గడ్డం జిందాబాద్

గడ్డం జిందాబాద్
*************
"ఏందిరా సాంబడు సాములోరి మాదిరి అట్టా ఇంత పొడువున గడ్డం పెంచినావు"
"ఓయ్ సాములోరి లెక్క ఏందిరా రాజకీయ నాయకుని లెక్క అను ఒప్పుకుంటా"
"కొత్తగా ఇదేందిరా, రాజకీయాల మీద గాని మనసు మళ్ళిందా ఏంటి?"
"అవున్రా ... దాని కోసమే గడ్డం పెంచుతున్నా."
"ఇదేం లింకురా - ఆడెవడో సేప్పినట్టు బోడిగుండుకి మోకాలికి లింకేముంటాది?"
"అరే తెలీకపోతే తెలీనట్టుండాలి గాని సామెతలు సేప్పకూడదురోయ్ ... నువ్వేమన్నా త్రివిక్రమ్ అనుకున్నావా పంచ్ లేయనీకి?"
"అబ్బా ఈ త్రివిక్రమ్ జనాలందరికీ పంచ్ పిచ్చి ఎక్కించి సేడగోట్టాడు. సర్లే గాని సాంబడు నీ గడ్డం కతేందో సెప్పు ..."
"అరె ఈ గడ్డం అడ్డమనుకుంటాం గానీ గడ్డం శానా అదృష్టం తెస్తాదిరోయ్ ... సప్పోస్ ఉదాహరణకి మన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారిని తీస్కో, ఆయన ఎప్పుడైనా రాజకీయాల్లో ఉన్నాడా, పోటీ గిట్ల సేసినాడా ఏకంగా ప్రధాన మంత్రి ఐపోయిండు ఎందువల్లసేతనంటే గడ్డం వల్ల. అంతెందుకు, మన మోడీగారిని సూడు, ఎప్పుడు సూసినా గడ్డంతోనే ఉంటాడు. అనుకున్నామా, మల్ల ఒక్క పార్టీకే ఫుల్లు మెజారిటీ వస్తాదని ఎవడన్నా కలగన్నాడా? ఎందువల్లసేత వచ్చిందనుకుంటున్నావు - మోడీ గడ్డం మైంటైన్ సెయ్యడం వల్లసేతనేరా!!!"
"ఎట్టెట్టా గడ్డం వల్ల మన్మోహన్ ప్రధాన మంత్రి ఐపోయాడా ... వార్నీ బయట జనాలతో అనేవురోయ్ అందరూ గడ్డాలు పెంచుకుని బేవార్సుగా తిరిగేయ్యగలరు."
"నీకు నవ్వులాట లెక్కున్నట్టుంది. గడ్డం సత్తా ఏంటో నీకు తెలీట్లేదురా. మా సిన్నన్నయ్యను సూడు గడ్డం పెంచుకున్నప్పుడు సింహం లేక్కుంటాడు, పులి లెక్క మాట్టాడతాడు. మా సామిని సూసే నేను కూడ గడ్డం పెంచనీకి డిసైడ్ ఐన. అంతెందుకురా నీకో సీక్రెట్ సేప్పనా ... ఇంతకు ముందు ఎలెచ్చన్లప్పుడు మా సిన్నన్నయ్య మీసం పెంచి పెద్దన్నయ్య కోసం ప్రస్నిన్చిండు ఏమైంది - ఏం కాలే అందుకని ఈ పారి గడ్డం పెంచి ప్రచారం సేసిండు ఏమైందో నీకు తెల్సు కదా."
"ఇంకా ఏమైనా ఉన్నాయారా గడ్డం సంగతులు ..."
"సివరాఖరుగా నీకో మాట సెప్తా ఇనుకో ... గడ్డం ఉన్నోళ్ళు కేవలం ప్రశ్నిస్తారు తప్ప సమాధానాలు చెప్పడం కష్టంరోయ్. క్వశ్చనేస్తే ఎదురు క్వశ్చనేస్తారు తప్ప సమాధానం సెప్పడం శానా కట్టం. ఇంతకీ నేను సేప్పొంచేదేంటంటే అదే అంటే వాట్ ఐ యామ్ సేయింగ్ ఈస్ ... "
"ఒరేయ్ ఆపరా నీ గడ్డం పురాణం. రాజకీయాల్లో గడ్డం వల్ల ఇన్ని లాభాలు ఉన్నాయని తెలీక రాహుల్ గాంధీ, చిరంజీవి లాంటోల్లు నీటుగా గడ్డం గీసుకుంటున్నారు. వాళ్లకి ఈ విషయం సెప్పరాదు ... "
"సెప్తాలేరా నాకు ఈ గడ్డం వల్ల కాలం కలిసొచ్చి ఏ ఎమ్మెల్యేనో, ఎంపీనో అయిపోతే కలిసి సెప్పెత్తా ... అంతవరకూ గడ్డం జిందాబాద్."

Comments

Popular posts from this blog

... మూడో కూటమి

... కరోనా కంటే ఎక్కువగా భయపెడుతున్న అంశం?

... 2019 ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు - జనసేన