... మూడో కూటమి

వంశీ వ్యూ పాయింట్ // ... మూడో కూటమి //
**************************************
            తెలంగాణాలో ఎన్నికలు వచ్చినపుడు కెసిఆర్ గారు జాతీయ స్థాయిలో మోదీకి వ్యతిరేకంగా మూడో కూటమి ఆలోచనలు చేశారు, అనేకమందిని కలిశారు. ఎన్నికల అనంతరం ఆ కూటమి ఏమైందో తెలియదు. ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు వచ్చినపుడు చంద్రబాబు నాయుడు గారు మోదీకి వ్యతిరేకంగా విస్తృతస్థాయిలో ప్రచారం చేశారు, అనేకమంది ప్రాంతీయ నాయకులను కలిసి కలిసి, కొత్త కూటమి కోసం విశ్వప్రయత్నాలు చేశారు. అయితే ఎన్నికల అనంతరం ఆయన చరిత్రలో ఎరుగని ఓటమితో కుదేలయ్యారు. మోదీ మాట్లాడటానికి  కూడా సాహసించటం లేదు.  పశ్చిమ బెంగాల్ లో ఎన్నికలు జరుగుతున్నాయి - దీదీ దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందని, మూడో కూటమి ఏర్పడవలసిన అవసరం ఉందని అనేకమంది ప్రాంతీయ నాయకులకు ఉత్తరాలు రాశారు. కొత్త కూటమికి ప్రయత్నాలు చేస్తున్నారు.
            వీళ్ళంతా తమకు కాసింత సెగ తగలగానే ఎగిరెగిరిపడి, ఆ తరువాత నిమ్మకుంటున్నారు. కారణాలు, అవసరాలు ఏవైనా ఒక్క కాంగ్రెస్ మినహాయించి వేరే ఏ పార్టీ కూడా మోదీకి వ్యతిరేకంగా స్థిరంగా పోరాడటం లేదు. కాంగ్రెస్ కు శక్తి సరిపోవడం లేదు, మిగతావారు ఎందుచేతనో కాంగ్రెస్ తో కలవడం లేదు. కాబట్టి ప్రస్తుతానికి మోదీకి ఎదురు లేదనే భావించవచ్చు. దీని అర్థం మోదీకి ప్రజల్లో మద్దతు ఉందని కాదు, ప్రజలు వేరేవారిని సరైన ప్రతిమన్యాయంగా చూడలేకపోతున్నారని. ఆ అలుసుతోనే మోదీ ప్రభుత్వం పేట్రేగిపోతోంది.
            మూడో కూటమి అయినా, నాలుగో కూటమి అయినా - మిగతావారు గమనించవలసింది ఏంటంటే కాంగ్రెస్ ను కలుపుకుపోని ఏ కూటమి అయినా భాజపా కూటమికి వ్యతిరేకంగా మనలేదు. దీనికి కారణాలు ఆయా కూటమికి నాయకత్వం వహించటానికి తయారయ్యే నాయకులకు ప్రాతీయ ప్రయోజనాలు, ప్రాంతీయ స్థాయిలో అధికారం సాధించడం/కాపాడుకోవడం అన్నవి ప్రధమ ప్రాధాన్యాలు తప్పించి కేంద్ర స్థాయిలో ఇప్పటికిపుడు అధికారం సాధించడం కాదు. దీనికి ఒక్క కాంగ్రెస్ మాత్రమే మినహాయింపు, ఎందుకంటే అది నిఖార్సైన జాతీయ పార్టీ కాబట్టి. భాజపా కూటమికి వ్యతిరేక కూటమిగా ఏది ఏర్పడినప్పటికీ అది కాంగ్రెస్ నాయకత్వంలో లేకపోతే ప్రయోజనం శూన్యం.
            భాజపా మరియు మోదీ పట్ల ప్రజలలో ఉన్న వ్యతిరేకతను జాతీయ స్థాయిలో ఉపయోగించుకుని, మోదీ/భాజపాను గద్దె దించాలంటే ప్రాంతీయ నాయకుల కూటమి కాంగ్రెస్ ను కలుపుకుపోవాల్సిందే. ఈ విషయం అర్థం చేసుకుని, పాటించనంతవరకూ లేదా ప్రజలే ప్రత్యామ్న్యాయంతో సంబంధం లేకుండా మోదీని గద్దె దించాలని నిర్ణయించుకునేంత దూరం వెళ్ళేవరకూ మోదీకి, భాజపా ప్రభుత్వానికి ఢోకా లేదనే చెప్పవచ్చు. చూద్దాం ... శివయ్య ఏటనుకుంటాన్నాడో మనకు తెలీదు కదా  

Comments

  1. Good analysis.

    However, it is unlikely that what you suggest will actually happen. Most of the alternative parties including Congress are morally, politically, and ideologically bankrupt. Their goals are also so diverse - from political and personal gain to harvesting minority vote banks. Just look at the farce that is called government in Maharashtra. Even the Congress party's leadership is laughable. It has ceased to be a national party long time ago. It is either in critical care or on death bed. It has been trying to get a credible permanent president for a long time with no success yet. The so called regional fellows aspiring to national wannabes (KCR, Babu Naidu, Mamata Begum, Sarad Pawar, and other sundries) cannot muster a sizeable gathering of audiences outside of their States.

    ReplyDelete
  2. జాతీయ స్థాయి నాయకుడు లేకుండా మూడో కూట‌మి సాధ్యం కాదు.

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

... కరోనా కంటే ఎక్కువగా భయపెడుతున్న అంశం?

... 2019 ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు - జనసేన