ఉత్తరకుమారత్వం ...

వంశీ కలుగోట్ల // ఉత్తరకుమారత్వం ... //
*****************************************
1
మహాభారతంలో ఉత్తరకుమారుడు అని పాత్ర ఉంటుంది. అతడు ఎప్పుడూ అంతఃపురంలో తన చెల్లెలి చెలికత్తెలతో తన వీరత్వం గురించి ప్రగల్భాలు పలుకుతూ ఉంటాడు, వారితో తన వీరత్వాన్ని (???) పొగిడించుకుంటూ ఉంటాడు. కానీ, అసలుకు అతడికి కత్తి పట్టడం కూడా సరిగా రాదు, యుద్ధం అనగానే వెన్నులో వణుకు పుడుతుంది. అలాంటి పాత్ర అన్నమాట. 
2
ఇప్పుడు ప్రస్తుతానికి వద్దాం. 
మొన్నటికి మొన్న రాజ్యసభలో జైట్లీగారు 'ప్రత్యేక హోదా ఇవ్వడం కుదరదు, మిగతా ఇరభై ఎనిమిది రాష్ట్రాలతో పాటూ మీరూ ఒకరు, ఏం హీక్కుంటారో హీక్కోపోండి' అని తేల్చేసిన తరువాత పత్రికా సమావేశంలో ఆవేదనతో కూడిన వచ్చిన ఆవేశం వల్ల మన గౌరవనీయ ముఖ్యమంత్రి గారు 'కేంద్రంతో మాట్లాడతాను, పోరాడతాను, తేల్చేసుకుంటాను, ఇట్ ఈస్ వెరీ దారుణం, రెండు రోజుల్లో ఢీల్లీ వెళతాను' అంటూ ప్రకటించారు. 
ఢీల్లీకి వెళ్లారు పచ్చ మీడియాలో కూడా ప్రత్యేకహోదాపై తేల్చుకోవడానికి వెళ్తున్నారు, ఇక తాడో పేడో తేలిపోవాల్సిందే అని ఊహాగానాలు రాసేశారు. సివరాకరికి బాబుగారు అందరినీ కలిసి వచ్చాక మళ్ళీ పత్రికా సమావేశంలో 'తూచ్ ఎవరు మీకు సెప్పింది (ఆయనే సెప్పారని మర్చిపోయారేమో) నేనొచ్చింది జస్ట్ కృష్ణా పుష్కరాలకు వీళ్లందరినీ ఆహ్వానిద్దామని' అనేసరికి అందరికీ దిమ్మ తిరిగి అదేదో ఉన్నోళ్లకి మైండ్ బ్లాంక్ అయింది. 
3
ఇద్దో సదివేటోళ్లు నేను ఫస్ట్ సెప్పిన ఉత్తరకుమారుడు పాత్రకీ రెండో విషయానికి లంకె ఎట్టుకుంటే అది మీ ఇష్టం, నాకు సంబంధం లేదు. నచ్చినోళ్ళు నవ్వుకోండి, నచ్చనోళ్లు ఏం హీక్కుంటారో హీక్కోపోండి హ హ హ, జస్ట్ సరదాగా తీసుకోండి తమ్ముళ్లూ ... 

Comments

Popular posts from this blog

... మూడో కూటమి

... కరోనా కంటే ఎక్కువగా భయపెడుతున్న అంశం?

... 2019 ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు - జనసేన