Posts

Showing posts from 2017

... తెలుగు సినిమా 2017 (నా వ్యూ)

వంశీ కలుగోట్ల // ... తెలుగు సినిమా 2017 (నా వ్యూ) // ******************************************************* తెలుగు సినిమా 2017 లో బాహుబలి సాక్షిగా వెలిగిపోయింది. కానీ, ఒక్క బాహుబలితోనే ఆగిపోలేదు. పెద్ద, చిన్న సినిమాలు మంచి విజయాలను నమోదు చేసి, తెలుగు సినిమా హద్దులను చెరిపేసే దిశగా అడుగులు పడ్డాయని చెప్పవచ్చు. నా దృష్టిలో ఈ సంవత్సరం తెలుగు సినిమా రంగంలోప్రస్తావించుకోదగ్గ సినిమాలుగా అనిపించిన చిత్రాలతో చిన్న సమీక్షలాంటిది ...   బాహుబలి 2: 'బాహుబలి' అన్నది నిస్సందేహంగా ఒక్క తెలుగు సినిమా రంగాన్నే కాక భారతీయ సినిమా రంగాన్నే వాణిజ్యపరంగా, సాంకేతిక హంగుల పరంగా కొత్త అడుగులు వేయించిన సినిమా. ముఖ్యంగా సాంకేతికత విషయంలో హాలీవుడ్ చిత్రాలతో పోలిస్తే పరిమిత వనరులతో హాలీవుడ్ స్థాయికేమాత్రం తగ్గకుండా తయారైంది. ఆ కష్టం వృధా పోకుండా, వాణిజ్యపరంగా సంచలనాత్మక విజయం సాధించింది. భారతీయ సినిమా సాంకేతిక విలువలు బాహుబలికి ముందు, తరువాత అన్నట్లు తయారైంది. అంతేకాదు దక్షిణాది సినిమారంగం అంటే 'తమిళం' అనుకునేవారికి తెలుగు సినిమాను పరిచయం చేసింది. బహుశా, ఇప్పటికీ ఇంకా దక్షిణ...

... పాదయాత్ర తీరు

వంశీ కలుగోట్ల // ... పాదయాత్ర తీరు // *************************************** ప్రతిపక్షనేత జగన్ చేస్తున్న పాదయాత్ర కొనసాగుతోంది. ఇవాళో, నిన్నో ఎవరో అభినందిస్తూ పెట్టిన పోస్ట్ చూశాను '600 కిలోమీటర్లు దాటిన శుభసందర్భంగా' అని. 600 కిలోమీటర్ల దూరం చిన్నదా, పెద్దదా అన్నది ముఖ్యమా? పాదయాత్ర లక్ష్యం లేదా నిర్ణయించుకున్న పూర్తి పాదయాత్ర దూరం దాదాపు 3000 కిలొమీటర్లనుకుంటా. దాదాపు అన్ని జిల్లాలలోనూ పర్యటన జరుగుందనుకుంటాను. ప్రతి వంద కిలోమీటర్లకూ సమర్థకుల నుండి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. దూరం పెరిగిన కొద్దీ అదో ఘనతగా కీర్తిస్తున్న సమర్థకులు, కాస్త వ్యక్తి మీద నుండి లక్ష్యం వైపు దృష్టి సారిస్తే మేలేమో.  ప్రతి వంద కిలోమీటర్లు పూర్తయ్యాక, అభినందనలకంటే ఎక్కువగా ...  -> ఆ పరిధులో చూసిన/తెలుసుకున్న సమస్యలేమిటి?  -> ఆయా ప్రాంతాలలో పార్టీ పరిస్థితి ప్రస్తుతం ఎలా ఉంది?  -> ఆ పరిధిలో ప్రతిపక్షనేత ఇచ్చిన హామీలేమిటి? వాటి ఆచరణీయత ఏమిటి?  -> తెలుసుకున్న సమస్యలలో గత ప్రభుత్వాల కాలం నుండి కొనసాగుతున్న సమస్యలెన్ని? ప్రస్తుత ప్రభుత్వపు తీ...

