'టాయిలెట్ - ఏక్ ప్రేమ్ కథ' గురించి ...
వంశీ కలుగోట్ల // 'టాయిలెట్ - ఏక్ ప్రేమ్ కథ' గురించి ... //
*************************************************
'రుద్రవీణ' చిత్రం గురించి ఇవాళ కొత్తగా చెప్పక్కరలేదు. అన్నా హజారే స్ఫూర్తిగా రూపొందించబడిన ఈ చిత్రం వాణిజ్యపరంగా ఆశించినంత విజయం సాధించనప్పటికీ అత్యుత్తమ చిత్రాల వరుసలో ఎప్పటికీ నిలబడిపోయే చిత్రంగా, చిరంజీవికి గుర్తుండిపోయే చిత్రంగా ఉండిపోయింది. ఎందుకు అపజయం పాలైందో కానీ, ఎవరు ఈ చిత్రాన్ని బాలేదని అనగా వినలేదు. అలాంటి సినిమాలు రావట్లేదెందుకు అని అనుకుంటూ ఉండేవాడిని. అంటే సందేశాత్మక చిత్రాలు రాలేదని కాదు కానీ వాణిజ్య సూత్రాలకు దూరంగా ఇలా ఒక క్షేత్రస్థాయి సమస్యలతో కథ అల్లుకుని, దాన్ని మ్యాజిక్కులకు దూరంగా వాస్తవిక కోణంలో తెరకెక్కించే ప్రయత్నాలు అరుదు. బహుశా శ్యామ్ బెనెగల్ చిత్రాలు దీనికి మినహాయింపు కావచ్చు. ఇది నా పరిమిత జ్ఞానంతో చేసిన వ్యాఖ్య కాబట్టి, ఎవరైనా సవరించవచ్చు (అటువంటి ఇతర చిత్రాల ప్రస్తావనతో). నిన్న 'టాయిలెట్ - ఏక్ ప్రేమ్ కథ' చిత్రం చూశాక నాకు రుద్రవీణ చిత్రమే గుర్తొచ్చింది. దానికీ, దీనికీ కథలో పోలిక లేదు, రెండూ విభిన్న అంశాలే. ఈ చిత్రాన్ని చూసిన చాలామందికి ఆ సమస్య కామెడీగా అనిపించి ఉండవచ్చు. కానీ, 90వ దశకం ద్వితీయార్థం వరకూ మా ప్రాంతంలో చాలా గ్రామాల్లో ఉన్న సమస్యే అది. ఇప్పటికీ కొన్ని గ్రామాల్లో ఉంది, ఉత్తర భారతంలోని అనేకానేక ప్రాంతాల్లో అధికం అని చదివాను.
ఇది నిజంగానే ఒక చక్కటి ప్రేమకథ. ఇందులో ప్రత్యేకించి విలన్లు అంటూ ఎవరూ
లేరు. గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ఒక సమస్యను వివాదాలకు తావివ్వకుండా, వినోదం
అంటూ ఎగతాళి చేసే తరహాలోనో లేక వెగటు కామెడీ చేస్తూనో చూపలేదు. ఎక్కడైనా
ఎవరికైనా ఇబ్బంది అనిపించే సన్నివేశాలలాగానో లేక కామెడీలాగానో అనిపిస్తే
అది వారు ఆ సమస్యను కేవలం వినడం వల్ల కావచ్చు, ఆ సమస్యను
చూసినవారికి/అనుభవించినవారికి తెలుస్తుంది. ఒక వాస్తవ ఘటన ఆధారంగా ఈ కథని
రూపొందించిన గరిమ మరియు సిద్ధార్థ్ లు, ఎటువంటి భేషజాలకు పోకుండా మూలకథకు
కట్టుబడి తెరకెక్కించిన దర్శకుడు శ్రీ నారాయణ్ సింగ్, ఇమేజ్ ను ఏనాడో
పక్కనబెట్టి ఇటువంటి చిత్రాలలో నటిస్తున్న అక్షయ్ కుమార్ లు అత్యంత
