వార్తలు ... వాళ్ళ ఇష్టం
వార్తలు ... వాళ్ళ ఇష్టం
**********************
(ఊరికే సరదాకి ...)
మన గౌరవనీయ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ప్రత్యేక హోదాపై పోరాటంలో (నవ్వకండి) భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారితో తాడో పేడో తేల్చుకుందామని ఆవేశంతో ఊగిపోతూ ఢీల్లీకి వెళ్లారు.
# బాబు గారు రాష్ట్రపతిని కలిశారు. 'మీలాంటి వారు రాష్ట్రానికొక్కరు ఉంటే ఈ దేశం ఎప్పుడో అభివృద్ధి సాధించేది. మీలాంటి గొప్పవారు ఒక్క రాష్ట్రానికే పరిమితమవుతే ఎలా? మీరు ప్రధాని కావాలి' అని అన్నారు ఆయన. అలానే పనిలో పనిగా 'అద్భుతంగా పాలిస్తున్నారు, ఆంధ్రని అమెరికా సరసన నిలిపేలా అభివృద్ధి చేస్తున్నారు' అంటూ తెగ పొగిడారు. దాంతో ఎప్పటిలానే పొగడ్తలు గిట్టని బాబు గారు సిగ్గుతో నిర్ణీత సమయానికంటే ముందే సమావేశాన్ని ముగించి వచ్చేశారు. # ప్రధానమంత్రితో సమావేశయ్యారు. (ఎన్నోసారో సరిగ్గా గుర్తులేదు కానీ) ఆంద్ర ప్రదేశ్ పరిస్థితి గురించి ఆయనకు వివరించి, హోదా ఇచ్చి తీరాల్సిందేనని లేకపోతే తానూ ఊరుకోనని కుండబద్దలు కొట్టేశారు. దాంతో భయంతో కూడిన బాధవల్ల వచ్చిన ఆందోళనతో మోడీగారు సానుకూలంగా స్పందించారు. పార్లమెంట్ సమావేశాల అనంతరం (???) తగిన నిర్ణయం తీసుకుంటానని తెలిపారు. # ఢీల్లీ లోని పెద్ద పెద్ద నాయకులందరూ బాబుగారిని కలిసి తమ సమస్యలను కూడా మోడీ గారికి చేరవేయాల్సిందిగా మనవి చేసుకున్నారు. అంతేకాక మూడోకూటమి ఏర్పరిచి భాజపా లో నుండి కొంతమంది ఎంపీలను ఒక కూటమిగా బయటకు తీసుకువచ్చి మద్దతు తీసుకుని బాబుగారిని ప్రధానమంత్రిని చేస్తామనే ప్రతిపాదన చేశారు. కానీ, ఆంద్ర ప్రయోజనాల కోసం తన జీవితం అంకితం అని బాబుగారు కుండా బద్దలుకొట్టారు. మొదటివార్త విని భయపడిన మోడీ రెండవ వార్త విని కుదుటపడ్డారు.
--- కొన్నిరోజుల తరువాత #
ప్రత్యేకహోదా ఇవ్వడం కుదరదని మళ్ళీ తేల్చేసిన జైట్లీ. తమకు ఆంద్ర ఒక్కటే
కాదు అన్ని రాష్ట్రాలూ సమానమే అని కుండ బద్దలు కొట్టిన మోడీ. # ప్రత్యేకహోదా ఏమీ సంజీవని కాదు, భాజపాపై నమ్మకం ఉంది, ప్రయోజనాలు సాధిస్తాం అన్న బాబు గారు. # ప్రత్యేకహోదా ఇవ్వకపోతే తెలుగువాడి పౌరుషం చూపుతామన్న బాలయ్య
--- మళ్ళీ కొన్నిరోజుల తరువాత # ప్రత్యేకహోదా కోరుతూ లోక్ సభ/రాజ్యసభలో వైకాపా, కాంగ్రెస్, వామపక్షాల ఆందోళన# ప్రత్యేకహోదా కోసం అంటూ రాష్ట్రవ్యాప్త బంద్ నిర్వహించిన ప్రతిపక్షాలు # ఎటువంటి హింసాత్మక ఘటనలు, ప్రభుత్వ ఆస్థి నష్టం జరగకపోవటంతో బంద్ పాక్షికం అని తేల్చేసిన ఆ రెండు పత్రికలు. # ప్రతిపక్షాలు బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తూ, తనను అనవసరంగా కార్నర్ చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేసిన బాబుగారు. #
ప్రత్యేకహోదాపై తనకు పెద్దగా అవగాహన, సమాచారం లేవు అని చంద్రబాబు గారు, తమ
పార్టీ తగిన సమయంలో తగిన నిర్ణయం తీసుకుంటాయని స్పష్టం చేసిన బాలయ్య.
