... పాదయాత్ర తీరు

వంశీ కలుగోట్ల // ... పాదయాత్ర తీరు //
***************************************
ప్రతిపక్షనేత జగన్ చేస్తున్న పాదయాత్ర కొనసాగుతోంది. ఇవాళో, నిన్నో ఎవరో అభినందిస్తూ పెట్టిన పోస్ట్ చూశాను '600 కిలోమీటర్లు దాటిన శుభసందర్భంగా' అని. 600 కిలోమీటర్ల దూరం చిన్నదా, పెద్దదా అన్నది ముఖ్యమా? పాదయాత్ర లక్ష్యం లేదా నిర్ణయించుకున్న పూర్తి పాదయాత్ర దూరం దాదాపు 3000 కిలొమీటర్లనుకుంటా. దాదాపు అన్ని జిల్లాలలోనూ పర్యటన జరుగుందనుకుంటాను. ప్రతి వంద కిలోమీటర్లకూ సమర్థకుల నుండి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. దూరం పెరిగిన కొద్దీ అదో ఘనతగా కీర్తిస్తున్న సమర్థకులు, కాస్త వ్యక్తి మీద నుండి లక్ష్యం వైపు దృష్టి సారిస్తే మేలేమో. 

ప్రతి వంద కిలోమీటర్లు పూర్తయ్యాక, అభినందనలకంటే ఎక్కువగా ... 

-> ఆ పరిధులో చూసిన/తెలుసుకున్న సమస్యలేమిటి? 
-> ఆయా ప్రాంతాలలో పార్టీ పరిస్థితి ప్రస్తుతం ఎలా ఉంది? 
-> ఆ పరిధిలో ప్రతిపక్షనేత ఇచ్చిన హామీలేమిటి? వాటి ఆచరణీయత ఏమిటి? 
-> తెలుసుకున్న సమస్యలలో గత ప్రభుత్వాల కాలం నుండి కొనసాగుతున్న సమస్యలెన్ని? ప్రస్తుత ప్రభుత్వపు తీరు వల్ల ఉత్పన్నమైన సమస్యలెన్ని? 
-> ఆ పరిధిలో అత్యంత ప్రధాన రంగాలైనటువంటి వ్యవసాయరంగం వంటి వాటి పరిస్థితి ఎలా ఉంది? 
-> వాణిజ్య రంగానికి సంబంధించి కనీస సదుపాయాల కల్పన పరిస్థితి ఎలా ఉంది? 

... పాదయాత్ర ప్రధాన మరియు అంతిమ లక్ష్యం అధికార సాధన అన్నదానిలో ఎవరికీ ఎటువంటి అనుమానాలు లేవు. కానీ, దానితో పాటు పర్యటిస్తున్న ప్రాంతాలలో ఉన్నటువంటి సమస్యలెటువంటివి? వాటిమీద అధికారాన్ని ఆశిస్తున్న పార్టీగా తమ ధోరణి (అధినేత గుప్పిస్తున్న హామీలు పక్కనబెట్టి) ఏమిటి అన్నది అధికారిక పార్టీ వేదిక మీదనుండి స్పష్టంగా చెప్పగలగాలి. 

... ఇటువంటి వివరాలతో కూడిన శ్వేతపత్రం తరహా ప్రకటనలు అధికారికంగా పార్టీ నుండి వెలువడితే బాగుంటుందని నా అభిప్రాయం. ప్రచారం తీరు వ్యక్తి కేంద్రీకృతం కంటే సమస్యలు, హామీల ఆచరణీయత వంటివి కేంద్రంగా జరగాలేమో. 

Comments

Popular posts from this blog

... కరోనా కంటే ఎక్కువగా భయపెడుతున్న అంశం?

... మూడో కూటమి

... 2019 ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు - జనసేన