అవీ ... ఇవీ అనబడు సాంబడి అనుమానాలు

వంశీ కలుగోట్ల // అవీ ... ఇవీ అనబడు సాంబడి అనుమానాలు //
*************************************************************************
1. ఓహ్ వ్వావ్ అద్భుతం, ఆశ్చర్యం, పరమాద్భుతం - మీడియా అనగా అదేనండీ పచ్చమీడియా లేదా ఆ రెండు పత్రికలు గత కొద్దిరోజులుగా పాటించిన స్వీయ నియంత్రణ గురించి చెబుతున్నాను. ముద్రగడ కాపు రేజర్వేషన్స్ ఉద్యమం విషయంలో ఆ రెండు పత్రికలు పాటించిన స్వీయ నియంత్రణ అత్యంత ఆశ్చర్యకరమైన అద్భుతమైన పరమ వ్వావ్ అన్నమాట. ఇంతటి జ్ఞానమే కనుక వారికి ఎన్నికల ప్రచార సమయంలో కలిగి ఉంటే ఆ సమయంలో బాబు గారు నోటికి అదుపు లేకుండా, విలేఖరుల చేతులు నొప్పెట్టేలా రాసుకునేంతటి లిస్ట్ లో హామీలు గుప్పించిన సమయాన ఈ నియంత్రణ పాటించి ఉంటే అసలు అలాంటి హామీ అంటూ ఒకటి ఇచ్చాడని కాపు జనాలకు తెలిసేది కాదు కదా. ఓ అలా అయితే ఆయన అధికారంలోకి ఎలా వస్తాడనే భయం కాబోలు. 
2. మేధావులు వచ్చారండీ - ముద్రగడకు కొన్ని ప్రశ్నలు అంటూ తెగ పోస్టుతున్నారు. అయ్యలూ అదేదో బాబు గారికి కూడా సంధించొచ్చుగా తవరి ప్రశ్నలు. అసలు ఇంతటికీ మూలకారణం ఆయనగారి హామీలే కదా. ఆ హామీల చిట్టా తీసి ప్రశ్నలు సాధించండి. ఊహూ అలా చేస్తే తవరందరూ మేధావులెలా అవుతారు? 
3. అయ్యా దేశపు మహా మహా మేధావులుంగారూ ఈ వందశాతం వి.ప్ర.పె.వి (ఈనాడు భాష ప్రయత్నించాను లెండి - వి.ప్ర.పె.వి అంటే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల విధానం అని అదే FDI) గురించి తవరి అభిప్రాయాలేవిటో సెప్తే తరిస్తాము సాములూ. అయ్యో నేనన్నది ఎర్ర మేధావులను కాదు సాములూ తవరినే. గతంలో మన్మోహన్ గారి ప్రభుత్వం ఈ వి.ప్ర.పె.వి ని పెంచాలని సూసినపుడు ఏవో అట్టముక్కలు పట్టుకుని తెగ హంగామా సేసినారు కదా సాములూ ... ఇప్పుడేమయ్యారు? ఒహ్హో నాను మర్సే పోనాను సుమీ తవరిప్పుడు కేంద్రంలో మంత్రిగిరీలు యెలగబెడ్తన్నారు గామోసు గాకపోతే ప్రభుత్వ పార్టీలో ఉన్నారు గామోసు. 
4. ఓ సామీ నిన్నేనయ్యో సుబ్బరమణ్య సామీ ఈడ మా గోల ఎవరూ పట్టించుకోట్లేదు గానీ తవరి ఉత్తరాలకు, తవరేసే కేసులకు మాంచి ఊపుంటాదట గందా ... ఈడ జరిగిన ఓటుకు నోటు, భూముల కుంభకోణం గట్రా వాటిపై కేసులెయ్యరాదా సామీ. గట్లనే గా మహారాష్ట్రలో తవరి ప్రభుత్వంలోనే మస్తు అవినీతి జరుగుతాందంట ఒక సూపు సూడరాదూ. 
5. సూడయ్యా సల్మాను ఖాను నువ్వేమన్నా మా కాడ 'బాబు' అని పిలిపించుకునే లెక్కటి హీరో ననుకున్నావా లేకపోతే నువ్వేమన్నా వాళ్ళొడివా గట్టా మాట్టాడితే వదిలిసీనీకి. అయినా ఈ ఆడోళ్ళ సంఘాలకి మన 'బాబు' హీరో గారి వాక్కులు ఆనందం గలిగించినాయి గాబోసు. 

ఇద్దో సివర్నే అయినా సెప్తాన్న ఇయ్యన్నీ మన సాంబడి మదిలో మెదిలినాయి నా మీటల పలక (అదే కీ బోర్డు) మీదకి ఒలకబడినాయి. ఇంత గబ్బు లేస్తాందని గబ్బరుకు  సెప్పినా గడ్డం పెరిగేవరకూ రానన్నాడని ఇట్టా నా మీటల పలక మీదికి లగెత్తుకుని వొచ్ఛీసినాడు సాంబడు. 

Comments

Popular posts from this blog

... మూడో కూటమి

... కరోనా కంటే ఎక్కువగా భయపెడుతున్న అంశం?

... 2019 ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు - జనసేన