ఏది ముఖ్యం?

వంశీ కలుగోట్ల // ... విషయమా, వ్యక్తా - ఏది ముఖ్యం? // ****************************** ******************             చాలామంది అడిగే ప్రశ్న ఏంటంటే వ్యక్తి ముఖ్యమా లేక విషయం ముఖ్యమా? ఆచరించకుండా ఒక వ్యక్తి ఏదైనా చెబితే, దానికివిలువిస్తారా? కేవలం విషయం మాత్రమే ముఖ్యం అనుకుని ఉండే ప్రపంచంలో ఇంతమంది సద్గురువులు, పీఠాచార్యులు, వివిధ శాఖల అధిపతులు ఉండేవారు కాదు. వ్యక్తి ముఖ్యమా, విషయం ముఖ్యమా అన్నదానికి సమాధానం చెప్పడం కష్టం - ఎందుకంటే ఇది మ్యాథమెటిక్స్ లాంటిది కాదు. ఏవేవో సూత్రాల ఆధారంగా ఇది కరెక్ట్ అని చెప్పలేం. అది ఒక సమూహం మీద ఆధారపడి ఉండవచ్చు, ఆ సమూహంలోని జనాల ఆలోచనలను బట్టి ఉండవచ్చు. చాలామంది అటూ ఇటూగా కాకుండా వ్యక్తి ముఖ్యమే మరియు విషయమూ ముఖ్యమే అంటారు; మరికొందరు వ్యక్తి ఎటువంటివాడైతేనేం విషయం ముఖ్యం అంటారు ... ఇలా పలు రకాలుగా చెప్తారు. నా ఉద్దేశంలో అయితే మనం ఆ విషయం సమాజం మీద చూపాల్సిన ప్రభావం ఏమిటి అన్న అంతిమ లక్ష్యం ఆధారంగా దీన్ని చూడాలి. ఎందుకంటే చెప్పే వ్యక్తి మీద ఆధారపడి ఆ విషయం సమాజమే మీద చూపే ప్రభావం ఉంటుంది. కరోనా జాగ్రత్తల గురించి నేనో, నువ్వో చెపితే పట్టించుకోవటానికి - చిర

... తప్పెవరిది?

వంశీ కలుగోట్ల // ... తప్పెవరిది? // *****************************             2009/10 ప్రాంతంలో అనుకుంటా ఒకసారి వెహికల్ అవసరమైనపుడు, మంచాలకట్ట శ్రీనివాస రెడ్డి అన్న గడివేముల నుండి ఒక డ్రైవర్ ను వెహికల్ తో పంపారు, అతడి పేరు రసూల్. అప్పటినుండి ఇప్పటి వరకూ ఎపుడు వెహికల్ అవసరమైనా అతడే. మేము పిలిస్తే, అప్పటికప్పుడు మిగతా బుకింగ్స్ ఏవైనా ఉంటే క్యాన్సల్ చేసుకుని వస్తాడు. ఇటీవల ఒకసారి నేను ఊరెళ్ళినపుడు అతడి వెహికల్ లోనే కర్నూలు వచ్చాను. అనుకోకుండా ఒక బంధువుకు ఒక అర్జెంటు/సీరియస్ పని ఉండటంతో రసూల్ వాళ్ళను తీసుకుని బెంగుళూరు వెళ్లాల్సి వచ్చింది. దాంతో అప్పటికపుడు గడివేములలో వేరే వెహికల్ డ్రైవర్ కి ఫోన్ చేసి, రమ్మన్నాడు. ఒక గంటన్నరకు ఆ వెహికల్ వచ్చింది. కర్నూలులో పనులు చూసుకుని, సాయంకాలానికి రిటర్న్ బయలుదేరాం.  సాధారణంగా నేను లాంగ్ జర్నీస్ లో కూడా నిద్రపోను. వీలయితే పుస్తకం చదువుతాను లేదంటే మనుషులను (హ హ). సో, ఆ ప్రయాణంలో పుస్తకం చదివే సౌలభ్యం లేకపోవడంతో ఆ డ్రైవర్ తో మాట్లాడటం మొదలుపెట్టాను. అప్పటికింకా ఈ కరోనా/కోవిద్ - 19 హడావుడి మొదలవలేదు. చర్చ రాజకీయాలవైపు మళ్ళింది. చెప్పానుగా అప్పటికింక