అభినందనీయులు. నిజంగా అక్షయ్ కుమార్ పాత్రలో జీవించాడు, అక్షయ్ కనబడడు
చిత్రంలో. కేవలం కేశవ్ అనే వ్యక్తి పెళ్ళికోసం పడే తపన; తండ్రి పురాతన
భావజాలానికి, భార్య నూతనత్వానికి, ప్రజల మూర్ఖత్వానికి, అధికార వర్గాల
అలసత్వానికి మధ్య నలిగిపోయే తీరు మాత్రమే కనబడుతుంది. అక్షయ్ కుమార్ నటనకు,
ఈ కథను ఎంపిక చేసుకున్నందుకు హాట్స్ ఆఫ్. ఇక జయగా నటించిన భూమి పేండేకర్,
చిత్రం మొదలైపుడు ఈవిడ కథానాయిక ఏంటి అనిపించింది. కానీ, చిత్రం ముందుకు
సాగినకొద్దీ జయ పాత్రలో మరొకరిని ఊహించుకోలేనంతగా జీవించేసింది. పాత్రలోని
సంఘర్షణను అత్యంత సమర్థంగా పోషించి, అనుభవజ్ఞుడైన అక్షయ్ కుమార్ ముందు
గర్వంగా చెప్పుకోలగలిగే నటనను చూపింది. మిగతా
పాత్రలను పోషించిన ప్రతి ఒక్కరూ కథానుగుణంగా అత్యంత సమర్థవంతంగా పాత్రలను
పోషించారు. ప్రతి పాత్రకు అత్యంత సమర్థులైన నటీనటులను ఎంచుకున్న దర్శకుడి
ఊహను ప్రశంసించకుండా ఉండలేం. *************************************************
'రుద్రవీణ' చిత్రం గురించి ఇవాళ కొత్తగా చెప్పక్కరలేదు. అన్నా హజారే స్ఫూర్తిగా రూపొందించబడిన ఈ చిత్రం వాణిజ్యపరంగా ఆశించినంత విజయం సాధించనప్పటికీ అత్యుత్తమ చిత్రాల వరుసలో ఎప్పటికీ నిలబడిపోయే చిత్రంగా, చిరంజీవికి గుర్తుండిపోయే చిత్రంగా ఉండిపోయింది. ఎందుకు అపజయం పాలైందో కానీ, ఎవరు ఈ చిత్రాన్ని బాలేదని అనగా వినలేదు. అలాంటి సినిమాలు రావట్లేదెందుకు అని అనుకుంటూ ఉండేవాడిని. అంటే సందేశాత్మక చిత్రాలు రాలేదని కాదు కానీ వాణిజ్య సూత్రాలకు దూరంగా ఇలా ఒక క్షేత్రస్థాయి సమస్యలతో కథ అల్లుకుని, దాన్ని మ్యాజిక్కులకు దూరంగా వాస్తవిక కోణంలో తెరకెక్కించే ప్రయత్నాలు అరుదు. బహుశా శ్యామ్ బెనెగల్ చిత్రాలు దీనికి మినహాయింపు కావచ్చు. ఇది నా పరిమిత జ్ఞానంతో చేసిన వ్యాఖ్య కాబట్టి, ఎవరైనా సవరించవచ్చు (అటువంటి ఇతర చిత్రాల ప్రస్తావనతో). నిన్న 'టాయిలెట్ - ఏక్ ప్రేమ్ కథ' చిత్రం చూశాక నాకు రుద్రవీణ చిత్రమే గుర్తొచ్చింది. దానికీ, దీనికీ కథలో పోలిక లేదు, రెండూ విభిన్న అంశాలే. ఈ చిత్రాన్ని చూసిన చాలామందికి ఆ సమస్య కామెడీగా అనిపించి ఉండవచ్చు. కానీ, 90వ దశకం ద్వితీయార్థం వరకూ మా ప్రాంతంలో చాలా గ్రామాల్లో ఉన్న సమస్యే అది. ఇప్పటికీ కొన్ని గ్రామాల్లో ఉంది, ఉత్తర భారతంలోని అనేకానేక ప్రాంతాల్లో అధికం అని చదివాను.
