... గురువింద గింజలు

వంశీ కలుగోట్ల // ... గురువింద గింజలు //
******************************************
-> మన ఆర్కే గారున్నారే అదేనండీ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు మొన్నామధ్య కోర్టుకు తన లాయర్ల ద్వారా వినతి పంపించారు ఏమిటంటే 'వ్యక్తిగత హాజరు నుండి మినహాయింపు ఇవ్వండి' అంటూ, అదీ ఎప్పుడు అంటే సదరు న్యాయస్థానం వారు వ్యక్తిగతంగా ఆర్కే గారు హాజరు కావట్లేదని ఆగ్రహం వ్యక్తం చేసినందువల్ల. కారణాలేంటయ్యా అంటే, శాసనసభ సమావేశాలను కవర్ చేస్తూ తీరిక లేకుండా ఉన్నారట. పాపం ఆయన ఫీల్డ్ జర్నలిస్ట్ కదా, ఉదయాన్నే నిద్ర లేవగానే తినీ తినకుండా లగెత్తుకుని శాసనసభ దగ్గరకెళ్ళి రాత్రి వరకూ అక్కడ కెమెరాలు మోసుకుంటూనో లేక కాయితాలు పట్టుకుని రాసుకుంటూనో తెగ బిజీగా ఉంటున్నారు కాబోలును. ఇదే ఆర్కే గారు ప్రతిపక్షనేత జగన్ గారు పాదయాత్ర సందర్భంగా వ్యక్తిగత హాజరు నుండి మినహాయింపు ఇవ్వమని కోర్టును అభ్యర్థించినపుడు రాసిన విశ్లేషణలు ఆయనకు చూపితే ఎలా ఉంటుంది? ఆ అవన్నీ పట్టించుకుంటే ఆయన ఆ స్థాయిలో కూచుని అంత కమ్మగా అనగా హాయిగా ఎలా ఉంటారులెండి. 

-> మన కత్తి మహేష్ గారున్నారు కదా ... పవన్ కళ్యాణ్ గారిపై విమర్శల జడివాన కురిపించి ప్రాముఖ్యత సంపాదించారు కదా ఆయన. ఆయనను షార్ట్స్ ఫిలిమ్స్ దర్శకుడిగా, రచయితగా, విశ్లేషకుడిగా కొద్దిమంది ఎరుగుదురేమో గతంలో. ఇపుడు జనాలకు ఆయన తెలిసినది మాత్రం పవన్ ను విమర్శించే వ్యక్తిగానే అన్నది తెలిసిందే. తాజాగా హైపర్ ఆదితో వివాదం విషయంలో టీవీ తొమ్మిదిలో ఆదితో మాట్లాడుతూ ఆణిముత్యంలాంటి ఒక ముక్క సెలవిచ్చారబ్బా. 'మీ దేవుడిని (అనగా ఆయన ఉద్దేశంలో పవన్ అన్నమాట) మీరేమన్నా చేసుకోండి, నా వరకూ రాకండి' అంట. మరి అదేమాట పవన్ కళ్యాణ్ గారి అభిమానులమని చెప్పుకునేవారు అంటున్నారు కదా. 'మీరేమన్నా హీక్కోండి, మా పవన్ కళ్యాణ్ వరకూ రాకండి' అని. మరి ఆ సూత్రం తవరికి వర్తించదా సామీ? ఆలా అంటే మాత్రం నేను అదీ, నేను ఇదీ, నా ఉద్దేశం ఇదీ అంటూ వివరణలు. మరి అదే ఆది కూడా తన వివరణ చెబుతుంటే వినడమే లేదే.

ప్రస్తానం సినిమాలో సాయి కుమార్ పాత్ర చెప్పినట్టు '... అవసరాల కోసం దారులు తొక్కే పాత్రలే తప్పించి హీరోలు, విలన్లు లేరీ నాటకంలో ...'. అయ్యా అటేపు, ఇటేపు తందానా తాళమేసే మేతావులూ నేను ఒక్కరినే తిట్టానని అనుకుంటే ... సెప్పేదేముంది కమ్ ఆన్ ఎవడి తందానా డప్పు ఆడు కొట్టుకొండెహె. 

Comments

Popular posts from this blog

... మూడో కూటమి

... కరోనా కంటే ఎక్కువగా భయపెడుతున్న అంశం?

... 2019 ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు - జనసేన