... నూటికి నూటిపాళ్ళూ నిజం

వంశీ కలుగోట్ల // ... నూటికి నూటిపాళ్ళూ నిజం //  ************************************************** రామ్ గోపాల్ వర్మ పైత్యం  మనం చూసే దృష్టే తప్పించి 'నూటికి నూటిపాళ్ళూ నిజం అంటూ ఏదీ లేదు. మనకు నచ్చిందా లేదా అన్నదే ముఖ్యం తప్పించి మరేదీ ముఖ్యం కాదు' అని నుడివే స్వేచ్చాజీవి రామ్ గోపాల్ వర్మ తన తాజా వెబ్ సిరీస్ 'కడప' ట్రైలర్ లో '... ఇది నూటికి నూటిపాళ్ళూ నిజం' అంటూ వాకృచ్చడం కాస్త ఆశ్చర్యంగా అనిపించింది. అందునా '... ఇది నాకు తెలిసింది, నేను తెలుసుకున్నది మాత్రమే కాదు నూటికి నూరుపాళ్ళూ నిజం' అంటూ దానిపై వాస్తవముద్ర వేయటం మరింత ఆశ్చర్యం. హత్య జరగటం అన్నది మాత్రమే వాస్తవం - ఆ హత్య ఎందుకు జరిగింది అన్నది మాత్రం కథనం. కాగా, వర్మ లాంటి పరిశీలనాత్మక దృక్కోణం ఉన్నటువంటి దర్శకమేధావి కూడా కథనాన్నే 'నూటికి నూరుపాళ్ళూ నిజం' అంటూ వాస్తవముద్ర వేయడం ఎంతవరకూ సబబు?  ఆయనను పట్టించుకోకపోవటం అన్నది పరిష్కారం కాగలదా?  ఎంత కాదనుకున్నా సినిమా వంటి దృశ్య మాధ్యమాలు సమాజంపై చూపే ప్రభావం అధికం. అది మంచికంటే చెడు ఎక్కువ. ఉదాహరణకు తాజాగా జరిగిన ఒక సంఘటన ప్రస్తావిం...

... ఎవరో ఒకరు, ఎపుడో అపుడు

వంశీ కలుగోట్ల // ... ఎవరో ఒకరు, ఎపుడో అపుడు // *************************************************** 'మీ అందరి తరఫున నేను పోరాడతాను, నేను ముందుంటాను' అనేవారి అవసరం ఇవుడు (అసలు ఎపుడైనా) ఉందా? జరిగిందో లేదో అని సంవాదాలు జరుగుతున్న పురాణాల కాలం నుండి కూడా ఇంతే పోరాడతామంటూ వచ్చేవారు నాయకులుగా ఎదుగుతున్నారు తప్పించి పీడితులు అలానే ఉంటూనే ఉన్నారు. అధికారం లేదా పదవి ఉంటేనే మంచి చెయ్యగలం అన్నది భ్రమ కాదు - అంతర్లీనంగా ఆయా వ్యక్తులలో ఉన్న 'అధికార కాంక్ష లేదా పదవీ వ్యామోహం లేదా పవర్ పట్ల ఉన్న వ్యామోహం'. ఇంత మంచి చెయ్యాలి, అంత మంచి చెయ్యాలి అనే కొలబద్దలేమీ లేవు. నీకు చేతనైనంత చెయ్యి - నీతో కలిసి వచ్చేవారితో కలిసి పని చెయ్యి. నీ లక్ష్యం మార్పు అంటున్నావు అంటే అది ఎటువంటి మార్పు అన్నది ముందుగా నీకు నువ్వు ఒక అవగాహన తెచ్చుకో. మార్పు అన్నది గుప్పెడు మంది అధికారపదవుల్లో ఉన్న వ్యక్తులను మారిస్తే రాదు. లెక్కకు మిక్కిలిగా ఉన్న జనాల ఆలోచనల్లో వస్తేనే మార్పు సాధ్యమవుతుంది. అది అంత సులువైన విషయమూ కాదు, తొందరగా జరిగే పనీ కాదు. కానీ, ఎప్పుడైతే అసలు లక్ష్యం నుండి చూపు మరల్చి, అధికార సాధన మీ...

జబర్దస్త్ గురించి

వంశీ కలుగోట్ల // ... జబర్దస్త్ //  ****************************** పురాణాలలో కొన్ని కథలు విని ఉంటాం. అందులో ఎలా ఉంటుందంటే దేవుడిని విపరీతంగా పూజించే భక్తుడికంటే, దేవుడిని దూషించే వాడికే దేవుడు ప్రత్యక్షమవుతాడు లేదా దర్శనమిస్తాడు. దాన్ని ప్రశ్నించిన భక్తుడికి దేవుడు చెబుతాడు - 'నువ్వు అవసరం ఉన్నప్పుడో లేకపోతే నిర్దిష్ట సమయాల్లోనో నన్ను తలచుకుంటున్నావు కానీ వాడు అలా కాదు నిరంతరం నన్నే తలచుకుంటున్నాడు అందుకే వాడు మరణానంతరం నా లోకంలో నా సమక్షంలో సకల సుఖాలనుభవిస్తాడు' అని వివరిస్తాడు. ఈ జబర్దస్త్ గోలలో నాకొకటి అనిపిస్తోంది... ఈ జబర్దస్త్ ను ఎవరైతే అధికంగా విమర్శిస్తున్నారో వారే మళ్ళీ మళ్ళీచూస్తూ, షేర్ చేస్తూ ఆ టి.ఆర్.పి రేటింగ్ లు ఏవైతే ఉన్నాయో వాటికి కారణమవుతున్నారు. ఈ జబర్దస్త్ బాగా ప్రాచుర్యం పొందాక హేవిటో అది అనుకుని కొన్ని ఎపిసోడ్స్ చూశాను (అది కూడా చాలాకాలం క్రితం). అందులోని వెకిలితనం, బూతు, అశ్లీలత, వెటకారం తదితరాలు నాకు నచ్చలేదు. అప్పటినుండి ఇప్పటివరకూ మళ్ళీ చూడలేదు కూడా. అంతే కాదు, సాధ్యమైనంతవరకూ నా చుట్టూ ఉన్నవారికి దాన్ని చూడొద్దని చెప్పటానికే ప్రయత్నించాను. నాకు బ...