చిత్రంలో ఒక సన్నివేశంలో గ్రామ సర్పంచ్ మనుస్మృతిని ఉంటంకిస్తూ ఒక శ్లోకం
చెప్తాడు. దానికి సమాధానంగా కేశవ్ (అక్షయ్) ఆ శ్లోకం తరువాయి భాగం చెబుతూ,
దాన్నెందుకు చెప్పకుండా దాటవేస్తున్నారని ప్రశ్నిస్తాడు. అదే కాదు, అటువంటి
మరికొన్ని సన్నివేశాలున్నాయి. కాలానుగుణంగా సంస్కృతిలో ఎటువంటి మార్పు
రావాలన్నది, గ్రామీణ ప్రాంతాలలో అత్యధికులతో ముడిపడిన ఒక సమస్యను తీసుకుని
వివరించిన ఈ చిత్రం చూసి తీరాల్సిన చిత్రం. ఈ సమస్య ఇంకా ఉందా అని ఆశ్చర్యం
అక్కరలేదు, చాలా ప్రాంతాలలో ఉంది. అలసత్వమో లేక మరోటో కారణాలేవైతేనేం
ఇటువంటి అనేకానేక సమస్యలు ఎదగాలనుకునే దేశాన్ని కిందకు లాగుతూనే
ఉన్నాయి/ఉంటాయి. 'తప్పు మనదైనప్పుడు, దెబ్బలు కూడా మనమే తినాలి' అని అక్షయ్
పాత్ర ద్వారా దర్శకుడు పలుమార్లు చూపుతాడు దర్శకుడు ఈ చిత్రంలో. ఎవరో
వస్తారని ఎదురు చూడటం కాదు, మార్పు అంటే ప్రభుత్వ బాధ్యతా కాదు. విప్లవం మన
నట్టింట్లోనుంచే పుట్టాలి అప్పుడే మార్పు సాధ్యం. మహిళలకు సమాన హక్కులైనా,
అస్పృశ్యత నివారణ అయినా, అసమానతలు తొలగాలన్నా, అభివృద్ధి సాధింపబడాలన్నా
... ఏమి జరగాలన్నా మన నుండే మొదలవ్వాలి.
సాంకేతిక అంశాల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సినంత లేకపోయినా కథను దెబ్బతీసే విధంగా లేకుండా, సహజత్వాన్ని ప్రతిబింబించేలా చూసుకున్నందుకు మాత్రం ప్రశంసించాల్సిందే. ఎక్కడా కూడా కథను మించిపోయేలా ఉండకుండా చూసుకున్నారు. నటీనటులు, సాంకేతిక నిపుణులు, ఇతర విభాగాల వారు ఇలా కథలో లీనమైపోయి కథను మాత్రమే తెరమీద కనబడేలా చెయ్యటం అరుదుగా చూస్తుంటాం - అందులో ఇది ఒకటి. 'టాయిలెట్ - ఏక్ ప్రేమ్ కథ'ని కేవలం ఒక వినోదాత్మక సినిమాగా చూడకండి, సాధ్యమైతే మార్పు కోసం మీ ప్రయాణం మొదలెట్టండి. మా ఇంట్లో టాయిలెట్ ఉందని అనకండి. వేరే సమస్య ఉండవచ్చు. విప్లవం/మార్పు విహంగంలా ఎగురుకుంటూ రాదు, మనతోనే, నీతోనే, నాతోనే మొదలవ్వాలి.

Comments
Post a Comment