వంశీ కలుగోట్ల // 'గొప్పోడు' - అవార్డు గారంటీ (*నిబంధనలు వర్తిస్తాయి) //
*************************************************************
మన (అంటే స్వీయ గౌరవం అన్నమాట) దగ్గర ఒక మాంచి ఊర మాస్ మసాలా సినిమా కథ
ఒకటుందబ్బా. ప్రతి సీన్ కేకో కేకస్య, కేకభ్యహ అన్నట్టు ఉంటాది.
కావాలనుకుంటే సదువుకోండి ...
ఓపెనింగ్
సీన్ లో మన హీరోవోడు ఒక సేతిలో గొడ్డలి, మరో సేతిలో మా సినిమా యూనిట్
ప్రత్యేకంగా తయారు చేసిన ఒక విచిత్ర ఆయుధం పట్టుకుని ఒక రెండు మూడొందల
మందిని నరికి పారేస్తాడు. అయినా కూడా మన హీరోవోడికి సిన్న గాయం కూడా కాదు.
సీన్ ముగియగానే మన హీరోవోడు ఒళ్ళంతా రక్తంతో (నరికేసినోళ్లదిలే టెన్షన్
పడమాకండి) 'హింస మంచిది కాదు, అది మన ధర్మమూ కాదు, సంప్రదాయమూ కాదు.
అహింసను మించిన ధర్మమూ లేదు' అని అరమూసిన కళ్ళతో చెబుతుంటే, మనోడు
నరికెయ్యగా మిగిలినోళ్ళు అమాంతం కాళ్ళమీద పడిపోయి 'నీ అంతటోడు లేడు, నువ్వే
మాకు గొప్పోడు' అంటూ పాటేసుకుంటారు.
ఆ
తరువాత అసలు సీన్ ఉంటాది, ఒక మాంచి అందమైన అమ్మాయి అసలు బట్టలేసుకుందా అని
అనుమానమొచ్చేలా ఉండీ లేని దుస్తులతో వస్తాది. మన హోరో 'ఏమున్నావే నువ్వు,
నీ సోకుమాడ దిమ్మదిరిగేస్తది నీ సోకులు సూస్తాంటే, నువ్వంటే నాకు అదీ'
అంటాడు. అంతే వెంటనే ఆ అమ్మాయి, అరవయ్యేళ్ళ మన హీరోతో (సినిమాలో ఇరవైల్లో
ఉన్నట్టు సూపించనీకి గ్రాఫిక్స్ యూస్ సేస్తాంలే) 'నువ్వే నాకు మొగుడయ్యో,
నిన్ను మించిన గొప్పోడు లేడయ్యె, రారా నా సామిరంగా సేద్దాం సెడామడా అదీ
ఇదీ' అంటూ ఒక మాంచి సాంగేసుకుంటాది. థియేటర్ లో కేకలు, ఈలలే. సాంగ్
అయిపోగానే ఒక అమ్మాయిని వెంటాడే అబ్బాయిలతో 'స్త్రీ దేవత వంటిది, వాళ్ళను
అదీ, ఇదీ అంటూ అసభ్యంగా మాట్లాడకూడదు, నీ తల్లి కూడా ఒక ఆడదే' అంటూ
ఉపన్యాసం ఇస్తాడు. వెంటనే వాళ్ళు అతని కాళ్ళమీద పడిపోయి 'నువ్వే మాకు
గొప్పోడివి, మా నాయకుడివి' అంటూ జేజేలు పలుకుతారు.
అసలెందుకు
ఉన్నాడో తెలియని విలన్ మూడో సీన్ లో వస్తాడు. సూడ్డానికి ఎద్దులా ఉన్నా,
మామూలుగా ఉన్న మన హీరో ఎడమ సేత్తో ఊరికే అలా అనగానే ఎగిరి అవతల పడి 'నీ కథ
ఇపుడు కాదు, సివరి సీన్ లో సెప్తా' అంటూ కుంటుకుంటూ వెళ్ళిపోతాడు. శివరాఖరి
సీన్ వరకూ లాగాలి కాబట్టి మన హీరో వాడిని వదిలేస్తాడు.
ఇక
అపుడు రెండో హీరోయిన్ వస్తాది. చక్కటి సంప్రదాయ పద్ధతిలో వచ్చి 'బావా, మనం
పెళ్లి చేసుకుందామా' అంటూ 'నీకూ నాకూ అదీ, సెన్సార్ సరే అంటే ఇంకో
ముద్దేసుకో మరి' అంటూ సాంగేసుకుంటాది. ఇలా
ఇద్దరు హీరోయిన్స్ తో, సిన్నా సితకా రౌడీ నాయాళ్ళను కొడుతూ శివరాఖరుకు
విలన్ ను సంపేస్తాడు. సచ్చిపోయేముందు విలన్ కూడా 'నువ్వే గొప్పోడివి, నేను
మళ్ళీ పుట్టినా నీ చేతిలోనే చచ్చేలా వరమివ్వు' అని మరీ చస్తాడు.
ఇంతటి గొప్ప పాత్ర, డవిలాగులు, సందేశాలు ఉన్న సినిమాను జనాలు సూడకుండా వదిలేస్తారా? అవార్డు ఇవ్వక సస్తారా?***
***
అవార్డు కావాలంటే నిబంధనలు వర్తిస్తాయి. ఎవరో ఒక 'బాబు'ను పెట్టి తీస్తేనే
(ఆ 'బాబు' ఎవరన్నది కూడా ముఖ్యమే సుమండీ) అవార్డు ఇవ్వబడుతుంది.
Comments
Post a Comment