...
...
...
--- ఇదొక చక్రభ్రమణం లాంటిది. ఇవి ఆ క్రమంలో అలా మళ్ళీ మళ్ళీ జరుగుతూనే ఉంటాయి, కనీసం 2019 వరకూ.
**********************
(ఊరికే సరదాకి ...)
మన గౌరవనీయ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ప్రత్యేక హోదాపై పోరాటంలో (నవ్వకండి) భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారితో తాడో పేడో తేల్చుకుందామని ఆవేశంతో ఊగిపోతూ ఢీల్లీకి వెళ్లారు.
# బాబు గారు రాష్ట్రపతిని కలిశారు. 'మీలాంటి వారు రాష్ట్రానికొక్కరు ఉంటే ఈ దేశం ఎప్పుడో అభివృద్ధి సాధించేది. మీలాంటి గొప్పవారు ఒక్క రాష్ట్రానికే పరిమితమవుతే ఎలా? మీరు ప్రధాని కావాలి' అని అన్నారు ఆయన. అలానే పనిలో పనిగా 'అద్భుతంగా పాలిస్తున్నారు, ఆంధ్రని అమెరికా సరసన నిలిపేలా అభివృద్ధి చేస్తున్నారు' అంటూ తెగ పొగిడారు. దాంతో ఎప్పటిలానే పొగడ్తలు గిట్టని బాబు గారు సిగ్గుతో నిర్ణీత సమయానికంటే ముందే సమావేశాన్ని ముగించి వచ్చేశారు. # ప్రధానమంత్రితో సమావేశయ్యారు. (ఎన్నోసారో సరిగ్గా గుర్తులేదు కానీ) ఆంద్ర ప్రదేశ్ పరిస్థితి గురించి ఆయనకు వివరించి, హోదా ఇచ్చి తీరాల్సిందేనని లేకపోతే తానూ ఊరుకోనని కుండబద్దలు కొట్టేశారు. దాంతో భయంతో కూడిన బాధవల్ల వచ్చిన ఆందోళనతో మోడీగారు సానుకూలంగా స్పందించారు. పార్లమెంట్ సమావేశాల అనంతరం (???) తగిన నిర్ణయం తీసుకుంటానని తెలిపారు. # ఢీల్లీ లోని పెద్ద పెద్ద నాయకులందరూ బాబుగారిని కలిసి తమ సమస్యలను కూడా మోడీ గారికి చేరవేయాల్సిందిగా మనవి చేసుకున్నారు. అంతేకాక మూడోకూటమి ఏర్పరిచి భాజపా లో నుండి కొంతమంది ఎంపీలను ఒక కూటమిగా బయటకు తీసుకువచ్చి మద్దతు తీసుకుని బాబుగారిని ప్రధానమంత్రిని చేస్తామనే ప్రతిపాదన చేశారు. కానీ, ఆంద్ర ప్రయోజనాల కోసం తన జీవితం అంకితం అని బాబుగారు కుండా బద్దలుకొట్టారు. మొదటివార్త విని భయపడిన మోడీ రెండవ వార్త విని కుదుటపడ్డారు.
# ఆందోళనలకు ఇది సమయం కాదు, సంయమనం పాటించాలి అని తన ' జనసేన' అధినేత పవన్ కళ్యాణ్
# త్వరలో 'జనసేన' అధినేత పవన్ కళ్యాణ్ ప్రత్యేకహోదా మరియు ఇతర వాగ్దానాలపై ఆందోళన బాట
పెట్టనున్నట్టు విశ్వసనీయవర్గాల భోగట్టా. ప్రస్తుతం నూతన చిత్రం కథా
చర్చల్లో ఉన్న ఆయన ఆ చిత్రం ముగించి రాజకీయ రంగపైకి దండయాత్ర చేయనున్నారని
జనసేన కార్యకర్తలు, అభిమానులు, సామాన్యప్రజలు భావిస్తున్నారు.
#
ప్రస్తుతానికి వ్యూహాత్మక మౌనం పాటిస్తున్న ''జనసేన' అధినేత పవన్ కళ్యాణ్.
ఇది అంతా తుఫాను ముందరి ప్రశాంతత అని అభిమానుల అభిప్రాయం.
...
...
...
Comments
Post a Comment