... ఆర్జీవీ

వంశీ కలుగోట్ల // ... ఆర్జీవీ // ************************* Don't walk like you rule the world, walk like you don't care who rule the world. రాం గోపాల్ వర్మ - పరిచయం అక్కర్లేని పేరు. ఒకప్పట్లో అయితే కేవలం సినీ ప్రేక్షకులకు మాత్రమే పరిచయం. కానీ ఎప్పుడైతే ఆర్జీవీ సామాజిక మాధ్యమపు గోడలెక్కడం మొదలెట్టాడో, అప్పటినుండి అందరికీ తెలిసిపోయాడు. తెలిసిపోవడమే కాదు ఒక ఇజమై కూచున్నాడు. నిజాయితీగా మాట్లాడతాడు అని కొందరు, నోటికొచ్చింది మాట్లాడతాడు అని కొందరు - ఇలా ఆర్జీవీని ఇష్టపడేవారు, ఇష్టపడనివారుగా ఏర్పడ్డారు. నిన్న 'ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే విత్ ఆర్జీవీ' ప్రోగ్రాం కాసింత చూశాను. గతంలోనూ కొన్ని ఆర్జీవీ ఇంటర్వ్యూలు చూశాను. వాటికీ, వీటికీ తేడా ఉందనిపించింది. విషయం గురించి కాదు, వర్మ గురించి. 'నేను అందరిలా కాదు' అనుకోవడం వేరు, 'నేను అందరికంటే వేరు' అనుకోవడం వేరు. నేను అందరిలా కాదు అనుకునేవాడు తనపని తానూ చేసుకుపోతాడు, నేను అందరికంటే వేరు అనుకునేవాడు అందరినీ కెలుకుతుంటాడు. నేను అందరిలా కాదు అనుకునే దశనుండి నేను అందరికంటే వేరు అనుకునే దశకు ఆర్జీవీ వచ్చాడ...

... గురువింద గింజలు

వంశీ కలుగోట్ల // ... గురువింద గింజలు // ****************************************** -> మన ఆర్కే గారున్నారే అదేనండీ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు మొన్నామధ్య కోర్టుకు తన లాయర్ల ద్వారా వినతి పంపించారు ఏమిటంటే 'వ్యక్తిగత హాజరు నుండి మినహాయింపు ఇవ్వండి' అంటూ, అదీ ఎప్పుడు అంటే సదరు న్యాయస్థానం వారు వ్యక్తిగతంగా ఆర్కే గారు హాజరు కావట్లేదని ఆగ్రహం వ్యక్తం చేసినందువల్ల. కారణాలేంటయ్యా అంటే, శాసనసభ సమావేశాలను కవర్ చేస్తూ తీరిక లేకుండా ఉన్నారట. పాపం ఆయన ఫీల్డ్ జర్నలిస్ట్ కదా, ఉదయాన్నే నిద్ర లేవగానే తినీ తినకుండా లగెత్తుకుని శాసనసభ దగ్గరకెళ్ళి రాత్రి వరకూ అక్కడ కెమెరాలు మోసుకుంటూనో లేక కాయితాలు పట్టుకుని రాసుకుంటూనో తెగ బిజీగా ఉంటున్నారు కాబోలును. ఇదే ఆర్కే గారు ప్రతిపక్షనేత జగన్ గారు పాదయాత్ర సందర్భంగా వ్యక్తిగత హాజరు నుండి మినహాయింపు ఇవ్వమని కోర్టును అభ్యర్థించినపుడు రాసిన విశ్లేషణలు ఆయనకు చూపితే ఎలా ఉంటుంది? ఆ అవన్నీ పట్టించుకుంటే ఆయన ఆ స్థాయిలో కూచుని అంత కమ్మగా అనగా హాయిగా ఎలా ఉంటారులెండి.  -> మన కత్తి మహేష్ గారున్నారు కదా ... పవన్ కళ్యాణ్ గారిపై విమర్శల జడివాన కురిపించి ప...

