నేనూ - వాడూ: ఒక సంభాషణ
వంశీ కలుగోట్ల // నేనూ - వాడూ: ఒక సంభాషణ //
****************************** ************
వాడు: ******************************
నేను:
అవును, చెడును ఖండించాల్సిందే. అవునూ, ఇంతకీ అవన్నీ ఖండిస్తూ నువ్వు తీసిన ఆ చిత్రంలో లేదా రాసిన రాతలో ఆ కాస్త యెర్రితనం, ఆ కాసింత బూతు, ఆ కొద్ది రక్తపాతం/హింస లేకపోయుంటే ఎంత బావుండేది మిత్రమా?
వాడు:
అవునా!!! అయితే నీకర్థం కాలేదన్నమాట. ఇంకాస్త ఎదగాలి నువ్వు. ఊరికే అలా అనకపోతే ఆ చెడు, బూతు, హింస గట్రా ఏవైతే ఉన్నాయో వాటిని వదిలేసి మిగతావాటిని చూడవచ్చు కదా! నేను అన్ని అంశాలు కలిపి తీస్తే/రాస్తే నీకు అవి మాత్రమే కనిపించాయి అంటే నువ్వు అలాంటివాడివి అని అర్థం. ఇంకెప్పుడు ఎదుగుతావు!!!?అయినా నన్నూ, నా మాటలనూ అర్థం చేసుకోవాలంటే నీకు, నీలాంటివారికీ కనీసం ఇంకో అర్థ శతాబ్ది అయినా పడుతుంది.
నేను:
అవును నిజమేనేమో మిత్రమా. నువ్వు తీసిన/రాసిన దాన్ని అర్థం చేసుకోవటానికి నాలాంటివారికి అర్థశతాబ్ది పడితే
మరి అదే నీతి నువ్వు చెబుతున్న పుస్తకాలకు వర్తించదా!!?
నీకు పనికొస్తుందని అనుకున్న ఒక
వాక్యాన్ని/అంశాన్ని పట్టేసుకుని నీకు అనుగుణంగా మార్చేసుకుని ఆ పుస్తకాలే
శుద్ధ దండగ అనేస్తున్నావు. ఏమోలే ... ఏమన్నా అంటే నా ఇష్టం అంటావు. నువ్వు
చెప్పే పుస్తకాలు రాసినోళ్ళెవరూ ఇప్పుడు లేరు కాబట్టి సరిపోయింది. ఉంటే,
వారు కూడా ఇలాగే 'నా ఇష్టం, నీకెందుకు?' అన్నారనుకో! హా, అంటే మాత్రం
ఏముందిలే ఏదో ఒక ముద్ర సిద్ధంగా పెట్టుకుని ఉంటావు. వారు అది, ఇది కాకపొతే
ఇంకోటి అని తీర్మానించెయ్యటానికి, అంతే కదూ ...?
అవునూ, ఇంతకీ నా మీద ఏం ముద్ర వేయబోతున్నావో!?
Comments
Post a Comment