గిరీశం - త్రివిక్రమ్


వంశీ కలుగోట్ల // ... గిరీశం - త్రివిక్రమ్ //

****************************
శుక్రవారం వచ్చిందంటే మాకు పార్టీయే, రూమ్మేట్స్ అందరం కలిసి మందు తాగడం, ఏదో ఒక టాపిక్ మీద తెల్లారేవరకు చర్చ పెట్టుకోవడం. నిజం చెప్పాలంటే దాన్ని చర్చ అనడం కంటే మా గిరిగాడి బోధనా కార్యక్రమం అనటం మేలేమో. రెండు పెగ్గులు లోపలికి వెళ్ళే దాకా సైలెంట్ గా ఉంటాడు మా గిరి. రెండో పెగ్గు పడిన ఒక ఐదు నిమిషాల తరువాత మొదలవుతుంది గిరీశోపాఖ్యానం. టాపిక్ ఇదీ అంటూ ఏమీ ఉండదు, ఒక్కోసారి ఒకే టాపిక్ మీద లేదంటే ఒక నాలుగైదు టాపిక్స్ మీద అది ఆ రోజు గిరిగాడి మూడ్ ని బట్టి ఉంటుంది. మేమందరం వాడిని సరదాగా గిరీశం అంటుంటాం. కన్యాశుల్కం లోని గిరీశానికి మా గిరికి దగ్గరి పోలికలు ఉంటాయి కూడా. కాకపోతే మావోడికి రెండు పెగ్గులు పడాలి.

గ్లెన్ ఫిడిచ్ విష్కి, సోడా, ఐస్ క్యూబ్స్, చిప్స్ గట్రా సరంజామా అంతా రెడీగా పెట్టుకుని మొదలెట్టాం. ఒకటో రౌండ్ పూర్తయ్యింది - టాపిక్ రాజకీయాలు, క్రికెట్ అయిపోయాయి. గిరి గాడు మేమంతా మాట్లాడేది వినడం తప్ప ఇంకా నోరు తెరవలేదు, తర్వాత మాకెలాగూ ఛాన్స్ ఉండదు కాబట్టి ముందే మా మాటలన్నీ మాట్లాడేసుకుంటున్నాం. రెండో పెగ్గు అయిపోయి ఐదు నిమిషాలు అలా అయ్యిందో లేదో గిరి గొంతు వినిపించింది.

"అరేయ్ మస్తు క్లాసు సినిమాలు తీస్తాడు, మస్తు డైలాగులు రాస్తాడు, పంచులు సూపర్ గా యేస్తాడు అని అనుకుంటాం ఈ త్రివిక్రమ్ కి పొగరు బాగా ఎక్కువ మామా."

"అదేంటిరోయ్ పుసుక్కున అంత మాట అనేసావ్, త్రివిక్రమ్ వింటే ఫీలవుతాడు లేదా పంచ్ లు వేస్తాడు"

"అరేయ్ నేను రెండు పెగ్గులేసాక నేను మాట్లాడింది మీరు వినాలి తప్ప ఎదురు మాట్లాడకూడదురోయ్, అదేదీ పూరి జగన్నాథ్ సేప్పినట్టు గిల్లితే గిల్లిన్చుకోవాలి తప్ప అరవకూడదు"

"పూరి జగన్నాథ్ గిల్లిన్చుకోమన్నాడంటావా గిరీ"

"అరేయ్ వాడిని సేప్పనియ్యండిరా, మామా ఆ ఎదవల్ని పట్టించుకోకు నువ్వు సెప్పురా" అంటూ జడ్జి లెక్క మా అందరికీ పెద్దమనిసిలా ఉండే వెంకటేశం సర్ది సెప్పి కథ ముందుకు నడిపాడు.

"ఇంతకీ నేనేం సేప్పోచ్చాను ఇంతకుముందు ... "

"అదేరా త్రివిక్రమ్ కి పొగరెక్కువ అని ... "

"ఆ ఆ అదేరా త్రివిక్రమ్ కి పొగరు బాగా ఎక్కువ, పొగరు అంటే అదీ మామూలు పొగరు కాదు మగోడికుండే పొగరు, దాన్ని ఇంగిలీసులో ఏమంటారు దీంతల్లి నోట్లో నాన్తావుంది కానీ రావట్లేదు - ఆ ఆ అదేరా మేల్ ఇగో, తత్రివిక్రమ్ హస్ గాట్ మేల్ ఇగో టు ది పీక్స్"

"అబ్బో ఆంగ్లం తన్నుకొచ్చెత్తన్ది మామోవ్ ... సరే సెప్పు సెప్పు"

"అట్టా కాదు మామా మనం త్రివిక్రమ్ తీసిన సినిమాలన్నీ సూసినం కదా ... ఏ సినిమాలో అయినా గానీ హీరో హీరొయిన్ యెంట బడతాడా లేదే ఏ? ఏ సినిమా సూసినా హీరోయిన్ అచ్చి హీరో ఎనకాతల బడాల్సిందే. ఇంకా హీరో హీరోయిన్ ని తిట్టడం లెక్కటివి సేస్తాంటాడు. ఆడోల్లంటే త్రివిక్రమ్ కి ఎందుకంత అలుసు మామా? ఏది ఆడోల్లు లేకుండా ఒక్క సినిమా తియ్యమను సూద్దాం. ఏమైనా గాని త్రివిక్రమ్ కి మగపొగరు బాగా ఎక్కువ మామా."

"అయితే ఇప్పుడు ఎం సేద్దామంటావ్ త్రివిక్రమ్ ని"

"ఏం సేయ్యడమేంటిరా బాబూ మనం త్రివిక్రమ్ బొమ్మ పెట్టుకుని దణ్ణం పెట్టుకోవాలి"

"అదేందిరోవ్ నువ్వు త్రివిక్రమ్ ని తిడతావున్నావనుకున్నా ఇంతసేపు"

"తిట్టడం కాదురా ... మగోడు అంటే సిత్తకార్తె కుక్కలెక్క అన్నట్టు సూపించే ఎదవలు ఉన్న ఈ రోజుల్లో త్రివిక్రమ్ లాంటి మగపొగరు ఉన్నోడు, మగోడికి కూడా మనసు ఉంటాది, వాడు కూడా గొప్పోడే అని సూపిత్తన్నాడు కదరా. జై త్రివిక్రమ్, జై జై త్రివిక్రమ్ ... జై త్రివిక్రమ్"

అప్పటికే త్రివిక్రమ్ ని పొగిడే క్రమంలో ఎన్ని పెగ్గులు తాగాడో లెక్క చూసుకోకుండా తాగేసిన గిరి కిక్కెక్కువై స్లీపేసాడు. 

*                               *                                *
... ఇంకేముంటాదిరా భాయి. తాగాడు, వాగాడు, పడుకున్నాడు. మళ్ళీ తాగినప్పుడు ఏదో ఒకటి చెప్తాడులే. ఇప్పటికైతే జై త్రివిక్రమ్, జై గిరీశం.

Comments

Popular posts from this blog

... మూడో కూటమి

... కరోనా కంటే ఎక్కువగా భయపెడుతున్న అంశం?

... 2019 ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు - జనసేన