'గొప్పోడు' - అవార్డు గారంటీ (*నిబంధనలు వర్తిస్తాయి)

వంశీ కలుగోట్ల // 'గొప్పోడు' - అవార్డు గారంటీ (*నిబంధనలు వర్తిస్తాయి) // *************************************************************                       మన (అంటే స్వీయ గౌరవం అన్నమాట) దగ్గర ఒక మాంచి ఊర మాస్ మసాలా సినిమా కథ ఒకటుందబ్బా. ప్రతి సీన్ కేకో కేకస్య, కేకభ్యహ అన్నట్టు ఉంటాది. కావాలనుకుంటే సదువుకోండి ...             ఓపెనింగ్ సీన్ లో మన హీరోవోడు ఒక సేతిలో గొడ్డలి, మరో సేతిలో మా సినిమా యూనిట్ ప్రత్యేకంగా తయారు చేసిన ఒక విచిత్ర ఆయుధం పట్టుకుని ఒక రెండు మూడొందల మందిని నరికి పారేస్తాడు. అయినా కూడా మన హీరోవోడికి సిన్న గాయం కూడా కాదు. సీన్ ముగియగానే మన హీరోవోడు ఒళ్ళంతా రక్తంతో (నరికేసినోళ్లదిలే టెన్షన్ పడమాకండి) 'హింస మంచిది కాదు, అది మన ధర్మమూ కాదు, సంప్రదాయమూ కాదు. అహింసను మించిన ధర్మమూ లేదు' అని అరమూసిన కళ్ళతో చెబుతుంటే, మనోడు నరికెయ్యగా మిగిలినోళ్ళు అమాంతం కాళ్ళమీద పడిపోయి 'నీ అంతటోడు లేడు, నువ్వే మాకు గొప్...

'సీక్రెట్ సూపర్ స్టార్' ఒక అద్భుతం

వంశీ కలుగోట్ల //  'సీక్రెట్ సూపర్ స్టార్' ఒక అద్భుతం // ****************************** *****************             కొన్నిసార్లు ఏదైనా 'ఎలా ఉంది' అని అడిగితే చెప్పటం చాలా కష్టం; ఎందుకంటే కొన్ని అద్భుతాలను, అనుభవాలను మాటల్లో వర్ణించడం వీలుకాదు, ఎవరికీ వారు స్వయంగా అనుభూతి చెందాల్సిందే. మన అదృష్టం కొద్దీ అప్పుడప్పుడూ అలాంటివి అనుభూతి చెందే అవకాశం లభిస్తుంటుంది. మన భారతీయ సినిమా రంగం అటువంటి అద్భుతాలను సృష్టించడం మానేసి దశాబ్దాలు అయినట్టుంది. ఎప్పుడో అప్పుడప్పుడు కొన్ని చమక్కులు తప్పించి. చక్కటి కథ అన్నా, అద్భుతం తినాలన్నా, హాలీవుడ్ స్థాయి అన్నా ఇపుడు అంతా గ్రాఫిక్స్ మాయాజాలం మాత్రమే అనే భ్రమలో కొట్టుకుపోతున్నారు 99% మంది. ఆ మిగిలిన 1% లో అధికులు అత్యంత ప్రతిభావంతులైన అనామకులు అనగా అంతగా పేరు, ప్రఖ్యాతులు లేనివారుగా ఉండటంతో వారి ప్రయత్నాలు కూడా ప్రాచుర్యం పొందవు, అటువంటి సినిమాలు వెలుగు చూడవేమో. కానీ, ఆ 1% లో కొద్దిమంది స్టార్స్ కూడా ఉంటారు అమీర్ ఖాన్, అక్షయ్ కుమార్ లాంటివాళ్ళు. ఎవరో వేరే వారు డబ్బు ప...

... ఖండిస్తా ఉన్నాం అధ్యక్ష్యా

వంశీ కలుగోట్ల // ... ఖండిస్తా ఉన్నాం అధ్యక్ష్యా // ***************************************** -> ఒక సినిమా నటుడు అరవై, డెబ్బై ఏళ్ళు వచ్చినా లేదంటే చచ్చేవరకూ నటిస్తూనే ఉండాలని అనుకుంటాడు. వందిమాగధ గణం, అభిమాన జన సందోహం ఈలలు వేస్తూ, కేకలు పెడుతూ, కాగితాలు చించి విసిరేస్తూ సంతోషపడుతూనే ఉంటారు. అతగాడు హీరోగానో కాకపొతే కీలక పాత్రలు పోషిస్తూనో నటిస్తూనే ఉంటాడు చచ్చేవరకూ ... -> ఒక క్రీడాకారుడు సత్తువ ఉన్నతవరకూ ఆడాలనే అనుకుంటాడు, ఎదుటోడి బలం పెరిగిందని అనుకుంటాడే కానీ తన సత్తువ తగ్గిందని అనుకోడు. మైదానం వదలాల్సి వచ్చినా శిక్షకుడిగానో, వ్యాఖ్యాతగానో ఉండాలనుకుంటాడే కానీ వీక్షకుడిగా మిగిలిపోవాలనుకోడు. ఊపిరున్నంతవరకూ ఆటతో బంధాన్ని తెంచుకోవాలనుకోడు.... -> ఒక రచయిత/కవి కళ్ళు కనబడి, చేయి పనిచేసినంత కాలం రాస్తూనే ఉండాలనుకంటాడు. పాఠకుడి మేధస్సు పెరగాలనుకుంటాడు కానీ, తన రాతలు అర్థమయ్యేలా లేవని, కాలానికి తగ్గట్టు తానూ మారలేదని ఒప్పుకోడు. పోయేవరకూ ఎదో ఒకటి రాస్తూనే ఉంటాడు ...  ... కార్మికుడు, కర్షకుడు ఇలా ఒకరనేమిటి ఎవరికెవరు వారి వారి రంగాలలో లేదా ఇష్టం/నైపుణ్య...

