మోడీ దేవుడు కాదు ...

మోడీ దేవుడు కాదు ...
*******************
మోడీ గారిని అభిమానించండి, ఆరాధించండి, ఆదర్శంగా తీసుకోండి; కాని మోడిని దేవుడిగా మార్చకండి, చూడకండి. అలా జరిగితే దేవుడి పేరు చెప్పుకునే పూజారుల గోల ఎక్కువవుతుంది. అలనాటి రాముడి కాలం నుండి మనలో పేరుకుపోయిన వ్యక్తి పూజా విధానం మనల్ని ఎప్పుడు   ఎవరో ఒకరికోసం ఎదురు చూసేలా చేస్తోంది, ఎవరో ఒకరు మార్పు కోసం పోరాడితేనో, కూసింత మంచి   చేస్తోనో అతగాడిని అవతారపురుషుడిగా కీర్తించడం, ఆ పేరు చెప్పుకునే పూజారుల ఆగడాలతో అవస్థలు పడటం. ఆ వ్యక్తులు పాటించిన ఆదర్శాలు, వాళ్ళు నేర్పిన విలువలు, నెలకొల్పిన ప్రమాణాలు మాత్రం పుస్తకాలలో, శిలా ఫలకాలలో భద్రంగా మనకు దూరంగా ఉంచటం అంతే. మోడీ మీద విశ్వాసం ఉంచండి, మూఢ నమ్మకంతో మూర్ఖపు అభిమానం మాత్రం పెంచుకుని ఆయనను దేవుడిగా కీర్తించకండి. ప్రధానిగా సమర్థంగా మేసలుకునే స్థాయి నుండి తనే సర్వస్వం అనుకునే స్థాయి  పోకడలదాకా మోడీని తీసుకెళ్తే భరించాల్సింది, అనుభవించాల్సింది మనమే. ఒక్క మోడీ మాత్రమె కాదు మనం కూడా మన భాధ్యతలను సమర్థంగా నిర్వాహించగాలిగిన నాడు మనకు ఇలా మోడీ లాంటి వాళ్ళ కోసం ఎదురు చూడాల్సిన అవసరం రాదు. మోడీ దేవుడు కాదు ... ఒక మామూలు మనిషి, ఒప్పులే కాదు తప్పులు కూడా చేస్తాడు; అలాంటి తప్పులు దిద్దుకోగాలిగాడు కాబట్టే టీ అమ్మే స్థాయి నుండి ప్రధాన మంత్రి స్థాయికి ఎదిగాడు.

Comments

Popular posts from this blog

... మూడో కూటమి

... కరోనా కంటే ఎక్కువగా భయపెడుతున్న అంశం?

... 2019 ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు - జనసేన