అత్తారింటి కోడలు

అత్తారింటి కోడలు
*************
అలా కొంత కాలం వెనక్కెలదాం - అది 1970/1980 ప్రాంతాలు అన్నమాట. ఒక అందమైన కుందనాల బొమ్మలాంటి అమ్మాయి, సుగుణాల భరిణ లాంటి అమ్మాయికి పెళ్లి అయ్యి అత్తారింటికి వెళ్ళింది. పుట్టింటి వారు మరీ అంత ఉన్న వారేమీ కాకపోయినా ఉన్నంతలో కాస్త వెతికి మంచి సంబంధమే చేసారు. అబ్బాయి మంచోడే అని అందరూ అంటుంటారు. పెళ్ళైన కొత్తలో పుట్టింటి వారు చూడటానికి వెళ్ళినా, అమ్మాయి పుట్టింటికి వచ్చినా బాగుండేది, అమ్మాయి మొఖంలో ఆ ఆనందం, కళ బావుండేవి. అంటా బాగుంది అని అందరూ సంతోషంగా ఉండేవారు. పెళ్ళైన మూడేళ్లకి కొంచం అటూ ఇటూగా ఒక పాప పుట్టింది. అంతా బాగానే ఉండేది.
ఈ మధ్యనే కాస్త తేడాలు తెలియడం మొదలైంది. ఎందుకో, ఏమైందో తెలీదు అమ్మాయిని చూడడానికని అమ్మా, నాన్నలు వెళితే; అత్తా మామలు వెంటనే బయటకేల్లెవారు, ఇంట్లో ఉన్నా పెద్దగా పలకరించకుండా ముఖం ముడుచుకుని కూచునేవారు. అమ్మాయి ముఖంలో మునుపటి కళా కాంతులు కూడా లేవు. పలకరింపులో కూడా ఏమి మాట్లాడితే ఏమవుతుందో అని తూకం వేసుకుని మాట్లాడినట్టు మాట్లాడుతోంది. ఏమైందో అడుగుదామా అనుకుంటే అమ్మాయి ఒంటరిగా దొరకట్లేదు. భర్త, అత్తమామల కత్తెర కాపలాలో మామూలుగా మాట్లాడాలంటేనే కష్టమవుతోంది. పుట్టింటికి పిలుచుకేలదామా అంటే ఇప్పుడెందుకు, అప్పుడెందుకు అంటూ అలా వాయిదాలు వేస్తున్నాడే తప్ప అల్లుడు అమ్మాయిని పంపట్లేదు.
ఆ రోజుల్లో ఇలాంటివి చాలా చాలా మామూలు సందర్భాలు. కన్నీళ్ళతో, గుండె బరువుతో చచ్చేదాకా అలాగే భరించేవారు ఇలాంటివి అప్పట్లో. అదే ఇప్పట్లో అయ్యుంటే ఏ వరకట్న వేధింపుల కేసు లేదా మరోటి; ఇంకా కావాలంటే గోరంతను కొండంతలు చేసే మీడియా అండ చూసుకుని మరోలా ఉండేది పరిస్థితి. కానీ అప్పట్లో అవేమీ లేవు; అంత ధైర్యమూ లేదు కాబట్టి అలా జరిగిపోయింది. పాపం ఆ అమ్మాయి అనుకోవడం తప్ప అప్పట్లో చెయ్యగలిగేదేమీ ఉండేది కాదు.
ఇప్పుడు ఇదే కథను 2014/15 కు అన్వయించి చెప్పుకుందాం.
పవన్ కళ్యాణ్ లాంటి అమ్మాయి, చిరంజీవి లాంటి తల్లి తండ్రులు, చంద్రబాబు లాంటి భర్త, మోడీ లాంటి అత్తమామలు. ఈ 'లాంటి' వాళ్ళ మైండ్ సెట్ లు మాత్రం ఆ 1970/80 ల అమ్మాయి, తల్లిదండ్రులు, అత్తామామలు, భర్త తీరులాంటివే అన్నమాట. ఉదాహరణకి 1970/80 లలో ఆ అమ్మాయిని పిలిచి 'అత్తింట్లో ఎలా చూసుకుంటున్నారు అమ్మాయ్' అని అడిగితే నోటితో 'చాలా బాగా చూసుకుంటున్నారు' అని చెప్పినా కనురెప్పల చివరల కదలాడే నీటిపొర నిజాన్ని దాచలేదు. కానీ అలా అని కాపురాన్ని కూల్చుకోలేదు, కూల్చుకోమని మనం కూడా చెప్పలేము. అప్పట్లో 'పాపం ఆ అమ్మాయి' అనుకునే వాళ్ళు. అంతకు మించి ఆ అమ్మాయిని ఎవరైనా తిట్టడం, కొట్టడం, అరవటం లాంటివి చేసేవారా? అసలే ఆరళ్ళు పడుతోంది పాపం మళ్ళీ ఇబ్బందులు పెట్టటం ఎందుకు అనుకోవడం తప్ప.
పాపం పవన్ కళ్యాణ్. పరిస్థితిని అర్థం చేసుకోవాలి తప్ప మనమూ నాలుగు రాల్లేస్తే ఎలా? 'కరవమంటే కప్పకు కోపం విడవమంటే పాముకు కోపం' పవన్ మాత్రం ఎం చెయ్యగలడు పాపం. 

Comments

Popular posts from this blog

... కరోనా కంటే ఎక్కువగా భయపెడుతున్న అంశం?

... మూడో కూటమి

... 2019 ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు - జనసేన