దేశభక్తి ఎందులో ఉంది?

వంశీ కలుగోట్ల // దేశభక్తి ఎందులో ఉంది? // *************************************             అరేయ్ ఎవర్రా అక్కడ, ఆ బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు కెప్టెన్ ముష్రఫె మొర్తజాకు ఏసుకోండి వీరతాళ్ళు. ఒకానొక శుభోదయాన కాకపొతే శుభదినాన మొర్తజా గారికి జ్ఞానోదయం అయ్యి 'మాదేముంది డబ్బులు తీసుకుని ఆడుతున్నాం, ఇందులో దేశభక్తీ లేదు తొక్కా లేదు. నిజమైన హీరోలు అంటే కూలీలు, వైద్యులే తప్పించి వేరెవరూ కాదు. వైద్యుడు ప్రాణం నిలబెడతాడు, కూలీ ఇటుకలు మోసి భవనాలు నిర్మిస్తాడు. మేమేమన్నా ప్రాణం పొయ్యగలమా లేక కూలీపని చేయగలమా' అంటూ ఒక చిన్న గొప్ప ఉపన్యాస సందేశమిచ్చాడు. మంచిది, నిజ్జంగానే నిజం చెప్పాడు. అందులో ఎటువంటి అనుమానమూ లేదు. కానీ, మొర్తజా  భయ్యా దేశభక్తి అంటే ప్రాణం పొయ్యడం, ఇటుకలు మొయ్యడమే కాదు; హీరోలు అంటే కూలీలు, వైద్యులు మాత్రమే కాదు . అవును కూలీలు, వైద్యులు గొప్పోళ్ళే మేమేమీ కాదనట్లేదు. అలా అయితే భూమ్మీద కూలీలు, వైద్యులు తప్పించి మిగతావారెవరూ ఉండకూడదు. ఇంకెవడో వచ్చి రైతులు, సైనికులు మాత్రమే హీరోలు మిగినోళ్ళందరూ చెత్త అంటాడు. అపుడు వాడికీ...

... పయనం ఎటువైపో

వంశీ కలుగోట్ల // ... పయనం ఎటువైపో // **************************************             'అవునవును నారాయణ, చైతన్య వంటి విద్యా కర్మాగారాలను అదుపు చేయాలి', 'విద్యావ్యవస్థలో మార్పు రావాలి', 'ప్రభుత్వాల అలసత్వాన్ని నిరసించాలి' ... చాలా. కానీ, అది సాధ్యమా!!!? ఇటీవల పలు ప్రైవేట్ విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్థులలో రకరకాల కారణాల వల్ల బలవన్మరణం పొందుతున్నవారి సంఖ్య పెరుగుతోంది. ఒక్కో బలవన్మరణానికి ఒక్కో కారణం ఉంటోంది. కొన్నింటికి ప్రేమ, కొన్నింటికి ర్యాగింగ్, కొన్నింటికి ఒత్తిడి తట్టుకోలేకపోవడం, కొన్నింటికి వేధింపులు భరించలేకపోవడం ... ఇలా. ఇవేమీ కొత్తగా జరుగుతున్నవీ కావు. ర్యాగింగ్ వంటి వికృత చర్యకు బలై/గురై విపరీత మానసిక ఒత్తిడికి లోనై డిప్రెషన్ లో ఉండి, ఇప్పటికీ ఆ ఘటనలు బాధిస్తున్న వ్యక్తి ఒకతన్ని బంధువుల్లో చూశాను కూడా. కానీ, పరిస్థితిని మార్చడం మాత్రం జరిగేపని కాదనిపిస్తోంది. ఎందుకు కాదనిపిస్తోందో నా అనుభవం ఒకటి వివరించి చెబుతాను.             మాది కర్నూలు జిల...