... మరో యుద్ధానికి సిద్ధంగా ఉండాల్సిందే

వంశీ కలుగోట్ల // ... మరో యుద్ధానికి సిద్ధంగా ఉండాల్సిందే // ****************************** *********************             "రాజు తెలివైనవాడైతే యుద్ధం గెలవడానికి మాత్రమే కాదు, యుద్ధం ఓడిపోతే ఏం చేయాలో కూడా వ్యూహం ఆలోచిస్తాడు. యుద్ధంలో జయాపజయాలను ఊహించలేం, కాబట్టి ఓడిపోతే మనముందు ఉన్న మార్గాలేంటి (యుద్ధంలో ప్రాణాలు కోల్పోకపోతే) అన్నది, యుద్ధానికి ముందుగానే సమీక్షించుకోవాలి." ఇపుడు మనం అలానే ఆలోచించాలి. మనముందు ఉన్న తక్షణ సమస్య, కరోనా మరియు లాక్డౌన్ ని ఎదుర్కోవటమెలా అన్నదే కావచ్చు. కానీ, కరోనా అదుపులోకొచ్చాక ఉండబోయే పరిస్థితులు అత్యంత దారుణంగా ఉండబోతున్నాయన్నది నిజం. గతంలో వచ్చిన ఆర్ధికమాంద్యాలు ప్రత్యేకించి కొన్ని రంగాలకు పరిమితమైనవి. కానీ, ఇపుడు అలా కాదు. ప్రతి రంగం కరోనా దెబ్బకు కుదేలైంది. అది కూడా ఏదో పది దేశాలో లేక ఇరవై దేశాలో కాదు - పెద్దన్న అమెరికా దగ్గరనుండి ప్రతి ఒక్క దేశం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనబోతోంది. కరోనాకు మందు కొనగొనబడనంతవరకూ, దాన్ని అదుపు చేయడానికి చర్యలు చేపట్టడం తప్ప మరేమీ చేయలేని పరిస్థితుల్లో ఉన్నారు అందరూ. వ్యక్తిగత శుభ్రత పాటించటం, భౌతిక దూరం పాట

'డాక్టర్ సుధాకర్ గారు - ప్రభుత్వం' ఉదంతంలో విషయంలో కొన్ని ప్రశ్నలు

డాక్టర్ సుధాకర్ గారు - ప్రభుత్వం ఉదంతంలో విషయంలో కొన్ని ప్రశ్నలు -> సుధాకర్ గారు మాస్క్స్ మరియు గ్లోవ్స్ వంటివాటి కొరత గురించి తన పై అధికారులనో లేక అధికార వర్గాలనో సంప్రదించారా? సంప్రదించి ఉంటే వారు వాటిని ఇవ్వటానికి నిరాకరించారా లేక సరఫరా లేదు కాబట్టి సర్దుకోవాలన్నారా లేదా మరేదైనా సమాధానమిచ్చారా? -> ఒకవేళ పై అధికారులనో లేక అధికార వర్గాలనో సంప్రదించలేదు అంటే - అలా ఎందుకు చేయలేదు? పై స్థాయి వర్గాలను సంప్రదించకుండా ఎవరైనా అడ్డుకున్నారా? -> అయ్యన్న పాత్రుడు గారిని కలవడం తప్పు కాకపోవచ్చు. కానీ, కలిసి వచ్చిన వెంటనే ఆరోపణలు చెయ్యడం, ఆయన్నీ కలిసి హాస్పిటల్ దగ్గరకు వచ్చే సమయానికి అటూఇటుగా విలేఖర్లు హాస్పిటల్ దగ్గరకు రావటం - వీటన్నిటికీ ఒకదానికి మరొకదాన్ని లింక్ ఉందా లేదా? లేక కేవలం కాకతాళీయమేనా? -> మాస్క్స్, పిపిఈ సూట్స్, గ్లోవ్స్ వంటి వాటి కొరత నిజమే అయినప్పటికీ; వాటి గురించి సంప్రదించవలసింది మీడియాను కాదు కదా. అధికార వర్గాలను సంప్రదించి ఉంటే, వారి స్పందన ఏంటో చెప్పవచ్చు కదా. -> వీటి కొరత అన్నది మన రాష్ట్రానికి మాత్రమే పరిమితమైనది కాదు. అలాగని ప్రతి ప్రాంతంలో కొరత