జై లవకుశ - దర్శకుడి/కథకుడి వైఫల్యం

జై లవకుశ - దర్శకుడి/కథకుడి వైఫల్యం ****************************** ***            జై లవకుశ చిత్రంలో చూపిన నీతి ఏంటంటే, కొన్ని అవలక్షణాలో లేక వైకల్యాలో ఉన్నాయని పిల్లలలో ఒకరిని సరిగా చూసుకోకపోతేనో/గుర్తించకపోతేనో ఎటువంటి అనర్థాలు జరిగే అవకాశం ఉంది అని. సరిగ్గా సినెమా తీతలో అదే జరిగింది. సినిమా కథలో ఒక పాత్రను మాత్రమే ప్రేమించి, దాని మీదే దృష్టి పెట్టి, దాని చుట్టూతానే కథ అనే వస్తువును అల్లుకుంటే ఎలా తయారవుతుంది అని చూపటానికి జై లవకుశ ఒక ఉదాహరణ. ఇక ఇపుడు మిగతా అంశాల విషయానికి వద్దాం. ఈ కాలపు కథానాయకులలో నటనా సామర్థ్యం పరంగా ఉన్నత స్థాయిలో చెప్పుకోదగ్గ వారిలో జూనియర్ ఎన్టీఆర్ ఒకరు, అందులో అనుమానం లేదు. కానీ, తన సామర్త్యానికి తగ్గట్టుగా కాక, కమర్షియల్ చట్రంలో ఇమిడే కథలు ఎన్నుకుంటూ వస్తోన్న ఎన్టీఆర్ జూనియర్ కొద్ది కాలంగా కాస్త కథ మీద కూడా దృష్టి పెట్టినట్టే ఉంది. మరీ ప్రయోగాత్మకాలు కాకపోయినా పర్లేదు అనే తరహా చిత్రాలు చెయ్యటానికి ముందుకు వస్తున్నాడు. అందులో భాగంగానే జై లవకుశ చిత్రం ఒప్పుకున్నాడు.            జై లవక...

'అర్జున్ రెడ్డి' అనే జీవితం గురించి

వంశీ కలుగోట్ల // 'అర్జున్ రెడ్డి' అనే జీవితం గురించి // ************************************************************             కథ అయితే ఎలా ఉందో చెప్పొచ్చు, కానీ ఒక జీవితాన్ని చూపిస్తే ... ఏం చెప్పాలి? సినిమా చూద్దామని వెళితే 'అర్జున్ రెడ్డి' అనే వ్యక్తి జీవితాన్ని చూపారు.  అప్పట్లో ఒకసారి 'ప్రేమ్ నగర్' సినిమాలోని ' ... నేను నవ్వాను లోకం ఏడ్చింది; నేను ఏడ్చాను లోకం నవ్వింది; నాకింకా లోకంతో పని ఏముంది ...' అన్న పాట విని ఆ పాట రాసిన ఆత్రేయ గారిని ఎవరో అడిగారట 'ఏంటండీ ఆ పాట అర్థం పర్థం లేకుండానూ...' అని. దానికి ఆత్రేయ గారు 'చూడండి, సినిమాలో పాత్ర ఏంటి? ఒక తాగుబోతు తాగి ఆడుతూ పాడే పాట. తాగుబోతు తాగిన తరువాత మాట్లాడే మాటలకి, పాటలకి అర్థం ఏముంటుంది చెప్పండి' అన్నారట. ఇంకేం మాట్లాడతారు. ఈ 'అర్జున్ రెడ్డి' కూడా అంతే. అతి కోపిష్టి, కోపం వస్తే ఏం చేస్తాడో తెలీదు చేసేస్తాడు అంతే. వాడొక ఎదవ, పర్వర్ట్, సైకో, నచ్చితే 'తనది' అనుకునే రకం, తనది అనుకుంటే ఎంత దూరమైనా వెళ్ళే రకం, తనను మించి మరెవరినీ అధికంగా ప్రేమించలేని రకం. అర్జున్ ర...

'టాయిలెట్ - ఏక్ ప్రేమ్ కథ' గురించి ...

వంశీ కలుగోట్ల // 'టాయిలెట్ - ఏక్ ప్రేమ్ కథ' గురించి ... // *************************************************           'రుద్రవీణ' చిత్రం గురించి ఇవాళ కొత్తగా చెప్పక్కరలేదు. అన్నా హజారే స్ఫూర్తిగా రూపొందించబడిన ఈ చిత్రం వాణిజ్యపరంగా ఆశించినంత విజయం సాధించనప్పటికీ అత్యుత్తమ చిత్రాల వరుసలో ఎప్పటికీ నిలబడిపోయే చిత్రంగా, చిరంజీవికి గుర్తుండిపోయే చిత్రంగా ఉండిపోయింది. ఎందుకు అపజయం పాలైందో కానీ, ఎవరు ఈ చిత్రాన్ని బాలేదని అనగా వినలేదు. అలాంటి సినిమాలు రావట్లేదెందుకు అని అనుకుంటూ ఉండేవాడిని. అంటే సందేశాత్మక చిత్రాలు రాలేదని కాదు కానీ వాణిజ్య సూత్రాలకు దూరంగా ఇలా ఒక క్షేత్రస్థాయి సమస్యలతో కథ అల్లుకుని, దాన్ని మ్యాజిక్కులకు దూరంగా వాస్తవిక కోణంలో తెరకెక్కించే ప్రయత్నాలు అరుదు. బహుశా శ్యామ్ బెనెగల్ చిత్రాలు దీనికి మినహాయింపు కావచ్చు. ఇది నా పరిమిత జ్ఞానంతో చేసిన వ్యాఖ్య కాబట్టి, ఎవరైనా సవరించవచ్చు (అటువంటి ఇతర చిత్రాల ప్రస్తావనతో). నిన్న 'టాయిలెట్ - ఏక్ ప్రేమ్ కథ' చిత్రం చూశాక నాకు రుద్రవీణ చిత్రమే గుర్తొచ్చింది. దానికీ, దీనికీ కథలో పోల...

వైఎస్ఆర్సిపీ ప్లీనరీలో ప్రకటించిన హామీలు - పరిశీలన ???

వంశీ కలుగోట్ల // వైఎస్ఆర్సిపీ  ప్లీనరీలో ప్రకటించిన హామీలు - పరిశీలన ??? //  ****************************** *********************************** వైఎస్ఆర్సిపీ  ప్లీనరీలో ప్రతిపక్షనేత జగన్ రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కొన్ని హామీలు ప్రకటించారు. ఓట్లు వేసే అన్నివర్గాలను దృష్టిలో  పెట్టుకుని ప్రకటించిన ఈ హామీలను ఒకసారి చూద్దాం ...  -> వైఎస్ఆర్ రైతు భరోసా కార్యక్రమ క్రింద రైతులకు యాభైవేల రూపాయలు ఇస్తారని ప్రకటించారు. మంచిదే, కానీ ఆచరణ విధివిధానాలు కూడా ప్రకటించగలగాలి. ఏ అంశాల ప్రాతిపదికన, ఎవరికి ఆ మొత్తాన్ని ఇవ్వాలనుకుంటున్నారో చెప్పగలగాలి. ఆచరణ విధివిధానాలేమిటో పత్రాల రూపేణా విడుదల చెయ్యాలి.  ->ద్వాక్రా రుణమాఫీ మరియు ఆసరా. మంచి నిర్ణయమే. దీనికి సంబంధించి కూడా ఆచరణయోగ్యమైన అమలు కార్యక్రమాన్ని ప్రకటించాలి.  -> అమ్మ ఒడి - చదువుకునే పిల్లల తల్లులకు డబ్బులివ్వడం అనే కార్యక్రమం. దీనికి సంబంధించి కూడా ఆచరణ విధివిధానాలు, ఏ అంశాల ప్రాతిపదికన, ఎవరికి ఆ మొత్తాన్ని ఇవ్వాలనుకుంటున్నారో చెప్పగలగాలి.  -> హౌసిం...

మనలో ఒకరు (5): ఒక మంచి మనిషి ... నీరజ

Image
వంశీ కలుగోట్ల // మనలో ఒకరు (5): ఒక మంచి మనిషి ... నీరజ // ****************************************************             చిరంజీవి నటించిన 'స్టాలిన్' చిత్రంలో కథ అంతా ఒక సందేశం చుట్టూ అల్లబడి ఉంటుంది. ఆ సందేశం ఏంటంటే 'మీరు ముగ్గురుకి సహాయం చెయ్యండి, ఆ ముగ్గురిని ఒక్కొక్కరు మరో ముగ్గురికి సహాయం చేయమనండి.' అలా ఒక గొలుసుకట్టులాగా సహాయం అన్న ప్రక్రియ సాగాలి, మనిషికి మనిషి సహాయం చేసుకోవాలి అన్నది అంతర్లీనంగా సందేశం. అది ఎదో హాలీవుడ్ లేదా కొరియన్ సినిమా నుండి తీసుకున్నది, ఆ సినిమా పేరు గుర్తు లేదు. అయినా నేను ఇపుడు ఈ వ్యాసం ముఖ్యోద్దేశం ఆ సినిమా గురించి చర్చించటం కాదు కాబట్టి ఆ విషయం అప్రస్తుతం. నా జీవితంలో జరిగిన ఒక చిన్న సంఘటన గురించి చెప్పాలనుకుంటున్నాను, దానికి ఇది ప్రవేశిక లాంటిది.             2000 సంవత్సరం, అప్పుడే డిగ్రీ పూర్తయ్యింది. రెండో అక్క గాయత్రి/నాగలతకు పెళ్లి కుదిరింది. అప్పటికింకా ఏమి చెయ్యలో, ఎటు వెళ్ళాలో డిసైడ్ చేసుకోలేదు కాబట్టి డిగ్రీ అయి కొన్ని...

'సారీ వరలక్ష్మి' లఘు చిత్రం సమీక్ష

వంశీ కలుగోట్ల // 'సారీ వరలక్ష్మి' లఘు చిత్రం సమీక్ష // ****************************** ****************             'జీవితంలో ఏ క్షణమూ ఒకేలా ఉండదు', 'జీవితాన్ని ఉదయం తొమ్మిది నుండి సాయంత్రం అయిదువరకు కంప్యూటర్స్ ముందు కాదు ప్రకృతి ముందు ఖర్చు పెట్టండి' అన్న రెండు సంభాషణలే మూలాధారంగా మారిన కథే శంకర్ సిద్ధం లఘు చిత్రం 'సారీ వరలక్ష్మి'. ఈ చిత్రానికి కథ, చిత్రానువాదం (స్క్రీన్ ప్లే), నిర్మాణం, దర్శకత్వం, సంభాషణలతో పాటు ప్రధాన పాత్ర కూడా పోషించిన శంకర్ అన్నింట్లోనూ రాణించాడు. ఈ చిత్రంలోని ఏ అంశంపైనైనా సమీక్ష చేస్తూ వ్యాఖ్య చేయబోయే ముందు గుర్తుంచుకోవలసింది ఇది అత్యంత పరిమిత వనరులతో తీసిన లఘు చిత్రం. కానీ, ఆ ఛాయలు ఎక్కడా కనబడకుండా మంచి నాణ్యమైన చిత్రాన్ని అందించారు అని చెప్పవచ్చు.             ముందుగా కథ - పైన పేర్కొన్నట్టు ఆ రెండు సంభాషణలే చిత్రం కథను, కథా గమనాన్ని తెలుపుతాయి. విదేశాలలో ఉన్న ఒక యువకుడి కథ అన్నది అదనపు హంగు. ఉన్నత చదువుల కోసం లండన్ లో దిగిన అభినవ్, తా...

నేనూ - వాడూ: ఒక సంభాషణ

వంశీ కలుగోట్ల // నేనూ - వాడూ: ఒక సంభాషణ // ****************************** ************ వాడు: ఎపుడో శతాబ్దాల క్రితం రాయబడిన ఆ పుస్తకంలో పేర్కొనబడిన ఆ చెడు విషయాన్ని ఖండఖండాలుగా ఖండించి తీరాల్సిందే. రాతలే రాయబడాలో, చిత్రాలే తీయబడాలో, మరింకేమైనా చెయ్యాలో కానీ, ఖండించి తీరాల్సిందే.  నేను: అవును, చెడును ఖండించాల్సిందే. అవునూ, ఇంతకీ అవన్నీ ఖండిస్తూ నువ్వు తీసిన ఆ చిత్రంలో లేదా రాసిన రాతలో ఆ కాస్త యెర్రితనం, ఆ కాసింత బూతు, ఆ కొద్ది రక్తపాతం/హింస లేకపోయుంటే ఎంత బావుండేది మిత్రమా? వాడు: అవునా!!! అయితే నీకర్థం కాలేదన్నమాట. ఇంకాస్త ఎదగాలి నువ్వు. ఊరికే అలా అనకపోతే ఆ చెడు, బూతు, హింస గట్రా ఏవైతే ఉన్నాయో వాటిని వదిలేసి మిగతావాటిని చూడవచ్చు కదా! నేను అన్ని అంశాలు కలిపి తీస్తే/రాస్తే నీకు అవి మాత్రమే కనిపించాయి అంటే నువ్వు అలాంటివాడివి అని అర్థం. ఇంకెప్పుడు ఎదుగుతావు!!!? అయినా నన్నూ, నా మాటలనూ అర్థం చేసుకోవాలంటే నీకు, నీలాంటివారికీ కనీసం ఇంకో అర్థ శతాబ్ది అయినా పడుతుంది. నేను: అవును నిజమేనేమో మిత్రమా. నువ్వు తీసిన/ర...

శ్వేతపత్రాలు ఏమయ్యాయి?

వంశీ కలుగోట్ల // శ్వేతపత్రాలు ఏమయ్యాయి? // ***************************************** ఎక్కువొద్దురా నాయనా సామీ, ఆ ఇచ్చేదేదో హోదానే ఇవ్వు అని 2014 నుండీ మొత్తుకుంటుంటే ఇపుడు మళ్ళీ తాజాగా ఎప్పటినుండో పాడిన పాతపాటనే పాడతారేంటి అమిత్ షాజీ!? మీరిచ్చిన డబ్బులు కావాలంటే ఎనక్కి తీసుకోండి, హోదా ఇవ్వండి చాలు. అవునూ, అమిత్ షా గారేం ఒక లక్షా డెబ్బై అయిదువేల కోట్లు ఇచ్చామని అంటున్నారు కదా, మరి అయితే క్రింది ప్రశ్నలకు వివరణ ఇస్తూ బాబుగారేమన్నా తెల్లకాయితం అదేనండీ శ్వేతపత్రం ఏమైనా విడుదల చేస్తారా లేక చెయ్యగలరా? -> అమిత్ షా గారు పేర్కొంటున్నట్టు అంతటి భారీస్థాయిలో నిధులు/డబ్బులు నిజంగానే ఇచ్చారా? -> ఒకవేళ అంతటి భారీ స్థాయిలో నిధులు ఇచ్చి ఉంటే, వేటికి ఉపయోగించారు? -> అమిత్ షా గారు పేర్కొన్న నిధులు గత సంవత్సర కాలంలో ఇచ్చినవా లేక గత మూడు సంవత్సరాల కాలంలో ఇచ్చినవా లేకపోతే 2019 వరకూ ఇవ్వాలని అనుకుంటున్నా వాటితో కలిపి చెప్పిన లెక్కనా? -> ఆ నిధుల ఉపయోగించిన వివరాలేమిటి అంటే ఏయే పథకాలు లేదా కార్యక్రమాలకు వినియోగించారు? -> ఇచ్చిన డబ్బులు హోదా, ప్రత్యేక ప్యాకేజీ తదితరాలకు...